రక్షమాం.. పాహిమాం | save congress party | Sakshi
Sakshi News home page

రక్షమాం.. పాహిమాం

Published Mon, Mar 24 2014 2:52 AM | Last Updated on Wed, Aug 29 2018 5:50 PM

రక్షమాం.. పాహిమాం - Sakshi

రక్షమాం.. పాహిమాం

ఏలూరు, న్యూస్‌లైన్:
రాష్ట్ర విభజనకు పూనుకుని కష్టాల్లో మునిగిపోరుున కాంగ్రెస్ పార్టీని కార్యకర్తలే ఆదుకోవాలని కేంద్ర మంత్రి, పీసీసీ ప్రచార కమిటీ అధ్యక్షుడు కొణిదల చిరంజీవి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ ఉనికిని కాపాడుకునే చర్యల్లో భాగంగా బస్సుయూత్ర చేపట్టిన సీమాంధ్ర  పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, కేంద్ర మంత్రులు జేడీ శీలం, ఎంఎం పళ్లంరాజు, కిల్లి కృపారాణి, పనబాక  లక్ష్మి ఆదివారం ఉదయం ఏలూరు చేరుకున్నారు.
 
స్థానిక మర్చంట్ చాంబర్ కల్యాణ మండపం వద్ద చిరంజీవికి, కేంద్ర మంత్రులకు కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలికారు. అనంతరం రఘువీరారెడ్డి అధ్యక్షతన కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కార్యకర్తలు పెద్దగా రాకపోవడంతో సభ వెలవెలబోరుుంది. అతికొద్ది మంది కార్యకర్తలు, చిరంజీవి అభిమానులు హాజరుకాగా, వారితోనే సభ నడిపించారు.
 
చిరంజీవి అభిమానులు ‘సీఎం చిరంజీవి, జై చిరంజీవా’ అంటూ నినాదాలు చేయడంతో అలా అనొద్దని చిరంజీవి సైగలతో వారిని వారించారు. ఈ నినాదాల మధ్య సభను నడ పలేక మాజీ మంత్రి వట్టి వసంత్‌కుమార్ ఒకానొక దశలో అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి జేడీ శీలం కూడా మీకిది మర్యాద కాదంటూ చిరంజీవి అభిమానులను హెచ్చరించారు. రఘువీరారెడ్డి మాట్లాడుతుండగా, ఉంగుటూరు నుంచి వసంత్‌కుమార్ పోటీ చేయాలని పలువురు కేకలు వేశారు.
 
 కాంగ్రెస్‌కు శీల పరీక్ష
కేంద్ర మంత్రులు చిరంజీవి, రఘువీరారెడ్డి తదితరులు మాట్లాడుతూ విభజన పాపం కాంగ్రెస్‌ది కాదని చెప్పుకొచ్చారు. దీనికి టీడీపీ సహా పలు పార్టీలు మద్దతు పలకడం వల్లే సీడబ్ల్యుసీ తీర్మానం చేసిందన్నారు. విభజన భాధాకరమని.. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ శీఘ్రంగా కోలుకునేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
 
విభజన వల్ల కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు వస్తాయని, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని నమ్మబలికారు. పాతనీరు పోతే పోయిందని.. కొత్త వారికి అవకాశాలు వస్తాయన్నారు. చంద్రబాబు వలసలను ప్రోత్సహించడం.. కాంగ్రెస్ నేతలు సిగ్గులేకుండా అందులో చేరిపోవడం వారి అనైతికతకు నిదర్శనమని ఎద్దేవా చేశారు.
 

సమైక్య చాంపియన్ అయిపోదామనుకున్న కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్రం విడిపోయూక కొత్తపార్టీ పెట్టి నవ్వుల పాలయ్యూరని రఘువీరా నిప్పులు చెరిగారు. బస్సు యాత్ర ద్వారా పార్టీల కుతంత్రాలను ప్రజలకు వివరిస్తున్నామని, రథయూత్ర తరహాలో సాగుతున్న దీని చక్రాల కింద ఇతర పార్టీలు నలిగిపోరుు నాశనం అవుతాయని శాపనార్థాలు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ శీల పరీక్ష ఎదుర్కొంటోందని, ఈ గండం నుంచి పార్టీని గట్టెక్కించి నవ్యాంధ్రప్రదేశ్ కోసం అందరూ పనిచేయాలని కోరారు.
 
విద్య, వైద్యం, ఆరోగ్యం, ఇతర రంగాల్లో సీమాంధ్రను దేశంలోనే ఉన్నతంగా తీర్చిదిద్దుతామని, ఇందుకు ఆనం రామనారాయణరెడ్డి ఆధ్వర్యంలో మేనిఫెస్టో సిద్ధం చేస్తున్నామని వివరించారు. కేంద్ర మంత్రులు ఎంఎం పళ్లంరాజు, జేడీ శీలం, కిల్లి కృపారాణి, పనబాక లక్ష్మి, రాష్ట్ర తాజా మాజీ మంత్రులు వట్టి వసంత్‌కుమార్, కొండ్రు మురళి, నరసాపురం ఎంపీ కనుమూరి బాపిరాజు తదితరులు కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేయూలని కోరారు.
 
ఎమ్మెల్యే బంగారు ఉషారాణి, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు కరాటం రాంబాబు, డీసీసీ అధ్యక్షుడు ముత్యాల వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణరాజు, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు మల్లిపూడి కనకదుర్గ, రాజ్యసభ మాజీ సభ్యుడు కమ్ముల బాలసుబ్బారావు, మాజీ ఎమ్మెల్యే గద్దె వెంకటేశ్వరరావు, ఎన్‌ఎస్‌ఆర్‌కే చౌదరి, పీసీీసీ ప్రధాన కార్యదర్శి రాజనాల రామ్మోహన్‌రావు, అలగా రవికుమార్, బీవీ రాఘవయ్య చౌదరి, బద్దా ఆనంద్‌కుమార్, కమ్ముల కృష్ణ, చిట్టిబొమ్మ వెంకటస్వామి పాల్గొన్నారు.
 సభ అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు కాంగ్రెస్ శ్రేణులకు వీడ్కోలు పలికిన చిరంజీవి బస్సుయాత్ర విజయవాడకు బయల్దేరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement