
'ఏసీబీ నుంచి నాకు నోటీసులు రాలేదు'
హైదరాబాద్: తెలంగాణ ఏసీబీ అధికారుల నుంచి తనకు ఎటువంటి నోటీసులు రాలేదని ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. సాక్షి మీడియాతో ఆయన ఫోన్ ద్వారా మాట్లాడారు. 'ఓటుకు కోట్లు' వ్యవహారంలో ఒకవేళ ఏసీబీ నుంచి నోటీసులు అందితే, వారిచ్చిన గడువులోపు సమాధానాలు చెప్పెందుకు తాను సిద్ధమని టీడీపీ ఎమ్మెల్యే అన్నారు. రేపు హైదరాబాద్ కు వచ్చి అసలు నోటీసులు ఏం ఇచ్చారో, వాటిలో ఏం ఉందో చూడాలన్నారు. ఆ తర్వాత నోటీసుల విషయంపై నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు.