చర్చ జరుగుతుంది, మేం సహకరిస్తాం: ఏరాసు
శాసన సభ లో చర్చ జరగకుండా ఎందుకు అడ్డుకుంటున్నారో తెలియడం లేదు మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి అన్నారు. సీఎం క్యాంప్ ఆఫీస్ లో కిరణ్ కుమార్ రెడ్డితో సమావేశం ముగిసిన తర్వాత ప్రతాప్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సోమవారం నాడు తెలంగాణ బిల్లుపై చర్చ ప్రారంభం కాలేదు అని అన్నారు. రాష్ట్రపతి నిర్ధేశించిన గడువులోగానే బిల్లు పంపడం జరుగుతుంది అని ఆయన తెలిపారు. బిల్లును పంపడానికి, చర్చకు రాష్ట్రపతి తగినంత సమయం ఇచ్చారు మీడియాతో అన్నారు.
బీఏసీ సమావేశంలో నిర్ణయించిన ప్రకారమే చర్చ జరుగుతుంది అని, దీనికి మేం సహకరిస్తాం అని అన్నారు. చర్చ జరగదు, బిల్లు ఆపుతున్నామనే భయాలు ఎందుకు వ్యక్తం చేస్తున్నారో తెలియడం లేదు అని ఏరాసు ప్రతాప రెడ్డి అన్నారు.