సీఎం నోటీసు చెల్లదు: షబ్బీర్ అలీ | Speakar not Accept CM Kiran Kumar Reddy Notice, says Shabbir Ali | Sakshi
Sakshi News home page

సీఎం నోటీసు చెల్లదు: షబ్బీర్ అలీ

Published Sun, Jan 26 2014 10:46 AM | Last Updated on Sat, Jun 2 2018 4:41 PM

సీఎం నోటీసు చెల్లదు: షబ్బీర్ అలీ - Sakshi

సీఎం నోటీసు చెల్లదు: షబ్బీర్ అలీ

హైదరాబాద్: రాష్ట్ర విభజనను సీఎం కిరణ్ అడ్డుకోలేరని మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ అన్నారు. పొలిటికల్‌ మైలేజీ, ప్రజలను గందరగోళ పర్చడానికే సీఎం కిరణ్‌ హడావుడి చేస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రజలెవరూ అయోమయానికి గురికావడం లేదని, విభజన ప్రక్రియ సాఫీగా జరుగుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. విభజన బిల్లుపై 77వ నిబంధన కింద సీఎం కిరణ్ ఇచ్చిన తిరస్కార నోటీసును స్పీకర్ నాదెండ్ల మనోహర్ అనుమతించరని చెప్పారు.

సమైక్య తీర్మానం చేయాలని, విభజన బిల్లును రాష్ట్రపతికి వెనక్కి పంపాలని 77, 78 నిబంధనల కింద నోటీసులిచ్చినా  స్పీకర్ పట్టించుకోలేదని గుర్తు చేశారు. ఈ రెండు నిబంధనలు రాష్ట్ర ప్రభుత్వ బిల్లులకే వర్తిస్తాయని షబ్బీర్ అలీ అన్నారు. రాష్ట్రపతి పంపిన విభజన బిల్లుకు ఇది వర్తించదన్నారు. గతంలో స్పీకర్‌గా ఉన్న సీఎంకు వీటిపై అవగాహన ఉందని గుర్తు చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement