Parsi
-
నీతా అంబానీ లుక్: వందేళ్లకు పైగా చరిత్ర, తయారీకి రెండేళ్లు
వివాహాలు, ప్రత్యేక సందర్భాలలో పార్సీ మహిళలు గారా చీరలను ధరించేవారు. అత్యంత ఖరీదైనదిగా పేరొందిన ఈ ఎంబ్రాయిడరీని కొన్ని ప్రత్యేక రోజులకే పరిమితం చేయకూడదని నేడు సృజనాత్మకంగా దుపట్టాలు, లెహంగాలు, ఇండోవెస్ట్రన్ డ్రెస్సుల మీదకు తీసుకు వస్తున్నారు. భారతదేశం నుండి పార్సీలు వాణిజ్యం కోసం చైనాకు ప్రయాణించే రోజుల్లో ‘గారా’ ఎంబ్రాయిడరీ మన దేశంలోకి అడుగుపెట్టింది. పార్సీలు మన దేశం నుండి నల్లమందు, పత్తిని చైనాకు తీసుకెళ్లి, అక్కడి టీ కోసం మార్పిడి చేసేవారు. బ్రిటిష్ వారు ఐరోపాలో ఎక్కువ టీని అమ్మాలనుకోవడంతో పార్సీలు త్వరగా వ్యాపారంలో ధనవంతులయ్యారు. వారు తిరిగి వచ్చేటప్పుడు చైనాలో అందుబాటులో ఉన్న సిరామిక్స్, వివిధ ప్రాచీన వస్తువులను కూడా తీసుకు వచ్చేవారు. ఒక వ్యాపారి కళాత్మకంగా ఉండే ఆ ఎంబ్రాయిడరీ ముక్కను ఒకటి తీసుకువచ్చాడన్నది చరిత్ర. ఆ ఎంబ్రాయిడరీ లో రకరకాల మార్పులు చేసి, తదుపరి కాలంలోపార్సీ మహిళల చీరల మీద వైభవంగా వెలిసింది. ముంబైలో స్థిరపడిన పార్సీ సమాజం చాలా ధనవంతులుగా, గారా చీరలు వారి సిగ్నేచర్‌గా మారిపోయాయి. ఆ విధంగా పార్సీ గారా అనే పేరు స్థిరపడిపోయింది.‘గారా’ ఎంబ్రాయిడరీలో పోల్కా చుక్కలను, సాలీడులా అనిపించే మోటిఫ్స్ కనిపిస్తాయి. పక్షులు, వృక్షజాలం, జంతుజాలం.. వంటివి ఈ ఎంబ్రాయిడరీలో ఒద్దికగా కనిపిస్తాయి. అచ్చమైన పట్టు దారాలతో సంక్లిష్టంగా ఉండే ఈ డిజైన్‌తో చీర రూ పొందించాలంటే కళాకారులకు కొన్ని నెలల సమయం పడుతుంది. అందుకే ఈ ఎంబ్రాయిడరీ అత్యంత ఖరీదైనదిగా పేరొందింది.ఇదీ చదవండి: వేసవిలో మెరిసే చర్మం : అద్భుతమైన మాస్క్లునాటి రోజుల్లో ఈ ఎంబ్రాయిడరీకి సాలిఘజ్’ అని పిలిచే ప్రత్యేక ఫ్యాబ్రిక్‌ను ఎంపిక చేసుకునేవారు.. 1930లలో ఈ ఫ్యాషన్ వెలుగు చూసింది. తర్వాత 80లలో పునరుద్ధరించబడింది. ముంబైలో పార్సీలు ఈఎంబ్రాయిడరీని మందపాటి పట్టు ఫ్యాబ్రిక్ పైనే డిజైన్ చేసేవారు. ఇప్పుడు క్రేప్, జార్జెట్, షిఫాన్ ఫ్యాబ్రిక్లను ఉపయోగిస్తున్నారు. డిజైన్‌కి పెద్దమొత్తంలో పట్టుదారాలు ఉపయోగిస్తారు కాబట్టి కొన్ని ఫ్యాబ్రిక్స్ ఈ ఎంబ్రాయిడరీ బరువును మోయలేవు. దాదాపు 40–50 సంవత్సరాల క్రితం ట్రెండ్‌లో ఉన్న ఈ కళ ఇప్పుడు మళ్లీ కళగా వెలుగులోకి రావడం చూస్తుంటే టైమ్‌లెస్ ట్రెడిషన్ అనిపించకమానదు. తరతరాలుగా చేతులు మారే ఆభరణాలలా పార్సీ‘గారా’ అనే ఎంబ్రాయిడరీని అత్యున్నతమైన వారసత్వ సంపదగా పేర్కొంటారు. గాజ్ లేదా పాజ్ అనే అందమైన పట్టు వస్త్రంపై రూపొందించే ఈ ఎంబ్రాయిడరీ సంప్రదాయ వేడుకలలో వైభవంగా వెలిగిపోతుంటుంది. వందేళ్లకు పైగా ప్రాచీన చరిత్ర కల ‘గారా’ డిజైన్ నేడు సెలబ్రిటీలకు ఇష్టమైన ఎంపిక అయ్యింది. ఇదీ చదవండి: వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? బెస్ట్ టిప్స్ ఇవే!ఇటీవల హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న నీతా అంబానీ పార్సీ గారా శారీలో మెరిసి, మరోసారి వారసత్వ సంపదను అందరికీ గుర్తుచేశారు. సంక్లిష్టమైన ఈ హస్తకళ పూర్తి కావడానికి దాదాపు రెండేళ్లు పట్టింది. ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ జెనోబియా ఎస్.దావర్ ఈ చీర రూపకర్త. -
దేశాభివృద్ధిలో పార్శీలది కీలక పాత్ర: అమిత్ షా
ముంబై: దేశాభివృద్ధిలో పార్శీల సహకారం అపారమైనదని హోం మంత్రి అమిత్ షా చెప్పారు. ఈ ప్రయాణంలో గుజరాతీ వార్తా పత్రిక ‘ముంబై సమాచార్’పాత్ర ప్రశంసనీయమని పేర్కొన్నారు. ‘ముంబై సమాచార్–200 నాటౌట్’డాక్యుమెంటరీ విడుదల సందర్భంగా ఆదివారం ముంబైలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు. ఈ డాక్యుమెంటరీ ఏకకాలంలో 40 దేశాల్లో విడుదలైంది. 200 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ముంబై సమాచార్ ఆసియాలోనే అత్యంత పురాతన వార్తా పత్రికగా నిలిచింది. విశ్వసనీయత కలిగిన జర్నలిజానికి ‘కామా’కుటుంబం మారుపేరుగా నిలిచిందని అమిత్ షా కొనియాడారు. స్వాతంత్య్ర ఉద్యమంలో పోషించిన పాత్ర, నిష్పాక్షిక రిపోర్టింగ్ పత్రిక నిబద్ధతకు, శాశ్వత విజయాలకు రహస్యాలని పేర్కొన్నారు. అందులో వచ్చే ప్రతి వార్తా నిజమేనని జనం నమ్మేవారన్నారు. -
పార్సీల నూతన సంవత్సర వేడుకల్లో.. వింటేజ్ కార్ల ప్రదర్శన!
పార్సీల నూతన సంవత్సర వేడుకలు సికింద్రాబాద్‌లో ఘనంగా జరుపుకున్నారు. గురువారం ఎంజీ రోడ్డులోని ఫైర్ టెంపుల్లో ప్రత్యేక పూజలు చేశారు.ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకుని పార్సీలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన వింటేజ్ కార్ల ప్రదర్శన సందర్శకులను ఆకట్టుకుంది. – రాంగోపాల్‌పేట్ -
సికింద్రాబాద్ : పార్శీల ‘నవ్రోజ్’ నూతన సంవత్సర వేడుకలు (ఫొటోలు)
-
ఇవేం అంత్యక్రియలు? మృతదేహాలను రాబందులకు వదిలేస్తారా!
ఒక్కొ మతం సంప్రదాయానికి అనుగుణంగా అంత్యక్రియలు ఉంటాయి. హిందువలు దహనం చేస్తే, క్రిస్టియన్లు, ముస్లింలు ఖననం చేస్తారు. ఐతే పార్శీలు వద్దకు వచ్చేటప్పటికి అంత్యక్రియలు చాలా విభిన్నంగా ఉటాయి. వారి బంధువులు ఎవరైనా చనిపోతే రాబందులు తినడానికి వదిలిపెట్టేసి వెళ్లిపోతారట. ఇది వారి ఆచారం. ఎన్నో ఏళ్లుగా చేస్తున్నారు. అలా మృతదేహాలను వదిలేసే ప్రదేశాన్ని టవర్ అఫ్ సైలెన్స్ అంటారు. మనం ఎలా అయితే శ్మశానం నిర్మించుకుంటామో అలాగే పార్మీలు మృతదేహాలను విడిచిపెట్టే స్థలాలను టవర్ అఫ్ సైలెన్స్ పేరుతో ఏర్పాటు చేసుకుంటారు. ఎందుకిలా? ఏంటీ ఆచారం అంటే.. పురాతనకాలం నుంచి పార్శీ కమ్యూనిటీ ఈ ఆచారాన్ని పాటిస్తోంది. దీన్ని 'దఖ్మా' అని కూడా పిలుస్తారు వారు. పార్శీలు వారి బంధువులు చనిపోయాక చేయాల్సిన చివరి కార్యక్రమాలు(అంత్యక్రియలు) ఇంత విడ్డూరంగా ఎందుకు చేస్తున్నారంటే?..వారి దృష్టిలో శరీరం ప్రకృతి ఇచ్చిన బహుమతని వారి నమ్మకం. అందుకే మరణాంతరం దాన్ని ప్రకృతికే సమర్పించాలనేది వారి ముఖ్యోద్దేశం. అందుకే వారంతా ఇలా చేస్తారు. ఐతే ఇక్కడో ఆసక్తకరమైన విషయం ఏంటంటే.. ఇలా మృతదేహాలను వదిలేసి ప్రదేశాన్ని.. టవర్ ఆఫ్ సైలెన్స్ పేరుతో పెద్ద ఖాళీ స్థలాన్ని ఎంచుకుని వృత్తాకారా రీతిలో రెండు పెద్ద గోడలు మధ్యలో ఓ పెద్ద బావి వచ్చేలా నిర్మిస్తారు. ఎవరైతే ఈ టవరాఫ్ సైలెన్స్‌ని నిర్మిస్తారో లేదా నిర్మించేందుకు విరాళం ఇస్తారో వారి శవమే ముందుగా ఇక్కడకు వస్తుందట. అందుకు ఆధారాలు ఉన్నాయని పార్శీ మతం గురించి పరిశోధన చేస్తున్నా ప్రాచి మహితా చెబుతున్నారు. కోల్‌కతాలో ఓ వ్యక్తి ఇలానే ఈ టవర్ ఆఫ్ సైలెన్స్‌ని నిర్మించాడని, అప్పుడు ఆయన శవమే ముందుగా అక్కడకు వచ్చిందని చెబుతున్నారు. అలాగే ఆయనకు ఓ కుక్క ఉండేదని, అది ఆయన మీద బెంగతో తిండి మానేయడంతో అతను చనిపోయిన ఏడు రోజుకే ఈ కుక్క చనిపోయింది. దీన్ని కూడా అక్కడకే తీసుకొచ్చి అంత్యక్రియలు చేసినట్లు ప్రాచి చెబుతున్నారు. రాబందువులకు ఆహరం కోసం అని ఇలా చేయడం లేదట వాళ్లు. జీవితం చివరల్లో కూడా దాతృత్యం ఉండేలని చాటి చెప్పేడమే ఈ వినూత్న రీతిలో చేసే అంత్యక్రియలు వెనుక దాగొన్న ప్రధానోద్దేశం. ముందుగా ఆ మృదేహాలు సూర్యుడికి, గాలికి బహిర్గతం అవుతాయి. ఆ తర్వాత రాబందులు లాంటివి పీక్కుని తినగా మిగిలిన ఎముకలు మధ్యలో ఉన్న బావిలో పడిపోతాయి. ఈ బావికి వృత్తాకారంలో రెండు సర్కిళ్లు ఉంటాయి. బాహ్య సర్కిల్లో పురుషుల శవాలు. లోపల సర్కిల్లో మహిళ శవాలు. మధ్యన చిన్నపిల్లల మృతదేహాలను ఉంచుతారు. అవి డికంపోజ్ అయ్యాక మిగిలిన ఎముకలు మధ్యలో ఉన్న బావిలో పడిపోతాయి. ఆ తర్వాత ఏడాదికి రెండేళ్లకొకసారి ఆయా వ్యక్తులు బంధువులు వెళ్లి మిగిలిపోయి ఉన్న అవశేషాలను సేకరించి డిస్పోజ్ చేస్తారు. వాళ్లు ఈ ప్రదేశానికి శవాన్ని తీసుకొచ్చేటప్పుడు తెల్లబట్టలు ధరించి మంత్రాలు జపిస్తారు. అలాగే టవర్ లోపలికి వెళ్లేటప్పుడూ అందరు ఒకేసారి బిగ్గరగా అరుస్తారు కూడా. ఈ టవర్లను నిర్మిచడానికి చాలా పెద్ద ఖాళీ స్థలం కావాల్సి ఉంటుంది. ఐతే ప్రస్తుత జనరేషన్ పార్శీలు దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఈ రోజుల్లో ఇది సరైనది కాదు. ఎందుకంటే ఇప్పుడు నగరాల్లో రాబందులు కూడా ఎక్కువుగా లేవు. దీంతో సంవత్సరాలు తరబడి బహిర్గతమై ఉన్న శవాలు త్వరగా డిస్పోజ్ కావు పైగా కాలుష్యం ఏర్పడుతుంది. దీనివల్ల లేనిపోని అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని పలువురు పార్శీలు ఆందోళన వ్యకం చేస్తున్నారు. ఈ ఆచారాన్ని మార్చాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు కూడా. కానీ పలువురు పార్శీలు మాత్రం ఆఖరి టైంలో ఆ వ్యక్తులకు నిశబ్ధంగా ఇచ్చే గౌరవమని సగర్వంగా చెబుతుండటం గమనార్హం. (చదవండి: దసరా జరుపుకోని ఏకైక గ్రామం! కారణం తెలిస్తే కళ్లు చెమ్మగిల్లుతాయ్!) -
ఫిరోజ్ గాంధీ అంత్యక్రియలు అలా ఎందుకు జరిగాయి? అల్లుని మృతదేహాన్ని చూసి నెహ్రూ ఏమన్నారు?
అది 1960, సెప్టెంబరు 7.. ఫిరోజ్ గాంధీ వారం రోజులుగా ఛాతీ నొప్పితో బాధపడుతున్నారు. ఆ నొప్పి ఇక భరించలేక తన స్నేహితుడైన డాక్టర్ హెచ్ఎస్ ఖోస్లాకు ఫోన్ చేశారు. తరువాత తానే కారు నడుపుతూ ఢిల్లీలోని వెల్లింగ్టన్ ఆస్పత్రికి చేరుకున్నారు. ఆ సమయంలో ఆయన భార్య ఇందిరా గాంధీ ఢిల్లీకి దాదాపు 3 వేల కిలోమీటర్ల దూరంలోని త్రివేండ్రంలో ఉన్నారు. ఈ వార్త తెలియగానే ఇందిర వెంటనే ఢిల్లీ బయలుదేరారు. విమానాశ్రయం నుంచి నేరుగా ఆసుపత్రికి చేరుకున్నారు. 48వ పుట్టినరోజుకు 4 రోజుల ముందు... ఇందిరా గాంధీ ఆ రాత్రంతా ఫిరోజ్ పక్కనే కూర్చున్నారు. ఫిరోజ్ అపస్మారక స్థితిలో ఉన్నారు. సెప్టెంబర్ 8న ఉదయం కొద్దిసేపు స్పృహలోకి వచ్చారు. అయితే ఆయన తన 48వ పుట్టినరోజుకు 4 రోజుల ముందు కన్నుమూశారు. ఫిరోజ్ గాంధీ మృతదేహాన్ని వెల్లింగ్టన్ హాస్పిటల్ నుండి తీన్ మూర్తి భవన్‌కు తీసుకువచ్చారని బెర్టిల్ ఫాక్ తన పుస్తకం ‘ఫిరోజ్ – ది ఫర్గాటెన్ గాంధీ’లో రాశారు. అందరినీ గది నుండి బయటకు వెళ్లిపోవాలని... తీన్ మూర్తి భవన్‌కు చేరుకున్న ఇందిర.. ఫిరోజ్ గాంధీ భౌతికకాయానికి తానే స్నానం చేయించి, అంత్యక్రియలకు సిద్ధం చేస్తానని, ఈ సమయంలో అక్కడ ఎవరూ ఉండకూడదని, అందరినీ గది నుండి బయటకు వెళ్లిపోవాలని కోరారు. తీన్ మూర్తి భవన్‌లోని కింది అంతస్తు నుంచి ఫర్నిచర్ తదితరాలన్నింటినీ తొలగించి, అక్కడ ఫిరోజ్ గాంధీ మృతదేహాన్ని తెల్లటి షీట్‌పై ఉంచి, అందరికీ చివరి చూపు కోసం ఉంచారు. ఫిరోజ్ గాంధీ చివరి దర్శనానికి... బీబీసీ తెలిపిన వివరాల ప్రకారం ఆ రోజుల్లో బ్రిటిష్ నటి, సినీ విమర్శకురాలు మేరీ సెటన్ జవహర్లాల్ నెహ్రూ ఇంటికి అతిథిగా వచ్చినప్పుడు తీన్ మూర్తి భవన్లో ఉండేవారు. జవహర్లాల్ నెహ్రూ, సంజయ్ గాంధీతో కలిసి ఫిరోజ్ గాంధీ మృతదేహాన్ని ఉంచిన గదికి చేరుకున్నారని మేరీ రాశారు. ఆ సమయంలో నెహ్రూ ముఖం పూర్తిగా వాడిపోయింది. ఇందిరా గాంధీ కూడా లోలోపల తీవ్రంగా ఆవేదన చెందున్నారు. ఫిరోజ్ గాంధీ చివరి దర్శనానికి వచ్చిన జనాన్ని చూసి నెహ్రూ ‘ఫిరోజ్ని జనం ఇంతలా ఇష్టపడతారని నాకు తెలియదు’ అని అన్నారు. మొదటిసారి గుండెపోటు వచ్చినప్పుడు... సెప్టెంబర్ 9 ఉదయం, ఫిరోజ్ గాంధీ భౌతికకాయం అంత్యక్రియల కోసం నిగంబోధ్ ఘాట్‌కు తరలించారు. ఫిరోజ్ గాంధీ తనకు మొదటిసారి గుండెపోటు వచ్చినప్పుడు పార్సీ ఆచారాల ప్రకారం తన అంత్యక్రియలు చేయకూడదని తన స్నేహితులకు తెలిపారు. పార్సీ సమాజ ఆచారంలో మృత దేహాన్ని కాల్చడం లేదా పూడ్చివేయడం చేయరు. దీనికి బదులుగా మృతదేహాన్ని ‘టవర్ ఆఫ్ సైలెన్స్’లో ఉంచుతారు. ఇక్కడ డేగలు, కాకులు, జంతువులు ఆ మృతదేహాన్ని ఆహారంగా తీసుకుంటాయి. కాథరిన్ ఫ్రాంక్ తన పుస్తకం ‘ది లైఫ్ ఆఫ్ ఇందిరా గాంధీ’లో ఇలా రాశారు ‘ఫిరోజ్ గాంధీ అంత్యక్రియలు హిందూ ఆచారాల ప్రకారం జరిగినప్పటికీ, ఫిరోజ్ గాంధీ మృతదేహాన్ని దహనం చేసే ముందు కొన్ని పర్షియన్ ఆచారాలను ఇందిర పాటించారు. ‘అహనవేటి’ అధ్యాయం మొత్తం చదివారు. అనంతరం 18 ఏళ్ల రాజీవ్ గాంధీ తన తండ్రి అంత్యక్రియల చితికి నిప్పంటించారు. చితాభస్మాన్ని మూడు భాగాలుగా.. ఫిరోజ్ గాంధీ కుటుంబం చాలా కాలం సూరత్‌లో ఉండేది. తర్వాత ఫిరోజ్ అలహాబాద్ వచ్చాడు. దహన సంస్కారాల అనంతరం అతని చితాభస్మాన్ని మూడు భాగాలుగా విభజించారు. పండిట్ నెహ్రూ సమక్షంలో అలహాబాద్ సంగమంలో ఒక భాగం నిమజ్జనం చేశారు. రెండవ భాగం అలహాబాద్‌లో, మూడవ భాగాన్ని సూరత్‌లోని ఫిరోజ్ పూర్వీకుల స్మశాన వాటికలో ఖననం చేశారు. ఇది కూడా చదవండి: డిజిటల్ విలేజ్ ప్రాజెక్ట్ అంటే ఏమిటి? ఆన్లైన్ సేవలు ఎలా వృద్ధి చెందుతాయి? -
పార్శీల ‘నవ్రోజ్’ నూతన సంవత్సర వేడుకలు (ఫొటోలు)
-
పార్సీల రూటే సపరేటు
ముంబై: అరబ్ పాలకులు ఇరాన్‌పై దాడులు చేయడంతో చాలా మంది పార్సీలు (జొరాస్ట్రియన్లు) భారత్‌కు వలస రావడం తెలిసిందే. అయితే వీరిలో వేలాది మంది ముంబైలో స్థిరపడ్డారు. విశేషమేమంటే ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ఇప్పటికీ రెండు అగ్ని దేవాలయాలు (పార్సీలు అగ్నిని ఆరాధిస్తారు) ఉన్నాయని, దాదాపు 30 వేల మంది జొరాజిస్ట్రియన్ మతాన్ని పాటిస్తున్నారని మెహ్రాన్ సెపెరీ అనే పార్సీ మతస్తుడు తెలిపారు. వర్లిలోని ఎన్ఎస్సీఐ ఆడిటోరియంలో శుక్రవారం నుంచి మొదలైన ప్రపంచ జొరాస్ట్రియన్ మహాసభ సమావేశాల కోసం సెపెరీ టెహ్రాన్ నుంచి ముంబైకి వచ్చారు. టెహ్రాన్‌లోని యాద్ ప్రాంతంలోని పార్సీ ఆలయాన్ని వెయ్యేళ్ల క్రితం నిర్మించారని వెల్లడించారు. అయితే ముంబై పార్సీలతో పోలిస్తే ఇరాన్‌వాసుల సంస్కృతి, ఆచార వ్యవహారాల్లో చాలా తేడాలుంటాయని తెలిపారు. ‘మేం ఫార్సీ భాష మాట్లాడుతాం. ఆహారం కూడా వేరుగా ఉంటుంది. టిర్గాన్ వంటి ప్రత్యేక పండుగలూ జరుపుకుంటాం. వేసవిలో బహిరంగ ప్రదేశాల్లోకి చేరి ఒకరిపై ఒకరం నీళ్లు చల్లుకోవడం ద్వారా టిర్గాన్ సంబరాలు చేసుకుంటాం’ అని వివరించారు. మిగతా పండగలన్నీ అన్ని దేశాల్లో ఒకేలా ఉంటాయన్నారు. అయితే ఇరానీ పార్సీలు మతాంతర వివాహాలను పెద్దగా వ్యతిరేకించడం లేదు. అమెరికాలో ఉంటున్న పార్సీలు ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్‌లోని ప్రపంచ జొరాస్ట్రియన్ చాంబర్ కామర్స్ సహ-వ్యవస్థాపకుడు పర్వీజ్ వజ్రవండ్ అమెరికన్‌ను పెళ్లాడారు. ఇరాన్లో ఎక్కడికి వెళ్లినా తన భార్యకు అంతా ఘనస్వాగతం పలుకుతారని ప్రస్తుతం ముంబైలోనే ఉన్న పర్వీజ్ అన్నారు. పార్సీ జాతిని సంరక్షించాలన్న వాదనను ఆయన తోసిపుచ్చారు. ‘మనమంతా ప్రవక్త జరతుస్త్ర సంతతి వాళ్లమా?’ అంటూ నవ్వేశారు. అయితే మతాంతర వివాహాల వల్ల జొరాస్ట్రియన్ మతం పూర్తిగా అంతరించిపోతుందని భయపడేవాళ్లు కూడా ఉన్నారు. మూడు తరాల తరువాత పార్సీ మతం అంతరించిపోయే అవకాశాలు ఉన్నాయని హూస్టర్ నగరవాసి, సరోష్ మానేక్షా ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్ పార్సీ మహిళలకు సహపూజారులు (మోబెడ్‌యర్స్)గా పనిచేసేందుకు అనుమతి ఉంటుంది. టెహ్రాన్‌లో మోబెడ్‌యర్‌గా పనిచేసే రషిన్ జెహంగిరి వర్లి మహాసభల్లో ప్రసంగించారు. ముంబై పార్సీల మాదిరిగా పాక్ పార్సీలు వేరే మతాల వారిని పెళ్లాడడానికి ఇష్టపడడం లేదు. ముంబై పార్సీ పూజారులు పార్సీ మహిళలు వేరే మతాల వారిని పెళ్లి చేసుకుంటే నవ్‌జోత్ (సంప్రదాయ పెళ్లి) నిర్వహించడానికి అంగీకరిస్తున్నారు. దేవాలయాల్లోకి కూడా రానివ్వడం లేదు. పార్సీ మతాన్ని కాపాడుకోవాలంటే మతాంతర వివాహాలను ప్రోత్సహించకూడదని కరాచీ నుంచి వచ్చిన 21 ఏళ్ల సోహ్రబ్ అన్నారు. ఇంగ్లండ్‌లో మాత్రం పార్సీలు మతాంతర వివాహాలు చేసుకోవడమే కాదు ఇతరులను కూడా తమ దేవాలయాల్లోకి అనుమతిస్తున్నారు. జొరాస్ట్రియన్ మహాసభ సమావేశాలు సోమవారంతో ముగుస్తున్నాయి.