
సీతాపూర్: దేశంలో దేవీనవరాత్రులు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. యూపీలోని సీతాపూర్‌లో నవరాత్రుల వేళ విషాదం చోటుచేసుకుంది. అమ్మవారి జాగరణలో కార్యక్రమంలో పాల్గొన్న ఒక యూట్యూబర్ ఆనందంగా నృత్యం చేస్తూ, ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
యూపీలోని సీతాపూర్‌లో నవరాత్రి కార్యక్రమాలను చిత్రీకరించేందుకు వచ్చిన వికాస్ అనే యూట్యూబర్ గుండెపోటుకు గురై మృతి చెందాడు. వికాస్ కుప్పకూలగానే అక్కడ ఒక్కసారిగా గందరగోళం చెలరేగింది. వికాస్ స్నేహితులు వెంటనే అతనిని ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అతనిని పరీక్షించి, గుండెపోటుతో మృతిచెందాడని ధృవీకరించారు.
వికాస్ మృతికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దానిలో వికాస్ హఠాత్తుగా కిందపడిపోవడం, తరువాత అతని స్నేహితులు అతనిని ఆస్పత్రికి తరలించడం కనిపిస్తుంది. వికాస్ షార్ట్ వీడియోలు తీస్తూ ఫేమస్ అయ్యాడు. ఫాలోవర్ల సంఖ్య కూడా అధికంగానే ఉంది. దుర్గా జాగృతి కార్యక్రమంలో పాల్గొనేందుకు స్నేహితులతో పాటు వచ్చిన వికాస్ డీజే ట్యూన్స్‌కు అనుగుణంగా డ్యాన్స్ చేస్తూ అక్కడే కుప్పుకూలిపోయాడు. వెంటనే అతని స్నేహితులు అతనిని దగ్గరలోని పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు వికాస్ చనిపోయినట్లు నిర్ధారించారు. వికాస్ మృతిపై పోలీసులకు తెలియజేయకుండా కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: కిడ్నాపైన బాలుడు శవమై తేలాడు
Comments
Please login to add a commentAdd a comment