ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ‘ప్రజా బ్యాలెట్’
-
రేపు తిరుపతిలో కార్యక్రమం
-
కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుధాకర్‌బాబు
ఒంగోలు సబర్బన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా బ్యాలెట్ నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీజేఆర్ సుధాకర్‌బాబు తెలిపారు. ఈ మేరకు సోమవారం స్థానిక డీసీసీ కార్యాలయంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి ప్రజాబ్యాలెట్ వివరాలు వెల్లడించారు.
ఈ నెల 28న తిరుపతి శ్రీ వెంకటేశ్వరస్వామి ముఖద్వారం అలిపిరి వద్ద నుంచి ప్రజాబ్యాలెట్ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకూ కొనసాగే కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు డాక్టర్ ఎన్ రఘువీరారెడ్డి పాల్గొని రెండు పార్టీలకు అనుకూలంగా, వ్యతిరేకంగా వచ్చిన బ్యాలెట్లను విలేకర్ల సమక్షంలో వెల్లడిస్తారని వివరించారు. సమావేశంలో పార్టీ ఒంగోలు నగర అధ్యక్షుడు శ్రీపతి ప్రకాశం, యాదాల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.