ఒక్కొ మతం సంప్రదాయానికి అనుగుణంగా అంత్యక్రియలు ఉంటాయి. హిందువలు దహనం చేస్తే, క్రిస్టియన్లు, ముస్లింలు ఖననం చేస్తారు. ఐతే పార్శీలు వద్దకు వచ్చేటప్పటికి అంత్యక్రియలు చాలా విభిన్నంగా ఉటాయి. వారి బంధువులు ఎవరైనా చనిపోతే రాబందులు తినడానికి వదిలిపెట్టేసి వెళ్లిపోతారట. ఇది వారి ఆచారం. ఎన్నో ఏళ్లుగా చేస్తున్నారు. అలా మృతదేహాలను వదిలేసే ప్రదేశాన్ని టవర్ అఫ్ సైలెన్స్ అంటారు. మనం ఎలా అయితే శ్మశానం నిర్మించుకుంటామో అలాగే పార్మీలు మృతదేహాలను విడిచిపెట్టే స్థలాలను టవర్ అఫ్ సైలెన్స్ పేరుతో ఏర్పాటు చేసుకుంటారు. ఎందుకిలా? ఏంటీ ఆచారం అంటే..
పురాతనకాలం నుంచి పార్శీ కమ్యూనిటీ ఈ ఆచారాన్ని పాటిస్తోంది. దీన్ని 'దఖ్మా' అని కూడా పిలుస్తారు వారు. పార్శీలు వారి బంధువులు చనిపోయాక చేయాల్సిన చివరి కార్యక్రమాలు(అంత్యక్రియలు) ఇంత విడ్డూరంగా ఎందుకు చేస్తున్నారంటే?..వారి దృష్టిలో శరీరం ప్రకృతి ఇచ్చిన బహుమతని వారి నమ్మకం. అందుకే మరణాంతరం దాన్ని ప్రకృతికే సమర్పించాలనేది వారి ముఖ్యోద్దేశం. అందుకే వారంతా ఇలా చేస్తారు. ఐతే ఇక్కడో ఆసక్తకరమైన విషయం ఏంటంటే.. ఇలా మృతదేహాలను వదిలేసి ప్రదేశాన్ని.. టవర్ ఆఫ్ సైలెన్స్ పేరుతో పెద్ద ఖాళీ స్థలాన్ని ఎంచుకుని వృత్తాకారా రీతిలో రెండు పెద్ద గోడలు మధ్యలో ఓ పెద్ద బావి వచ్చేలా నిర్మిస్తారు. ఎవరైతే ఈ టవరాఫ్ సైలెన్స్‌ని నిర్మిస్తారో లేదా నిర్మించేందుకు విరాళం ఇస్తారో వారి శవమే ముందుగా ఇక్కడకు వస్తుందట.
అందుకు ఆధారాలు ఉన్నాయని పార్శీ మతం గురించి పరిశోధన చేస్తున్నా ప్రాచి మహితా చెబుతున్నారు. కోల్‌కతాలో ఓ వ్యక్తి ఇలానే ఈ టవర్ ఆఫ్ సైలెన్స్‌ని నిర్మించాడని, అప్పుడు ఆయన శవమే ముందుగా అక్కడకు వచ్చిందని చెబుతున్నారు. అలాగే ఆయనకు ఓ కుక్క ఉండేదని, అది ఆయన మీద బెంగతో తిండి మానేయడంతో అతను చనిపోయిన ఏడు రోజుకే ఈ కుక్క చనిపోయింది. దీన్ని కూడా అక్కడకే తీసుకొచ్చి అంత్యక్రియలు చేసినట్లు ప్రాచి చెబుతున్నారు. రాబందువులకు ఆహరం కోసం అని ఇలా చేయడం లేదట వాళ్లు. జీవితం చివరల్లో కూడా దాతృత్యం ఉండేలని చాటి చెప్పేడమే ఈ వినూత్న రీతిలో చేసే అంత్యక్రియలు వెనుక దాగొన్న ప్రధానోద్దేశం. ముందుగా ఆ మృదేహాలు సూర్యుడికి, గాలికి బహిర్గతం అవుతాయి. ఆ తర్వాత రాబందులు లాంటివి పీక్కుని తినగా మిగిలిన ఎముకలు మధ్యలో ఉన్న బావిలో పడిపోతాయి.
ఈ బావికి వృత్తాకారంలో రెండు సర్కిళ్లు ఉంటాయి. బాహ్య సర్కిల్‌లో పురుషుల శవాలు. లోపల సర్కిల్‌లో మహిళ శవాలు. మధ్యన చిన్నపిల్లల మృతదేహాలను ఉంచుతారు. అవి డికంపోజ్ అయ్యాక మిగిలిన ఎముకలు మధ్యలో ఉన్న బావిలో పడిపోతాయి. ఆ తర్వాత ఏడాదికి రెండేళ్లకొకసారి ఆయా వ్యక్తులు బంధువులు వెళ్లి మిగిలిపోయి ఉన్న అవశేషాలను సేకరించి డిస్పోజ్ చేస్తారు. వాళ్లు ఈ ప్రదేశానికి శవాన్ని తీసుకొచ్చేటప్పుడు తెల్లబట్టలు ధరించి మంత్రాలు జపిస్తారు. అలాగే టవర్ లోపలికి వెళ్లేటప్పుడూ అందరు ఒకేసారి బిగ్గరగా అరుస్తారు కూడా. ఈ టవర్‌లను నిర్మిచడానికి చాలా పెద్ద ఖాళీ స్థలం కావాల్సి ఉంటుంది.
ఐతే ప్రస్తుత జనరేషన్ పార్శీలు దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఈ రోజుల్లో ఇది సరైనది కాదు. ఎందుకంటే ఇప్పుడు నగరాల్లో రాబందులు కూడా ఎక్కువుగా లేవు. దీంతో సంవత్సరాలు తరబడి బహిర్గతమై ఉన్న శవాలు త్వరగా డిస్పోజ్ కావు పైగా కాలుష్యం ఏర్పడుతుంది. దీనివల్ల లేనిపోని అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని పలువురు పార్శీలు ఆందోళన వ్యకం చేస్తున్నారు. ఈ ఆచారాన్ని మార్చాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు కూడా. కానీ పలువురు పార్శీలు మాత్రం ఆఖరి టైంలో ఆ వ్యక్తులకు నిశబ్ధంగా ఇచ్చే గౌరవమని సగర్వంగా చెబుతుండటం గమనార్హం.
(చదవండి: దసరా జరుపుకోని ఏకైక గ్రామం! కారణం తెలిస్తే కళ్లు చెమ్మగిల్లుతాయ్!)
Comments
Please login to add a commentAdd a comment