దేశాభివృద్ధిలో పార్శీలది కీలక పాత్ర: అమిత్‌ షా | Parsis made silent but immense contribution to India development says Amit Shah | Sakshi
Sakshi News home page

దేశాభివృద్ధిలో పార్శీలది కీలక పాత్ర: అమిత్‌ షా

Published Mon, Sep 9 2024 5:00 AM | Last Updated on Mon, Sep 9 2024 5:00 AM

Parsis made silent but immense contribution to India development says Amit Shah

ముంబై: దేశాభివృద్ధిలో పార్శీల సహకారం అపారమైనదని హోం మంత్రి అమిత్‌ షా చెప్పారు. ఈ ప్రయాణంలో గుజరాతీ వార్తా పత్రిక ‘ముంబై సమాచార్‌’పాత్ర ప్రశంసనీయమని పేర్కొన్నారు. ‘ముంబై సమాచార్‌–200 నాటౌట్‌’డాక్యుమెంటరీ విడుదల సందర్భంగా ఆదివారం ముంబైలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు.

 ఈ డాక్యుమెంటరీ ఏకకాలంలో 40 దేశాల్లో విడుదలైంది. 200 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ముంబై సమాచార్‌ ఆసియాలోనే అత్యంత పురాతన వార్తా పత్రికగా నిలిచింది. విశ్వసనీయత కలిగిన జర్నలిజానికి ‘కామా’కుటుంబం మారుపేరుగా నిలిచిందని అమిత్‌ షా కొనియాడారు. స్వాతంత్య్ర ఉద్యమంలో పోషించిన పాత్ర, నిష్పాక్షిక రిపోర్టింగ్‌ పత్రిక నిబద్ధతకు, శాశ్వత విజయాలకు రహస్యాలని పేర్కొన్నారు. అందులో వచ్చే ప్రతి వార్తా నిజమేనని జనం నమ్మేవారన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement