అది చారిత్రక తప్పిదమే: బొత్స | That is historical mistake, says botsa satyanarayana | Sakshi
Sakshi News home page

అది చారిత్రక తప్పిదమే: బొత్స

Published Wed, Feb 12 2014 2:50 PM | Last Updated on Sat, Jun 2 2018 4:41 PM

అది చారిత్రక తప్పిదమే: బొత్స - Sakshi

అది చారిత్రక తప్పిదమే: బొత్స

హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ సహా ఇప్పుడు ఎవరు రాజీనామా చేసినా ఒరిగేదేం ఉందని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. ఇప్పుడు రాజీనామాలు చేసినా ఆ ప్రభావం తెలంగాణ బిల్లుపై ఏమాత్రం ఉందని అన్నారు. రాష్ట్ర విభజనపై అంతా అయిపోవస్తున్న తరుణంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేస్తే ప్రయోజనమేమిటని వ్యాఖ్యానించారు.

రాష్ట్ర విభజనకు అనుకూలంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) నిర్ణయం తీసుకున్న వెంటనే రాజీనామా చేయకపోవడం చారిత్రక
తప్పిదమని అభిప్రాయపడ్డారు. తిరుగుబాటు ఎంపీల బహిష్కరణకు విభజన బిల్లుకు సంబంధం లేదని బొత్స అన్నారు. విభజన ప్రక్రియపై ఎంపీల బహిష్కరణ ప్రభావం ఉండదని వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement