'గాడ్సేకు గుడి కడితే ఎన్ఎస్ఏ కేసు' | NSA will be imposed for trying to build Godse temple, says Sitapur DM | Sakshi
Sakshi News home page

'గాడ్సేకు గుడి కడితే ఎన్ఎస్ఏ కేసు'

Published Mon, Dec 29 2014 9:18 PM | Last Updated on Sat, Aug 25 2018 4:14 PM

మహాత్మాగాంధీ - నాథూరామ్ గాడ్సే - Sakshi

మహాత్మాగాంధీ - నాథూరామ్ గాడ్సే

సీతాపూర్(యూపీ): జాతిపిత మహాత్మాగాంధీని హత్యచేసిన నాథూరాం గాడ్సే ఆలయం నిర్మించేందుకు ప్రయత్నిస్తే జాతీయ భద్రతా చట్టం(ఎన్ఎస్ఏ) కింద కేసులు పెడతామని సీతాపూర్ జిల్లా మేజిస్ట్రేట్ ఎల్బీ పాండే హెచ్చరించారు. నాథూరాం గాడ్సే పేరుతో ఎక్కడా ఆలయం నిర్మించినా చర్య తప్పదన్నారు.

వచ్చే జనవరి 30న పారా గ్రామంలో గాడ్సేకు గుడి కట్టనున్నట్టు కమలేష్ తివారి అనే వ్యక్తి ఇంతకుముందు ప్రకటించాడు. ఇందుకోసం తనుకున్న భూమిలో కొంత దానం కూడా చేశాడు. ఈ నేపథ్యంలో జిల్లా మేజిస్ట్రేట్ హెచ్చరిక జారీ చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement