కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేపట్టిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభానికి సంఘీభావం తెలిపిన నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
కిర్లంపూడి: కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేపట్టిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభానికి సంఘీభావం తెలిపిన నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం ముద్రగడ దీక్షకు మద్దతుగా కిర్లంపూడి వచ్చిన మాజీ ఎంపీ హర్షకుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజమండ్రిలో వైఎస్ఆర్ సీపీ నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మిని అరెస్ట్ చేశారు.
ముద్రగడ దీక్షకు మద్దతు తెలిపిన జక్కంపూడి విజయలక్ష్మి ఇంటి వద్ద ఈ రోజు ఉదయం భారీగా పోలీసులను మోహరించారు. విజయలక్ష్మితో పాటు ఆమె కుంటుంబసభ్యులను బయటకు వెళ్లినివ్వలేదు. పోలీసుల తీరుకు నిరసనగా ఇంటి వద్దే బైఠాయించిన విజయలక్ష్మి, ఆకుల వీర్రాజు లను పోలీసులు అరెస్ట్ చేశారు.