
బుధవారం నామినేషన్ దాఖలు చేస్తున్న పనబాక లక్ష్మి
సాక్షి, నెల్లూరు(అర్బన్): ఏపీలో తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికకు సంబంధించి టీడీపీ తరఫున మాజీ మంత్రి పనబాక లక్ష్మి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు పార్టీ కార్యకర్తలతో కలసి వీఆర్‌సీ మీదుగా కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పార్టీ సీనియర్ నాయకులు దేవినేని ఉమామహేశ్వరరావు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణలతో కలసి కలెక్టరేట్‌లో రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబుకు రెండు సెట్ల నామినేషన్లను అందించారు.
అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఒక్క సీటు గెలిచినంత మాత్రాన టీడీపీకి ఒరిగేదేమీ లేదన్నారు. అయితే ప్రజా సమస్యలపై పోరాడాలంటే తమను గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment