
వారే టీడీపీలో చేరారు: రఘువీరా
కాంగ్రెస్‌లో మేము తప్ప ఎవ్వరూ మిగలరని ప్రకటించిన వాళ్లే టీడీపీలో చేరి పదవులు అనుభవిస్తున్నారని జేసీ సోదరులను ఉద్దేశించి...
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌లో మేము తప్ప ఎవ్వరూ మిగలరని ప్రకటించిన వాళ్లే టీడీపీలో చేరి పదవులు అనుభవిస్తున్నారని జేసీ సోదరులను ఉద్దేశించి పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి మాట్లాడారు. పీసీసీ అధ్యక్ష పదవి పోయిన తర్వాత రఘువీరారెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడనున్నారని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి సోమవారం అనంతపురంలో చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.