
రెండు ప్రాంతాల్లో శుంఠలున్నారు: ఏరాసు
హైదరాబాద్: సీమాంధ్రలో శుంఠలున్నారన్న కేంద్రమంత్రి జైపాల్రెడ్డి వ్యాఖ్యలు సరికావని మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి అన్నారు. జైపాల్రెడ్డి సమైక్యవాది అని, గతంలో ఆయన ఏనాడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ చేయలేదని గుర్తు చేశారు. తెలివైన తెలంగాణవాదులు రాష్ట్ర విభజన కోరుకోరని చెప్పారు. అలాగే తెలివైన సీమాంధ్రవాదులు సమైక్యాన్ని కోరుకోరని అన్నారు. దురదృష్టవశాత్తూ రెండు ప్రాంతాల్లో శుంఠలున్నారని ఆయన అన్నారు.
విభజన విషయంలో తమకు దింపుడు కళ్లెం ఆశ ఉందన్నారు. తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో ఓటింగ్‌కు పట్టుపడతామన్నారు. సీఎం కిరణ్ కొత్త పార్టీపై తమకు సమాచారం చేయలేదన్నారు. రాష్ట్రం విడిపోతే సీఎం కొత్త పార్టీ పెట్టినా లాభం ఉండదని ఏరాసు ప్రతాపరెడ్డి అభిప్రాయపడ్డారు.