
సాక్షి, అమరావతి : తన బినామీలకు నష్టం జరుగుతుందన్న అక్కసుతో చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో కృత్రిమ ఉద్యమం సృష్టించారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. రాజధానిలో చంద్రబాబు, టీడీపీ నేతలు ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కైలే అనిల్ కుమార్‌పై టీడీపీ నేతలు దాడులు చేయడం దారుణమన్నారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని, చంద్రబాబు, లోకేష్‌లపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని, ఆ దిశగా ఆయన కృషి చేస్తున్నారని ప్రసంసించారు. వికేంద్రీకరణతోనే రాష్ట్ర అభివృద్ధి జరగుతుందని అభిప్రాయపడ్డారు. జీఎన్ రావు, బీసీజీ కమిటీల నివేదికలు కూడా అధికార వికేంద్రీకరణకు మొగ్గు చూపాయని గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment