పెద్ద నోట్ల రద్దుతో పేదలకు ఇబ్బందులు
ప్రధానికి లేఖ రాసిన రఘువీరా
సాక్షి, హైదరాబాద్: నల్లధనం పేరుతో పెద్ద నోట్లను రద్దు చేయడం వల్ల క్షేత్ర స్థాయిలో పేదలు ఇబ్బందులు పడుతున్నారని, వాస్తవాలను ప్రజలకు అందించాలని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ప్రధాని మోదీకి లేఖ రాశారు. లేఖలోని అంశాలను ఇందిరభవన్‌లో గురువారం విలేకరులకు వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు కావలసిన వారికి, బీజేపీకి ఎన్నికల్లో ఆర్థికంగా ఉపయోగపడిన నల్ల కుబేరులకు సంబంధించి రూ.1.20 లక్షల కోట్ల బ్యాంకు అప్పులను రద్దు చేసింది నిజం కాదా.. ఆ మొత్తాన్ని రద్దు చేసిన నల్లకుబేరుల పేర్లను బహిరంగంగా ప్రకటించగలరా? అని ప్రశ్నించారు.