harshakumar
-
నన్ను,నా కుటుంబాన్ని చంపే ప్రయత్నం జరిగింది
-
ప్రేమ ఎలా పుట్టింది?
హర్షకుమార్, తులిక సింగ్ జంటగా దీపక్ బల్దేవ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘లాస్ట్ సీన్’. మధునారాయణ్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ప్రకాష్ ఠాకూర్ సమర్పణలో గ్లిట్టర్ ఫిల్మ్ అకాడమీ, ఏజీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్‌లో రూపొందుతోన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఊటీ, కెట్టి వాలీ, పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. దీపక్ బల్దేవ్ మాట్లాడుతూ– ‘‘సీటీ లైఫ్ వద్దని స్వచ్ఛమైన ప్రకృతి వాతావరణం కోసం ఊటీలో సెటిల్ అవ్వాలనుకునే అబ్బాయి.. పల్లెటూరు కంటే సిటీ లైఫ్ బాగుంటుంది అని సిటీ అబ్బాయిని లవ్ చేసి అక్కడే సెటిల్ అవ్వాలనుకునే అమ్మాయి మధ్య ప్రేమ ఎలా పుట్టింది? ఆ ప్రేమ నిలబడుతుందా? అన్నదే చిత్ర కథ. యూత్‌కి 100% నచ్చే ప్రేమ కథ. తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్నాం. ఊటీ షెడ్యూల్‌తో 80% చిత్రీకరణ పూర్తవుతుంది. మిగిలిన 20% షూటింగ్ హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో జరుపుతాం. మార్చిలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనిల్, కెమెరా: జవహర్ రెడ్డి, సహ నిర్మాత: అజయ్ గౌతమ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కొల్లా జగన్. -
సీఎం అనుమతి తీసుకున్నట్టు ఆధారం చూపితే నేను తీసుకుంటా
– కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం –మాజీ ఎంపీ హర్షకుమార్‌ను పరామర్శించిన ‘ముద్రగడ’ తాడితోట,(రాజమహేంద్రవరం సిటీ) : ముఖ్యమంత్రి చంద్రబాబు పాదయాత్ర చేసిన సమయంలో అనుమతి తీసుకున్నట్టు ఆధారాలు చూపితే తానూ అనుమతి కోసం దరఖాస్తు చేస్తానని మాజీ మంత్రి, కాపు ఉద్యమ నాయకులు ముద్రగడ పద్మనాభం అన్నారు. గురువారం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ఆమరణ నిరహార దీక్ష చేస్తున్న సందర్భంగా ఆయనను పరామర్శించేందుకు రాజమహేంద్రవరం వచ్చిన ముద్రగడ విలేకరులతో మాట్లాడారు. గరగపర్రు సంఘటన బాధాకరమని అన్నారు. అంబేడ్కర్‌ను ప్రపంచం మేధావిగా గుర్తించిందని మర్చిపోకూడదని అన్నారు. పాదయాత్రకు అనుమతి విషయమై ఆయన మాట్లాడుతూ సమాధానం ఇస్తూ ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేశాడని, ఆలాగే వైఎస్ రాజ శేఖర్ రెడ్డి పాదయాత్ర చేశారని, సీపీఎం నాయకులు నారాయణ కూడా పాదయాత్రలు చేశారని వీరందరూ అనుమతి తీసుకొని చేశారా? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ప్రజలకు అండగా ఆమరణ నిరహార దీక్ష చేపట్టిన జీవి హర్ష కుమార్‌ను ముద్రగడ అభినందించారు. -
పాదయాత్రకు సీఎం అనుమతి తీసుకున్నట్టు ఆధారం చూపితే నేను తీసుకుంటా
– కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం –మాజీ ఎంపీ హర్షకుమార్‌ను పరామర్శించిన ‘ముద్రగడ’ తాడితోట,(రాజమహేంద్రవరం సిటీ) : ముఖ్యమంత్రి చంద్రబాబు పాదయాత్ర చేసిన సమయంలో అనుమతి తీసుకున్నట్టు ఆధారాలు చూపితే తానూ అనుమతి కోసం దరఖాస్తు చేస్తానని మాజీ మంత్రి, కాపు ఉద్యమ నాయకులు ముద్రగడ పద్మనాభం అన్నారు. గురువారం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ఆమరణ నిరహార దీక్ష చేస్తున్న సందర్భంగా ఆయనను పరామర్శించేందుకు రాజమహేంద్రవరం వచ్చిన ముద్రగడ విలేకరులతో మాట్లాడారు. గరగపర్రు సంఘటన బాధాకరమని అన్నారు. అంబేడ్కర్‌ను ప్రపంచం మేధావిగా గుర్తించిందని మర్చిపోకూడదని అన్నారు. పాదయాత్రకు అనుమతి విషయమై ఆయన మాట్లాడుతూ సమాధానం ఇస్తూ ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేశాడని, ఆలాగే వైఎస్ రాజ శేఖర్ రెడ్డి పాదయాత్ర చేశారని, సీపీఎం నాయకులు నారాయణ కూడా పాదయాత్రలు చేశారని వీరందరూ అనుమతి తీసుకొని చేశారా? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ప్రజలకు అండగా ఆమరణ నిరహార దీక్ష చేపట్టిన జీవి హర్ష కుమార్‌ను ముద్రగడ అభినందించారు. -
‘మాధ్యమిక ’ మాఫియా
విద్యా విధానంలో మార్పు రావాలి మాజీ ఎంపీ హర్షకుమార్ కంబాలచెరువు (రాజమహేంద్రవరంసిటీ) : ఇంటర్మీడియెట్ విద్య ఒక మాఫియాలా తయారైందని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ అన్నారు. స్థానిక రాజీవ్‌గాంధీ డిగ్రీ కళాశాలలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పుస్తెలు సైతం తాకట్టుపెట్టుకుని తల్లిదండ్రులు తమ బిడ్డలను చదివించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. జూన్ ఒకటి నుంచి కళాశాలల్లో ప్రవేశాలు కల్పించాలి, అయితే ఫలితాలు వచ్చిన రోజే ఆయా కళాశాలల్లో సీట్లు అయిపోయాయని చెబుతున్నారని, ఎక్కడా రిజ్వేషన్ అమలు చేయడం లేదున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు రూ.2,300 వరకు అయితే ఒకో విద్యార్థి నుంచి రూ.లక్షల్లో గుంజడం మాఫియాను తలపిస్తోందన్నారు. కళాశాలలన్నింటికీ ఒకే ఫీజు విధానం అమలు చేయాలన్నారు. పేద విద్యార్థుల్లో మంచి మార్కులు వచ్చిన వారిని తీసి, వారికి కార్పొరేట్ విద్యాసంస్థల్లో రూ.70 వేల వరకు ప్రభుత్వమే ïఫీజు కట్టడం ఎంత దారుణమో తెలుస్తుందన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కళాశాలలు నడుచుకోకపోతే వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారం ఇంటర్ బోర్డు ఆర్ఐవోకు ఉందన్నారు. బలహీన వర్గాలకు చెందిన 12 వేలమందికి పైగా విద్యార్థులు స్కాలర్షిప్కు నోచుకోలేదన్నారు. ఇంటర్ విద్యలో తయారైన మాఫియాను ప్రభుత్వం వెంటనే అరికట్టాలని ఆయన కోరారు. పది ఫలితాల్లో రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానం సాధించడం ఆనందదాయకమన్నారు. -
'ముద్రగడ పరిస్థితి జైలు కన్నా దారుణం'
తూర్పుగోదావరి: తుని ఘటనలో ప్రభుత్వం అమాయకులను కేసుల్లో ఇరికించిందని మాజీ పార్లమెంట్ సభ్యుడు హర్షకుమార్ విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముద్రగడ దగ్గరకు ఎవరినీ వెళ్లనీయకుండా ప్రభుత్వం అడ్డుకుంటొందని మండిపడ్డారు. ముద్రగడ ప్రస్తుత పరిస్థితి జైలు కన్నా దారుణంగా ఉందన్న ఆయన.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియంత మాదిరిగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. -
హర్షకుమార్‌తో మద్రగడ భేటీ
రాజమండ్రి: మాజీ ఎంపీ హర్షకుమార్‌తో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆదివారం భేటీ అయ్యారు. స్నేహపూర్వకంగానే హర్షకుమార్‌ను కలిశానని ముద్రగడ తెలిపారు. కాపు రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం ఇచ్చిన గడువు ఆగష్టుతో ముగుస్తుంది. ఆలోపు సరైన నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తు కార్యాచరణను త్వరలో ప్రకటిస్తానని మద్రగడ పేర్కొన్నారు. -
హర్షకుమార్, జక్కంపూడి విజయలక్ష్మి అరెస్ట్
కిర్లంపూడి: కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేపట్టిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభానికి సంఘీభావం తెలిపిన నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం ముద్రగడ దీక్షకు మద్దతుగా కిర్లంపూడి వచ్చిన మాజీ ఎంపీ హర్షకుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజమండ్రిలో వైఎస్ఆర్ సీపీ నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మిని అరెస్ట్ చేశారు. ముద్రగడ దీక్షకు మద్దతు తెలిపిన జక్కంపూడి విజయలక్ష్మి ఇంటి వద్ద ఈ రోజు ఉదయం భారీగా పోలీసులను మోహరించారు. విజయలక్ష్మితో పాటు ఆమె కుంటుంబసభ్యులను బయటకు వెళ్లినివ్వలేదు. పోలీసుల తీరుకు నిరసనగా ఇంటి వద్దే బైఠాయించిన విజయలక్ష్మి, ఆకుల వీర్రాజు లను పోలీసులు అరెస్ట్ చేశారు. -
'ఏ హోదాతో బోయపాటి మైక్ పట్టుకున్నారు'
హైదరాబాద్ : గోదావరి పుష్కరాల నేపథ్యలో రాజమండ్రిలో తొక్కిసలాట ఘటనపై హైకోర్టును ఆశ్రయిస్తామని అమలాపురం మాజీ ఎంపీ జి.వి. హర్షకుమార్ తనయుడు శ్రీరాజ్ స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్ లో శ్రీరాజ్ విలేకర్లతో మాట్లాడుతూ... రాజమండ్రిలో తొక్కిసలాట హర్షకుమార్ వర్గం కుట్ర అని మంత్రుల వ్యాఖ్యలను ఆయన ఖండించారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. తోక్కిసలాట ఘటనపై కమిటీ వేసి సమగ్ర విచారణ జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని శ్రీరాజ్ డిమాండ్ చేశారు. సెంట్రల్ జైల్లో ఉండి కనీసం ఫోన్ కూడా మాట్లాడలేని స్థితిలో ఉన్న తన తండ్రిపై అబాండాలు వేయడం సరికాదన్నారు. తోక్కిసలాట సంఘటనతో కలత చెంది పట్టణ మూడో టౌన్ పీఎస్‌కు వెళ్తే దాదాపు 2 గంటలు వేచి ఉంచి ఆ తర్వాత కేసు నమోదు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పుష్కరాల సమయంలో మైక్ ఐ అండ్ పీఆర్ లేదా పోలీసుల చేతిలో ఉండాలి. కానీ దర్శకుడు బోయపాటి శ్రీను మైక్ పట్టుకున్న దృశ్యాలు అన్నిఛానల్స్లో చూశామన్నారు. ఏ హోదాతో బోయపాటి మైక్ పట్టుకున్నారని ప్రశ్నించారు. తన తండ్రి హర్షకుమార్‌ను అరెస్ట్ చేసిన విధానం సరిగా లేదన్నారు. దీక్ష చేస్తున్న 36 గంటల్లో కనీసం డాక్టర్‌ను కూడా పంపకుండా నిర్ధాక్షణ్యంగా ఈడ్చుకెళ్లారని శ్రీరాజ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎలాంటి అడ్మినిస్ట్రేటీవ్ స్కిల్స్ లేవని ఎద్దేవా చేశారు. -
ఎన్జీవోలపై హర్ష తనయుల దాడి
అమలాపురం ఎంపీ హర్షకుమార్ కుమారులు రాజమండ్రిలో సమైక్య ఉద్యమకారులపై దాడి చేయడంతో సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. ఆ దాడిని నిరసిస్తూ అమలాపురంలో ఎంపీ క్యాంప్ కార్యాలయాన్ని ఉద్యమకారులు ముట్టడించారు. ఆ సందర్భంగా జరిగిన పోలీసు లాఠీచార్జిలో పలువురు గాయపడ్డారు. దాంతో వివిధ పార్టీలకు చెందిన నేతలు సీఐ కార్యాలయాన్ని ముట్టడించారు. ఇదిలా ఉండగా జిల్లా వ్యాప్తంగా హర్షకుమార్ కుమారుల చర్యలను ఖండిస్తూ దిష్టిబొమ్మల దహనాలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. సాక్షి, రాజమండ్రి/కంబాలచెరువు, న్యూస్‌లైన్ : ఎంపీ హర్షకుమార్ తనయులు సమైక్యవాదులపై దాడి చేసి రెచ్చి పోయారు. ‘మీకు సమైక్యాంధ్ర కావాలా’ అంటూ వీరంగం ఆడారు. అయితే హైదరాబాద్‌లో ఉన్న ఎంపీ తోపులాట జరిగింది... ఆ పరిస్థితుల్లో కొట్టారని టీవీల్లో చెప్పడం ఉద్యమకారులను రెచ్చకొట్టింది. దాడి జరిగిందిలా.. తెలంగాణ నోట్‌కు వ్యతిరేకంగా శనివారం ఉదయం పేపర్మిల్ను మూయించివేసేందుకు అక్కడకు వెళ్లిన ఎన్జీవో నాయకులు కాతేరు వైపునుంచి వచ్చే వాహనాలను ఆపేందుకు రాజీవ్‌గాంధీ కళాశాల వద్ద రోడ్డుకు అడ్డంగా ఆటోలు పెట్టి, తాడుతో దారి మూసివేస్తున్నారు. ఓ సమైక్యవాది ఉదయం 8.50 గంటల ప్రాంతంలో కళాశాల బోర్డును చింపారు. ఆ సమాచారం తెలుసుకున్న ఎంపీ హర్షకుమార్ తనయులు శ్రీరాజ్, సుందర్ అక్కడకు వచ్చి సమైక్యవాదుల చేతిలో జెండాలు లాక్కుని ఆ కర్రలతో విచక్షణా రహితంగా కొట్టారు. ఈ దాడిలో సబ్‌కలెక్టర్ కార్యాలయం ఉద్యోగి, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకుడు ప్రమోద్‌కుమార్, వీఆర్వోలు లక్ష్మణ్, శివరాజు, పేపర్‌మిల్లు ఉద్యోగి దుర్గాప్రసాద్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. పోలీసుల సాక్షిగా దాడి ‘ఏరా.. మీకు సమైక్యాంధ్ర కావాలా..మీరు ఎన్జీవోలా’ అంటూ పోలీసుల సాక్షిగా ఎంపీ తనయులు శ్రీరాజ్, సుందర్ దాడి చేశారు. వారికి ఎంపీ సెక్యూరిటీ, వారి వ్యక్తిగత గార్డులు తోడయ్యారు. రంగంలోకి దిగిన ఎన్జీవోలు పేపరు మిల్లు వద్ద ఆందోళన చేస్తున్న ఉద్యోగులకు ఈ విషయం తెలిసిన వెంటనే పెద్ద ఎత్తున ఆ ప్రాంతానికి చేరుకున్నారు. దాంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అర్బన్ జిల్లా ఎస్పీ టి.రవికుమార్‌మూర్తి, డీఎస్సీలు నామగిరి బాబ్జీ, అనిల్‌కుమార్ పోలీసులు బలగాలతో అక్కడకు చేరుకున్నారు. అలాగే అమలాపురం నుంచి కోనసీమ జేఏసీ నాయకులు ఆ ప్రాంతానికి తరలివచ్చారు. హర్షకుమార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హర్షకుమార్ భార్య జేఏసీ నాయకులను బుజ్జగించే ప్రయత్నంలో కాలేజీ లోపల వారితో ఆమె మాట్లాడుతున్న సమయంలో ఆందోళకారులు బయటనుంచి రాళ్లు విసిరారు. ఈ దాడిలో కాలేజీ అద్దాలు బద్దలుకాగా ఒక పత్రికా విలేకరికి, మరొకరికి గాయాలయ్యాయి. మున్సిపల్ సిబ్బంది ట్రాక్టర్లతో పెద్ద ఎత్తున చెత్తతీసుకుని వచ్చి కళాశాల ముందు వేశారు. ఆందోళనకారులు ఆ చెత్తకు నిప్పుపెట్టారు. ఆందోళనకారులను కళాశాల మెయిన్‌గేట్ వద్ద పోలీసులు అడ్డుకొనడంతో పక్కమార్గం గుండా లోపలికి వెళ్లి ఏసీ మిషన్లు తీసుకువచ్చి చెత్త మంటల్లో పడేశారు. మూడు కాలేజీ బస్సులను ధ్వంసం చేశారు. శ్రీరాజ్, సుందర్‌లను అరెస్టు చేశామని, కావాల్సివస్తే తీసుకెళ్లి చూపిస్తామని ఎన్జీవో నాయకులు గెద్దాడ హరిబాబు, ఇతర జేఏసీ నాయకులకు ఎస్పీ వివరించడంతో గొడవ సద్దుమణిగింది. బాధితులకు పరామర్శ ఎంపీ తనయుల దాడిలో గాయపడిన ప్రమోద్‌కుమార్, లక్ష్మణ్, శివరాజ్, దుర్గాప్రసాద్‌లను రాజమండ్రి ప్రభుత్వాస్పత్రిలో వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులు పరామర్శించారు. నాన్ బెయిలబుల్ కేసు పెట్టాలి మాకు క్షమాపణలు కాదు. న్యాయం కావాలి. ఎంపీ కుమారులపై నాన్ బెయిలబుల్ వారంట్లు జారీ చేయాలి. - బూర్ల హరిబాబు, ఎపీఎన్జీఓల సంఘం రాజమండ్రి విభాగం అధ్యక్షుడు సమైక్యవాదుల్ని నీచంగా తిట్టారు సమైక్యవాదాన్ని, ఉద్యోగులను ఎంపీ తనయులు నీచంగా తిట్టారు. మేంప్రాణాలకు ఒడ్డి సమైక్య రాష్ట్రం కోసం పాటు పడుతుంటే సీమాంధ్రలో ఉండి తెలంగాణా వాదిలా వ్యవహరించారు. - ప్రమోద్ కుమార్, దాడిలో గాయపడ్డ ఉద్యోగి వారు ఎన్జీవోలని తెలీదు ఏపీఎన్జీవోల పిలుపులో కళాశాలల బంద్ లేదు. అయినప్పటికీ మేం బంద్ పాటిస్తున్నాం. కళాశాలపై దాడి చేస్తున్నారని భావించి కొట్టాం. వారు ఎన్జీవోలు అని తెలియదు. - సుందర్, హర్షకుమార్ కుమారుడు