centralization
-
‘చంద్రబాబు అనవసరంగా రెచ్చగొడుతున్నారు’
సాక్షి, గుంటూరు : రాజధాని తరలిపోతుదంటూ అసత్యాలను ప్రచారం చేస్తూ ప్రజలను అనవసరంగా రెచ్చగొడుతున్నారని చంద్రబాబు నాయుడిపై హోంమంత్రి మేకతోటి సుచరిత మండిపడ్డారు. రాజధాని ఎక్కడికి పోవడంలేదని, కేవలం వికేంద్రీకరణ మాత్రమే జరగుతుందన్నారు. బుధావారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేతలు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని తరలిపోతుదంటూ టీడీపీ నేతలు అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. రాజధాని గ్రామాల్లో అనారోగ్యంతో చనిపోయినవారిని కూడా చంద్రబాబు రాజకీయాలకు వాడుకుంటున్నారని విమర్శించారు. అమరావతి రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని, అభివృద్ధి చేసిన భూమిని తిరిగి ఇస్తామని హామీ ఇచ్చారు. ఏ ప్రాంతానికీ అన్యాయం చేసే ఆలోచన లేదు ‘చంద్రబాబు అసాంఘిక శక్తి. హింస లేనిదే బతకలేరు. అధికారం కోల్పోయిన తర్వాత ఆయన పరిస్థితి ఒడ్డున పడ్డ చేపలా తయారైంది. ఈరోజు విజయవాడలో, గుంటూరులో శాంతి భద్రతల సమస్య సృష్టించి తన బినామీ భూముల రేట్లు తగ్గకుండా కాపాడుకునేందుకు తెగించారు. నిజానికి రాష్ట్రంలో మూడు రాజధానులు ఉండే అవకాశం ఉందన్న ప్రతిపాదనల్లో విజయవాడ తన ప్రాధాన్యతను ఎప్పటికీ నిలబెట్టుకునేలా లెజిస్లేటివ్ రాజధాని ఇక్కడే ఉంటుందని అందరికీ అర్థం అయ్యింది. అభివృద్ధిని అందరికీ పంచకపోతే తిరుగుబాటు లేదా ఉద్యమాలు వస్తాయని శ్రీకృష్ణ కమిటీ, శివరామకృష్ణన్ కమిటీలు స్పష్టంచేశాయి. ఇప్పుడు చంద్రబాబు చేసిన దుర్మార్గాన్ని సరిదిద్దేందుకు ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఏ ప్రాంతానికీ అన్యాయం చేసే ఆలోచనే లేదు. రైతులకు అన్యాయం చేసే ఆలోచన అంతకన్నా లేదు. అయినా చంద్రబాబు ఉద్దేశ పూర్వకంగానే శాంతి భద్రతల సమస్యను సృష్టించి, తన పార్టీని బతికించుకోవాలనుకుంటున్నారు. ఇందుకోసం శవరాజకీయాలు చేస్తున్నారు. ఉద్దేశ పూర్వకంగా సమస్యలు సృష్టిస్తున్నారు ఇవాళ బెంజ్ సర్కిల్ వద్ద పక్కా పథకంతో ముందుగానే తన మనుషులను పిలిపించుకుని లా అండ్ ఆర్డర్ సమస్యను ఉద్దేశ పూర్వంగా సృష్టించారు. ముందుగానే తన అనుకూల మీడియాను పిలిపించుకుని, ఒక డ్రామా నడిపారు. విజయవాడలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే విజయవాడ ప్రజలకు మేలు జరుగుతుందా? విజయవాడలో శాంతి భద్రతలు ఇలా ఉన్నాయంటే.. రాష్ట్రంలో మిగతా ప్రాంతాల వారికి ఎలాంటి సంకేతం పోతుంది? సచివాలయానికి, అసెంబ్లీకి, హైకోర్టుకు వెళ్లే దారిని వెళ్లకుండా రోడ్డుమీద కూర్చుని అడ్డగిస్తున్నారంటే.. 13 జిల్లాల్లోని ప్రజలకు ఏం అర్థం అవుతుంది. చంద్రబాబు ముఠా సామ్రాజ్యంగా ఈప్రాంతాన్ని నడిపేందుకే ఈ ఉద్యమం చేస్తున్నాడని అర్థం కావడంలేదా? పోలీసుల సహనాన్ని ఎంత పరీక్షించినా.. వారు మౌనంగానే ఉన్నారు. ప్రశాంతగా వారు విధులు నిర్వర్తించారు. చంద్రబాబు రెచ్చగొట్టినా ప్రజలెవ్వరూ రెచ్చిపోలేదు, రెచ్చపోరుకూడా. బాబు ఒక ముఠానాయకుడినని నిరూపించుకున్నారు నిన్న మా ఇద్దరి ఎమ్మెల్యేల మీద హత్యాయత్నం చేసినా మా ప్రభుత్వం సంయమనం పాటించింది. ఇదంతా చంద్రబాబు తన చేతకాని తనంతో చేస్తున్నాడని కనపడుతూనే ఉన్నా ప్రజా బలం లేని చంద్రబాబును చూసి రాష్ట్రం అంతా ఛీ కొడుతోంది. 40 ఏళ్ల రాజకీయ అనుభవం, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం, మూడు సార్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న అనుభవం.. పక్కకుపోయి చంద్రబాబు నిజస్వరూపం ఒక అసాంఘిశక్తి రూపంలో, హింసావాది రూపంలో బట్టబయలు అయ్యింది. తనను జాతీయ నాయకుడిగా ప్రచారం చేసుకున్న చంద్రబాబు తాను ఒక ముఠానాయకుడినేనని నిరూపించుకున్నారు. చివరగా ఒక మాట చెప్పాలి. భారతదేశ చరిత్రలోనే 29 రాష్ట్రాల్లో ఏనాడూ కనీవినీ ఎరుగని ఒక అద్భుతమైన పథకానికి, అమ్మ ఒడి రూపంలో ఒక చారిత్రక ఘట్టానికి ఆంధ్రప్రదేశ్ వేదిక కాబోతుందన్న అంశాన్ని డైవర్ట్ చేయడానికి చంద్రబాబు ఇంతకు తెగించాడా అని అందరూ ఆలోచిస్తారు. తన పాదయాత్ర ముగిసిన జనవరి 9 నే దాదాపు 43 లక్షల మందికి తల్లులకు, వారి పిల్లల్ని చదవించుకునేందుకు వీలుగా రూ.6400 కోట్లకుపైగా డబ్బును వారి ఖాతాల్లో వేయబోతున్న ఇంత పెద్ద సందర్భాన్ని చంద్రబాబు డైవర్ట్ చేయడానికి రోడ్డుమీద కూర్చున్నాడు. తన పచ్చమీడియాను పురిగొల్పుతున్నారు’ అని హోంమంత్రి మేకతోటి సుచరిత వ్యాఖ్యానించారు. -
వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యం
సాక్షి, అమరావతి : తన బినామీలకు నష్టం జరుగుతుందన్న అక్కసుతో చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో కృత్రిమ ఉద్యమం సృష్టించారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. రాజధానిలో చంద్రబాబు, టీడీపీ నేతలు ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కైలే అనిల్ కుమార్‌పై టీడీపీ నేతలు దాడులు చేయడం దారుణమన్నారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని, చంద్రబాబు, లోకేష్‌లపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమని, ఆ దిశగా ఆయన కృషి చేస్తున్నారని ప్రసంసించారు. వికేంద్రీకరణతోనే రాష్ట్ర అభివృద్ధి జరగుతుందని అభిప్రాయపడ్డారు. జీఎన్ రావు, బీసీజీ కమిటీల నివేదికలు కూడా అధికార వికేంద్రీకరణకు మొగ్గు చూపాయని గుర్తు చేశారు. -
‘ఇన్సైడర్’కు ‘జోడీ’ అవుట్‌సైడర్!
‘‘ప్రపంచంలో కొంతమంది జర్నలిస్టులు న్నారు. జనాభాలోని కొందరు ఇతరుల మాదిరే వీరూ డబ్బుకు కక్కుర్తిపడి తమ వృత్తి ధర్మమైన నిజాయితీని తాకట్టు పెట్టేసుకుంటు న్నారు. జర్నలిస్టుల్లో కొద్దిమంది మాత్రమే బెదిరింపులకు (బ్లాక్మెయిల్) లొంగి సాగిల పడనివారుంటారు.’’– ప్రసిద్ధ అమెరికన్ మీడియా విశ్లేషకుడు డాక్టర్ పాల్ క్రీగ్ రాబర్ట్స్ (25–10–2019) ‘‘అనేక స్థానిక కారణాలు, ప్రాంతాల అవసరాల దృష్ట్యా ప్రపం చంలో 12–16 దేశాల్లో ప్రాంతాలవారీగా ఒక రాజధాని కాదు, రెండేసి, మూడేసి రాజధానులు ఒకచోట పరిపాలనా కేంద్రంగా, శాసన సభా వేదికలుగా, న్యాయ వ్యవస్థా కేంద్రాలుగా రెండేసి, మూడేసి రాజ ధానీ నగరాలున్నాయి.’’ – మాటా రోజన్ బెర్గ్ (01–03–2019) రాజకీయంగా అడుగూడిపోయిన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకుడిగా, అస్తుబిస్తు సంఖ్యా బలంతో రోజురోజుకీ మరింత తరుగుతూ ప్రతిపక్ష నాయకుడిగా హోదాను కూడా కోల్పోయే దశలో ప్రవేశించిన చంద్రబాబు నాయుడికి ఓ ‘కొత్త సమస్య’ చేతికి దొరి కింది. తాడూ బొంగరం లేని చోటును రాజధానిగా బలవంతాన ఎంపిక చేసుకుని, ప్రతిపక్షంతో సంబంధం లేకుండా ఆదరాబాద రాగా అమరావతికి ప్రయాణం కట్టించాడు చంద్రబాబు. అదేమంటే తాను అధికారంలో ఉండగా శాసనసభలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని ప్రకటించినప్పుడు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి కూడా ఆమో దించినట్టే చెప్పారు గదా అని ఇప్పుడు బాబు ఎత్తిపొడవడానికి ప్రయ త్నిస్తున్నాడు. కానీ ఈ ప్రకటన వెనుక ఉన్న బాబు దుష్ట ఆలోచనను, జరిగిన పరిణామాలను ప్రజలు మరిచిపోరు! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనకు అర్ధంతరంగా, కేంద్ర కాంగ్రెస్ అధిష్టాన వర్గం నిర్ణయా నికి గంగిరెద్దులా తలూపి తెల్లకాగితంపై బాబు సంతకం చేసివచ్చిన తర్వాత జరిగిన పరిణామాలను మనం మరిచిపోరాదు. విభజనకు పావులు కదుపుతూనే నాటి కాంగ్రెస్ ప్రభుత్వం.. విడగొడుతున్న ఆంధ్ర ప్రాంతానికి రాజధానిగా, పర్యావరణ పరిస్థి తులు, ఇతర భౌగోళిక సానుకూలతలు, వనరులు వగైరా సానుకూల ప్రదేశాలు ఏవేవో చూసి, సమగ్ర నివేదికను సిద్ధం చేయాలని అగ్ర శ్రేణి నిపుణులతో శివరామకృష్ణన్ కమిటీని నియమించాలని ఆదే శించింది. వెంటనే ఆ కమిటీ కొన్ని మాసాలు ఆంధ్రా ప్రాంతాలను పర్యటించి తన సిఫార్సులతో నివేదిక సమర్పించింది. దాన్ని చంద్ర బాబు శాసనసభలో ప్రవేశపెట్టి చర్చించి, నిర్ణయం తీసుకోవల సింది. కానీ శాసనసభ ముందుకు ఆ నివేదికను తీసుకురానివ్వ కుండా, తన కొలువులో ఉన్న మంత్రి నారాయణ పేరుతో అనుకూల కమిటీని ఆగమేఘాల మీద వేయించి దాని నివేదికను ప్రవేశపెట్టి శాసనసభలో ఆమోదింపచేసుకున్నాడు బాబు. అది మొదలు అసలు కొత్త రాష్ట్ర రాజధాని ఎక్కడ వస్తుందో బహిరంగంగా చెప్పకుండా జాగ్రత్త వహించాడు. ఆ తర్వాత రాజధాని నూజివీడు, గన్నవరం, విజయవాడ–గుంటూరు మధ్య కూడా కావచ్చునని ఒక సట్టా వ్యాపారి మాదిరి లీకేజీలు వదిలాడు. ఈలోగా తన అనుయాయులు కొందరు ఈ అన్ని ప్రాంతాల్లోనూ భూ దందాలు మొదలెట్టేశారు. ఆ తర్వాత తన ఆప్తులకు, తన మంత్రులకు అమరావతి చుట్టూ భూములు కొనుక్కోవడానికి వీలు కల్పించి స్పెక్యులేటివ్ వ్యాపారా నికి బాబు తెరలేపాడు. బాబు అండతో జరిగిన లోపాయికారీ తతంగం రాజకీయ స్పెక్యులేటివ్ వ్యాపారం ఎవరికైనా ఎలా తెలు స్తుంది మరి? తీరా చూస్తే అమరావతిని భూముల కొనుగోళ్ల లావా దేవీల కేంద్రంగా బాబు మార్చాడు. మోతుబరులు సహా, మధ్యతర గతి, పేద, బడుగు, బలహీన వర్గాల భూములను అమరావతి రాజ ధాని పేరిట సట్టా వ్యాపార కేంద్రాలుగా మార్చాడు. పైగా ఈ వ్యాపారంలోకి కొందరు జర్నలిస్టులనూ దించాడు. అంతే గాదు, తరచూ ముంపునకు గురయ్యే ప్రాంతం అమరావతి అని, ఆ భూమిలో 15 అడుగులలోనే నీరు ఉబికి వస్తుందనీ, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా ఆ ప్రాంతం పెద్ద నగరాల నిర్మాణానికి అనుకూలం కాదని కేంద్ర పర్యావరణ పరిరక్షణా సాధికార సంస్థ హెచ్చరించి, నివారిస్తూ వచ్చింది. ఈ కారణాన్ని శివరామకృష్ణన్ కమిటీ కూడా స్పష్టం చేసింది. రాజధాని నిర్మాణానికి అనువైన ప్రాంతాలనూ సూచించింది. వాటిలో ఒకటి విశాఖ దొనకొండ, వినుకొండ ప్రాంతాలు కూడా ఉన్నాయి. అయినా సట్టా వ్యాపారిగా మారిన రాజకీయ పాలకుడు చంద్ర బాబు దృష్టి అమరావతిపైనే లగ్నమయింది. రైతుల్ని, వ్యవసాయ కార్మికుల్ని నిలువునా ముంచేశాడు. మూడు, నాలుగు పంటలు పండే అమరావతి పరిసర ప్రాంతాల సుక్షేత్రాలను వదులుకోవడానికి ఇష్ట పడకపోతే అర్ధరాత్రి పూట పంటల్ని తగలబెట్టించారు. ఇందుకు ఎదురు తిరిగిన పేదలపైన కేసులుపెట్టి, వేధించేందుకు సాహసిం చారు. అలాంటి దళితులలో జగన్ పార్టీ అభ్యర్థిగా పార్లమెంట్ సభ్యుడైన నందిగాం సురేష్ ఒకరు. అతణ్ణి అప్రూవర్‌గా మారమని పోలీసులచే కొట్టించారు. పంటల్ని తానే తగలబెట్టించానని అంగీ కరిస్తే చంద్రబాబుతో స్వయానా 50 లక్షలు ఇప్పిస్తామని పోలీసులు వేధించినా సురేష్ లొంగలేదు. ఇది బాబు రాజధాని అమరావతి లోగుట్టు. రాష్ట్రానికి తన అసమర్థపాలన ద్వారా బాబు చేసిన రెండు న్నర లక్షల కోట్ల అప్పులు చాలక మరో లక్షన్నర కోట్లు వెచ్చిస్తేగానీ అమరావతికి ముక్తి కలగని దౌర్భాగ్య స్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే నూతన ముఖ్యమంత్రి జగన్ ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధికి పరిపాలన, ప్రజా సదుపాయాల వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానులను, కార్యనిర్వహణ కేంద్రాలను, న్యాయ వ్యవస్థలను వికేంద్రీకరించడం సబబన్న ఆలోచనకు రావడం శుభ సూచకం. ఈ సమయంలో సమగ్ర రాజధాని నిర్మాణపు ఆలోచనకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సిఫారసులు చేదోడువాదోడు కాగలవు. స్పెక్యులేషన్ ద్వారా లోపాయికారీగా ఎవరో బయటి వ్యాపారులు కాదు, సొంత క్యాబినెట్ మంత్రులతోనే ఎక్కడెక్కడినుంచో వచ్చి అమరావతి భూముల్ని ప్రలోభాలతో, బెది రింపులతో కొనిపించి, వ్యాపారంలోకి దించారు. ఇప్పుడు ‘రాజధాని’ చెదిరితే గొల్లుమంటున్నారు, కానీ చిన్న, మధ్యతరగతి అమాయక రైతు కుటుంబాల బతుకులు దెబ్బతినకూడదు. నేను విన్నాను, నేను న్నానన్న జగన్ ప్రజాస్వామిక భరోసా, భూముల సరిహద్దులు చెరిగినా, వారి మనసులు చెదరనివ్వదు. ఈలోగా ఢిల్లీ కేంద్రంగా వ్యాపార వార్తా కథనాలు అల్లే శేఖర్ గుప్తా అనే ఒక జర్నలిస్టు అండతో చంద్రబాబు వర్గం, స్థానిక ‘ఉంపుడు’ పత్రికా నిర్వాహకుల సహాయంతో జగన్‌ను, ఆలో చనాపరమైన ఆయన ప్రతిపాదనలపైన ‘పిచ్చితుగ్లక్’ అంటూ రాతలు రాయిస్తున్నారు. ‘చండీగఢ్ తర్వాత దేశంలో మరో గ్రీన్‌ఫీల్డ్ నగరం లేదని, మూడు రాజధానుల ఆలోచన ఆచరణీయం కాదనీ, రాజధాని కేంద్రంగా అమరావతి నిర్మాణం దేశానికి అవసరమనీ’ బాబు మైక్ ద్వారా సందేశమివ్వడానికి సాహసించాడు శేఖర్‌గుప్తా. అసలు పంజాబ్, హరియాణాలు రెండింటికీ ఒకే రాజధాని పొసి గినప్పుడు ఒక రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణకు అనువైన పాలనా వికేంద్రీకరణ యంత్రాంగం ఉంటే నష్టం ఏమిటో గుప్తా చెప్పలేక పోయాడు. మహానగరాలు శతాబ్దాలు గడిస్తే కానీ నిర్మాణమై వృద్ధిలోకి రాలేదు. కానీ చంద్రబాబు తాను 50 ఏళ్లలో అమరావతిని మహా నగరం చేస్తానని ప్రగల్భాలు పలికాడు. ప్రపంచబ్యాంకు అధికా రులు, అమరావతి భూముల సమీకరణ కింద ఇచ్చిన భూములకు నష్టపరిహారంగానీ, హామీపడిన ఇళ్ల స్థలాలుగానీ తమకు ఇవ్వలేదని పేద రైతులు ఫిర్యాదు చేసి గగ్గోలు పెట్టిన దరిమిలా రాజధాని నిర్మాణానికి రుణాలిచ్చేందుకు ముందుకు రాకపోవడమే గాక, ఎందుకు ఇవ్వబోవటం లేదో కూడా తమ వెబ్సైట్లో నమోదు చేశారు. కానీ బాబు మైకంలో చిక్కుకున్న శేఖర్‌గుప్తాకు ఇవేవీ పట్టవు. తెలుగు ప్రజల్ని నిలువెల్లా మోసగించి, ఆర్థికంగా రాష్ట్రాన్ని రెండున్నర లక్షల కోట్ల మేర అప్పులు చేసి, ప్రాజెక్టులను, ప్రజల సామాజిక ప్రయోజనాలను విస్మరించి చిప్ప చేతికిచ్చి, అమరావతి పేరును మాత్రం మిగిల్చిన చంద్రబాబుకు అకస్మాత్తుగా ఆప్తుడ య్యాడు. అమరావతిలో ఇంతవరకూ బాబుకి ‘ఇన్సైడర్ ట్రేడర్స్’ ఉన్నారు. ఇప్పుడు శేఖర్ గుప్తా అవతరణతో ‘అవుటర్ ట్రేడర్’ సాయం, వత్తాసు దొరికినట్టయింది. ఆంధ్రుల రాజధానిగానే అమరా వతి కూడా ఉన్నా, చంద్రబాబుని సంతోషపెట్టడానికి జగన్‌ను పేరుపెట్టి దూషించడానికి సాహసించాడు. దేశయాత్రల్లో బాబు మన జర్నలిస్టులు కొందరిని విమానా లపైన తీసుకెళ్లి మరీ విదేశాల్లో ఖుషీ చేసి పంపితే తిరుగు ప్రయా ణంలో హైదరాబాద్ విమానాశ్రయంలో దొంగ సరుకు దిగుమతి చేసిన కేసులో పట్టుబడిన వైనం ‘బ్లిడ్జ్’ (బాంబే), ‘ది టెలిగ్రాఫ్’ (కలకతా)్త పత్రికల్లో ఆనాడే ఫ్లాష్ అయింది. అందుకే క్రిస్తోఫర్ లోగ్ రాసిన ఒక కవితకు ‘ప్రొఫెసర్‌గారి రిపోర్టు’ పేరిట శ్రీశ్రీ అనువాదం ఏం చెబుతుందో చూడండి: ‘‘మానవుడు రాజకీయజీవి/ ముఠాలుగా తిరిగేవాడు/ ఒక గుంపు ఇంకో గుంపును ద్వేషించేది/ అబ్బో! ఎన్నెన్ని విశేషాలనుకున్నారు/ అన్నింటిలోనూ ప్రధానమైనది ‘దేశాభిమానం’!! ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
రాజధానికి విశాఖపట్నం అనువైన ప్రాంతం
-
‘రాజధానికి విశాఖ అనువైన ప్రాంతం’
సాక్షి, అమరావతి : రాజధానికి విశాఖపట్నం అనువైన ప్రాంతం అని మంత్రి బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌ను తలదన్నే రాజధానిని ఏపీలో అభివృద్ది చేయాలంటే విశాఖపట్నంను మించి మరో ఆప్షన్ లేదని,ఇది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భారతదేశంలో శరవేగంగా అభివృద్ది చెందుతున్న నగరాల్లో విశాఖ ఒకటి అన్నారు. హైదరాబాద్‌ను మించి అభివృద్ధి చెందుతున్న విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా చేయడం చంద్రబాబుకు ఇష్టం లేదా అని నిలదీశారు. వెనుకబడిన ప్రాంతాలు,కరువుతో అల్లాడిన ప్రాంతాలు అభివృద్ది చెందడం మీకు ఇష్టం లేదా అని ప్రశ్నించారు. కేవలం ఒక టౌన్‌షిప్‌ను తయారుచేయడం ద్వారా అభివృద్ది సాధ్యపడదని, ఐదు కోట్ల మంది ఆర్థిక స్థితి గతులు మెరుగుపడవన్నారు. గత ప్రభుత్వం మొత్తం రూ.1లక్షా 90వేల కోట్లు అప్పులు తెచ్చిందని, అందులో కేవలం రూ. 5వేల కోట్లు మాత్రమే రాజధాని కోసం ఖర్చు పెట్టిందని అన్నారు. మిగతా డబ్బును ఏం చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అవసరాలను,ఆర్థిక స్థితిగతులను పట్టించుకోకుండా రాజధానిపై ఇష్టారీతినా నిర్ణయాలు తీసుకున్నారని విమర్శించారు. రాజధానిపై సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. రాజధానిపై సుజనా చౌదరి చెప్పిందేమైనా వేదమా..? శాసనమా..? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఫెడరల్ వ్యవస్థలో నిర్ణయాలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుందన్నారు. గత ప్రభుత్వంలో తప్పులు జరిగాయి కాబట్టే.. ఇప్పుడు రాజధానిని మార్చాల్సివస్తుందన్నారు. అశోక గజపతిరాజు కూడా రాజధాని నిర్ణయంపై విమర్శిస్తున్నారని, అసలు ఐదేళ్లు కేంద్రమంత్రిగా ఉన్న ఆయన ఉత్తరాంధ్రకు ఏం చేశారని ప్రశ్నించారు. ఎవరెన్ని విమర్శించినా, ఏం ఆరోపించినా జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్సీపీ కార్యాచరణ కొనసాగుతుందన్నారు. హైపవర్ కమిటీ నివేదికను పరిశీలించిన తర్వాత రాజధానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. తమ ప్రభుత్వానికి అన్ని జిల్లాల అభివృద్ధే ధ్యేయం తప్ప ప్రాంతీయ ద్వేషం ఉండదని మంత్రి బొత్స స్పష్టం చేశారు. -
భారత్‌లో వృద్ధి మాంద్యం..
న్యూఢిల్లీ: పాలనాధికారాలన్నీ ప్రధాని కార్యాలయంలోనే కేంద్రీకృతమై ఉన్నాయని, మంత్రులంతా నిమిత్తమాత్రులుగానే ఉంటున్నారని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యాఖ్యానించారు. ఇలాంటి పాలనతో ఎకానమీ తీవ్ర రుగ్మతలతో సతమతమవుతోందని .. దేశం ‘వృద్ధి మాంద్యం’ పరిస్థితుల్లో చిక్కుకుందని పేర్కొన్నారు. ఒక వార్తాపత్రికకు రాసిన వ్యాసంలో ఆయన ఈ విషయాలు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దేశాన్ని గట్టెక్కించాలంటే పెట్టుబడులు, భూ.. కార్మిక చట్టాలపరమైన సంస్కరణలు మరిన్ని చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. దీంతో పెట్టుబడులతో పాటు వృద్ధికి కూడా ఊతం లభించగలదని రాజన్ తెలిపారు. దేశ సమర్థతను మెరుగుపర్చుకోవడానికి, పోటీ దేశాలకు దీటుగా ఎదగడానికి .. ఉపయుక్తంగా ఉండే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడంపై భారత్ దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. ‘ప్రస్తుత ప్రభుత్వంతో సమస్యేమిటంటే .. అధికారాలన్నీ ఒకే చోట కేంద్రీకృతమై ఉంటాయి. నిర్ణయాలే కాదు.. ఆలోచనలు, ప్రణాళికలు.. అన్నీ కూడా ప్రధాని చుట్టూ ఉండే కొద్ది మంది, ప్రధాని కార్యాలయం నుంచి వస్తుంటాయి. ఒక పార్టీ రాజకీయ, సామాజిక ఎజెండాను అమలు చేయడానికి ఇలాంటి విధానం పనికొస్తుంది కానీ.. ఆర్థిక సంస్కరణల విషయంలో ఇది పనిచేయదు. ఇందుకు రాష్ట్రాల స్థాయిలో కాకుండా జాతీయ స్థాయిలో ఎకానమీ ఎలా పనిచేస్తుందన్న దానిపై అపార పరిజ్ఞానం అవసరమవుతుంది‘ అని రాజన్ పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు సంకీర్ణంగా నడిచినప్పటికీ.. ఆర్థిక విధానాల సరళీకరణను స్థిరంగా ముందుకు తీసుకెళ్లాయన్నారు. ‘తీవ్ర స్థాయిలో అధికార కేంద్రీకరణ, మంత్రులకు అధికారాలు లేకపోవడం తదితర అంశాల కారణంగా.. పీఎంవో దృష్టి పెట్టినప్పుడు మాత్రమే సంస్కరణలు జోరందుకుంటున్నాయి. పీఎంవో దృష్టి మిగతా అంశాలవైపు మళ్లిన మరుక్షణం.. సంస్కరణల జోరూ తగ్గిపోతోంది‘ అని రాజన్ అన్నారు. ముందుగా సమస్యను గుర్తించాలి.. ఆర్థిక మందగమనానికి మందు కనుగొనాలంటే.. ముందుగా సమస్య తీవ్రతను గుర్తించడం దగ్గర్నుంచి మొదలుపెట్టాల్సి ఉంటుందని రాజన్ తెలిపారు. ‘సమస్య పరిమాణాన్ని గుర్తించాలి. సమస్య తాత్కాలికమేనని.. ప్రతికూల వార్తలు, అననుకూల సర్వేలను తొక్కి పెట్టి ఉంచితే అది పరిష్కారమైపోతుందనే ఆలోచనల నుంచి బైటికి రావాలి. విమర్శించే ప్రతి ఒక్కరికీ రాజకీయ దురుద్దేశాలు ఆపాదించడం మానుకోవాలి. దేశం వృద్ధి మాంద్య పరిస్థితుల మధ్యలో ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో గణనీయమైన ఒత్తిడి ఉంది‘ అని ఆయన పేర్కొన్నారు. భారత జీడీపీ వృద్ధి రేటు.. జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో ఆరేళ్ల కనిష్టమైన 4.5%కి పడిపోయిన నేపథ్యంలో రాజన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సంస్కరణలు తేవాలి.. రియల్ ఎస్టేట్, నిర్మాణ, ఇన్ఫ్రా రంగాలు.. వాటికి రుణాలిచ్చిన నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు సంక్షోభంలో ఉన్నాయని రాజన్ చెప్పారు. బ్యాంకుల్లో మొండి బాకీలు కూడా తోడవడంతో రుణ వితరణ వృద్ధి ఉండటం లేదన్నారు. సామాన్యుల నుంచి కార్పొరేట్ల దాకా అందరి రుణభారం, యువతలో నిరుద్యోగిత పెరిగిపోతోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భూ సమీకరణ, కార్మిక చట్టాలపరమైన సంస్కరణలు, స్థిరమైన పన్నులు.. నియంత్రణా వ్యవస్థల విధానాలు అమలు చేయాలని రాజన్ సూచించారు. -
'ఆ ప్రాంత ప్రజలు రగిలిపోతున్నారు'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు పాలనలో అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకరించడం వల్ల రాయలసీమ, ఉత్తరాంధ్రలో అసహనం పెరిగిపోతోందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య మండిపడ్డారు. అసమానతలపై ఆ ప్రాంత ప్రజలు రగిలి పోతున్నారని తెలిపారు. ఇప్పటికైనా చంద్రబాబు తన విధానాలను సమీక్షించుకొని ..అభివృద్ధి వికేంద్రీకరణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. -
గిరిజనులపై ఒడిశా పోలీసుల దౌర్జన్యం
అన్యాయంగా ఇద్దరు అరెస్టు నిరసనగా గ్రామస్తుల రాస్తారోకో సీలేరు, న్యూస్‌లైన్ :అడవుల్లోను, మారుమూల ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్న గిరిజనులపై ఒడిశా పోలీసుల దౌర్జన్యం నానాటికీ పెరుగుపోతోంది. విశాఖ జిల్లా జీకేవీధి మండలం దుప్పుడువాడ పంచాయితీ కాట్రగెడ్డ గ్రామంలో పది రోజుల కిందట ఓ వివాహం జరిగింది. ఆ గ్రామానికి పక్కనే ఉన్న ఒడిశా చిత్రకొండ పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఐదుగురు కానిస్టేబుళ్లు మూడు బైక్‌లపై వచ్చి అక్కడ దొరికిన రెండు కేసుల మద్యాన్ని తీసుకువెళ్లారు. అయితే రెండు రోజుల కిందట సదరు మద్యం కేసుల యజమానిగా భావిస్తున్న వంతల నారాయణరావు కొడుకు, అతని స్నేహితురాళ్లను తీసుకుని బలిమెల రిజర్వాయర్ని చూపించడానికి బైక్‌పై వెళుతుండగా ఒరిస్సా పోలీసులు వారిని అడ్డగించి బైక్‌ను స్వాధీనం చేసుకొని మీ తండ్రిని తీసుకురావాలని చెప్పి పంపారు. దీంతో గ్రామస్తులు నారాయణరావును తీసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. ఈ తరుణంలో పోలీసులు నారాయణరావును అక్రమంగా బంధించి స్టేషన్లో ఉంచారు. స్టేషన్లో ఉన్న ఈయన్ను చూడడానికి వచ్చిన బంధువైన చిట్టి పడాలుపైనా తప్పుడు కేసు పెట్టి మల్కన్‌గిరి కోర్టుకు తరలించారు. పోలీసులు అకారణంగా తమవారిని బంధించడాన్ని నిరసిస్తూ కాట్రగెడ్డ గిరిజనులు ఏకమై ఆంధ్ర -ఒడిశా సరిహద్దు రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. తమ ఊరికి వచ్చి మద్యం అడిగితే తాము ఇవ్వలేదని, ఈ కోపంతోనే పోలీసులు తమపై తప్పుడు కేసులు పెట్టి హింసిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.