
సాక్షి, అమరావతి : రాష్ట్ర మంత్రివర్గం రేపు (శనివారం) సమావేశం కానుంది. హై పవర్ కమిటీ నివేదికపై కేబినెట్ చర్చించనుంది. రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధిపై జీఎన్ రావు నిపుణుల కమిటీ సిఫార్సులు, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) నివేదిక అధ్యయనానికి ప్రభుత్వం హై పవర్ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. రేపు మధ్యాహ్నం 3 గంటలకు భేటీ కానున్న కేబినెట్ హై పవర్ కమిటీ నివేదికను అధ్యయనం చేయనుంది. కాగా ఈ నెల 20న జరగాల్సిన మంత్రివర్గ సమావేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల ముందుకు తీసుకొచ్చింది. కాగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని హై పవర్ కమిటీ శుక్రవారం కలిసింది. నివేదికపై ప్రజంటేషన్ ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment