seemandhra congress condidates
-
సీమాంధ్ర కాంగ్రెస్ అభ్యర్ధులకు బీఫాంలు
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పథకాలకు ప్రజలకు వివరించాలని కేంద్ర మంత్రి, సీమాంధ్ర పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ చిరంజీవి అన్నారు. అందరినీ కలుపుకుపోవాలని అభ్యర్ధులకు సూచించారు. సీమాంధ్ర కాంగ్రెస్ అభ్యర్ధులకు ఇందిరాభవన్లో బీఫాంలు అందజేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. కాంగ్రెస్ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ గెలిచే విధంగా పనిచేస్తామంటూ అభ్యర్ధులచే సీమాంధ్ర పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ప్రతిజ్ఞ చేయించారు. ఎన్నికల్లో అవలంభించాల్సిన తీరుపై అభ్యర్ధులకు దిశానిర్దేశం చేశారు. వచ్చే ఐదేళ్లు కాంగ్రెస్ను బలోపేతం చేసేందుకే అభ్యర్థులకు టిక్కెట్లు ఇచ్చామని రఘువీరా అన్నారు. తెలుగు ప్రజలు కాంగ్రెస్ను ఆదరిస్తారన్న ఆశాభావాన్ని జాతీయ నేత వయలార్ రవి వ్యక్తం చేశారు. పనబాక లక్ష్మి, కిల్లి కృపారాణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
'సీమాంధ్రలో కాంగ్రెస్ అభ్యర్థుల కొరత అవాస్తం'
న్యూఢిల్లీ : సీమాంధ్రలో కాంగ్రెస్ అభ్యర్థుల కొరత అవాస్తవమని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్ అన్నారు. ఈనెల 14వ తేదీలోగా సీమాంధ్ర కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికను పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. ఈనెల 16న తెలంగాణలో సోనియా గాంధీ, 17న రాహుల్ గాంధీ పర్యటిస్తారని ఆయన శుక్రవామిక్కడ పేర్కొన్నారు. కరీంనగర్లో 16న సోనియా సభ ఉంటుందని, 17న మహబూబ్నగర్, మెదక్, వరంగల్లో రాహుల్ బహిరంగ సభలు ఉంటాయని దిగ్విజయ్ తెలిపారు. కాగా అభ్యర్థుల ఖరారుపై ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి శుక్రవారం ఉదయం దిగ్విజయ్ ని కలిశారు. ఆయనతో పాటు చిరంజీవి, జేడీ శీలం కూడా ఉన్నారు. -
సీమాంధ్ర కాంగ్రెస్ తొలి జాబితా ఖరారు!
న్యూఢిల్లీ : రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్తో ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, కేంద్రమంత్రులు చిరంజీవి, జేడీ శీలం శుక్రవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీమాంధ్ర అభ్యర్థుల ఖరారుపై వీరు చర్చించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీమాంధ్రలో 150 స్థానాలకు అభ్యర్థులు దాదాపు ఖరారైనట్లు సమాచారం. అయితే ఈరోజు సాయంత్రం కాంగ్రెస్ కేంద్ర కమిటీ సమావేశం తర్వాత సీమాంధ్ర కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయడానికి కాంగ్రెస్ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం లేదా శనివారం అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించనున్నారు.