పక్కా ప్లాన్‌తో భార్యలను హజ్‌ యాత్రకు పంపాడు.. ఐదో పెళ్లికి రెడీ! ట్విస్ట్‌! | 7 Children Along With Their Mothers Stop Father 5th Marriage At UP | Sakshi
Sakshi News home page

అబ్బ ఛా! ఐదో పెళ్లి కావాలా? రంగంలోకి రెండో భార్య, ఏడుగురు పిల్లలు

Published Thu, Sep 1 2022 12:33 PM | Last Updated on Thu, Sep 1 2022 1:12 PM

7 Children Along With Their Mothers Stop Father 5th Marriage At UP - Sakshi

పెళ్లంటే అందమైన జ్ఞాపకం.. నూతన జీవితానికి నిలువెత్తు సాక్ష్యం. కష్టాల్లోనూ, సుఖాల్లోనూ ఒకరకొకరం తోడుంటామని చేసే వాగ్దానం. అయితే కొంతమంది విచ్చలవిడి జీవితానికి అలవాటు పెళ్లి అనే పవిత్ర బంధానికి కళంకం తీసుకొస్తున్నారు.. ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుంటూ మోసాలకు పాల్పడుతున్నారు. నిత్య పెళ్లికొడుకు, పెళ్లికూతురు బాగోతాలు బయటపడటం అప్పుడప్పుడు చూస్తూనే ఉన్నాం.

తాజాగా అలాంటి ఘటనే ఒకటి ఉత్తర ప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చింది. సీతాపూర్‌కు చెందిన 50 ఏళ్ల షఫీ అహ్మద్‌ అనే వ్యక్తి  లప్పటికే నలుగురు మహిళలను వివాహం చేసుకున్నాడు. వీరికి ఏడుగురు సంతానం. కాగా ఇస్లాం మతం బహు భార్యత్వానికి అనుమితిస్తుంది. కొన్ని నిర్ధిష్ట పరిస్థితుల్లో ఒక వ్యక్తి  గరిష్టంగా నలుగురు భార్యలను కలిగి ఉండొచ్చు. అయితే నాలుగు పెళ్లి చేసుకున్న షఫీ.. అంతటితో ఆగకుండా అయిదో పెళ్లికి రెడీ అయ్యాడు. ఈ విషయం మిగతా భార్యలకు తెలియకుండా వారిని పక్కా ప్లాన్‌తో హజ్‌ యాత్రకు పంపాడు. 
చదవండి: Viral Video: మనతో మాములుగా ఉండదు.. పులిని బెంబేలెత్తించిన ఎద్దు

అయితే భర్త మరో పెళ్లి చేసుకుంటున్నాడన్న వార్త తెలుసుకున్న రెండో భార్య.. అతని ఏడుగురు పిల్లలు, బంధువులతో కలిసి పెళ్లి మండపం వద్దకు చేరుకుంది. అక్కడ వధువు తల్లిదండ్రులకు భర్త నిజస్వరూపం చెప్పి పెళ్లిని అడ్డుకున్నారు.. బంధువుల అందరి ముందే భర్తను చితకబాదింది. ఈ కొట్లాటలో నవ వధువు వేదిక నుంచి పరారయ్యింది. విషయం తెలుసుకున్న పోలీసులు.. షఫీ పిల్లలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిత్య పెళ్లికొడును అదుపులోకి తీసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement