కాంగ్రెస్లో ఉన్నందుకు సిగ్గుపడుతున్నా: ఏరాసు | Erasu Pratap Reddy to resign if state divided | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్లో ఉన్నందుకు సిగ్గుపడుతున్నా: ఏరాసు

Published Tue, Feb 11 2014 4:02 PM | Last Updated on Sat, Jun 2 2018 4:41 PM

కాంగ్రెస్లో ఉన్నందుకు సిగ్గుపడుతున్నా: ఏరాసు - Sakshi

కాంగ్రెస్లో ఉన్నందుకు సిగ్గుపడుతున్నా: ఏరాసు

హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో మూర్ఖంగా వ్యహరిస్తున్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నానని రాష్ట్ర మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి అన్నారు. విభజన జరిగితే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు తాను కూడా రాజీనామా చేస్తానని చెప్పారు. విభజన జరగకుండా సీఎం శాయశక్తుల ప్రయత్నిస్తున్నారని తెలిపారు.

సీమాంధ్రులకు కలిగే లాభనష్టాలు, సాగునీటి పంపకం, నిరుద్యోగం సమస్యల వంటి వాటి గురించి తెలంగాణ బిల్లులో ప్రస్తావించలేదని అన్నారు. రాష్ట్రం ముక్కలయితే రాయలసీమ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఏరాసు పునరుద్ఘాటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement