Sitapur
-
గుండెపోటుతో యూట్యూబర్ కన్నుమూత
సీతాపూర్: దేశంలో దేవీనవరాత్రులు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. యూపీలోని సీతాపూర్‌లో నవరాత్రుల వేళ విషాదం చోటుచేసుకుంది. అమ్మవారి జాగరణలో కార్యక్రమంలో పాల్గొన్న ఒక యూట్యూబర్ ఆనందంగా నృత్యం చేస్తూ, ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.యూపీలోని సీతాపూర్‌లో నవరాత్రి కార్యక్రమాలను చిత్రీకరించేందుకు వచ్చిన వికాస్ అనే యూట్యూబర్ గుండెపోటుకు గురై మృతి చెందాడు. వికాస్ కుప్పకూలగానే అక్కడ ఒక్కసారిగా గందరగోళం చెలరేగింది. వికాస్ స్నేహితులు వెంటనే అతనిని ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అతనిని పరీక్షించి, గుండెపోటుతో మృతిచెందాడని ధృవీకరించారు. వికాస్ మృతికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దానిలో వికాస్ హఠాత్తుగా కిందపడిపోవడం, తరువాత అతని స్నేహితులు అతనిని ఆస్పత్రికి తరలించడం కనిపిస్తుంది. వికాస్ షార్ట్ వీడియోలు తీస్తూ ఫేమస్ అయ్యాడు. ఫాలోవర్ల సంఖ్య కూడా అధికంగానే ఉంది. దుర్గా జాగృతి కార్యక్రమంలో పాల్గొనేందుకు స్నేహితులతో పాటు వచ్చిన వికాస్ డీజే ట్యూన్స్‌కు అనుగుణంగా డ్యాన్స్ చేస్తూ అక్కడే కుప్పుకూలిపోయాడు. వెంటనే అతని స్నేహితులు అతనిని దగ్గరలోని పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు వికాస్ చనిపోయినట్లు నిర్ధారించారు. వికాస్ మృతిపై పోలీసులకు తెలియజేయకుండా కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారని తెలుస్తోంది. ఇది కూడా చదవండి: కిడ్నాపైన బాలుడు శవమై తేలాడు -
ఇదేనా మీకు నేర్పింది? రిక్షా బోల్తాపడినా ఆగని కలెక్టర్ కాన్వాయ్
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ సీతాపుర్‌లో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. గుంతలమయం, వర్షపు నీటితో కూడిన రోడ్డుపై జిల్లా మెజిస్ట్రేట్ కాన్వాయ్ వెళ్తుండగా.. దానికి ఆటోరిక్షా(ఈ-రిక్షా) సైడ్ ఇవ్వబోయింది. ఈ క్రమంలోనే అదుపుతప్పి బోల్తాపడింది. అందులోని ప్రయాణికులందరు బురద నీటిలో పడిపోయారు. ఇంత జరిగినా కన్వాయ్‌లో వెళ్తున్న అధికారులు, సిబ్బంది మాత్రం ఏమీ పట్టనట్టు అలాగే వెళ్లిపోయారు. కనీసం వాహనం దిగి ఎవరికైనా ఏమన్నా అయిందా అని కూడా చూడలేదు. ఇందుకు సంబంధించిన వీడియోను స్థానికులు ఒకరు ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది వైరల్‌గా మారింది. అధికారుల తీరుపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ఐఏఎస్, ఐపీఎస్ శిక్షణలో నేర్పింది ఇదేనా? సామాన్యులను పట్టించుకోరా అని మండిపడ్డారు. సామాన్యులు నడిరోడ్డుపై కిందపడినా పట్టించుకోని అధికారులు, ఇక ప్రభుత్వ కార్యాలయాలకు పని కోసం వెళ్తే వాళ్లను అసలు పట్టించుకుంటారా? అని ఆవేదన వ్యక్తం చేశారు. Ignore the common people....Is this what civil servants being taught at their training academy after qualifying India's toughest exam ? #IAS #IPS #Sitapur #CivilServices @ChiefSecyUP pic.twitter.com/MHZYP22cxM — Anand Tripathi (@dranandtripathi) October 11, 2022 ఉత్తర్‌ప్రదేశ్‌లో నవంబర్ 15నాటికి గుంతల రోడ్లు ఉండొద్దని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇటీవలే అధికారులను ఆదేశించారు. మెరుగైన రోడ్లు ప్రజల హక్కు అని ఉన్నతస్థాయి సమావేశంలో చెప్పారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఈ ఘటన జరగడం ప్రభుత్వంపై విమర్శలకు దారితీసింది. చదవండి: అశ్రునయనాల మధ్య ములాయం అంత్యక్రియలు -
దారుణం.. ఉపాధ్యాయుడిపై పదో తరగతి విద్యార్థి కాల్పులు
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ సీతాపుర్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. 10వ తరగతి విద్యార్థి తనకు పాఠాలు బోధించే ఉపాధ్యాయుడిపైనే కాల్పులకు తెగబడ్డాడు. నాటు తుపాకీతో స్కూల్‌కి వెళ్లి టీచర్‌పై మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. అయితే అదృష్టవశాత్తు బుల్లెట్ కీలకమైన అవయవాలకు తగలకపోవడం వల్ల ఉపాధ్యాయుడు ప్రాణాలతో బయటపడ్డాడు. తనపై కాల్పులు జరిపిన విదార్థిని టీచర్ ధైర్యంగా ప్రతిఘటించిన దృశ్యాల సీసీటీవీలో నమోదయ్యాయి. ఈ ఘటన చూసి పాఠశాలలోని కొందరు విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. మరికొంత మంది విద్యార్థులు మాత్రం ఉపాధ్యాయుడి వద్దకు చేరుకున్నారు. కాల్పులు జరిపిన విద్యార్థిని పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. తన తోటి విద్యార్థితో గొడవపడినందుకు ఈ విద్యార్థిని టీచర్ మందలించినట్లు తెలుస్తోంది. దీంతో ఆగ్రహం చెందిన అతడు పగ పెంచుకుని ఉపాధ్యాయుడిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు అదనపు ఎస్పీ రాజీవ్ దీక్షిత్ చెప్పారు. వైద్యుల సూచన మేరకు ఉపాధ్యాయుడ్ని లక్నో ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. చదవండి: 21 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు ఇంకా టచ్‌లోనే ఉన్నారు -
ఇళ్లు, గోడలు కూలి 22 మంది మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు పేదల ఉసురు తీశాయి. శుక్రవారం రాజధాని లక్నో, ఉన్నావ్, ఫతేపూర్, సీతాపూర్‌లలో గోడలు, ఇల్లు కూలిన ఘటనల్లో మొత్తం 22 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 9 మంది కూలీలున్నారు. లక్నోలోని దిల్కుషా ఏరియాలో ఆర్మీ కేంద్రం చుట్టూ ప్రహరీ నిర్మాణ పనులు సాగుతున్నాయి. ఈ పనుల్లో పాల్గొంటున్న కూలీలు కొందరు ఆ గోడ పక్కనే గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారు. భారీ వర్షాలతో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత నిర్మాణంలో ఉన్న ప్రహరీ కూలీల గుడిసెలపై కూలిపడింది. శిథిలాల కింద చిక్కుకుని తొమ్మిది మంది చనిపోయారు. గాయపడిన ఒక్కరిని మాత్రం పోలీసులు రక్షించి ఆస్పత్రికి తరలించారు. వీరంతా ఝాన్సీ జిల్లాకు చెందిన వారని అధికారులు తెలిపారు. అదేవిధంగా, ఉన్నావ్ జిల్లా కాంతా గ్రామంలోని ఓ ఇంటి గోడ కూలి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు, ఝాలిహాయ్, కసందా గ్రామాల్లో ఇళ్లు కూలి ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. ఫతేపూర్ జిల్లాలో ముగ్గురు, సీతాపూర్ జిల్లాలో ఒకరు, ప్రయాగ్‌రాజ్‌లో ఇద్దరు చిన్నారులు ఇంటి గోడకూలి మీద పడటంతో ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. లక్నో విషాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంతాపం ప్రకటించారు. -
పక్కా ప్లాన్‌తో భార్యలను హజ్ యాత్రకు పంపాడు.. ఐదో పెళ్లికి రెడీ! ట్విస్ట్!
పెళ్లంటే అందమైన జ్ఞాపకం.. నూతన జీవితానికి నిలువెత్తు సాక్ష్యం. కష్టాల్లోనూ, సుఖాల్లోనూ ఒకరకొకరం తోడుంటామని చేసే వాగ్దానం. అయితే కొంతమంది విచ్చలవిడి జీవితానికి అలవాటు పెళ్లి అనే పవిత్ర బంధానికి కళంకం తీసుకొస్తున్నారు.. ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుంటూ మోసాలకు పాల్పడుతున్నారు. నిత్య పెళ్లికొడుకు, పెళ్లికూతురు బాగోతాలు బయటపడటం అప్పుడప్పుడు చూస్తూనే ఉన్నాం. తాజాగా అలాంటి ఘటనే ఒకటి ఉత్తర ప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చింది. సీతాపూర్‌కు చెందిన 50 ఏళ్ల షఫీ అహ్మద్ అనే వ్యక్తి లప్పటికే నలుగురు మహిళలను వివాహం చేసుకున్నాడు. వీరికి ఏడుగురు సంతానం. కాగా ఇస్లాం మతం బహు భార్యత్వానికి అనుమితిస్తుంది. కొన్ని నిర్ధిష్ట పరిస్థితుల్లో ఒక వ్యక్తి గరిష్టంగా నలుగురు భార్యలను కలిగి ఉండొచ్చు. అయితే నాలుగు పెళ్లి చేసుకున్న షఫీ.. అంతటితో ఆగకుండా అయిదో పెళ్లికి రెడీ అయ్యాడు. ఈ విషయం మిగతా భార్యలకు తెలియకుండా వారిని పక్కా ప్లాన్‌తో హజ్ యాత్రకు పంపాడు. చదవండి: Viral Video: మనతో మాములుగా ఉండదు.. పులిని బెంబేలెత్తించిన ఎద్దు Uttarpradesh: Rest of the wives was sent on #Haj Pilgrimage, Father of 7 children from 2nd wife, was going to do 5th Nikaah (marriage): In Sitapur, the 2nd wife along with the children ßeat up the husband, the new bride absconded. बाकी पत्नियों को हज यात्रा पर +@Uppolice pic.twitter.com/oI0xQRrw1J — Ashwini Shrivastava (@AshwiniSahaya) September 1, 2022 అయితే భర్త మరో పెళ్లి చేసుకుంటున్నాడన్న వార్త తెలుసుకున్న రెండో భార్య.. అతని ఏడుగురు పిల్లలు, బంధువులతో కలిసి పెళ్లి మండపం వద్దకు చేరుకుంది. అక్కడ వధువు తల్లిదండ్రులకు భర్త నిజస్వరూపం చెప్పి పెళ్లిని అడ్డుకున్నారు.. బంధువుల అందరి ముందే భర్తను చితకబాదింది. ఈ కొట్లాటలో నవ వధువు వేదిక నుంచి పరారయ్యింది. విషయం తెలుసుకున్న పోలీసులు.. షఫీ పిల్లలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిత్య పెళ్లికొడును అదుపులోకి తీసుకున్నారు. Uttarpradesh: Rest of the wives was sent on #Haj Pilgrimage, Father of 7 children from 2nd wife, was going to do 5th Nikaah (marriage): In Sitapur, the 2nd wife along with the children ßeat up the husband, the new bride absconded. बाकी पत्नियों को हज यात्रा पर +@Uppolice pic.twitter.com/oI0xQRrw1J — Ashwini Shrivastava (@AshwiniSahaya) September 1, 2022 -
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం
లక్నో: ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేటుకుంది. అవినీతి సహా పలు ఆరోపణలపై జైలు శిక్ష అనుభవిస్తున్న సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత ఆజం ఖాన్‌కు బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి మద్దతుగా నిలిచారు. ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ సర్కారు ఆయనపై కక్ష సాధిస్తోందని ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు పేదలు, దళితులు, ఆదివాసీలు, ముస్లింలను లక్ష్యంగా చేసుకుని రాజకీయ ప్రత్యర్థులను వేధిస్తున్నాయని గురువారం విమర్శించారు. ఈ మేరకు వరుసగా ట్విటర్ వేదికగా ప్రశ్నాస్త్రాలు సంధించారు. ‘యూపీ ప్రభుత్వం తన ప్రత్యర్థులపై నిరంతర ద్వేషపూరిత, ఉగ్రదాడులకు పాల్పడుతూ సీనియర్ ఎమ్మెల్యే మహ్మద్ ఆజం ఖాన్‌ను రెండున్నరేళ్లపాటు జైల్లో ఉంచింది. ప్రజల దృష్టిలో ఇది న్యాయం గొంతు నొక్కడం కాకపోతే ఇంకేంటి?’ అని మాయావతి ప్రశ్నించారు. 88 కేసుల్లో బెయిల్ ఆజం ఖాన్ రెండేళ్లుగా సీతాపూర్ జైలులో ఉన్నారు. ఆయనపై మొత్తం 89 కేసులు పెట్టగా 88 కేసుల్లో బెయిల్ లభించింది. శత్రువుల ఆస్తులను అక్రమంగా స్వాధీనం చేసుకున్న కేసులో బుధవారం అలహాబాద్ హైకోర్టు ఆయనకు తాజాగా బెయిల్ మంజూరు చేసింది. చివరి కేసులో కూడా బెయిల్ మంజూరయ్యాకే జైలు నుంచి ఆజం ఖాన్ విడుదల కానున్నారు. (క్లిక్: అనూహ్యం.. డీజీపీని తప్పించిన సీఎం యోగి) కూల్చివేతలు కరెక్ట్ కాదు కొన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకుని దేశ రాజధాని ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో అధికారులు చేపట్టిన నిర్మాణాల కూల్చివేతలను మాయావతి తప్పుబట్టారు. ‘దేశంలోని పలు రాష్ట్రాల్లో దురుద్దేశపూరితంగా ఆక్రమణల తొలగింపు పేరుతో వలస కార్మికులు, శ్రామిక ప్రజలను భయాందోళనలకు గురిచేస్తూ వారి జీవనోపాధిని లాగేసుకుంటున్న తీరు అనేక ప్రశ్నలను లేవనెత్తడంతోపాటు ఆందోళన కలిగిస్తోంద’ని ఆవేదన వ్యక్తం చేశారు. (క్లిక్: ‘అవార్డ్ వాపసీ’పై బీజేపీ, టీఎంసీ మాటల యుద్ధం) -
శ్రామిక్ రైలులో ఆగిన గుండె
లక్నో: వలస కార్మికులతో వెళుతున్న శ్రామిక్ ప్రత్యేక రైలులో మృతదేహం వెలుగు చూసిన ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. రైల్వే శాఖ ఎస్పీ సుమిత్రా యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. బతుకు దెరువు కోసం వచ్చి చిక్కుకుపోయిన వలస కూలీలను స్వస్థలాలకు చేర్చేందుకు శనివారం సాయంత్రం గుజరాత్‌లోని ధోలా ప్రాంతం నుంచి శ్రామిక్ రైలు లక్నోకు బయలు దేరింది. ముందుగా అందరికీ పరీక్షలు చేసిన తర్వాతే ప్రయాణానికి అనుమతించారు. అయితే రైలు లక్నోకు చేరిన తర్వాత వలస కూలీలందరూ దిగి వెళ్లిపోగా ముప్పై యేళ్ల వ్యక్తి మాత్రం అందులోనే ఉండిపోయాడు. (సీతమ్మ కష్టం తీరింది) అతడు అచేతన స్థితిలో ఉండటం గమనించిన అధికారులు వెంటనే బలరాంపూర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అతడు అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. మృతుడిని యూపీలోని సీతాపూర్ జిల్లాకు చెందిన కన్హయ్యగా గుర్తించారు. అతడి మరణవార్తను కుటుంబ సభ్యులకు చేరవేయగా నేడు ఆసుపత్రికి చేరుకుని మృతదేహాన్ని తీసుకెళ్లనున్నారు. దీనిపై ఎస్పీ సుమిత్రా యాదవ్ మాట్లాడుతూ అతని ఆరోగ్య పరిస్థితి తోటి కార్మికులెవరూ సమాచారం ఇవ్వలేదని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. (స్వస్థలాలకు పంపండి.. మహాప్రభో!) -
జైలులో ఉన్న ఎమ్మెల్యేను కలిసిన బీజేపీ ఎంపీ
లక్నో : ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉన్నావ్ నుంచి ఎంపీగా గెలుపొందిన సాక్షి మహరాజ్.. జైలులో ఉన్న బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌ను పరామర్శించారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచార ఘటన కేసులో సెంగార్ ప్రధాన నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సీతాపూర్ జైలులో ఉన్న సెంగార్‌ను కలిసిన సాక్షి మహరాజు కాసేపు అక్కడే గడిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘చాలా కాలం నుంచి సెంగార్ జైల్లో ఉంటున్నారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు సెంగార్‌కు ధన్యవాదాలు తెలిపేందుకు ఇక్కడికి వచ్చాన’ని తెలిపారు. అయితే లోక్‌సభ ఎన్నికల ప్రచార సమయంలో కూడా సాక్షి మహరాజు ఉన్నావ్‌లోని సెంగార్ ఇంటికి వెళ్లినట్టుగా తెలుస్తోంది. కాగా, సెంగార్ ఇంటికి ఉద్యోగం కోసం వెళ్లిన తనపై ఆయన లైంగిక దాడికి పాల్పడ్డారని ఉన్నావ్ అత్యాచార బాధితురాలు ఆరోపించారు. ఎమ్మెల్యేపై చర్యలు చేపట్టాలని కోరుతూ ఆమె పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసులు మాత్రం ఆమె తండ్రిని అక్రమ ఆయుధాల కేసులో అరెస్ట్ చేశారు. అక్కడ ఆయన చనిపోవడంతో బాధితురాలు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఇంటి వద్ద ఆత్మహత్యాయత్నం చేయడం అప్పట్లో కలకలం రేపింది. ఈ ఘటనపై సీఎం యోగి సిట్ ఏర్పాటు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో ఆ తర్వాత ఈ కేసును సీబీఐకి అప్పగించారు. చివరికి అలహాబాద్ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత సీబీఐ అధికారులు సెంగార్ అరెస్ట్ చేసి.. పొక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. -
బతికి ఉండగానే మహిళకు నిప్పంటించారు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. బతికి ఉండగానే ఓ మహిళకు ఇద్దరు వ్యక్తులు నిప్పటించారు. ఈ ఘటనలో ఆమె శరీరం 60 శాతం మేర కాలిపోయింది. ప్రస్తుతం సీతాపూర్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ మహిళ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. సోదరులైన రాము, రాజేశ్‌లు గత కొంతకాలంగా సదరు మహిళను వేధిస్తున్నారు. కొన్ని రోజుల ముందు ఆ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడగా ఆమె తప్పించుకుంది. ఆమె వెంటనే సమీపంలోని పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లింది. కానీ అక్కడ పోలీసులు ఆమె ఫిర్యాదును స్వీకరించలేదు. దీంతో బాధితురాలి బంధువులు పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేస్తే.. వారు కూడా అదే పోలీసు స్టేషన్‌కు వెళ్లమని సూచించారు. మరోసారి పోలీసు స్టేషన్ వెళ్లిన కూడా ఆమెకు నిరాశే ఎదురయింది. కానీ, అంతలోనే ఘోరం జరిగిపోయింది. తమపై ఫిర్యాదు చేసేందుకు బాధితురాలు ప్రయత్నిస్తుండటంతో నిందితులు ఆమెపై కోపాన్ని పెంచుకున్నారు. ఆదివారం రోజున ఆ మహిళ బాత్రూమ్కు వెళ్లిన సమయంలో నిందితులు ఆమెకు నిప్పంటించారు. ఈ ప్రమాదంలో ఆమె ముఖంతోపాటు, పై భాగం కాలిపోయింది. ఈ విషయం తెలుసుకున్న సీనియర్ పోలీస్ అధికారి సుర్జీత్ పాండే ఆస్పత్రికి చేరుకుని బాధితురాలి బంధువులతో మాట్లాడారు. ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు లైంగిక వేధింపులతో పాటు, హత్యాయత్నం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాధితురాలు ఫిర్యాదు చేసిన స్పందించకుండా విధుల్లో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు. ఈ కేసుపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టామని పాండే తెలిపారు. -
భర్త బతికుండగానే వితంతు పెన్షన్
లక్నో : భర్త బతికుండగానే ఓ వివాహితకు వితంతు పెన్షన్ అందింది. ఇది చూసి నిర్ఘాంతపోయిన ఆమె భర్త ఆరాతీయగా అధికారులు నిర్లక్ష్యం వెలుగు చూసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సితాపుర్ జిల్లాలో చోటుచేసుకుంది. అదే జిల్లాకు చెందిన సందీప్ కుమార్ (22) సతీమణికి ఇటీవల బ్యాంకు ఖాతాలో 3000 జమ అయినట్లు మెసేజ్ వచ్చింది. ఈ డబ్బులెక్కడివని సందీప్ బ్యాంకు అధికారులను సంప్రదించగా.. వితంతు పెన్షన్ స్కీమ్‌లో భాగంగా వచ్చాయని తెలిపారు. తను బతికుండగానే తన భార్యకు వితంతు పెన్షన్ రావడం ఏంటని సందీప్ షాక్‌కు గురయ్యాడు. తన భార్యకే కాకుండా అత్త, మరదలుకు కూడా వారి భర్తలు బతికుండగానే పెన్షన్ వచ్చిందని మీడియాకు తెలిపాడు. ఈ ఘటనపై జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో జిల్లా పరిపాలక అధికారుల నిర్లక్ష్యంపై ఉన్నతాధికారులు దర్యాప్తుకు ఆదేశించారు. దీనికి కారణమైన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
రైలు బోగినే.. ప్రసూతి గదైన వేళ
సీతాపూర్: రైలు బోగే ఆ తల్లికి ప్రసూతి గది అయింది. స్ధానిక రైల్వే పోలీసు ఆమె పాలిట దేవుడయ్యాడు. అధికారులు, తోటి ప్రయాణికుల సాయంతో ఆ మహిళ రైలు బోగిలోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ సంఘటన సోమవారం రాత్రి జననాయక్ ఎక్స్‌ప్రెస్‌లో చోటు చేసుకుంది. రైల్వే అధికారుల వివరాల ప్రకారం సుమన్ దేవీ (30), తన భర్త హరి ఓంతో కలిసి ప్రసవం కోసం ఉత్తరప్రదేశ్‌లోని ఘోరక్‌పూర్‌కి బయలుదేరింది. మార్గమధ్యలో సుమన్ దేవికి నొప్పులు ప్రారంభమయ్యాయి. రైలు సీతాపూర్ చేరుకునే సరికి పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో ఆమె భర్త హరిఓం సీతాపూర్ స్టేషన్ ప్రభుత్వ రైల్వే పోలీసు అధికారి (జీఆర్పీ) సురేష్ యాదవ్‌ని సహాయం చేయవలసిందిగా కోరాడు. అదృష్టవశాత్తు ఆ అధికారి కూడా డాక్టర్ కావడంతో ఆయన వెంటనే స్పందించి తన తోటి మహిళా కానిస్టేబుల్, ఇతర మహిళా ప్రయాణికుల సాయంతో సుమన్ దేవికి రైలు బోగిలోనే ప్రసవం చేశారు. సుమన్ దేవి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ లోపు అధికారులు అంబులెన్స్‌ని ఏర్పాటు చేయడంతో తల్లి, బిడ్డలను సీతాపూర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ ఘటనతో రైలు ఒక గంట ఆలస్యమైంది. రైలులోనే ప్రసవం జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ సల్మా షైక్ (26) అనే మహిళ ముంబై లోకల్ రైలులోనే ప్రసవించింది. సల్మా ఛత్రపతి శివాజీ టెర్మినల్‌కు వెళ్తుండగా ఆమెకు నొప్పులు ప్రారంభమయ్యాయి. వెంటనే సమీప దాదర్ స్టేషన్‌లోని ఒక్క రూపాయి ఆస్పత్రి వైద్యులు వచ్చి ఆమెను పరీక్షించారు. సల్మాకు క్రోనింగ్ మొదలవ్వడంతో ఆస్పత్రికి తీసుకెళ్లే వ్యవధి లేకపోయింది. వెంటనే రైలులోని ఆడవారి కంపార్ట్మెంట్లో ఆమెకు ప్రసవం చేశారు. అనంతరం తల్లీ, బిడ్డలను సమీప కేయీఎమ్ ఆస్పత్రికి తరలించారు. ముంబై లోకల్ రైలులో సల్మా షైక్ బిడ్డతో రైల్వే అధికారులు, వైద్య సిబ్బంది (పాత ఫొటో) -
ఉత్తర్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం
సితాపుర్(యూపీ): ఉత్తర్ ప్రదేశ్‌లోని సితాపుర్లో శుక్రవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు అదుపు తప్పి శారదా కెనాల్లోకి దూసుకెళ్లింది. ఈ సంఘటనలో 9 మంది మృతిచెందగా, 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. -
'రాహుల్ గాంధీకి చేదు అనుభవం'
-
‘నాపై చెప్పులు వేయాలనుకుంటే వేయండి’
సీతాపూర్: దాడులకు భయపడబోనని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. తన యాత్రను అడ్డుకునేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఉత్తర ప్రదేశ్ సీతాపూర్‌లో రోడ్ షో సందర్భంగా తనపై అనూప్ మిశ్రా అనే వ్యక్తి చెప్పు విసరడంపై రాహుల్ స్పందించారు. ‘బీజేపీ, ఆర్ఎస్ఎస్ వారికి నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా. నాపై చెప్పులు వేయాలకుంటే వేయండి. నేను మీకు భయపడను. వెనకడుగు వేయను. బస్సులో రోడ్ షో చేస్తుండగా నాపై ఎవరో విసిరిన చెప్పు నాకు తాకలేదు. నా పక్కనే ఉన్న వ్యక్తి చేతికి తగిలింది. మీ కోపమే మీ బలహీనత అని గుర్తుంచుకోండి. మీరు ఎన్ని దాడులు చేసినా నన్ను ఆపలేరు. విద్వేషం పట్ల నాకు నమ్మక లేదు. ప్రేమ, సౌభ్రాతృత్వం పట్ల నాకు అపార విశ్వాసముంద’ని రాహుల్ గాంధీ అన్నారు. -
రాహుల్ గాంధీకి చేదు అనుభవం.
-
రాహుల్ గాంధీకి చేదు అనుభవం
సీతాపూర్ : కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి సోమవారం చేదు అనుభవం ఎదురైంది. ఉత్తర ప్రదేశ్ సీతాపూర్‌లో రోడ్ షో నిర్వహిస్తున్న రాహుల్ గాంధీపై ఓ ఆగంతకుడు చెప్పు విసిరాడు. ఓపెన్ టాప్ జీపుపై ర్యాలీగా వెళుతున్న ఆయనపై దుండగుడు షూ విసరగా, అది కాస్త రాహుల్ తలకు తగిలింది. కాగా ఈ ఘటనకు సంబంధించి ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని, విచారణ జరిపారు. ఈ సందర్భంగా కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం మళ్లీ రాహుల్ గాంధీ తన రోడ్ షోను కొనసాగించారు. కాగా షూ విసిరిన వ్యక్తి జర్నలిస్ట్ అనూప్ మిశ్రాగా పోలీసులు గుర్తించారు. కాగా వచ్చే ఏడాది జరగబోయే యూపీ అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాహుల్ గాంధీ రాష్ట్రవ్యాప్తంగా కిసాన్ యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. -
వంటగ్యాస్ కోసం మళ్లీ పెళ్లా?
45 ఏళ్ల పుత్తిలాల్ గౌతం నిరుపేద దళితుడు. భార్య చనిపోయింది. నలుగురు పిల్లలు ఉన్నారు. రెక్కల కష్టం మీద బతికే దినసరి కూలీ అయిన పుత్తిలాల్ కు ఇప్పుడో వింత కష్టం వచ్చి పడింది. ఇన్నాళ్లు పుత్తిలాల్ ఇంట్లో ఉన్నది కట్టెలపొయ్యి మాత్రమే. ఇప్పుడు ఉచిత వంటగ్యాస్ కనెక్షన్ పొందాలంటే ఆయన మరో పెళ్లి చేసుకోవాల్సిన అగత్యం ఏర్పడింది. గ్యాస్ సిలిండర్ కోసం మాకు సవతి తల్లిని తీసుకొస్తావా? అంటూ పిల్లలు తండ్రి రెండోపెళ్లికి నిరాకరిస్తున్నారు. దీంతో ఏం చేయాలో తోచక పుత్తిలాల్ డైలామాలో పడిపోయారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) పథకం కింద ఉచిత గ్యాస్ కనెక్షన్ పొందాలంటే ప్రభుత్వ నిబంధనలప్రకారం పుత్తిలాల్ కు భార్య ఉండాలి. అతని కూతుళ్లు చిన్నవారు కావడంతో వారు గ్యాస్ కనెక్షన్ కు దరఖాస్తు చేసుకునే వయస్సు రాలేదు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ సీతాపూర్ జిల్లాలోని జుధువురా గ్రామానికి చెందిన పుత్తిలాల్ ఉచిత గ్యాస్ కనెక్షన్ కోసం స్థానిక ఎల్పీజీ డీలర్ చుట్టు కాళ్లు అరిగేలా తిరుగుతున్నాడు. అయినా స్థానిక డీలర్ నిబంధనలు అనుమతించవంటూ అతన్ని తిప్పి పంపుతున్నాడు. 'సరైన ధ్రువపత్రాలను మీ భార్యకు ఇచ్చి పంపండి. అప్పుడు గ్యాస్ కనెక్షన్ ఇస్తామని వారు చెప్తున్నారు. నా భార్య చనిపోయింది. నాకు నలుగురు పిల్లలు ఉన్నారు. వారి బాగోగులు నేను చూసుకోవాలి అని చెప్పినా వారు వినిపించుకోవడం లేదు. నిబంధనలు ఒప్పుకోవాలని తేల్చిచెప్తున్నారు' అని పుత్తిలాల్ 'హిందూస్థాన్ టైమ్స్' పత్రికకు తెలిపారు. -
హా! చూస్తుండగానే.. కుప్పకూలింది!!
అది రెండు అంతస్తుల భవనం. నిన్నమొన్నటిదాక దానిని హోటల్‌గా వినియోగించారు. కానీ, తాజాగా కూలగొట్టాలని నిర్ణయించినట్టు కనిపిస్తుంది. కొంతమేరకు కూలగొట్టారు కూడా. జేసీబీ పక్కనే ఉంది. కొంతమంది జనం ఆ భవనం సమీపంలో తచ్చాడుతూనే ఉన్నారు. ఇంతలో ఎవరూ ఊహించనివిధంగా ఈ రెండంతస్తుల బంగ్లా కూలికుప్పలైంది. క్షణాల్లో భవనం నేలకూలి శిథిలాల కుప్పగా మారింది. అనూహ్యరీతిలో రెప్పపాటులో భవనం కూలి.. దుమ్ము రేగింది. ఇలా కూలుతుందని దానికి చేరువగా ఉన్నవారు అనుకొని ఉండరు. ఒక్కసారి పెళపెళరావాలు చేస్తూ అది కూలడంతో అక్కడున్న వారు భయంతో కేకలు పెడుతూ పరిగెత్తారు. జాగ్రత్తగా ఉండటం వల్ల అదృష్టవశాత్తు ఎవరికీ గాయాలు కాలేదు. ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌లో మంగళవారం ఈ ఘటన జరిగింది. రెండతస్తుల ఓ హోటల్ భవనం చూస్తుండగానే నాటకీయరీతిలో కూలి శిథిలాలుగా మారింది. ఈ వీడియో ఆన్లైన్లో ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నది. -
ఈవ్ టీజింగ్ చేస్తూ బాలికను కాల్చేశాడు!
సీతాపూర్: ఓ మైనర్ బాలికను తరచూ వేధిస్తున్న ఓ ఆకతాయి.. ఆమెను కాల్చిచంపిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఒకడు పరారీలో ఉన్నాడు. యూపీలోని సీతాపూర్‌లో ఇంటి పనులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తుంది 15 ఏళ్ల ప్రింకీ. ఆమెను కుల్దీప్ తరచూ వెంటపడి వేధిస్తుండేవాడు. ఈ క్రమంలో మంగళవారం ప్రింకి తన చెల్లెలితో కలిసి ఇంటికి వస్తుండగా.. మాటువేసిన కులదీప్, అతని ఇద్దరు స్నేహితులు పుజారీ, లోకేష్ వాళ్లను అడ్డగించారు. ఈసారి కూడా బాలికను మళ్లీ వేధించిన కులదీప్.. ఏకంగా ఆమెను తనతో తెచ్చుకున్న తుపాకీతో కాల్చాడు. అక్కడికక్కడే ఆమె మృతి చెందింది. ప్రింకీ సోదరి, తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కులదీప్, పుజారీలను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న లోకేష్ కోసం గాలిస్తున్నారు. -
పెళ్లికొడుకును కాల్చి చంపారు..
లక్నో: ఉత్తరప్రదేశ్ సీతాపూర్‌లో వివాహ వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. ఊరేగింపుగా వివాహ వేదికకు వస్తున్న వరుడు అమిత్ రస్తోగి (28)ని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. దీంతో మరికొద్ది నిమిషాల్లో బాజా భజంత్రీలతో మార్మోగాల్సిన వివాహ వేడుక కాస్తా బంధువుల రోదనలతో శోకసంద్రంలా మారిపోయింది. వివరాల్లోకి వెళితే స్థానిక ప్రేమ్ నగర్‌లోని గెస్ట్ హౌస్ బుధవారం పెళ్లి వారితో సందడిగా ఉంది. పెళ్లి బారాత్‌లో పెళ్లికొడుకు గుర్రంపై ఊరేగుతూ తరలి వస్తున్నాడు. ఇంతలో ఏమైందో ఏమో తెలియదు గానీ వరుని తరపు నుంచి వచ్చిన కొంతమంది వ్యక్తులు విచక్షణా రహితంగా కాల్పులు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఒక బుల్లెట్ వరుడు అమిత్ తలలోకి దూసుకుపోయింది. దీంతో ఒక్కసారిగా అక్కడ కలకలం రేగింది. పెళ్లికొచ్చిన అతిథులు ప్రాణభయంతో పరుగులు తీశారు. కాగా స్పృహ తప్పిపడిపోయిన అతడిని లక్నోలోని ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే అమిత్ మరణించాడని వైద్యులు ధృవీకరించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. హంతకుల ఆచూకీ కోసం పెళ్లి వీడియో ఫుటేజ్‌ను పరిశీస్తున్నారు. -
పొలంలో బాలికపై గ్యాంగ్ రేప్
లక్నో: ఉత్తరప్రదేశ్ సీతాపూర్‌లోని బిశ్వా ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. గడ్డి కోసేందుకు పొలంలోకి వెళ్లిన 13 ఏళ్ల బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం వారు అక్కడి నుంచి పరారైయ్యారు. అయితే గడ్డి కోసేందుకు పొలానికి వెళ్లి యువతి సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఆ క్రమంలో ఆమె కోసం గాలింపు చేపట్టారు. దాంతో బాలిక పొలంలోకి అపస్మారక స్థితిలో ఉండటంతో ఆమెను ఇంటికి తరలించారు. జరిగిన సంఘటనను యువతి కుటుంబ సభ్యులకు వెల్లడించింది. దాంతో వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా నిందితుల్లో ఒకరైనా రోహిత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ సంఘటన బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. -
'గాడ్సేకు గుడి కడితే ఎన్ఎస్ఏ కేసు'
సీతాపూర్(యూపీ): జాతిపిత మహాత్మాగాంధీని హత్యచేసిన నాథూరాం గాడ్సే ఆలయం నిర్మించేందుకు ప్రయత్నిస్తే జాతీయ భద్రతా చట్టం(ఎన్ఎస్ఏ) కింద కేసులు పెడతామని సీతాపూర్ జిల్లా మేజిస్ట్రేట్ ఎల్బీ పాండే హెచ్చరించారు. నాథూరాం గాడ్సే పేరుతో ఎక్కడా ఆలయం నిర్మించినా చర్య తప్పదన్నారు. వచ్చే జనవరి 30న పారా గ్రామంలో గాడ్సేకు గుడి కట్టనున్నట్టు కమలేష్ తివారి అనే వ్యక్తి ఇంతకుముందు ప్రకటించాడు. ఇందుకోసం తనుకున్న భూమిలో కొంత దానం కూడా చేశాడు. ఈ నేపథ్యంలో జిల్లా మేజిస్ట్రేట్ హెచ్చరిక జారీ చేశారు.