మా వాళ్ల ఓట్లు అక్కర్లేదా? | Andhra Congress Politics? | Sakshi
Sakshi News home page

మా వాళ్ల ఓట్లు అక్కర్లేదా?

Published Sun, Jan 17 2016 9:30 AM | Last Updated on Wed, Aug 29 2018 6:00 PM

మా వాళ్ల ఓట్లు అక్కర్లేదా? - Sakshi

మా వాళ్ల ఓట్లు అక్కర్లేదా?

హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికల సందడి మొదలైనా ప్రచారంలో పాల్గొనాలని మాటమాత్రంగానైనా ఆహ్వానించకపోవడం పట్ల తెలంగాణ కాంగ్రెస్ నేతలపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పెద్దలు గుర్రుమంటున్నారు. ఈ ఎన్నికల్లో ఏదో ఒక రకంగా ఉనికి చాటుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్  రంగంలోకి దిగారు. తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహించారు. అభ్యర్థుల ఎంపికతోపాటు ప్రచార వ్యూహంపై పెద్ద ఎత్తున కసరత్తు చేపట్టారు. అయితే, తనకు పిలుపు రాకపోవడంతో ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

తాము ప్రచారం చేస్తే ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఓటర్లను ఆకర్షించే అవకాశం ఉన్నా దిగ్విజయ్‌సింగ్, తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎందుకు పట్టించుకోవడం లేదని ఏపీకి చెందిన ముఖ్యనేతలు ఇందిర భవన్‌లో చర్చించుకుంటున్నారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటామనే ఆకాంక్షను ఇటీవల ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రకటించాలని ఏపీ పీసీసీ చీఫ్ ముందుగా అనుకున్నప్పటికీ తెలంగాణ నాయకుల నుంచి ఎలాంటి పిలుపు రాకపోవడంతో ఆ విషయాన్ని ప్రకటించకుండా వాయిదా వేయాల్సి వచ్చిందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement