ప్రతి శాఖలోనూ రాబందులు ఉన్నారని ఆంధ్రప్రదేశ్ రెవెన్యు ఎంప్లాయిస్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఘాటుగా విమర్శించారు.
రాజమండ్రి: ప్రతి శాఖలోనూ రాబందులు ఉన్నారని ఆంధ్రప్రదేశ్ రెవెన్యు ఎంప్లాయిస్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఘాటుగా విమర్శించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఒకరిద్దరి గురించి మొత్తం వ్యవస్థను తప్పు పట్టడం సరికాదన్నారు. ప్రభుత్వ ఆఫీసుల్లో పనులు జరగడం లేదన్నారు.
ప్రెస్ కాన్ఫరెన్స్‌లు, వీడియో కాన్ఫరెన్స్‌లతో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. రెవెన్యు కార్యాలయల్లో ఆర్‌ఎస్‌ఆర్- ఎస్‌ఎల్‌ఆర్ లేకపోవడంతోనే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.