తుని ఘటనలో అమాయకులను ప్రభుత్వం కేసుల్లో ఇరికించిందని మాజీ పార్లమెంట్ సభ్యుడు హర్షకుమార్ విమర్శించారు.
తూర్పుగోదావరి: తుని ఘటనలో ప్రభుత్వం అమాయకులను కేసుల్లో ఇరికించిందని మాజీ పార్లమెంట్ సభ్యుడు హర్షకుమార్ విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముద్రగడ దగ్గరకు ఎవరినీ వెళ్లనీయకుండా ప్రభుత్వం అడ్డుకుంటొందని మండిపడ్డారు. ముద్రగడ ప్రస్తుత పరిస్థితి జైలు కన్నా దారుణంగా ఉందన్న ఆయన.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియంత మాదిరిగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.