jakkampudi vijayalaxmi
-
రానున్న ఎన్నికలే టీడీపీకి ఆఖరువి
రాజానగరం : రానున్న ఎన్నికలే టీడీపీకి ఆఖరి ఎన్నికలు అవుతాయని, ఆ పై ఆ పార్టీని ఓటర్లు బంగాళాఖాతంలో కలిపేస్తారని వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు. ప్రత్యేక హోదా కోసం పదవులకు రాజీనామాలు చేసి, ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్సార్సీపీ ఎంపీలకు మద్దతుగా నియోజకవర్గ కేంద్రమైన రాజానగరంలో నిర్వహిస్తున్న రిలే దీక్ష శిబిరాన్ని ఆదివారం సందర్శించి, దీక్షాపరులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లేనిపోని హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, ఈ నాలుగేళ్లలో హామీలను తీర్చకపోగా, విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని తన విదేశీ పర్యటనలు, విలాస భవనాలతో మరింత లోటులో పడవేశారని విమర్శించారు. కేంద్రం నుంచి లోటును భర్తీ చేసే విధంగా నిధులు తెచ్చుకోవడంలోనూ, పార్లమెంటులో ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక హోదాను సాధించుటలోనూ పూర్తిగా విఫలమయ్యారన్నారు. అటువంటి వ్యక్తి రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలోని 25 పార్లమెంటు స్థానాలనూ గెలుచుకుని ఢిల్లీలో చక్రం తిప్పేస్తామంటూ పగటి కలలు కంటున్నారన్నారు. కొంగ జపాలు ఎవరి కోసం గట్టు మీద ఉండి చెరువులో చేపల కోసం జపం చేసే కొంగల మాదిరిగానే చంద్రబాబు దీక్షను భావించవలసి వస్తుందన్నారు. నిన్న ప్రధాన మంత్రి దీక్ష చేస్తే, 20న చంద్రబాబు దీక్ష చేస్తానంటుంటే ఇటువంటి అసమర్థులనా మనం పాలకులుగా ఎన్నుకుంది అని ప్రజలు సిగ్గుపడుతున్నారన్నారు. నీవు దొంగంటే నీవే దొంగంటూ ఇద్దరు దొందూ దొందే కాబట్టే ఇటువంటి నిర్ణయాలను తీసుకుంటున్నారన్నారు. ఇటువంటి కొంగ జపాలు ఎవరి కోసమని ప్రశ్నించారు. బంద్‌ని విజయవంతం చేయండి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామంటూ పార్లమెంటు సాక్షిగా పాలకులు ఇచ్చిన హామీని అమలు చేయమని కోరుతూ సోమవారం జరుపతలపెట్టిన రాష్ట్ర బంద్‌ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు విజయలక్ష్మి పిలుపునిచ్చారు. అన్ని పార్టీలు సంపూర్ణ మద్దతుతో చేపట్టిన ఈ బంద్‌లో అధికార పార్టీ కూడా కలిసి ప్రత్యేక హోదా పోరులో ప్రజలకు బాసటగా నిలవాలని సూచించారు. ప్రత్యేక హోదా రాకూడదునుకునే వారే బంద్‌కి దూరంగా ఉంటారన్నారు. -
హర్షకుమార్, జక్కంపూడి విజయలక్ష్మి అరెస్ట్
కిర్లంపూడి: కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేపట్టిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభానికి సంఘీభావం తెలిపిన నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం ముద్రగడ దీక్షకు మద్దతుగా కిర్లంపూడి వచ్చిన మాజీ ఎంపీ హర్షకుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజమండ్రిలో వైఎస్ఆర్ సీపీ నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మిని అరెస్ట్ చేశారు. ముద్రగడ దీక్షకు మద్దతు తెలిపిన జక్కంపూడి విజయలక్ష్మి ఇంటి వద్ద ఈ రోజు ఉదయం భారీగా పోలీసులను మోహరించారు. విజయలక్ష్మితో పాటు ఆమె కుంటుంబసభ్యులను బయటకు వెళ్లినివ్వలేదు. పోలీసుల తీరుకు నిరసనగా ఇంటి వద్దే బైఠాయించిన విజయలక్ష్మి, ఆకుల వీర్రాజు లను పోలీసులు అరెస్ట్ చేశారు. -
'ప్రతిపక్షాన్ని అణచివేయాలని చూస్తోంది'
రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి ప్రతిపక్షాన్ని అణచివేయాలని చూస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అంబటిరాంబాబు మండిపడ్డారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నేతల అరెస్టులే దీనికి నిదర్శనమన్నారు. వైఎస్సార్సీపీ నేత జక్కంపూడి విజయలక్ష్మి పట్ల అసభ్యంగా మాట్లాడిన ఉన్నతాధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై వైఎస్సార్సీపీ పోరాడుతూనే ఉంటుందని తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని అంబటి రాంబాబు పేర్కొన్నారు. -
రేవంత్ ను ఎందుకు సస్పెండ్ చేయలేదు?
రాజమండ్రి: ఓటుకు కోట్లు కేసులో అరెస్టైన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని ఇప్పటివరకు టీడీపీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదని వైఎస్సార్ సీపీ కేంద్ర కమిటీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ప్రశ్నించారు. సెక్షన్ 8 గురించి ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారని అన్నారు. టీడీపీ ఓటుకు కోట్లు కేసుకు, సెక్షన్ 8కు సంబంధం ఏమిటని నిలదీశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు పెట్టిన ఐదు సంతకాలు ఎందుకు అమలు చేయలేదని విజయలక్ష్మి ప్రశ్నించారు. -
వివాహ వేడుకల్లో వైఎస్ జగన్