burial
-
దైవ దూషణ నెపం.. పాకిస్తాన్లో మరో దారుణం
కరాచీ: పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో అమానవీయ ఉదంతం చోటుచేసుకుంది. దైవదూషణ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక వైద్యుని మృతదేహాన్ని ఖననం చేయడానికి బదులుగా దహనం చేసిన వైనం వెలుగు చూసింది.వివరాల్లోకి వెళితే సింధ్ ప్రావిన్స్‌లో దైవ దూషణ ఆరోపణలు ఎదుర్కొంటున్న షానవాజ్ కంబార్ అనే వైద్యుడు పోలీసులకు లొంగిపోయేందుకు నిరాకరిస్తూ పారిపోయే ప్రయత్నం చేశాడు. దీంతో ఓ పోలీసు ఆ వైద్యునిపై కాల్పులు జరిపాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ కాల్పుల్లో ఆ వైద్యుడు మృతిచెందాడు. కంబార్ మృతదేహాన్ని పోలీసులు అతని కుటుంబ సభ్యులకు అంత్యక్రియలు నిర్వహించేందుకు అప్పగించారు. మృతునికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె, భార్య ఉన్నారు. అయితే వైద్యునిపై కాల్పులు జరిపిన పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ నియాజ్ ఖోసో ఈ సంఘటనను ధృవీకరిస్తూ, ఆ వైద్యునితో పాటు అతని సహచరులు పోలీసులపై కాల్పులు జరిపారని, ఈ నేపధ్యంలోనే తాము ఎదురు కాల్పులు జరిపినట్లు తెలిపారు.స్థానిక పోలీసు అధికారి షకుర్ రషీద్ మాట్లాడుతూ మృతుని కుటుంబ సభ్యులు తమ స్వగ్రామమైన జాన్హీరోలో వైద్యునికి అంత్యక్రియలు చేసే ప్రయత్నం చేసింది. అయితే ఇంతలో కొందరు ఆ మృతదేహాన్ని అప్పగించాలని డిమాండ్ చేశారు. దీంతో వారికి భయపడిన మృతుని కుటుంబ సభ్యులు అక్కడి నుంచి భయంతో పారిపోయారు. దీంతో ఆ అల్లరి మూక వైద్యుని మృతదేహనికి నిప్పు పెట్టిందని రషీద్ తెలిపారు.ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఉమర్కోట్ నగర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆ వైద్యుడు సోషల్ మీడియాలో దైవ దూషణతో కూడిన ఒక పోస్ట్ పెట్టారనే ఆరోపణలతో పాకిస్తాన్ శిక్షాస్మృతిలోని సెక్షన్ 295 సీ కింద ఆ డాక్టర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం పోలీసులు అతనిని అరెస్టు చేసేందుకు వచ్చిన తరుణంలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఇది కూడా చదవండి: జనాలను ఉరుకులు పెట్టించిన మైసూర్ గజరాజులు -
ఇవేం అంత్యక్రియలు? మృతదేహాలను రాబందులకు వదిలేస్తారా!
ఒక్కొ మతం సంప్రదాయానికి అనుగుణంగా అంత్యక్రియలు ఉంటాయి. హిందువలు దహనం చేస్తే, క్రిస్టియన్లు, ముస్లింలు ఖననం చేస్తారు. ఐతే పార్శీలు వద్దకు వచ్చేటప్పటికి అంత్యక్రియలు చాలా విభిన్నంగా ఉటాయి. వారి బంధువులు ఎవరైనా చనిపోతే రాబందులు తినడానికి వదిలిపెట్టేసి వెళ్లిపోతారట. ఇది వారి ఆచారం. ఎన్నో ఏళ్లుగా చేస్తున్నారు. అలా మృతదేహాలను వదిలేసే ప్రదేశాన్ని టవర్ అఫ్ సైలెన్స్ అంటారు. మనం ఎలా అయితే శ్మశానం నిర్మించుకుంటామో అలాగే పార్మీలు మృతదేహాలను విడిచిపెట్టే స్థలాలను టవర్ అఫ్ సైలెన్స్ పేరుతో ఏర్పాటు చేసుకుంటారు. ఎందుకిలా? ఏంటీ ఆచారం అంటే.. పురాతనకాలం నుంచి పార్శీ కమ్యూనిటీ ఈ ఆచారాన్ని పాటిస్తోంది. దీన్ని 'దఖ్మా' అని కూడా పిలుస్తారు వారు. పార్శీలు వారి బంధువులు చనిపోయాక చేయాల్సిన చివరి కార్యక్రమాలు(అంత్యక్రియలు) ఇంత విడ్డూరంగా ఎందుకు చేస్తున్నారంటే?..వారి దృష్టిలో శరీరం ప్రకృతి ఇచ్చిన బహుమతని వారి నమ్మకం. అందుకే మరణాంతరం దాన్ని ప్రకృతికే సమర్పించాలనేది వారి ముఖ్యోద్దేశం. అందుకే వారంతా ఇలా చేస్తారు. ఐతే ఇక్కడో ఆసక్తకరమైన విషయం ఏంటంటే.. ఇలా మృతదేహాలను వదిలేసి ప్రదేశాన్ని.. టవర్ ఆఫ్ సైలెన్స్ పేరుతో పెద్ద ఖాళీ స్థలాన్ని ఎంచుకుని వృత్తాకారా రీతిలో రెండు పెద్ద గోడలు మధ్యలో ఓ పెద్ద బావి వచ్చేలా నిర్మిస్తారు. ఎవరైతే ఈ టవరాఫ్ సైలెన్స్‌ని నిర్మిస్తారో లేదా నిర్మించేందుకు విరాళం ఇస్తారో వారి శవమే ముందుగా ఇక్కడకు వస్తుందట. అందుకు ఆధారాలు ఉన్నాయని పార్శీ మతం గురించి పరిశోధన చేస్తున్నా ప్రాచి మహితా చెబుతున్నారు. కోల్‌కతాలో ఓ వ్యక్తి ఇలానే ఈ టవర్ ఆఫ్ సైలెన్స్‌ని నిర్మించాడని, అప్పుడు ఆయన శవమే ముందుగా అక్కడకు వచ్చిందని చెబుతున్నారు. అలాగే ఆయనకు ఓ కుక్క ఉండేదని, అది ఆయన మీద బెంగతో తిండి మానేయడంతో అతను చనిపోయిన ఏడు రోజుకే ఈ కుక్క చనిపోయింది. దీన్ని కూడా అక్కడకే తీసుకొచ్చి అంత్యక్రియలు చేసినట్లు ప్రాచి చెబుతున్నారు. రాబందువులకు ఆహరం కోసం అని ఇలా చేయడం లేదట వాళ్లు. జీవితం చివరల్లో కూడా దాతృత్యం ఉండేలని చాటి చెప్పేడమే ఈ వినూత్న రీతిలో చేసే అంత్యక్రియలు వెనుక దాగొన్న ప్రధానోద్దేశం. ముందుగా ఆ మృదేహాలు సూర్యుడికి, గాలికి బహిర్గతం అవుతాయి. ఆ తర్వాత రాబందులు లాంటివి పీక్కుని తినగా మిగిలిన ఎముకలు మధ్యలో ఉన్న బావిలో పడిపోతాయి. ఈ బావికి వృత్తాకారంలో రెండు సర్కిళ్లు ఉంటాయి. బాహ్య సర్కిల్లో పురుషుల శవాలు. లోపల సర్కిల్లో మహిళ శవాలు. మధ్యన చిన్నపిల్లల మృతదేహాలను ఉంచుతారు. అవి డికంపోజ్ అయ్యాక మిగిలిన ఎముకలు మధ్యలో ఉన్న బావిలో పడిపోతాయి. ఆ తర్వాత ఏడాదికి రెండేళ్లకొకసారి ఆయా వ్యక్తులు బంధువులు వెళ్లి మిగిలిపోయి ఉన్న అవశేషాలను సేకరించి డిస్పోజ్ చేస్తారు. వాళ్లు ఈ ప్రదేశానికి శవాన్ని తీసుకొచ్చేటప్పుడు తెల్లబట్టలు ధరించి మంత్రాలు జపిస్తారు. అలాగే టవర్ లోపలికి వెళ్లేటప్పుడూ అందరు ఒకేసారి బిగ్గరగా అరుస్తారు కూడా. ఈ టవర్లను నిర్మిచడానికి చాలా పెద్ద ఖాళీ స్థలం కావాల్సి ఉంటుంది. ఐతే ప్రస్తుత జనరేషన్ పార్శీలు దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఈ రోజుల్లో ఇది సరైనది కాదు. ఎందుకంటే ఇప్పుడు నగరాల్లో రాబందులు కూడా ఎక్కువుగా లేవు. దీంతో సంవత్సరాలు తరబడి బహిర్గతమై ఉన్న శవాలు త్వరగా డిస్పోజ్ కావు పైగా కాలుష్యం ఏర్పడుతుంది. దీనివల్ల లేనిపోని అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని పలువురు పార్శీలు ఆందోళన వ్యకం చేస్తున్నారు. ఈ ఆచారాన్ని మార్చాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు కూడా. కానీ పలువురు పార్శీలు మాత్రం ఆఖరి టైంలో ఆ వ్యక్తులకు నిశబ్ధంగా ఇచ్చే గౌరవమని సగర్వంగా చెబుతుండటం గమనార్హం. (చదవండి: దసరా జరుపుకోని ఏకైక గ్రామం! కారణం తెలిస్తే కళ్లు చెమ్మగిల్లుతాయ్!) -
60 ఏళ్ల వృద్ధుడు ఖననం చేసేశాక..హఠాత్తుగా బతికే ఉన్నానంటూ..
మహారాష్ట్రలో వింత ఘటన చోటు చేసుకుంది. 60 ఏళ్ల వృద్ధుడు అంత్యక్రియలు అయిపోయాక బతికే ఉన్నానంటూ స్నేహితుడికి కాల్ చేశాడు. దీంతో ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు బంధువులు. వారు ఈ విషయాన్ని పోలీసులకి తెలపడంతో ఈ ఘటనపై దర్యాప్తు చేయడం ప్రారంభించారు. వివరాల్లోకెళ్తే..మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో 60 ఏళ్ల ఆటో డ్రైవర్ రిఫీక్ షేక్ అనే వృద్ధుడు కొద్దినెలల క్రితం తప్పిపోయాడు. దీని గురించి కుటుంబసభ్యులు పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు కూడా. ఐతే జనవరి 29న బోయిసర్ మరియు పాల్ఘర్ స్టేషన్ల మధ్య ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. దీంతో రైల్వే పోలీసులు అతడి ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీన్ని చూసిన ఒక వ్యక్తి రైల్వే పోలీసులను సంప్రదించి అతను తన సోదరుడు రఫీక్ షేక్ అని చెప్పాడు. అతను తప్పిపోయినట్లు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు కూడా తెలిపాడు. ఆ తర్వాత రఫీక్ భార్య సైతం మృతి చెందింది తన భర్తే అని గుర్తిచడం విశేషం. దీంతో పోలీసులు మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. కుంటుంబికులు ఆ మృతదేహాన్ని ఖననం చేసేశారు కూడా. ఇంతలో రఫీక్ తన స్నేహితుడికి బతికే ఉన్నానంటూ సడెన్‌గా కాల్ చేశాడు. దీంతో అతను ఒక్కసారిగా షాక్ తిన్నాడు. వీడియో కాల్ చేసి మాట్లాడేంత వరకు నమ్మలేకపోయాడు. ఈ విషయాన్ని అతను షేక్ కుటుంబికులకు చెప్పాడంతో వారు కూడా బిత్తరపోయారు. అతన్ని చూసి ఆ కుంటుంబం ఆనందానికి ఆవధులే లేకుండా పోయింది. అంతేకాదు వారు ఈ విషయాన్నిపోలీసులకు తెలియజేయడంతో వారు ఖననం చేసిన మృతదేహన్ని వెలికితీసి.. అతను ఎవరో కనిపెట్టి పని ప్రారంభించారు. ఆ వృద్ధుడు కొద్ది నెలల వరకు పాల్ఘర్లోని ఒక నిరుపేద ఇంటిలో ఉన్నట్లు సమాచారం. (చదవండి: తాజ్‌మహల్‌ని చూసి మంత్రముగ్దులయ్యి ముషారఫ్ ఏం అన్నారంటే..) -
ఖననం చేసేముందు కన్ను తెరిచిన పురిటికందు
సాక్షి, కోల్‌సిటీ(కరీంనగర్): చనిపోయాడనుకుని ఖననం చేయడానికి తీసుకెళ్తున్న మగశిశువు శ్వాస తీసుకోవడంతో వెంటనే పిల్లల ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో గోదావరిఖనిలో చోటుచేసుకుంది. మంథని మండలానికి చెందిన ఓ మహిళ 26 వారాల గర్భిణి. నెలలు నిండకున్నా పురిటి నొప్పులు రావడంతో ఆమెను గోదావరిఖని లక్ష్మీనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఏప్రిల్ 9న డెలీవరీ డేట్ ఇచ్చినా, పురిటినొప్పులు తీవ్రం కావడంతో వైద్యులు సాధారణ ప్రసవం చేశారు. తక్కువ బరువుతో మగశిశువు జన్మించాడు. అయితే ఆ శిశువు బతకడం కష్టమని, ఏదైనా పిల్లల ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. దీంతో శిశువును రాత్రంతా తల్లి వద్దే ఉంచారు బంధువులు. ఆదివారం ఉదయం శిశువును గమనించగా శ్వాస తీసుకోలేదు. దీంతో చనిపోయాడని భావించిన బంధువులు ఖననం చేయడానికి గోదావరి నది ఒడ్డుకు తీసుకెళ్లారు. అక్కడికెళ్లాక శిశువుపై ఉంచిన గుడ్డను తీసి చూశారు. శిశువులో కదలిక కనిపించడంతో హుటాహుటిన లక్ష్మీనగర్‌లో గల మరో పిల్లల ఆస్పత్రికి తరలించారు. తక్కువ బరువుతో పుట్టిన శిశువుకు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని, మెరుగైన వసతులు కలిగిన పిల్లల ఆస్పత్రికి తరలించాల్సి ఉందని అక్కడి వైద్యులు చెబుతున్నారు. సరిగా పరీక్షించకుండానే శిశువులో శ్వాస ఆడటం లేదని మొదట పురుడుపోసిన ఆస్పత్రి సిబ్బంది చెప్పడం వల్లే తాము ఖననం చేయడానికి తీసుకెళ్లామని శిశువు బంధువులు ఆరోపిస్తున్నారు. జరిగిన ఘటనలో తమ నిర్లక్ష్యమేమీ లేదని, మెరుగైన ఆస్పత్రికి తరలించాలని తాము ముందే చెప్పగా, చనిపోయాడని భావించి బంధువులే శిశువును శ్మశానానికి తీసుకెళ్లారని లక్ష్మీనగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు వివరించారు. -
అనాథ మహిళ మృతి.. రెండు గ్రామాల మధ్య ‘ఖనన’ పంచాయితీ
సాక్షి, అమరచింత(మహబూబ్‌నగర్): ఓ అనాథ మహిళ మృతి చెందగా ఇరు గ్రామాల మధ్య ‘ఖనన’ పంచాయితీ తలెత్తింది. చివరకు ఒకరిద్దరు గ్రామ పెద్దల జోక్యంతో అంత్యక్రియలు నిర్వహించారు. వివరాలిలా ఉన్నాయి. వనపర్తి జిల్లా అమరచింత మండలంలోని కిష్టంపల్లికి శ్మశాన వాటిక లేదు. దీంతో పక్క గ్రామమైన నందిమల్ల ఎక్స్‌రోడ్డు శివారులో ఇటీవల అధికారులు రెండెకరాలు కేటాయించారు. అయితే కిష్టంపల్లిలో ఎవరు చనిపోయినా అంత్యక్రియలు నిర్వహించేందుకు నందిమల్ల ఎక్స్‌రోడ్డు మధ్య నుంచే వెళ్లాలి. దీంతో ఇరు గ్రామాల మధ్య పంచాయితీ న డుస్తోంది. కాగా, కిష్టంపల్లికి చెందిన అనాథ దాసరి కొండమ్మ (80) మంగళవారం తెల్లవారుజామున మృతి చెందింది. సర్పంచ్ చెన్నమ్మతో పాటు గ్రామస్తులు ఆర్థికసాయం అందించి మధ్యాహ్నం అంతిమ సంస్కారాలకు సిద్ధమయ్యారు. ఖననానికి తీసుకెళ్తుండగా తమ గ్రామం మీదుగా వద్దని నందిమల్ల ఎక్స్‌రోడ్డు గ్రామస్తులు అడ్డుకున్నారు. మృతదేహాన్ని అక్కడే ట్రాక్టర్‌పై నుంచి కిందికి దింపారు. ఇరు గ్రామస్తుల మధ్య గంటన్నర పాటు వాదోపవాదా లు నడిచాయి. కొందరు నాయకులు జోక్యం చేసుకు ని మృతదేహాలు తీసుకెళ్లడానికి వేరే మార్గం చూపి స్తామని హామీ ఇవ్వడంతో పరిస్థితి సద్దుమణిగింది. చివరకు అనాథ మహిళ మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. చదవండి: రిమ్స్‌లో దారుణం: కాలం చెల్లిన ఇంజక్షన్లతో చికిత్స.. -
25 రోజుల్లో 376 అంత్యక్రియలు!
అహ్మదాబాద్: గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో సున్నీ ముస్లింలకు చెందిన గంజ్ షాహిద్ ఖబ్రస్థాన్ (శ్మశానానికి)కు శవాల తాకిడి ఎక్కువైంది. అందులో ప్రతి రోజు ఎవరివో ఒకరివి అంత్యక్రియలు జరగుతున్నాయి. ఒక్క ఏప్రిల్ నెలలోనే 199 మంది సున్నీల మృతదేహాలకు అంత్యక్రియలు జరగ్గా, ఆ సంఖ్య మే నెలలో దాదాపు రెండింతలయింది. గతేడాది, అంటే 2019, ఏప్రిల్ నెలలో ఆ శ్మశానంలో కేవలం 66 మంది మృతదేహాలకు మాత్రమే అంత్యక్రియలు జరిగాయి. ఇక మే నెలలో, మొదటి 25 రోజుల్లో 376 మృతదేహాలకు అంత్యక్రియలు జరిగాయి. గతేడాది ఇదే కాలానికి 61 మృతదేహాలకు మాత్రమే అంత్యక్రియలు జరిగాయని శ్వాశాన రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ప్రాణాంతక కరోనా వైరస్ కబళించడం వల్లనే శ్మశానంలో అంత్యక్రియల సంఖ్య అంతగా పెరిగిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా వైరస్‌కు గుజరాత్ రాష్ట్రంలో ‘హాట్‌స్పాట్’.గా ఉన్న అహ్మదాబాద్ నగరంలో ఇప్పటి వరకు 11,163 కరోనా కేసులు నిర్ధారణకాగా, వారిలో 773 మంది మరణించారు. మరణాల సంఖ్య ఏకంగా 6.9 శాతం ఉండడం ఆందోళనకరం. నగరంలోని ముస్లింల శ్మశానాల నిర్వహించే సున్నీ వక్ఫ్ బోర్డు అధిపతి రిజ్వాన్ ఖాద్రిని ఇదే విషయమై సంప్రతించగా, ఏప్రిల్ నెల నుంచి మే 25వ తేదీ వరకు 575 మంది సున్నీలు మరణించగా, వారిలో 147 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని చెప్పారు. నగరంలోని తమ సున్నీ ముస్లింలకు చెందిన అన్ని శ్మశానాల్లో అంత్యక్రియల సంఖ్య ఈ సారి చాలా ఎక్కువగా ఉందని ఆయన చెప్పారు. ముసా సుహాగ్ ఖబ్రస్థాన్‌లో గతేడాది ఏప్రిల్‌లో 71, మే నెలలో 66 అంత్యక్రియలు జరగ్గా , ఈ ఏడాది ఏప్రిల్ నెలలో 142, మే నెల మొదటి 27 రోజుల్లో 300 అంత్యక్రియలు జరగ్గా వాటిలో కేవలం 21 మరణాలు మాత్రమే కరోనా కారణంగా మరణించినట్లు ఖాద్రి తెలిపారు. అలాగే చార్టోడ ఖబ్రస్థాన్‌లో గతేడాది ఏప్రిల్ నెలలో 55, ఈ ఏడాది ఏప్రిల్ 117 అంత్యక్రియలు, అలాగే గతేడాది మే నెలలో 52, ఈ మే నెల మొదటి 15 రోజుల్లోనే 193 మంది మృతదేహాలకు అంత్యక్రియలు జరిగాయి. ఒక్క ముస్లింలకు చెందిన శ్మశానంలోనే కాకుండా ఇతర శ్మశానాల్లో కూడా అంత్యక్రియల సంఖ్య బాగా పెరిగాయి. నగరంలోని ‘అంతిమ్ ధామ్’ శ్మశానంలో గతేడాది మే నెలలో 180 అంత్యక్రియలు జరగ్గా, ఈ ఏడాది మే నెలలో 350 అంత్యక్రియలు జరిగాయి. ఈ స్థాయిలో అంత్యక్రియలు పెరగడానికి కారణం కరోనా మహమ్మారి కారణమని తెలుస్తోంది. అయితే నిర్ధారిత కేసులు మాత్రం తక్కువగా ఉన్నాయి. అంటే కరోనా కేసులు బయట పడకుండానే పాడె కడుతున్నాయా అన్న అనుమానం కలుగుతోంది. (కరోనా వైద్య పరీక్షల్లో తేలిందేమిటి?) -
కన్నతల్లి కడచూపునకు నోచుకోక..
మేడిపల్లి: కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్ మిగిలిస్తున్న కన్నీటి గాథలెన్నో.. జన్మనిచ్చిన అమ్మ ఇక లేదని తెలిసినా, కన్నతల్లి కడచూపునైనా నోచుకోనివ్వని బా ధ్యతలు ఆ కానిస్టేబుల్‌నే కాదు మిగతా సి బ్బందినీ కంట తడిపెట్టించాయి. కానిస్టేబుల్ గౌరీనాయుడు మేడిపల్లి ఠాణా పరిధిలో లాక్డౌన్ విధులు నిర్వర్తిస్తున్నాడు. తల్లి ఎల్లమ్మ (48) విజయనగరం జిల్లా వెట్టిపల్లిలో అనారోగ్యంతో శనివారం మృతి చెందినట్టు సమాచారం అందింది. లాక్‌డౌ న్‌తో రాష్ట్ర సరిహద్దులు మూసుకుపోవడంతో తన తల్లిని కడసారి చూ సుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. ఆదివారం తల్లి అంత్యక్రియలకు హాజరుకాలేకపోయిన గౌరీనాయుడు గుండెదిటవు చేసుకు ని బాధ్యతలు నిర్వర్తించాడు. విషయం తెలిసిన సహోద్యోగులు అతడిని ఓదార్చి సంఘీభావం తెలిపారు. సీఐలు అంజిరెడ్డి, యద్బాల్ జానీ, ఎస్ఐ రఘురామ్ కానిస్టేబుల్‌ను పరామర్శించి ఓదార్చారు. -
అందుకే కరుణానిధిని ఖననం చేశారు
చెన్నై : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం కరుణానిధి అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి. మెరీనా బీచ్‌లోని అన్నా స్క్వేర్ ప్రాంగణంలో ప్రభుత్వ లాంఛనాలతో కరుణ అంత్యక్రియలు ముగిశాయి. కుటుంబ సభ్యులు, లక్షలాది మంది అభిమానులు ఆశ్రునయనాలతో ఆయనకు తుది వీడ్కోలు పలికారు. తొలుత పళనిస్వామి ప్రభుత్వం కరుణానిధి అంతిమ సంస్కరాలకు మెరీనా బీచ్‌లో స్థలం కేటాయించడానికి నిరాకరించిన సంగతి తెలిసింది. దాంతో స్టాలిన్, డీఎమ్‌కే వర్గాలు హై కోర్టుకు వెళ్లి మరి కరుణానిధి అంత్యక్రియలు మెరీనా బీచ్‌లో జరిగేలా కృషి చేశారు. హిందువు కదా.. ఖననం ఎలా హిందూ సాంప్రదాయం ప్రకారం చిన్న పిల్లల్ని, సాధువుల్ని తప్ప మిగితా ఎవరూ మరణించిన వారిని దహనం (క్రిమేషన్) చేస్తారు. కేవలం క్రైస్తవులు, ముస్లింలు మాత్రమే ఖననం (బురియల్) చేస్తారు. కానీ కరుణానిధిని కూడా ఖననం చేశారు. ఎందుకిలా అంటే కరుణానిధి హిందూ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే అయినప్పటికి, ఆయన నాస్తికుడు. జీవించినంత కాలం ఆయన తనను తాను నాస్తికునిగానే ప్రచారం చేసుకున్నారు. అందువల్లనే కరుణానిధి అభిప్రాయాలకు విలువ ఇస్తూ ఆయనను దహనం చేయకుండా ఖననం చేశారు. ఒక కరుణానిధినే కాక గతంలో పెరియార్ ఇ.వి. రామసామి, సీఎన్ అన్నాదురై వంటి మహామహులందరిని ఖననం చేశారు. ఇప్పుడు వారి దారిలోనే కరుణానిధిని కూడా ఖననం చేశారు. 14 ఏట నుంచి నాస్తికవాదం వైపు సమాజంలో ఉన్న బ్రాహ్మణాధిక్యాన్ని ప్రశ్నిస్తూ పెరియార్ ఇ వి రామసామి నాయకర్ ‘ద్రవిడ ఉద్యమా’న్ని తీసుకొచ్చారు. ఈ ఉద్యమ భావజాలానికి ఆకర్షితులైన కరుణానిధి దీనిలో భాగస్వామి అయ్యారు. అనంతరం ఈ ఉద్యమ ఫలితంగా ఆవిర్భవించిన ‘ద్రవిడ కళగం పార్టీ’(డీకేపీ)లో చేరారు. డీకే పార్టీలో వచ్చిన వివాదం ఫలితంగా ‘డీఎమ్‌కే’ పార్టీ ఆవిర్భవించింది. ఈ పార్టీ కూడా దేవున్ని నమ్మదు. అయితే కరుణా నిధి నాస్తికుడిగా ఉన్నప్పటికీ, ఇతరుల నమ్మకాలకు పూర్తి విలువనిచ్చేవారని తెలిసింది. ఆయన దేవున్ని నమ్మనప్పటికీ, ఇతరుల విశ్వాసాలను మాత్రం వ్యతిరేకించేవారు కాదని తెలిసింది. -
ముమ్మరంగా బోరుగుంతల పూడ్చివేత
మెదక్‌రూరల్: బోరుబావులను పూడ్చేందుకు ఆయా గ్రామాల సర్పంచ్‌లు, యువత, అధికారులు ముందుకు వçస్తున్నారు. మెదక్ మండలం మంబోజిపల్లి గ్రామ సమీప పొలంలో ప్రమాదకరంగా ఉన్న బోరుబావిని సర్పంచ్ ప్రభాకర్ ఆధ్వర్యంలో పూడ్చివేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ బోర్ వేసిని నీరుపడని గుంతలను వెంటనే పూడ్చివేయాలని సూచించారు. పాపన్నపేట(మెదక్): మండల పరిధిలోని చిత్రియాల్‌లో నిరుపయోగంగా ఉన్న బోరు గుంతలను ఎస్ఐ సందీప్‌రెడ్డి ,గ్రామ పోలీసు ఇన్చార్జి ఇమ్మానియల్ ఆధ్వర్యంలో పోలీసులు పూడ్చివేశారు. బోరు తవ్వినా నీరు పడకపోవడంతో చాలా మంది రైతులు వాటిని అలాగే వదిలేశారు. ఈ సంధర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. ప్రమాదకరంగా ఉన్న బోర్లను రైతులు వెంటనే పూడ్చివేత చర్యలు చేపట్టాలని హెచ్చరించారు. లేనిపక్షంలో కేసులు నమోదుచేస్తామన్నారు. హవేళిఘణాపూర్(మెదక్): ప్రమాదకరంగాఉన్న బోరుబావులను పూడ్చివేయాలని హవేళిఘణాపూర్ ఎస్ఐ శ్రీకాంత్ అన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా మంగళవారం ఎస్ఐ ఆధ్వర్యంలో మండల పరిధిలోని తొగిట, కూచన్‌పల్లి, ముత్తాయికోట, మద్దుల్వాయి గ్రామాల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. నీరు పడని బోరుబావుల పూడ్చివేత చర్యలు వెంటనే చేపట్టాలని సూచించారు. అంతకు ముందు హవేళిఘణాపూర్ ఉన్నత పాఠశాలలో ప్రమాదకరంగా ఉన్న బోరుబావిని పూడ్చివేశారు. బైక్ ర్యాలీలో ఎంపీటీసీ శ్రీకాంత్, టీఆర్ఎస్ నాయకులు సాయిలు, రాంచంద్రారెడ్డి, మంగ్యనాయక్, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. పెద్దశంకరంపేట(మెదక్): బోరుబావుల మూసివేతపై ప్రతిఒక్కరూ స్పందించాలని ఎస్ఐ విజయరావు, సర్పంచ్ జంగం శ్రీనివాస్ అన్నారు. మంగళవారం పెద్దశంకరంపేట బస్టాండ్‌తో పాటు ఇతర ప్రాంతాల్లోఉన్న ప్రమాదకరంగా ఉన్న బోరుబావులను మట్టితో పూడ్చివేశారు. ప్రజల స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బోరుబావులను పూడ్చివేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు సుభాష్‌గౌడ్, ఈఓ నవీన్‌కుమార్, పోలీస్ సిబ్బంది తదితరులున్నారు. -
ఢిల్లీ ధర్మాసుపత్రిలో దారుణం
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి డాక్టర్ల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం ఈ ఉదంతం. తక్కువ బరువుతోపుట్టిన శిశువు మరణించిందని అక్కడి డాక్టర్లు ప్రకటించారు. అయితే శిశువు ఖననం చేయబడటానికి తీసుకెళ్లినపుడు సజీవంగా ఉన్నట్లు బంధువులు గుర్తించడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే బదర్పూర్కు చెందిన ఓ మహిళ పూర్తిగా నెలలు నిండకముందే ఆదివారం ఉదయం పాపకు జన్మనిచ్చింది. అయితే ఆ పాప ఊపిరితీసుకోవడం లేదని గుర్తించిన నర్సింగ్ సిబ్బంది చిన్నారి మరణించినట్టుగా ధ్రువీకరించి తండ్రి రోహిత్ కు అప్పగించారు. అయితే ఆరోగ్యం ఇంకా కుదుట పడకపోవడంతో తల్లి ఇంకా ఆసుపత్రిలోనే ఉంది. దీంతో పాపను ఇంటికి తీసుకెళ్లి సమాధి చేయడానికి సిద్ధపడుతుండగా, పాప చిన్నగా ఏడ్వడాన్ని రోహిత్ సోదరి గమనించింది. వెంటనే అక్కడున్నవారిని అప్రమత్తం చేసింది. ప్యాప్ విప్పి చూశారు. పాప ఊపిరి తీసుకుంటూ కాళ్లూ, చేతులూ కదుపుతూ కనిపించింది. వెంటనే పీసీఆర్ చికిత్స అందింని అంబులెన్స్‌లో స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. డాక్టర్ల బాధ్యతారాహిత్యంపై ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఆసుపత్రి అధికారులు స్పందించారు. డబ్ల్యుహెచ్వో మార్గదర్శకాల ప్రకారం 22 వారాల ముందు జన్మించిన శిశువులు 500 గ్రా. బరువుతో పుడతారని దాదాపు బతికే అవకాశాలు తక్కువగా ఉంటాయని చెప్పారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని సఫ్దర్‌జంగ్ దవాఖాన మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఏకే రాయ్ చెప్పారు. ఇలాంటి ప్రీ మెచ్యూర్ డెలివరీ శిశువులను చనిపోయినట్లు ప్రకటించటానికి ముందు కనీసం సుమారు ఒక గంట పాటు పరిశీలనలో ఉంచాలని మరో డాక్టర్ చెప్పారు. -
కలాం విగ్రహ ఏర్పాట్లు సందర్శించిన ప్రత్యేక బృందం
రామేశ్వరంః మాజీ రాష్ట్రపతి, దివంగత ఎపిజె అబ్దుల్ కలాం కాంస్య విగ్రహాన్ని రామేశ్వరంలో ప్రతిష్టించనున్నారు. జూలై 27న జరగనున్న విగ్రహ స్థాపనకు వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు రక్షణ మంత్రిత్వశాఖ, ఇండియన్ కోస్ట్ గార్డు అధికారులతో కూడిన బృందం ఆ ప్రదేశాన్ని సందర్శించింది. రక్షణ మంత్రిత్వశాఖ, ఇండియన్ కోస్ట్ గార్డు అధికారులు రామేశ్వరంలో పర్యటించారు. మాజీ రాష్ట్రపతి ఎపిజె అబ్దుల్ కలాం కాంస్య విగ్రహం ఏర్పాటుకోసం జరుగుతున్న పనులను పర్యవేక్షించారు. మాజీ రాష్ట్పపతి మొదటి వర్థంతి సందర్భంలో జూలై 27న ఆయన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నట్లు రక్షణ మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు. అదే ప్రాంతంలో కలాం స్మారక చిహ్నంగా ఓ లైబ్రరీని, మ్యూజియం ను సైతం నిర్మించనున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే సిబ్బందికోసం హౌసింగ్ క్వార్టర్స్ ను కూడా నిర్మించనున్నట్లు వెల్లడించారు. పర్యవేక్షణ బృందంతోపాటు మండపం కోస్ట్ గార్డ్ కమాండర్ రామ్మోహన్ రావు, అబ్దుల్ కలాం మేనల్లుడు షేక్ సలీం కూడా హాజరై విగ్రహ ఏర్పాటు పనులను పరిశీలించారు. -
కాకతీయకు ‘మెషినరీ’ దెబ్బ!
♦ చెరువుల పూడికతీత పనులకు దొరకని ట్రాక్టర్లు, ప్రొక్లెయిన్లు ♦ కావాల్సిన ప్రొక్లెయిన్లు 10 వేలు.. అందుబాటులో ఉన్నవి 6 వేలే.. ♦ ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి తెప్పిస్తున్నా చాలని వైనం ♦ మెదక్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో పనులకు ఆటంకం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని చెరువుల పునరుద్ధరణ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మిషన్ కాకతీయ’ను మెషినరీ కొరత వేధిస్తోంది. చెరువుల పూడికతీతకు అవసరమయ్యే ప్రొక్లెయిన్లు, ట్రాక్టర్లు, కాంక్రీట్ మిక్సర్ల కొరత మిషన్ పనులకు అడ్డంకిగా మారింది. రాష్ట్రంలో ఉన్నవి కాక.. పక్క రాష్ట్రాల నుంచి ప్రొక్లెయిన్లు తెప్పిస్తున్నా సరిపోవడం లేదు. రాష్ట్రంలో మిషన్ భగీరథ, రోడ్లు, భవనాల నిర్మాణ కార్యక్రమాలు చురుగ్గా సాగుతుండటం, ప్రధాన కాంట్రాక్టర్లంతా మెషినరీని ఆ పనులకు తరలిస్తుండటంతో చెరువు పనులకు యంత్రాలు దొరకడం లేదు. దీంతో ఒక చెరువు పరిధిలో రోజుకు 300 నుంచి 400 క్యూబిక్ మీటర్ల పూడికను తీయాల్సిం ఉండగా.. ప్రస్తుతం అది 100 క్యూబిక్ మీటర్లను కూడా దాటడం లేదు. రాష్ట్రంలో రెండో విడత మిషన్ కాకతీయ కింద 9,035 చెరువులకు పరిపాలనా అనుమతులు ఇవ్వగా, అందులో 8,862 చెరువులకు టెండర్లు పిలిచారు. ఇందులో 7,746 చెరువు పనులకు ఒప్పందాలు కుదరగా, 7,108 చెరువుల్లో పనులు ఆరంభమయ్యాయి. ప్రస్తుతం పూడికతీత పనులు చేసేందుకు గరిష్టంగా మరో నెల గడువే ఉన్నా, గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పనుల్లో వేగం కనిపించడం లేదు. ఇతర కారణాలు ఎలా ఉన్నా.. మెషినరీ కొరత మాత్రం పనులకు బంధనమేస్తోంది. ఉన్నవి ఆరు వేలే... రాష్ట్రంలో చెరువుల పనులకు 10 వేల ప్రొక్లెయిన్లు అవసరం కాగా.. ప్రస్తుతం 6 వేలు మాత్రమే ఉన్నాయి. ట్రాక్టర్ల అవసరం 15 వేల వరకు ఉండగా, అవి 10 వేల మేర ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఈ దృష్ట్యా పనుల కోసం ఖమ్మం, నల్లగొండ జిల్లా కాంట్రాక్టర్లు ఆంధ్రప్రదేశ్ నుంచి, మహబూబ్‌నగర్ కాంట్రాక్టర్లు రాయలసీమ, కర్ణాటక నుంచి, ఆదిలాబాద్ జిల్లా కాంట్రాక్టర్లు మహారాష్ట్ర నుంచి మెషినరీ తెప్పిస్తున్నారు. దీంతో ఈ జిల్లాల్లో పనుల్లో కొంత మెరుగుదల కనబడుతోంది. మెదక్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో మాత్రం మెషినరీ సమస్య తీవ్రంగా ఉంది. దీంతో వరంగల్ జిల్లాలో 1,081 చెరువులకు గానూ 649, కరీంనగర్లో 1,054 చెరువులకు 753, నిజామాబాద్‌లో 649కి 547, మెదక్‌లో 1,679కి 1,512 చెరువుల్లో మాత్రమే పనులు ఆరంభమయ్యాయి. దీనికితోడు రాష్ట్రవ్యాప్తంగా మిషన్ భగీరథ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతుండటంతో ట్రాక్టర్లు, ప్రొక్లెయిన్లు ఆ పనులకు తరలివెళుతున్నాయి. వీటితో పాటే గ్రామీణ రోడ్లు, రెండు పడకల ఇళ్ల నిర్మాణంతో పాటు పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరం వంటి భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు మొదలుకావడంతో ప్రొక్లెయిన్లు, ట్రాక్టర్లు, కాంక్రీట్ మిక్సర్లు, సెల్ఫ్ లోడర్స్ అన్నీ ఆ పనులకే వెళుతున్నాయి. తగ్గిన పూడికతీత సామర్థ్యం గత ఏడాది ఒక్కో చెరువు కింద 3 నుంచి 4 ప్రొక్లెయిన్లు.. 30 నుంచి 40 ట్రాక్టర్లు పనిచేసేవి. దీంతో ప్రతి రోజూ సుమారు 300 క్యూబిక్ మీటర్ల పూడికను తీసే వీలు కలిగింది. ప్రస్తుతం ఒక్కో చెరువు పరిధిలో ఒక ప్రొక్లెయిన్, 10కి మించని ట్రాక్టర్లు ఉండటంతో రోజూ 100 క్యూబిక్ మీటర్ల పూడికతీత కూడా సాధ్యం కావడం లేదు. ఈ సమస్య కారణంగా వర్షాలు మొదలయ్యే నాటికి అనుకున్న మేర పూడికతీత సాధ్యమవుతుందా? అన్నది ప్రశ్నగా మారింది. -
పూడ్చిన శవం వెలికితీత
♦ తల్లి మృతిపై అనుమానం వ్యక్తం చేసిన కూతుళ్లు ♦ బస్వాపూర్‌లో వెలుగు చూసిన సంఘటన ములుగు : పూడ్చిపెట్టిన మహిళ శవాన్ని పోలీసులు వెలికి తీసిన సంఘటన ములుగు మండలం బస్వాపూర్ గ్రామంలో సోమవారం జరిగింది. తమ తల్లి మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ ఆమె కూతుళ్లు ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ములుగు పోలీసులు సోమవారం మృతదేహాన్ని తీశారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పదిరోజుల క్రితం జరిగిన మహిళ మృతికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన చెలిమల లక్ష్మమ్మ(75) భర్త శంకరయ్య గతంలోనే మరణించడంతో కుమారుడు రాజయ్య వద్ద ఉంటోంది. అయితే కిడ్నీలు పాడైపోవడంతో రాజయ్య గత ఆరునెలలుగా బాధ పడుతున్నాడు. వ్యాధి నయం చేయించుకునేందుకు ఇటీవల రాజయ్య తనకున్న కొద్దిపాటి భూమిని అమ్ముకోవడంతో కొద్ది మొత్తంలో డబ్బులు వచ్చాయి. ఈ డబ్బుల విషయంలో రాజయ్య చెల్లెళ్లు సుగుణ, ముత్యాలమ్మల మధ్య గొడవ జరిగింది. ఇంతలో ఏమయిందో తెలియదు కానీ ఈ నెల 19న లక్ష్మమ్మ మృతి చెందింది. దీంతో తమ తల్లి మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ ఈ నెల 25న లక్ష్మమ్మ కుమార్తెలు సుగుణ, ముత్యాలమ్మ ఎస్పీకీ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ములుగు తహశీల్దార్ శకుంతలరెడ్డి సమక్షంలో పోలీసులు శవ పంచనామా నిర్వహించారు. గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి చెందిన డాక్టర్ బాలకృష్ణ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. -
మృత్యు తాండవం
ఈ తండాల మట్టి తీసుకెళ్లి రోడ్డు వేశారు. ఇప్పుడు ఆ తండాల్లో మట్టి మిగల్లేదు.. అవును.. ఆ రోడ్డు మట్టినంతా మింగేసింది. మనిషిని ఖననం చేసేటంత మట్టిని కూడా మిగల్చలేదు... నిజానికి హైవే అన్నది ప్రగతికి పునాది కావాలి... కాని పెద్దకుంట, ధన్సింగ్ తండాలకు అది సమాధి అయింది హైవేల మీద తరచుగా సైన్‌బోర్డులు చూస్తూ ఉంటాం.. అతి వేగం ప్రాణాంతకం.. వేగం కన్నా ప్రాణం మిన్న.. అని! ఇది నడిపేవారికి హెచ్చరిక... కానీ ఇక్కడ అది నడిచేవారికి మరణశాసనం అవుతోంది! మృత్యు‘తాండ’వం అవుతోంది. ఈ చావు లెక్కలకు ఆ హైవే దేశంలోనే అతిపెద్ద మైలురాయిగా నిలుస్తోంది... అది ఊరు కాదు. వల్లకాడు. ఇది ఆగ్రహం కాదు. వాస్తవం. ఊరు ఊరంతా నెత్తుటి ప్రవాహమే అయితే, చిన్నా పెద్దా అందరినీ మృత్యువు కాటేస్తే చివరకు ఊరే వల్లకాడవుతుంది. ఒక్కో యింట్లో ఇద్దరూ, ముగ్గురూ... నలుగురూ... అక్కడ చనిపోయిన వారిని పూడ్చిపెట్టేందుకు అటు ఆరు, ఇటు మూడడుగుల జాగా కూడా మిగల్లేదు. కానీ అక్కడ ఇళ్ళన్నీ మనుషుల్ని కోల్పోయి మట్టిదిబ్బలుగా మారాయి. ఇళ్లకు తాళాలు తప్ప మానవ సంచారం కనిపించదు. బిడ్డల పొట్టనింపేందుకు భర్తల శరీరాలను ఛిద్రం చేసిన నెత్తుటి రహదారిపైనే స్త్రీలు తమ శరీరాలను అమ్మకానికి పెడుతున్నారు. ఇదంతా ఎక్కడో కాదు హైదరాబాద్‌కి కూతవేటు దూరంలోని మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌కి దగ్గరలోని కొత్తూరు మండలం హైవే పక్కనే వున్న పెద్దకుంట తండా, ధన్సింగ్ తండాల పరిస్థితి. ఆ తండాలకు వెళితే వృద్ధులు, స్త్రీలు తప్ప పురుషులు కనిపించరు. వాళ్ళంతా ఒకే చోట, జాతీయ రహదారిని దాటుతుండగా యాక్సిడెంట్లో చనిపోయినవారే. సహజంగా రహదారుల్లో జరిగే ప్రమాదాలను నివారించడం కష్టమే కావచ్చు. కానీ ఒకే ప్రదేశంలో, ఒకే తండాకి చెందిన వారు పదే పదే యాక్సిడెంట్లో చనిపోతున్నారంటే దానర్థం ఎక్కడో పొరపాటు జరుగుతున్నట్టే. ఆ నిర్లక్ష్యం ఖరీదు నిండు ప్రాణాలు. మానని గాయాలు శాంతికి నలుగురు కొడుకులు. పదేళ్ల క్రితం పెద్ద కొడుకు మల్లేష్, ఆ తర్వాత మూడేళ్లకు రెండోవాడు రవి, మిగిలిన ఇద్దరు కొడుకులు శంకర్, గోపాల్ యాక్సిడెంట్లో చనిపోయారు. ఈ బాధతోనే భర్త పోయాడు. జబ్బుతో శాంతి కాళ్ళు చచ్చుబడిపోయాయి. నడవలేదు, నించోలేదు. ఇంత ముద్దపెట్టే దిక్కులేక జీవచ్ఛవంలా బతుకీడుస్తోంది. పదహారేళ్ల శారద భర్త యాక్సిడెంట్లో చనిపోయాడు. అప్పటికే ఆమెకు ఓ కొడుకు. మామ పంచన బతుకుతోంది. ఆర్నెల్ల క్రితం మామ కిషన్‌కి కూడా యాక్సిడెంట్ అయ్యింది. అతనిప్పుడు నడవలేడు. గాయాలకు మందులేక ఇంకా రక్తమోడుతూనే వున్నాయి. రేషన్‌కార్డు కూడా లేకుండా బతికేదెలా ప్రశ్నిస్తోంది శారద, తన జీవితంలోని విషాదానికి కారకులెవరో తెలియక. ఇదే తండాకు చెందిన కొర్ర నేజి అనే మహిళ భర్త, అల్లుడు యాక్సిడెంట్లో చనిపోయారు. ఆ బాధ భరించలేక కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఒంటరిగా ఇంట్లో ఉండే ధైర్యం చేయలేక రెండిళ్ళకి తాళాలు వేసి, భర్త చనిపోయిన హస్లి అనే ఆమె దగ్గర ఉంటోంది. ‘చిన్నపిల్లలున్నారు... రేషన్ కార్డయినా యిప్పించండం’టూ వేడుకుంటోంది. ఎందుకీ విషాదం... ధన్సింగ్, పెద్దకుంట తండాల నుంచి ఏ పనికి బయటకు వెళ్ళాలన్నా రహదారిని దాటాల్సిందే. అక్కడ ఎటువంటి ప్రమాద హెచ్చరికలు ఉండవు. సాయంత్రం అయ్యిందంటే చీకట్లో మలుపు అసలే కనిపించదు. 140, 120 స్పీడుతో వెళ్ళే వాహనదారులకు రోడ్డుదాటుతున్న వారు దగ్గరకొచ్చేంత వరకు కనిపించరు. పొలాల్లోనుంచి జనం పూర్తిగా రోడ్డుపైకి వచ్చే వరకు ఎత్తై రహదారిపైన ఏ వాహనాలొస్తున్నాయో కనిపించదు. నెత్తుటి దారిలోనే చిన్నారుల పాదముద్రలు... పనికే కాదు, పాఠశాలకు వెళ్ళాలన్నా రక్తసిక్తమైన రహదారులను దాటుకుంటూ భయం భయంగా వెళ్ళాల్సిందే. ప్రైమరీ స్కూల్లో చదువు అయిపోయాక ఆ చిన్నారులను హైస్కూల్‌కి పంపాలంటే ఆ దారి తప్ప వేరే దారి లేదు. చిన్నారులకు ఏ రోజు ఏం జరుగుతుందోనని ఆ తండాల జనం ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని బతుకుతున్నారు. అందుకే పిల్లలు బడికి దూరంగా తండాల్లోనే ఉంటున్నారు. ఏం జరుగుతోంది? హైదరాబాద్ బెంగుళూరు జాతీయ రహదారిలో మహబూబ్ నగర్ జిల్లాలోని కొత్తూరు మండలంలో జరిగిన యాక్సిడెంట్లను పరిశీలిస్తే... 2010లో 41 మంది, 2011లో 39 మంది, 2012లో 39 మంది, 2013లో 47 మంది, 2014లో 61 మంది చనిపోయారు. 2015 జనవరి నుంచి ఈనెల 30 వరకు ఈ మండలంలో జరిగిన యాక్సిడెంట్లు 30, ఇందులో 19 మంది మరణిస్తే, 20 మంది క్షతగాత్రులయ్యారు. అయితే పైన వివరించిన లెక్కల్లో అత్యధిక శాతం పెద్దకుంట తండా, ధన్ సింగ్తండాకి చెందిన వారేనన్నది లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఇవన్నీ కేవలం ప్రభుత్వం చెబుతున్నవి. పోలీస్ రికార్డుల్లోకి ఎక్కని యాక్సిడెంట్లెన్నో చెప్పడం కష్టం. గత్యంతరం లేక... ఇంటి పెద్ద దిక్కు చనిపోతే, గత్యంతరం లేక పడుపువృత్తిలోకి దిగుతున్నారు ఇక్కడి స్త్రీలు. ఒక్కో ఇంట్లో ముగ్గురు పిల్లలు ముసలి వాళ్ళూ కలుపుకొని ఐదారుగురు వుంటే వాళ్ళకిస్తోంది 12 కేజీల రేషన్ బియ్యం. ‘ఎలా సరిపోతాయ’ని ప్రశ్నిస్తున్నారు. పడుపు వృత్తిని ఎంచుకున్న వీరి జీవితంలో భద్రత గాలిలో దీపమే. ఎలాంటి రక్షణా లేని వారి జీవితాలలో పొంచి వున్నది పెనుభూతమే. హెచ్.ఐ.వి లాంటి వ్యాధుల నిర్ధారణ కోసం చేసే వైద్యపరీక్షలేవీ వీరికి జరపకపోవడం విచారకరం. ప్రమాదాలను నివారించాలి... తండాల నుంచి నేరుగా హైవే పైకి ఎక్కకుండా లింక్ రోడ్డు వేయడం ద్వారా ప్రమాదాలు నివారించొచ్చు. రోడ్డు దాటే దగ్గర ప్రమాద హెచ్చరికలు, హైమాస్ట్ లైట్లు అమర్చాలి. స్టాపర్స్, సేఫ్టీ గార్డ్స్ పెట్టాలి. రహదారి మధ్యలో వున్న డివైడర్ పై చెట్లు లేకపోవడం వల్ల ఎదురెదురుగా వస్తున్న వాహనాల లైట్లు కళ్ళల్లో పడుతుంటాయి. యాక్సిడెంట్లకి మద్యం కూడా కారణమే. వీటికి తోడు జిల్లాలో ప్రత్యేకించి ట్రాఫిక్ పోలీస్ వ్యవస్థ లేదు. లా అండ్ ఆర్డర్ పోలీసులే ట్రాఫిక్‌నీ చూసుకోవాలి. దీనివల్ల ప్రత్యేకించి నిధులు కూడా జిల్లా పోలీసు యంత్రాంగానికి ఉండవు. ట్రాఫిక్ ఆంక్షలను అతిక్రమించినందుకు వసూలు చేసినదంతా ప్రభుత్వ ఖజానాకే పోతోంది. దీనివల్ల ఏ చర్యలు తీసుకోవాలన్నా జిల్లా అధికారులకు అవకాశం లేదన్నది కొందరి వాదన. టోల్ గేట్ లో హైదరాబాద్ నుంచి అడ్డాకుల వరకు 24 గంటల్లో 6 నుంచి 8 లక్షల పైచిలుకే ఆదాయం వస్తోంది. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని, హెచ్చరిక బోర్డులు పెట్టాలని టోల్గేట్ యాజమాన్యానికీ. జాతీయ రహదారుల అధికారులకు ఎన్నో విజ్ఞాపనలు చేసారు. ఎవ్వరూ స్పందించలేదు. కనీసం హైమాస్ట్ లైట్లు కూడా పెట్టలేదు. - టి.జి.శ్రీనివాస్, లెక్చరర్ జాతీయ రహదారి నిర్మాణం జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నోసార్లు ప్రజలు ఆందోళనలు చేశారు. అనేక సందర్భాల్లో జాతీయ రహదారిని దిగ్బంధించారు. టోల్ గేట్ యాజమాన్యాన్ని అడిగితే అది పంచాయితీ పరిధిలోనిదంటున్నారు. కానీ జాతీయ రహదారిపై భద్రతా చర్యలు చేపట్టే అధికారం మాకు లేదు. చేసేది లేక చేజేతులా ప్రమాదాలను ఆహ్వనిస్తున్నారు తండా ప్రజలు. - కొమ్ము క్రిష్ణ, నందిగామ గ్రామ సర్పంచ్ -
నారావారిపల్లెలో శ్మశానం మాయం
తిరుపతి రూరల్: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత పంచాయతీలో శ్మశానం మాయమైందని, దీంతో ఎవరైనా మరణిస్తే తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని నారావారిపల్లె, కందులవారిపల్లె వాసులు తెలిపారు. మాయమైన శ్మశానాన్ని వెతికి పెట్టాలని జన్మభూమిలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని కొరారు. నారావారిపల్లెకు చెందిన కందులవారిపల్లెలో బుధవారం జన్మభూమి-మా ఊరు కార్యక్రమం జరిగింది. సర్పంచ్ పాశం చంద్రకుమార్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమనికి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నారావారిపల్లె, కందులవారిపల్లె, శేషాపురానికి గతంలో 1.31 ఎకరాల విస్తీర్ణంలో శ్మశానం ఉండేదని పంచాయతీ వాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. కొన్నేళ్లుగా శ్మశానం పూర్తిగా ఆక్రమణలకు గురైందన్నారు. దీంతో ఎవరైనా మరణిస్తే సొంత భూముల్లో ఖననం చేస్తున్నట్లు తెలిపారు. భూములు లేని వారు మూడు గ్రామా లకు దూరంగా ఉన్న భీమవరం గ్రామ సమీపంలో దహనక్రియలు చేస్తున్నట్లు తెలిపారు. పాఠశాల భవనం పూర్తిగా శిథిలమైందని, గ్రామంలో డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని ఎమ్మెల్యేని కోరారు. పశువుల గడ్డి కోసం కేటాయించిన భూమి సైతం కబ్జాకు గురైందని, కాపాడాలని ఎమ్మెల్యేని వేడుకున్నారు. స్పందించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి రాష్ట్రంలోనే ప్రముఖ పంచాయతీ అయిన నారావారిపల్లెలో సమస్యలు లేకుండా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. శ్మశాన భూమిని పూర్తిగా సర్వే చేసి ఆక్రమణల నుంచి విముక్తి కలిగించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. పాఠశాల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తానన్నారు. పార్టీలకు అతీతంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని, అందుకు అందరూ కలిసి నడవాలని పిలుపునిచ్చారు. -
పూడికతీత ఎప్పటికో..
గిలకలదిండి హార్బర్ సముద్ర ముఖద్వారం వద్ద ఇసుక మేట రోజులో గంట మాత్రమే బోట్లు వెళ్లేందుకు అవకాశం పూడికతీసి 30 సంవత్సరాలు అమలుకు నోచుకోని మంత్రి హామీ మచిలీపట్నం : పాలకుల నిర్లక్ష్యం కారణంగా గిలకలదిండి హార్బర్లో సముద్రముఖ ద్వారం వద్ద పూడిక మేటవేసింది. ముఖద్వారం కనీసం 10 నుంచి 12అడుగుల లోతు ఉండాల్సి ఉండగా, ఒకచోట ఐదు అడుగులు, పక్కనే మరోచోట అడుగు లోతు మాత్రమే ఉంటోంది. దీంతో మత్స్యకారుల బోట్లు దెబ్బతింటున్నాయి. మత్స్యకారులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఏళ్ల తరబడి పూడిక తీయకపోవడం వల్లే ఈ దుస్థితి నెలకొందని బోటు యజమానులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. లోతు ఎక్కడో తెలియదు.. గిలకలదిండి హార్బర్ నుంచి అధికారిక లెక్కల ప్రకారం వందకు పైగా మెకనైజ్డ్ బోట్లు, 60కి పైగా పెద్ద ఫైబర్‌బోట్లు చేపలవేటకు వెళ్లి వస్తుంటాయి. అనధికారికంగా మరో 100 వరకు మెకనైజ్డ్, పెద్ద ఫైబర్ బోట్లు చేపలవేట కొనసాగిస్తున్నాయి. ఈ బోట్ల నుంచి సాగించే వేట వల్ల వచ్చే మత్స్య సంపద ద్వారా రోజూ లక్షలాది రూపాయల ఆదాయం సమకూరుతోంది. అయితే చేపలవేటకు వెళ్లి రావాలంటే హార్బర్ నుంచి రెండు కిలోమీటర్ల మేర కాలువలో ప్రయాణించాలి. ఆ తర్వాత సముద్ర ముఖద్వారం వస్తుంది. ఇక్కడే అసలు సమస్య మేటవేసింది. ముఖద్వారం వద్ద ఇసుక మేట వేయటంతో ఎక్కడ సముద్రం లోతుగా ఉంది.. ఎక్కడ మెరకగా ఉంది.. అనే విషయం తెలియడం లేదు. ఎవరైనా డ్రైవర్ లోతును అంచనా వేయలేక బోటును ముందుకు నడిపితే మేట వద్ద చిక్కుకుపోతోంది. సముద్రం నుంచి వచ్చే అలలు ఈ బోటును బలంగా తాకటంతో అది పగిలిపోతోంది. గత నాలుగు నెలల వ్యవధిలో నాలుగు మెకనైజ్డ్ బోట్లు ముఖద్వారం వద్ద చిక్కుకుని పాడైపోయాయి. ఈ బోట్లలోని వలలను మినహాయిస్తే ఒక్కో బోటులో ఉన్న యంత్రాలు, సౌకర్యాలను బట్టి రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల విలువ ఉంటుందని బోటు యజమానులు చెబుతున్నారు. మేట వేసిన ప్రాంతాల్లో బోట్లు చిక్కుకుపోతున్నాయని పలుమార్లు పాలకులకు, అధికారులకు చెప్పినా ఫలితం ఉండటం లేదని వారు వాపోతున్నారు. పూడిక తీసి 30 సంవత్సరాలు గిలకలదిండి హార్బర్‌కు సమీపంలో సముద్ర ముఖద్వారం వద్ద పూడికతీసి 30 సంవత్సరాలకు పైగా అయ్యిందని బోటు యజమానులు, స్థానిక మత్స్యకారులు చెబుతున్నారు. మూడేళ్ల క్రితం అప్పటి రాష్ట్ర ఓడరేవుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సముద్ర ముఖద్వారాన్ని జిల్లాస్థాయి అధికారులు, ఓడరేవుల శాఖ ముఖ్య అధికారులతో కలిసి పరిశీలించారు. రూ.16 కోట్లతో ముఖద్వారంలో పూడికతీస్తామని ఆయన హామీ ఇచ్చారని మత్స్యకారులు చెబుతున్నారు. మూడేళ్లయినా ఆ హామీ అమలుకు నోచుకోలేదని వారు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అలల వెంబడి వచ్చిన ఇసుక బోట్లు వెళ్లే కాలువలో మేట వేస్తోంది. కాబట్టి గిలకలదిండి హార్బర్ నుంచి సముద్రంలోకి వెళ్లే కాలువకు కుడివైపున ముఖద్వారం నుంచి రెండు కిలోమీటర్ల మేర రాళ్లతో సముద్రంలోకి అడ్డుగోడ నిర్మిస్తే అలల తాకిడి తగ్గి ముఖద్వారం పూడుకుపోకుండా ఉంటుందని స్థానిక మత్స్యకారులు, బోటు యజమానులు చెబుతున్నారు. 24 గంటలు ఆగాల్సిందే.. సముద్రంలో ఆటు, పోటు వేళలు ప్రతి రోజు మారుతుంటాయి. పగటి సమయంలో సముద్రం పోటు వచ్చినప్పుడు గంట పాటు గిలకలదిండి హార్బర్ నుంచి బోట్ల రాకపోకలకు అవకాశం ఉంటుంది. మిగిలిన సమయంలో సముద్రంలోనే రెండు కిలోమీటర్ల దూరంలో బోటుకు లంగరు వేసి మళ్లీ పోటు వచ్చే వరకు నిలిపివేస్తున్నారు. దీనివల్ల తుపానులు వచ్చినప్పుడు సముద్రంలో ఉన్న బోట్లు గిలకలదిండి హార్బర్‌కు త్వరగా చేరేందుకు అవకాశం లేకుండాపోతోందని బోటు యజమానులు వాపోతున్నారు. సముద్రంలో వేటకు వెళ్లిన వారిలో ఎవరైనా అనారోగ్యం పాలైతే ఒడ్డుకు తీసుకురావాలంటే అష్టకష్టాలు పడుతున్నామని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కొన్నిసార్లు వేట ముగిసిన వెంటనే బయటకు రాలేకపోతున్నామని, ఆలస్యమైతే పెద్ద వ్యాపారులు చేపల కొనుగోలును పూర్తిగా నిలిపివేస్తున్నారని చెబుతున్నారు. స్థానికంగా ఉన్న వ్యాపారులు నిర్ణయించిన ధరకే చేపలను విక్రయించాల్సి వస్తోందని, ఒక్కో రోజు ఖర్చులు కూడా రావడంలేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి గిలకలదిండి హార్బర్ నుంచి ముఖద్వారం వరకు డ్రెడ్జింగ్ చేయించేందుకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
ఆ 6గురు జూన్ 1 లోపే ఎందుకు చనిపోయారు?
చైనాలో ఆరుగురు వృద్ధులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకుంటూ చేసుకుంటూ 'మమ్మల్ని పూడ్చి పెట్టండి. మా శవాలను కాల్చొద్దు' అని లేఖ రాసి చనిపోయారు. అంతే కాదు. తాము జూన్ 1 కి ముందే చనిపోతున్నాం కనక తమను కాల్చడానికి వీల్లేదు అని కూడా వారు చెప్పుకున్నారు. అసలు సమస్యేమిటంటే చైనాలో మృతులను ఖననం చేయడం, వారి జ్ఞాపకార్థం సమాధి కట్టడం ఆచారం. తరతరాలుగా ఈ ఆచారం కొనసాగుతోంది. అయితే జనాభా విపరీతంగా పెరిగిపోవడంతో చనిపోయిన ప్రతివారినీ పూడ్చిపెడితే ఆఖరికి దేశంలో అంగుళం కూడా మిగిలే పరిస్థితి కనిపించడం లేదు. అందుకే చైనా జూన్ 1 తరువాత నుంచి సమాధి చేయడాన్ని పూర్తిగా నిషేధించింది. ఈ వార్త వినగానే ఆరుగురు వృద్ధులు తమకు సమాధులుండవేమోనని భయపడ్డారు. అందుకే జూన్ 1 లోపే చనిపోతే సమాధులుంటాయని మే 28 నే ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ సంఘటన అన్ హుయ్ ప్రాంతంలోని ఆంకింగ్ నగరంలో జరిగింది. చనిపోయిన వారిలో 83 ఏళ్ల ఝెంగ్ షిఫాంగ్ అనే ఆమె ముందుగానే తన శవపేటికను తయారు చేసి ఉంచుకుంది. కానీ ఆ శవపేటికను అధికారులు కొత్త చట్టాల మేరకు ధ్వంసం చేశారు. దీంతో ఆమె పొడుచుకుని ఆత్మహత్య చేసుకుంది. ఒక మహిళ బావిలోకి దుంకి చనిపోతే, మిగతా వారు విషం తాగారు. చైనాలో సమాధులను నేలమట్టం చేసే ఉద్యమాన్ని ప్రభుత్వం చేపట్టింది. దీని పట్ల ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. రెండేళ్ల క్రితం 4 లక్షల సమాధులను ప్రభుత్వం నేలమట్టం చేసింది. అయితే తీవ్ర ప్రజావ్యతిరేకత నేపథ్యంలో అప్పట్లో ఈ సమాధి విధ్వంస ఉద్యమం ఆగిపోయింది. -
నేడు నెల్సన్ మండేలా అంత్యక్రియలు
జాతివివక్ష వ్యతిరేకోద్యమ నాయకుడు, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా భౌతికకాయాన్ని శనివారం ప్రిటోరియా నుంచి ఆయన చిన్నప్పుడు గడిపిన కును గ్రామానికి తరలించారు. అంతకుముందు ప్రిటోరియాలో దేశాధ్యక్షుడు జాకబ్ జుమా, ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ నేతలు ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం భౌతికకాయాన్ని ప్రత్యేక విమానంలో థాథా పట్టణానికి తీసుకెళ్లి, అక్కడి నుంచి అధికార లాంఛనాలతో కును వరకు అంతిమయాత్ర నిర్వహించారు. 31 కి.మీ సాగిన యాత్ర జనసంద్రాన్ని తలపించింది. అభిమానులు తమ ప్రియతమ నేతను తలచుకుంటూ పాటలు పాడారు. మండేలా అంత్యక్రియలు ఆదివారం ఆయన తెగ హోసాకు చెందిన శ్మశానంలో జరుగుతాయి.