
'సీమాంధ్రలో కాంగ్రెస్ అభ్యర్థుల కొరత అవాస్తం'
న్యూఢిల్లీ : సీమాంధ్రలో కాంగ్రెస్ అభ్యర్థుల కొరత అవాస్తవమని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్ అన్నారు. ఈనెల 14వ తేదీలోగా సీమాంధ్ర కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికను పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. ఈనెల 16న తెలంగాణలో సోనియా గాంధీ, 17న రాహుల్ గాంధీ పర్యటిస్తారని ఆయన శుక్రవామిక్కడ పేర్కొన్నారు.
కరీంనగర్లో 16న సోనియా సభ ఉంటుందని, 17న మహబూబ్నగర్, మెదక్, వరంగల్లో రాహుల్ బహిరంగ సభలు ఉంటాయని దిగ్విజయ్ తెలిపారు. కాగా అభ్యర్థుల ఖరారుపై ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి శుక్రవారం ఉదయం దిగ్విజయ్ ని కలిశారు. ఆయనతో పాటు చిరంజీవి, జేడీ శీలం కూడా ఉన్నారు.