'ఎన్టీఆర్ను మానసికంగా హత్య చేసిన బాబు' | Shabbir Ali Attack on Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

'ఎన్టీఆర్ను మానసికంగా హత్య చేసిన బాబు'

Published Sun, Feb 16 2014 2:40 PM | Last Updated on Sat, Jun 2 2018 4:41 PM

'ఎన్టీఆర్ను మానసికంగా హత్య చేసిన బాబు' - Sakshi

'ఎన్టీఆర్ను మానసికంగా హత్య చేసిన బాబు'

హైదరాబాద్: సొంత మామ ఎన్టీఆర్ను మానసికంగా హత్య చేసిన ఘనుడు చంద్రబాబని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్‌ ఆలీ దుయ్యబట్టారు. రాష్ట్ర విభజనపై ప్రాంతాల వారీగా చంద్రబాబు మాట్లాడుతున్న తీరు ప్రజలు అర్థం చేసుకోవాలని ఆయన సూచించారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే టీడీపీ సభలోనే చంద్రబాబుకు బుద్ధి చెబుతామని ఆయన హెచ్చరించారు.

రాష్ట్ర విభజనపై తన వైఖరి చెప్పే నిజాయితీ చంద్రబాబుకు లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి విమర్శించారు. విభజనపై ఒక విధానమంటూ లేనిది ఒక్క చంద్రబాబుకేనని ఆయన ఎద్దేవా చేశారు. సోనియాను విమర్శిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement