చంద్రబాబే అధికార ఉన్మాది | Minister Kurasala Kannababu Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబే అధికార ఉన్మాది

Jan 6 2020 7:34 PM | Updated on Mar 21 2024 8:24 PM

గతంలో చంద్రబాబు అధికార ఉన్మాదంతో అరాచకాలకు పాల్పడ్డారని.. ఆయనే అధికార ఉన్మాది అని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. సోమవారం కాకినాడలో  మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత చంద్రబాబు తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబుకు అమరావతిపై అంత ప్రేమ.. వెనుకబడిన ప్రాంతాలపై ద్వేషం ఎందుకని ప్రశ్నించారు. ‘అధికార వికేంద్రీకరణ జరగాలని మెజార్టీ ప్రజలు కోరుకుంటున్నారు. ఉత్తరాంధ్రలో అభివృద్ధి జరగకూడదా..? చంద్రబాబు ఎంపిక చేసిన ప్రాంతంలోనే అభివృద్ధి జరగాలా? వెనుకబడిన ప్రాంతాల పరిస్థితి ఏంటి? అభివృద్ధి వికేంద్రీకరణకు ఆయన ఎందుకు అడ్డుపడుతున్నారు? ఎగ్జిక్యూటివ్‌, జ్యుడీషియల్‌ క్యాపిటల్‌కు చంద్రబాబు వ్యతిరేకమా..’ అంటూ పలు ప్రశ్నలను మంత్రి సంధించారు.

Vijayakumar

Advertisement
 
Advertisement

పోల్

Advertisement