
'ఎదురుదాడితో నిప్పులాంటి మనిషి కాలేరు'
హైదరాబాద్: 'ఓటుకు నోటు'పై సీబీఐతో దర్యాప్తు చేయించాలని ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ముడుపుల వ్యవహారంలో చంద్రబాబు ఎదురుదాడి చేయడం తగదని హితవు పలికారు. ఎదురుదాడితో నిప్పులాంటి మనిషి కాలేరని అన్నారు. ఓటుకు నోటు వ్యవహారంలో ప్రమేయం ఉందా, లేదా చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. నవ నిర్మాణ దీక్షలో ప్రజలతో చంద్రబాబు అవినీతి వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
65 మంది మంది ఎమ్మెల్యేలు ఉన్న టీఆర్ఎస్ ఐదుగురు అభ్యర్థులను ఎమ్మెల్సీ ఎన్నికల్లో దించడాన్ని చంద్రాబు ప్రశ్నించడం శోచనీయమన్నారు. 14 మంది ఎమ్మెల్యేలు ఉన్న టీడీపీ ఎందుకు ఎమ్మెల్సీ అభ్యర్థిని పోటీ పెట్టిందని నిలదీశారు. చంద్రబాబు నిప్పులాంటి మనిషి కాదని, చెదలు పట్టిన మనిషిని రఘువీరారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి.