
ఎన్‌ఎస్‌యూఐ ‘విద్యార్థి పోరాట యాత్ర’
పోస్టర్ విడుదల చేసిన పీసీసీ చీఫ్ రఘువీరా
సాక్షి, హైదరాబాద్: బాబు వస్తే జాబు వస్తుంది... నిరుద్యోగులకు ప్రతి నెలా భృతి... ఇలా ఎన్నో హామీలతో అధికారంలోకొచ్చిన చంద్రబాబు ఆ తర్వాత చేతులెత్తేయడంపై ఎన్‌ఎస్‌యూఐ ఉద్యమానికి దిగుతోంది. బాబు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఒత్తిడి తెచ్చేందుకు ‘విద్యార్థి పోరాటం’ పేరిట యాత్ర చేపడుతోంది. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి శుక్రవారం ఇందిరా భవన్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌యూఐ రాష్ర్ట అధ్యక్షుడు రాజీవ్ రతన్ మాట్లాడారు. ఈ నెల 28న అనంతపురం జిల్లాలో పోరాట యాత్రను ప్రారంభించి ఫిబ్రవరి 11న శ్రీకాకుళం జిల్లాలో ముగిస్తామన్నారు.
కాంగ్రెస్ రాష్ట్ర బీసీ సెల్ చైర్మన్ నియామకం..: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బీసీ సెల్ చైర్మన్‌గా కాకినాడకు చెందిన ఎన్.వెంకటేశ్వరరావును ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ. ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు నియమించారు. పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి శుక్రవారం నియామక పత్రాన్ని వెంకటేశ్వరరావుకు అందజేశారు.