'గాడ్సేకు గుడి కడితే ఎన్ఎస్ఏ కేసు'
సీతాపూర్(యూపీ): జాతిపిత మహాత్మాగాంధీని హత్యచేసిన నాథూరాం గాడ్సే ఆలయం నిర్మించేందుకు ప్రయత్నిస్తే జాతీయ భద్రతా చట్టం(ఎన్ఎస్ఏ) కింద కేసులు పెడతామని సీతాపూర్ జిల్లా మేజిస్ట్రేట్ ఎల్బీ పాండే హెచ్చరించారు. నాథూరాం గాడ్సే పేరుతో ఎక్కడా ఆలయం నిర్మించినా చర్య తప్పదన్నారు.
వచ్చే జనవరి 30న పారా గ్రామంలో గాడ్సేకు గుడి కట్టనున్నట్టు కమలేష్ తివారి అనే వ్యక్తి ఇంతకుముందు ప్రకటించాడు. ఇందుకోసం తనుకున్న భూమిలో కొంత దానం కూడా చేశాడు. ఈ నేపథ్యంలో జిల్లా మేజిస్ట్రేట్ హెచ్చరిక జారీ చేశారు.