ఈ నెల 20న ఏపీ అసెంబ్లీ ప్రత‍్యేక సమావేశం | AP Assembly Special Meeting Will Begin January 20 Morning | Sakshi
Sakshi News home page

ఏపీ: అసెంబ్లీ అధికారులకు సమాచారం

Published Mon, Jan 13 2020 4:55 PM | Last Updated on Mon, Jan 13 2020 8:05 PM

AP Assembly Special Meeting Will Begin January 20 Morning - Sakshi

సాక్షి, అమరావతి : ఈ నెల 20 వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆ రోజు ఉదయం 10 గంటలకు ఈ సమావేశాలు ప్రారంభమవుతాయి. అలాగే 21 వ తేదీ నుంచి శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు శాసనసభ కార్యదర్శి (ఇంచార్జీ) సోమవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ప్రత్యేక సమావేశాల్లో రాజధాని, రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి సంబంధించి జీఎన్‌ రావు కమిటీ, బీసీజీ నివేదికలను రాష్ట్ర ప్రభుత్వం ఉభయ సభల్లో ప్రవేశపెట్టనుంది. ఈ రెండు కమిటీలపై ఇప్పటికే ఏర్పాటైన హైపవర్‌ కమిటీ తన నివేదికను సభలో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ఈ సందర్భంగా రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ అంశాలపై సమగ్ర చర్చ చేపట్టనున్నట్టు తెలిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement