
చంద్రబాబు షాక్‌లో ఉన్నట్లుంది: రఘువీరా
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదో షాక్‌లో ఉన్నట్లు కన్పిస్తోందని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు.
హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదో షాక్‌లో ఉన్నట్లు కన్పిస్తోందని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు. గతంలో 23 జిల్లాలకు ముఖ్యమంత్రిగా ఉన్న బాబు ప్రస్తుతం 13 జిల్లాలకే పరిమితం అనే న్యూనతా భావంలో ఉన్నారని ఎద్దేవా చేశారు. పాలనలో చంద్రబాబు జోష్ ప్రదర్శించడం లేదన్నారు. బుధవారం ఇందిరాభవన్‌లో పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి రుద్రరాజు పద్మరాజుతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. రైతుల రుణ మాఫీపై ఇచ్చిన హామీని పక్కనపెట్టి రీ షెడ్యూల్ చేసి రైతులను మోసగించాలని చూస్తున్నారన్నారు.