
రేవంత్ ను ఎందుకు సస్పెండ్ చేయలేదు?
రాజమండ్రి: ఓటుకు కోట్లు కేసులో అరెస్టైన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని ఇప్పటివరకు టీడీపీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదని వైఎస్సార్ సీపీ కేంద్ర కమిటీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ప్రశ్నించారు. సెక్షన్ 8 గురించి ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారని అన్నారు. టీడీపీ ఓటుకు కోట్లు కేసుకు, సెక్షన్ 8కు సంబంధం ఏమిటని నిలదీశారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు పెట్టిన ఐదు సంతకాలు ఎందుకు అమలు చేయలేదని విజయలక్ష్మి ప్రశ్నించారు.