హైదరాబాద్ : రాష్ట్ర విభజన ప్రక్రియ నిర్వహించేందుకు యూపీఏ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జిఓఎం (గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్) శుక్రవారం సమావేశం కానుంది. ఏకే ఆంటోనీ నేతృత్వంలో ఈ భేటీ జరుగుతోంది. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ బుధవారం ఏడుగురు మంత్రులతో కూడిన కమిటీకి ఆమోదం తెలిపారు.
రాష్ట్ర విభజన ప్రక్రియ నిర్వహించేందుకు యూపీఏ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జిఓఎం (గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్) సంఖ్యను పదినుంచి ఏడుకు కుదించిన విషయం తెలిసిందే. రక్షణ మంత్రి ఏకె ఆంటోనీ, హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే, ఆర్థిక మంత్రి పి చిదంబరం, పెట్రోలియం మంత్రి వీరప్పమొయిలీ, వైద్య ఆరోగ్య మంత్రి గులాం నబీ ఆజాద్, గ్రామీణాభివృద్ధి మంత్రి జైరాం రమేష్, ప్రధాని కార్యాలయంలో సహాయ మంత్రి నారాయణ స్వామి జిఓఎం సభ్యులుగా కొనసాగుతారు. మానవ వనరుల మంత్రి పళ్లంరాజు, రైల్వే శాఖ మంత్రి మల్లిఖార్జున ఖర్గే, నీటివనరుల శాఖ మంత్రి హరీష్ రావత్‌లను జిఓఎం నుంచి తొలగించటం గమనార్హం.
పల్లంరాజు మంత్రి పదవికి రాజీనామా చేయటంతో ఆయనతోపాటు ఖర్గే, రావత్‌లనూ జిఓఎం నుంచి తొలగించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు అవసరమైన విభజన ప్రక్రియను ఆరువారాల్లో పూర్తి చేయాల్సిన జిఓఎం, ఇకమీదట తరచూ సమావేశం కానుంది. అయితే జిఓఎం సంఖ్యను పదినుంచి ఏడుకు ఎందుకు కుదించారనేది మాత్రం హోంశాఖ స్పష్టం చేయటం లేదు. విభజన ప్రక్రియను మరింత వేగంగా పూర్తి చేసేందుకే జిఓఎంలోని మంత్రుల సంఖ్యను తగ్గించి ఉంటారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
11న తెలంగాణపై మంత్రుల కమిటీ భేటీ
Published Wed, Oct 9 2013 1:56 PM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
Advertisement