సీమాంధ్ర కాంగ్రెస్ అభ్యర్ధులకు బీఫాంలు | Seemandhra Congress candidates ger B-forms | Sakshi
Sakshi News home page

సీమాంధ్ర కాంగ్రెస్ అభ్యర్ధులకు బీఫాంలు

Published Tue, Apr 15 2014 1:31 PM | Last Updated on Wed, Aug 29 2018 6:00 PM

సీమాంధ్ర కాంగ్రెస్ అభ్యర్ధులకు బీఫాంలు - Sakshi

సీమాంధ్ర కాంగ్రెస్ అభ్యర్ధులకు బీఫాంలు

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పథకాలకు ప్రజలకు వివరించాలని కేంద్ర మంత్రి, సీమాంధ్ర పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ చిరంజీవి అన్నారు. అందరినీ కలుపుకుపోవాలని అభ్యర్ధులకు సూచించారు. సీమాంధ్ర కాంగ్రెస్ అభ్యర్ధులకు ఇందిరాభవన్‌లో బీఫాంలు అందజేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. కాంగ్రెస్ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

పార్టీ గెలిచే విధంగా పనిచేస్తామంటూ అభ్యర్ధులచే సీమాంధ్ర పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ప్రతిజ్ఞ చేయించారు. ఎన్నికల్లో అవలంభించాల్సిన తీరుపై అభ్యర్ధులకు దిశానిర్దేశం చేశారు. వచ్చే ఐదేళ్లు కాంగ్రెస్‌ను బలోపేతం చేసేందుకే అభ్యర్థులకు టిక్కెట్లు ఇచ్చామని రఘువీరా అన్నారు. తెలుగు ప్రజలు కాంగ్రెస్‌ను ఆదరిస్తారన్న ఆశాభావాన్ని జాతీయ నేత వయలార్ రవి వ్యక్తం చేశారు. పనబాక లక్ష్మి, కిల్లి కృపారాణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement