హైదరాబాద్ : రాష్ట్ర విభజన ప్రక్రియ నిర్వహించేందుకు యూపీఏ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జిఓఎం (గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్)లో కీలక శాఖ మంత్రులు లేరని మంత్రులు కాసు కృష్ణారెడ్డి, ఏరాసు ప్రతాప్ రెడ్డి అన్నారు. ఆ కమిటీ అసలు రాష్ట్రానికి వస్తుందో లేదో నమ్మకం లేదని....అందుకే ఆ కమిటీని తాము వ్యతిరేకిస్తున్నట్లు వారు బుధవారమిక్కడ తెలిపారు. ఆ కమిటీలో తెలంగాణ తీర్మానంపై ఓటింగ్ జరగకపోయినా.... సభ్యులంతా విభజనపై అభిప్రాయాలు వ్యక్తం చేస్తారన్నారు.
అలాగే అసమ్మతి తెలపటానికి కూడా ఆస్కారముందని వారు తెలిపారు. రాజీనామాలు చేయవద్దని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వారిస్తున్నారని.... అయితే విశ్వరూప్ పార్టీ మారతారనే ఆయన రాజీనామాను ఆమోదించారని కాసు కృష్ణారెడ్డి, ఏరాసు ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా పలువురు సీమాంధ్ర మంత్రులు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
'జీవోఎంలో కీలకశాఖ మంత్రులు లేరు'
Published Wed, Oct 9 2013 2:38 PM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
Advertisement
Advertisement