'చంద్రబాబుది ఇంకుడు గుంత జాతకం'
కాకినాడ: పోలవరం ప్రాజెక్టుకు టీడీపీ, బీజేపీ వ్యతిరేకమని పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి అన్నారు. పోలవరానికి పట్టిసీమ ప్రాజెక్టు ప్రత్యామ్నాయం అయితే పోలవరాన్ని ఎందుకు కొనసాగించాలని ఆయన ప్రశ్నించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... వచ్చేనెల లోపు రాయలసీమకు నీళ్లు ఇవ్వకుంటే టీడీపీ నాయకులు తలలు ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు.
టీడీపీ బతుకే ఇంకుడుగుంత బతుకు.. చంద్రబాబు జాతకం కూడా ఇంకుడు గుంతేనని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదాపై మోసం చేసిన మోదీ, వెంకయ్య, చంద్రబాబు నేరస్థులని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వారిపై ఈనెల 7, 8, 9 తేదీల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తులు పోలీసుస్టేషన్లకు వెళ్లి ఫిర్యాదులు చేస్తారని చెప్పారు.