హా! చూస్తుండగానే.. కుప్పకూలింది!! | in Sitapur Dramatic visuals of hotel building collapsing | Sakshi

హా! చూస్తుండగానే.. కుప్పకూలింది!!

Published Wed, May 4 2016 4:56 PM | Last Updated on Sun, Sep 3 2017 11:24 PM

హా! చూస్తుండగానే.. కుప్పకూలింది!!

హా! చూస్తుండగానే.. కుప్పకూలింది!!

అది రెండు అంతస్తుల భవనం. నిన్నమొన్నటిదాక దానిని హోటల్‌గా వినియోగించారు.

అది రెండు అంతస్తుల భవనం. నిన్నమొన్నటిదాక దానిని హోటల్‌గా వినియోగించారు. కానీ, తాజాగా కూలగొట్టాలని నిర్ణయించినట్టు కనిపిస్తుంది. కొంతమేరకు కూలగొట్టారు కూడా. జేసీబీ పక్కనే ఉంది. కొంతమంది జనం ఆ భవనం సమీపంలో తచ్చాడుతూనే ఉన్నారు. ఇంతలో ఎవరూ ఊహించనివిధంగా ఈ రెండంతస్తుల బంగ్లా కూలికుప్పలైంది. క్షణాల్లో భవనం నేలకూలి శిథిలాల కుప్పగా మారింది.

అనూహ్యరీతిలో రెప్పపాటులో భవనం కూలి.. దుమ్ము రేగింది. ఇలా కూలుతుందని దానికి చేరువగా ఉన్నవారు అనుకొని ఉండరు. ఒక్కసారి పెళపెళరావాలు చేస్తూ అది కూలడంతో అక్కడున్న వారు భయంతో కేకలు పెడుతూ పరిగెత్తారు. జాగ్రత్తగా ఉండటం వల్ల అదృష్టవశాత్తు ఎవరికీ గాయాలు కాలేదు. ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌లో మంగళవారం ఈ ఘటన జరిగింది. రెండతస్తుల ఓ హోటల్ భవనం చూస్తుండగానే నాటకీయరీతిలో కూలి శిథిలాలుగా మారింది. ఈ వీడియో ఆన్‌లైన్‌లో ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement