
16న సీమాంధ్ర ప్రజాప్రతినిధుల భేటీ
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో మంత్రి కాసు కృష్ణారెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిస్థితులతో పాటు ఇతర అంశాలపై చర్చించినట్లు సమాచారం. సీఎంతో భేటీ అనంతరం మంత్రి కాసు కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈనెల 16న సీమాంధ్ర ఎమ్మెల్యేలు... ఎమ్మెల్సీలు... మంత్రుల సమావేశం జరుగుతుందన్నారు. అయితే ఈ భేటీలో సీఎం కొత్తపార్టీపై చర్చ.... ఎలక్షణ్ ఎజెండా కాదని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే తమ లక్ష్యమని కాసు కృష్ణారెడ్డి తెలిపారు.