nathuram godse
-
ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ఎంఐఎం పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హనుమాన్ శోభాయాత్రలో గాడ్సే ఫోటో ప్రదర్శించారని మండిపడ్డారు. దేశంలో తొలి టెర్రరిస్టు నాథురామ్ గాడ్సేనేనని.. ఆయన ఫోటోలు ప్రదర్శిస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తాము లాడెన్, హజరీ ఫోటోలు ప్రదర్శిస్తే ఊరుకుంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా ఇటీవల హైదరాబాద్‌లో శ్రీరామనవమి రోజున గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ నిర్వహించిన శోభాయాత్రలో మహాత్మా గాంధీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సే ఫొటో దర్శనం ఇవ్వడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అసదుద్దీన్ స్పందిస్తూ...హనుమాన్ శోభయాత్రలో గాడ్సే ఫొటోలు ప్రదర్శించడం ఏంటని ప్రశ్నించారు. చదవండి: వీడిన సస్పెన్స్.. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఇంచార్జీగా మర్రి రాజశేఖర్ రెడ్డి -
గాడ్సే ఫొటోలతో తిరంగా యాత్ర!
ముజఫర్‌నగర్: పంద్రాగస్టు సందర్భంగా సోమవారం అఖిల భారతీయ హిందూ మహాసభ చేపట్టిన తిరంగా యాత్రలో నాథూరాం గాడ్సే ఫొటోలను ప్రదర్శించడం కలకలం రేపుతోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో జరిగిన ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో మంగళవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనిపై పలు సంఘాల నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే, దీన్ని సంస్థ జాతీయాధ్యక్షుడు యోగేంద్ర వర్మ సమర్థించుకోవడం విశేషం. ‘‘ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మేము తిరంగా యాత్ర చేపట్టాం. జిల్లా మొత్తం ఈ యాత్ర కొనసాగింది. ఇందులో ప్రముఖ హిందూ నేతలంతా పాల్గొన్నారు. మేము పలువురు స్వాతంత్య్ర సమరయోధుల ఫొటోలు పెట్టాం. తిరంగా యాత్రలో మా కార్యకర్తలు ప్రదర్శించిన సమర యోధుల ఫొటోల్లో గాడ్సే కూడా ఉన్నారు. గాంధీ జాతి వ్యతిరేక విధానాలపై గాడ్సే గళం విప్పారన్నది మా విశ్వాసం’’ అని చెప్పుకొచ్చారు యోగేంద్ర వర్మ. ఇదీ చదవండి: కర్ణాటక సీఎం బొమ్మైకి మరో తలనొప్పి.. రాష్ట్ర మంత్రి ఆడియో లీక్! -
వాస్తవాలే లక్ష్యంగా ‘1948 - అఖండ భారత్’
మహాత్మాగాంధీ హత్యకు గురి కావడానికి గల కారణం ఏంటి? హత్య తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ‘1948 - అఖండ భారత్’. ఎమ్.వై.ఎమ్ క్రియేషన్స్ పతాకంపై ఈశ్వర్ బాబు.డి దర్శకత్వంలో ఎంవై మహర్షి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆలేఖ్య శెట్టి, రఘనందన్, ఆర్యవర్ధన్ రాజ్, ఇంతియాజ్ తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్ట్ 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ చిత్ర విడుదలను పుర్కరించుకొని ఏర్పాటు చేసిన ప్రి రిలీజ్ ఈవెంట్ లో డాక్టర్ ఆర్యవర్థన్ రాజు మాట్లాడుతూ... "గాంధీజీని ఎవరు చంపారన్నది అందరికి తెలుసు. కానీ ఎందుకు.. ఏ పరిస్థితుల్లో చంపాల్సి వచ్చింది? దానికి గల కారణాలు ఏమిటి? అనే విషయాలు చాలామందికి తెలియవు. దానికి కారణం... కానీ ఎందుకు.. ఏ పరిస్థితుల్లో చంపాల్సి వచ్చింది? దానికి గల కారణాలు ఏమిటి? అనే విషయాలు చాలామందికి తెలియవు. వాటిని తమ చిత్రంలో చూపించబోతున్నామని చెప్పారు. ‘70 సంవత్సరాల పాటు దాచి పెట్టబడిన నిజాలను... ప్రామాణికంగా పరిశోధన చేసి ఈ సినిమాకి స్క్రిప్ట్ ని సిద్ధం చేశాం... మహాత్మాగాంధీ హత్యకు గురి కావడానికి 45 రోజుల ముందు నుంచి హత్య తదనంతర పరిణామాల నేపధ్యంలో ఈ చిత్రం తెరకెక్కిందని, వివాదాలకు తావులేని రీతిలో- మరుగున పడిపోయిన వాస్తవాలు వెలికి తీయడమే లక్ష్యంగా ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాం' అన్నారు చిత్ర దర్శకుడు ఈశ్వర్ డి.బాబు మాట్లాడుతూ...11,372 పేజీల రీసెర్చ్ పేపర్స్, 350కి పైగా పుస్తకాలు, 750కి పైచిలుకు ఇంటర్వ్యూలు పరిశోధించి... 96 క్యారెక్టర్లు, 114 సీన్స్, 700కి పైగా ప్రొపర్టీస్, 500కి పైగా కాస్ట్యూమ్స్, 500కి పైగా జూనియర్ ఆర్టిస్టులు, 47 లొకేషన్స్ లో, 9 షెడ్యూల్స్ లో... ఉన్నత ప్రమాణాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం’అన్నారు. ఇంత గొప్ప చిత్రాన్ని నిర్మించినందుకు గర్వంగా ఉందని... దర్శకుడు ఈశ్వర్, ఆర్యవర్ధన్ ఈ చిత్రం కోసం ప్రాణం పెట్టి పని చేశారని, హైదరాబాద్ లో ఉన్న సెన్సార్ బోర్డ్... ఈ సినిమా సెన్సార్ చేయడానికి నిరాకరిస్తే... ముంబైలో చేయించామని నిర్మాత ఎమ్.వై. మహర్షి పేర్కొన్నారు. ‘1948 - అఖండ భారత్’ వంటి ప్రతిష్టాత్మక చిత్రానికి పనిచేసే అవకాశం రావడం పట్ల సంగీత దర్శకుడు ప్రజ్వల క్రిష్, ఎడిటర్ రాజు జాదవ్, నటుడు సుహాస్ తదితరులు సంతోషం వ్యక్తం చేశారు. -
ఆగస్టు 12న ‘1948 - అఖండ భారత్’
మహాత్మాగాంధీ హత్యకు గురి కావడానికి గల కారణం ఏంటి? హత్య తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ‘1948 - అఖండ భారత్’. ఎమ్.వై.ఎమ్ క్రియేషన్స్ పతాకంపై ఈశ్వర్ బాబు.డి దర్శకత్వంలో ఎంవై మహర్షి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆలేఖ్య శెట్టి, రఘనందన్, ఆర్యవర్ధన్ రాజ్, ఇంతియాజ్ తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్ట్ 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ చిత్రం విడుదలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్ర నిర్మాత ఎమ్.వై.మహర్షి, దర్శకుడు ఈశ్వర్ డి.బాబు, రచయిత మరియు గాడ్సే పాత్రధారి డా. ఆర్యవర్ధన్ రాజు, సంగీత దర్శకుడు ప్రజ్వల్ క్రిష్, ఎడిటర్ రాజు జాదవ్, నటుడు సుహాస్ పాల్గొన్నారు. నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి... బాలకృష్ణ నటించగా అద్భుత విజయం సాధించిన ‘అఖండ’ తరహాలో విజయం సాధించే చిత్రంగా ‘1948 - అఖండ భారతి’చిత్రాన్ని అభివర్ణించారు. డాక్టర్ ఆర్యవర్థన్ రాజు మాట్లాడుతూ... "గాంధీజీని ఎవరు చంపారన్నది అందరికి తెలుసు. కానీ ఎందుకు.. ఏ పరిస్థితుల్లో చంపాల్సి వచ్చింది? దానికి గల కారణాలు ఏమిటి? అనే విషయాలు చాలామందికి తెలియవు. వాటిని తమ చిత్రంలో చూపించబోతున్నామని చెప్పారు. మహాత్మాగాంధీ హత్యకు గురి కావడానికి 45 రోజుల ముందు నుంచి... హత్య తదనంతర పరిణామాల నేపధ్యంలో ఈ చిత్రం తెరకెక్కిందని, వివాదాలకు తావులేని రీతిలో- మరుగున పడిపోయిన వాస్తవాలు వెలికి తీయడమే లక్ష్యంగా ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాం' అన్నారు! చిత్ర దర్శకుడు ఈశ్వర్ డి.బాబు మాట్లాడుతూ...11,372 పేజీల రీసెర్చ్ పేపర్స్, 350కి పైగా పుస్తకాలు, 750కి పైచిలుకు ఇంటర్వ్యూలు పరిశోధించి... 96 క్యారెక్టర్లు, 114 సీన్స్, 700కి పైగా ప్రొపర్టీస్, 500కి పైగా కాస్ట్యూమ్స్, 500కి పైగా జూనియర్ ఆర్టిస్టులు, 47 లొకేషన్స్ లో, 9 షెడ్యూల్స్ లో... ఉన్నత ప్రమాణాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం" అన్నారు ఇంత గొప్ప చిత్రాన్ని నిర్మించినందుకు గర్వంగా ఉందని... దర్శకుడు ఈశ్వర్, ఆర్యవర్ధన్ ఈ చిత్రం కోసం ప్రాణం పెట్టి పని చేశారని, హైదరాబాద్ లో ఉన్న సెన్సార్ బోర్డ్... ఈ సినిమా సెన్సార్ చేయడానికి నిరాకరిస్తే... ముంబైలో చేయించామని నిర్మాత ఎమ్.వై. మహర్షి పేర్కొన్నారు. -
ఉరి సమయంలో గాడ్సే గొంతు జీరబోయింది!
స్వతంత్ర భారతి 1949/2022 ఘట్టంలో.. పాయింట్ బ్లాంక్‌లో తుపాకీ గురిపెట్టి గాంధీజీపై నాథూరామ్ గాడ్సే మూడుసార్లు కాల్పులు జరిపాక అక్కడున్న ప్రజలంతా ఒక్కసారిగా గాడ్సేపై దాడి చేశారు. అయితే పోలీసులు రావడంతో వారి నుంచి గాడ్సే తప్పించుకున్నాడు. గాడ్సేను అదుపులోకి తీసుకున్న అనంతరం ఈ హత్యలో అతడికి సహకరించిన నిందితుల కోసం పోలీసులు వేట మొదలుపెట్టారు. గాంధీ హత్య ఘటన జరిగిన ఐదు నెలల తర్వాత జడ్జి ఆత్మ చరణ్ నేతృత్వంలో విచారణ ప్రారంభమైంది. ఏడాది తర్వాత 1949, ఫిబ్రవరి 10న కోర్టు తన తీర్పు వెలువరించింది. హిందూ మహాసభ నాయకుడు వీర్ సావర్కర్‌కు కూడా ఈ కుట్రలో భాగం ఉందని తేల్చింది. అయితే సరైన సాక్ష్యాధారాలు లభించని కారణంగా ఆయన బయటపడ్డారు. అనంతరం నాథూరామ్ గాడ్సే, అతడి స్నేహితుడు నారాయణ ఆప్టేలకు కోర్టు ఉరిశిక్ష విధించింది. మిగిలిన ఐదుగురు నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. దీంతో నిందితులు పంజాబ్ హైకోర్టుకు అప్పీలు చేసుకున్నారు. ముగ్గురు న్యాయవాదులతో కూడిన ధర్మాసనం దీనిని విచారించింది. ఇక్కడ కూడా గాడ్సే, ఆప్టేలకు ఉరిశిక్ష విధించాలనే కోర్టు తీర్పునిచ్చింది. ఆ ప్రకారం 1949, నవంబరు 15న వారిద్దరిని అంబాలా జైలులో ఉరితీశారు. ‘‘శిక్ష అమలు కావడానికి ముందు బతికేందుకు తనకు అవకాశం ఇవ్వాల్సిందిగా గాడ్సే కోరాడు. శాంతి గురించి ప్రచారం చేసుకుంటూ దేశ సేవలో తన శేష జీవితాన్ని గడుపుతానని పేర్కొన్నాడు. కానీ గాడ్సేకు ఆ అవకాశం లభించలేదు. ఉరిశిక్ష అమలయ్యే రోజున ఆ ఇద్దరు ఖైదీల చేతులు వెనక్కి మడిచి అధికారులు ఉరికంబం దగ్గరికి తీసుకువచ్చారు. ఈ క్రమంలో తడబడుతూనే గాడ్సే ముందుకు నడిచాడు. విషణ్ణ వదనంతో, భయంతో ఆయన ముఖకవళికల్లో పూర్తి మార్పు కనిపించింది. ఉరికంబం ముందు నిల్చుని గాడ్సే మానసిక యుద్ధం చేశాడు. ధైర్యంగా ఉండేందుకు ప్రయత్నించాడు. ఉరి తీయడానికి కొన్ని క్షణాల ముందు అఖండ భారత్ అంటూ నినదించిన గాడ్సే గొంతు జీరబోయింది. ట్రయల్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ వాదించినప్పుడు ఉన్నంత ధైర్యం అప్పుడు ఆ గొంతులో ప్రతిధ్వనించలేదు’’ అని చరిత్రకారులు కొందరు రాశారు. -
‘‘వై ఐ కిల్డ్ గాంధీ’’ సినిమా విడుదల ఆపండి
ముంబై: మహాత్మాగాంధీ వర్ధంతి రోజైన జనవరి 30న విడుదల కానున్న వై ఐ కిల్డ్ గాంధీ సినిమా విడుదల నిలిపివేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ సినిమాతో జాత్యహంకార పోకడలు పెచ్చుమీరుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోల్ ఒక లేఖ రాశారు. మహాత్ముని మార్గాలైన అహింస, శాంతిని స్మరించుకోవాల్సిన రోజు ఈ సినిమా విడుదల చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఎన్సీపీ ఎంపీ, నటుడు అమోల్ కొల్హె ఈ సినిమాలో మహాత్ముడిని చంపిన నాథూరామ్ గాడ్సే పాత్రని పోషించారు. -
అభ్యంతరకరమైన పోస్టు..: రమేష్ నాయుడు
అమరావతి: నాథూరామ్ గాడ్సేను నిజమైన దేశ భక్తుడిగా అభివర్ణించిన ఏపీ బీజేపీ నేత రమేష్ నాయుడు నాగోతు తన ట్వీట్‌ను డెలిట్ చేశారు. సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ‘‘నా ట్విటర్‌ను హ్యాండిల్ చేస్తున్నవారు అభ్యంతరకరమైన పోస్టు పెట్టారు. దానిని, వారి సేవలను తొలగించడమైనది’’ అంటూ వివరణ ఇచ్చారు. నవంబరు 15న గాడ్సే వర్ధంతిని పురస్కరించుకని.. ‘‘నేడు నాథూరాం గాడ్సే వర్ధంతి. ఈ సందర్భంగా ఆయన పట్ల కృతజ్ఞతాభావం చాటుకుంటున్నా. భరతభూమిలో ముందెన్నడూ ఇలాంటి గొప్ప దేశభక్తుడు జన్మించలేదు’’అని నివాళులు అర్పించారు. (చదవండి: ఇలాంటివి రాసే బాబుకు 23 ఇచ్చారు: సోము) ఈ క్రమంలో నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. జాతిపిత మహాత్మా గాంధీ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ గతంలో రమేష్ నాయుడు చేసిన పోస్టును, గాడ్సేను ప్రశంసిస్తూ చేసిన ట్వీట్‌ను పోలుస్తూ .. రాజకీయాల కోసమే రెండు నాల్కల ధోరణి అవలంబిస్తున్నారా అంటూ ధ్వజమెత్తారు. దీంతో ట్వీట్‌ను డెలిట్ చేయడంతో పాటుగా తన ట్విటర్ ఖాతాను నిర్వహిస్తున్న వారికి కూడా ఉద్వాసన పలికినట్లు రమేష్ నాయుడు మరో ట్వీట్లో పేర్కొన్నారు. నా ట్విట్టర్ ను handle చేస్తున్నవారు అభ్యన్తరకరమైన post పెట్టారు దానిని , వారి సేవలను తొలగించడమైనది 🙏 — Rameshnaidu Nagothu (@RNagothu) November 15, 2020 -
కరెన్సీ నోటు మీద గాడ్సే చిత్రం
భోపాల్: ఓ వ్యక్తి కరెన్సీ నోటు మీద మహాత్మాగాంధీకి బదులు గాంధీని హతమార్చిన నాథూరాం గాడ్సే ఫొటోను ఎడిట్ చేశాడు. అనంతరం దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీనిపై స్పందించిన పోలీసులు వారం రోజుల తర్వాత కేసు నమోదు చేసిన ఘటన మధ్య ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాలు.. ఏబీవీపీ (అఖిల భారతీయ విద్యార్థి పరిషత్)కి చెందిన శివమ్ శుక్లా మే 19న నాథూరాం గాడ్సే జయంతిని పురస్కరించుకుని సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్ట్ పెట్టాడు. (వీడియోలతో బ్లాక్ మెయిలింగ్..) 'నాథూరాం గాడ్సే వర్ధిల్లు గాక' అంటూ రూ.10 నోటుపై మహాత్ముడి చిత్రానికి బదులు నాథూరాం గాడ్సే ఉన్న చిత్రాన్ని ఫేస్బుక్లో షేర్ చేశాడు. "దేశాన్ని నాథూరాం రక్షించాడు" అంటూ ఆ పోస్ట్‌లో పేర్కొన్నాడు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్ఎస్యూఐ(నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా) పోలీసులకు ఫిర్యాదు చేయగా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలింపు చేపట్టామని కొత్వాలీ సిధి పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ ఎస్ఎమ్ పటేల్ తెలిపారు. (ఈ రోజు నా గడువు తీరిందని లేఖలో ..) -
గాడ్సే దేశాన్ని రక్షించారంటూ పోస్ట్
భోపాల్: రూ. 10 కరెన్సీ నోటుపై మహాత్మాగాంధీ బొమ్మ స్థానంలో నాథూరామ్ గాడ్సే బొమ్మను క్లోన్ చేసిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఘటనకు పాల్పడిన వ్యక్తిని అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)తో సంబంధమున్న సిధి జిల్లాకు చెందిన శివమ్ శుక్లాగా గుర్తించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న మధ్యప్రదేశ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహాత్మా గాంధీని చంపిన గాడ్సేను హీరోగా పేర్కొంటూ శుక్లా ఫేస్బుక్లో 'లాంగ్ లివ్ నాథురామ్ గాడ్సే' అంటూ ఒక సందేశాన్ని పోస్ట్ చేశారు. మే 19న గాడ్సే 111 వ జయంతిని పురస్కరించుకొని శివమ్ శుక్లా ఈ పోస్ట్ చేసినట్లు తెలిపారు. మరో పోస్ట్‌లో.. రఘుపతి రాఘవ రాజా రామ్, దేశ్ బచ్చా గే నాథూరాం' (నాథూరాం దేశాన్ని రక్షించారు) అని పేర్కొన్నారు. అదే పోస్ట్‌లో 'శుక్లా గాడ్సేను మహాత్మా' అని సంభోదించి.. 'పూజ్య పండిట్ నాథూరాం గాడ్సే అమర్ రహీన్' అంటూ పోస్ట్ చేశారు. ఇదే విషయంపై నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ (ఎన్ఎస్యూఐ) కాంగ్రెస్ విద్యార్థి విభాగం శుక్లాపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు శుక్లాను గుర్తించడానికి సైబర్ నిపుణుల సహాయం తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ విషయంపై స్పందించిన ఏబీవీపీ.. సంబంధం లేని విషయాల్లో తమ పేరును తప్పుగా వాడుతున్నట్లు కాంగ్రెస్‌పై ఫిర్యాదు చేసింది. కాగా నవంబర్ 15, 1949న 'ఫాదర్ ఆఫ్ ది నేషన్'ను హతమార్చినందుకు గాడ్సేను అంబాలా జైలులో ఉరితీసిన సంగతి తెలిందే. చదవండి: గాడ్సేపై నాగబాబు వివాదాస్పద ట్వీట్ -
నాగబాబు మరో సంచలన ట్వీట్: వైరల్
హైదరాబాద్ : మెగా బ్రదర్, జనసేన నేత నాగబాబు కొణిదెల సోషల్ మీడియాలో రోజుకో సంచలనం సృష్టిస్తున్నారు. ఇటీవలె జాతిపిత మహాత్మ గాంధీజీని హత్యచేసిన నాథూరాం గాడ్సే నిజమైన దేశభక్తుడు అంటూ వివాదస్పద ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. నాగబాబు వ్యాఖ్యలపై గాంధేయవాదులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు భగ్గుమన్నారు. అంతేకాకుండా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. తాజాగా ఈ మెగా బ్రదర్ చేసిన మరో ట్వీట్ వివాదస్పదమవుతోంది. ‘భారత కరెన్సీ నోట్ల మీద సుభాష్ చంద్రబోస్, అంబేద్కర్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, లాల్ బహదూర్, పీవీ నరసింహారావు, అబ్దుల్ కలాం, సావర్కార్, వాజ్‌పేయి లాంటి మహానుభావుల చిత్రాలను కూడా చూడాలని ఉంది. ఎందుకంటే స్వతంత్ర భారత ఆవిర్బావానికి కృషి చేసి మహానుభావులను జనం మర్చిపోకూడదని ఒక ఆశ’ అంటూ ట్వీట్ చేశారు. ‘గాంధీ గారు బతికి ఉంటే ఆయన కూడా తనతో పాటు దేశానికి సేవ చేసి దేశభక్తులని గౌరవించమని తప్పకుండా చెప్పేవారు. దేశం కోసం జీవితాల్ని త్యాగం చేసిన మహానుభావుల పేర్లు తప్ప మొహాలు గుర్తు రావడం లేదు. భావితరాలకు కరెన్సీ నోట్లపై వారి ముఖ పరిచయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది’ అంటూ మరో ట్వీట్లో నాగబాబు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ రెంటు ట్వీట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే నాగబాబు వ్యాఖ్యలపై కొందరు మండిపడుతుండగా మరికొందరు సమర్థిస్తున్నారు. చదవండి: గాడ్సే నిజమైన దేశభక్తుడు పార్టీకి, ఫ్యామిలీకి సంబంధం లేదు : నాగబాబు అక్కినేని ‘మనం’.. ఎన్నేళ్లైనా మరువం -
పార్టీకి, ఫ్యామిలీకి సంబంధం లేదు : నాగబాబు
హైదరాబాద్ : నాథూరాం గాడ్సే దేశభక్తిని శంకించలేమని సినీ నటుడు, జనసేన నాయకుడు నాగబాబు సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఆయన పోస్ట్‌పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి నాగబాబుపై చర్యలు తీసుకోవాలని కొందరు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఈ నేపథ్యంలో తన ట్వీట్‌కు సంబంధించి నాగబాబు వివరణ కూడా ఇచ్చారు. తాజాగా తాను చేసే ట్వీట్లకు సంబంధించి పూర్తి బాధ్యత తనదేనని నాగబాబు తెలిపారు. ఈ మేరకు ట్విటర్లో ఆయన ఓ పోస్ట్ చేశారు.(చదవండి : నాగబాబుపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు) ‘నేను ఏ అంశంపై ట్వీట్ చేసినా.. అది నా వ్యక్తిగత బాధ్యతే. జనసేన పార్టీకిగానీ, మా కుటుంబ సభ్యులకుగానీ నా అభిప్రాయాలలో ఎటువంటి ప్రమేయం లేదు’ అని పేర్కొన్నారు. కాగా, గాడ్సే పుట్టిన రోజున నాగబాబు చేసిన ట్వీట్ వివాదస్పదం కావడంతో ఆయన వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘దయచేసి అందరూ నన్ను అర్థం చేసుకోండి. నేను నాథూరాం గురించి ఇచ్చిన ట్వీట్ లో అతను చేసిన నేరాన్ని సమర్థించలేదు.నాథూరాం వెర్షన్ కూడా జనానికి తెలియాలి అని మాత్రమే అన్నాను.నాకు మహాత్మ గాంధీ అంటే నాకు చాలా గౌరవం.ఇన్ఫాక్ట్ నన్ను విమర్శించే వల్లకన్నా నాకు ఆయనంటే చాలా గౌరవం’ అని పేర్కొన్నారు.(చదవండి : గాడ్సే నిజమైన దేశభక్తుడు) Whatever i tweet on anything,it's my personal responsibility.janasena party or any of my family has no involvement in my opinion — Naga Babu Konidela (@NagaBabuOffl) May 20, 2020 -
నాగబాబుపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్ : జాతిపిత మహాత్మా గాంధీని కించపరిచారంటూ సినీ నటుడు, జనసేన నాయకుడు కొణిదెల నాగబాబుపై టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతారాయ్ పోలీస్ స్టేషన్లో బుధవారం ఫిర్యాదు చేశారు. నాగబాబుపై ఓయూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన అనంతరం మానవతారాయ్ మాట్లాడుతూ.. నాగబాబుకు మతిభ్రమించిందని, ఎర్రగడ్డ ఆస్పత్రికి తరలించాలన్నారు. మానసిక స్థితి బాగాలేకపోవడంతోనే ట్విటర్లో గాంధీని హత్యచేసిన నాథూరాం గాడ్సేను దేశభక్తుడని కొనియాడారని విమర్శించారు. నాగబాబుపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మానవతారాయ్ డిమాండ్ చేశారు. కాగా, మంగళవారం గాంధీని హత్యచేసిన నాథూరాం గాడ్సే జన్మదినం సందర్భంగా నాగబాబు వివాదస్పద ట్వీట్ చేసిన విషయం తెలసిందే. ‘ఈరోజు నాథూరాం గాడ్సే పుట్టిన రోజు. నిజమైన దేశభక్తుడు. గాంధీని చంపడం కరెక్టా కాదా అనేది డిబేటబుల్. అతని వైపు వాదనని ఆ రోజుల్లో ఏ మీడియా కూడా చెప్పలేదు. మీడియా అధికార ప్రభుత్వానికి లోబడి పనిచేసింది. (ఈ రోజుల్లో కూడా చాలా వరకు అంతే). గాంధీని చంపితే అపఖ్యాతి పాలవుతానని తెలిసినా తను అనుకున్నది చేశాడు. కానీ నాథూరాం దేశభక్తిని శంకించలేము. ఆయన ఒక నిజమైన దేశభక్తుడు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయన్ను ఓసారి గుర్తు చేసుకోవాలనిపించింది. పాపం నాథూరాం గాడ్సే. మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్’ అంటూ నాగబాబు ట్వీట్ చేశారు. చదవండి: గాడ్సే నిజమైన దేశ భక్తుడు: నాగబాబు మీకు జీవితాంతం రుణపడి ఉంటాను: ఎన్టీఆర్ ఈ రోజు నాధురాం గాడ్సే పుట్టిన రోజు.నిజమైన దేశ భక్తుడు.గాంధీ ని చంపడం కరెక్టా కదా అనేది debatable. కానీ అతని వైపు ఆర్గుఎమెంట్ ని ఆ రోజుల్లో ఏ మీడియా కూడా చెప్పలేదు.కేవలం మీడియా అధికార ప్రభుత్వానికి లోబడి పనిచేసింది.(ఈ రోజుల్లో కూడా చాలా వరకు ఇంతే).గాంధీ ని చంపితే ..contd pic.twitter.com/WNIpG6gsVO — Naga Babu Konidela (@NagaBabuOffl) May 19, 2020 -
గాడ్సేపై నాగబాబు వివాదాస్పద ట్వీట్
సాక్షి, హైదరాబాద్: జాతిపిత మహాత్మాగాంధీని హత్యచేసిన నాథూరాం గాడ్సేపై సినీనటుడు నాగబాబు వివాదాస్పద ట్వీట్ చేశారు. నాథురాం గాడ్సే దేశభక్తిని శంకించలేమని, ఆయన నిజమైన దేశ భక్తుడని కొనియాడారు. మంగళవారం గాడ్సే జయంతి సందర్భంగా నాగబాబు ట్విటర్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. ఆయన చేసిన ట్వీట్‌పై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ఈ రోజు నాథురాం గాడ్సే పుట్టిన రోజు. నిజమైన దేశ భక్తుడు. గాంధీని చంపడం కరెక్టా కాదా అనేది చర్చనీయాంశం. కానీ అతని వైపు వాదనలను ఆ రోజుల్లో ఏ మీడియా కూడా చెప్పలేదు. కేవలం మీడియా అధికార ప్రభుత్వానికి లోబడి మాత్రమే పనిచేసింది. (ఈ రోజుల్లో కూడా చాలా వరకు ఇంతే). గాంధీని చంపితే ఆపఖ్యాతి పాలవుతానని తెలిసినా తాను అనుకున్నది చేశాడు. నాథురాం దేశభక్తిని శంకించలేము. ఆయన ఒక నిజమైన దేశభక్తుడు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయనని ఒకసారి గుర్తుచేసుకోవాలనిపించింది. పాపం నాథురాం గాడ్సే.. మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్.’ అని ట్విటర్లో అభిప్రాయపడ్డారు. (అందుకే జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేశా) గాడ్సేపై నాగబాబు చేసిన పోస్ట్‌పై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గాంధీని చంపిన వ్యక్తి దేశ భక్తుడు ఎలా అవుతాడు..? అంటూ కొంతమంది ప్రశ్నించగా.. అతను ముమ్మాటికీ హంతకుడేనని మరికొందరు ట్వీట్ చేశారు. ‘ఇంకా నయం డబ్బులు మీద గాంధీ బొమ్మ కాకుండా గాడ్సే బొమ్మ ఉండాలి అని చెప్పలేదు సంతోషం’ అంటూ మరో వ్యక్తి వ్యంగ్యంగా స్పందించారు. -
సుబ్రమణియన్ స్వామి సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : మహాత్మాగాంధీ హత్య కేసును రీ-ఓపెన్ చేయాలంటూ బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణియన్ స్వామి ట్విటర్ వేదికగా సంచలన వాఖ్యలు చేశారు. గాంధీ హత్య కేసును రీఓపెన్ చేసి పునర్విచారణ జరిపించాలని ఆయన కోరారు. గాంధీజీ హత్యపై సుబ్రమణియన్ స్వామి ట్విట్టర్లో వరుస ప్రశ్నలు సంధించారు. గాంధీ మృతదేహానికి ఎందుకు పోస్టుమార్టమ్ నిర్వహించలేదని ప్రశ్నించారు. ప్రత్యక్ష సాక్షులైన అభా, మనులను కోర్టులో ఎందుకు విచారించలేదన్నారు. గాడ్సే కాల్చిన రివాల్వర్‌ను ఇప్పటివరకు ఎందుకు పట్టుకోలేకపోయారని ప్రశ్నించారు. అందుకే కేసును రీఓపెన్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ('కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి బొమ్మ ముద్రిస్తే మేలు') 1st question: Why no post mortem or autopsy on Gandhiji's body? 2nd : Why Abha and Manu as direct eyewitnesses not questioned in court? 3rd: How many empty chambers in Godse's revolver? Italian revolver "untraceable"!! Why? We need to re-open the case — Subramanian Swamy (@Swamy39) February 16, 2020 మరో ట్వీట్లో అసోసియేటెడ్ ప్రెస్ ఇంటర్నేషనల్ జర్నోను ప్రస్తావిస్తూ.. ఆరోజు సాయంత్రం 5.05 గంటలకు అతను 4 బుల్లెట్ శబ్దాలు విన్నాడని చెప్పారు. అయితే గాడ్సే మాత్రం తాను రెండుసార్లు మాత్రమే కాల్చాడని చెప్పాడన్నారు. ఏపీఐ జర్నలిస్టు బిర్లా హౌజ్ వద్ద గాంధీ 5.40గంటలకు చనిపోయాడని చెప్పాడని.. అంటే, 35నిమిషాల పాటు ఆయన బతికే ఉన్నారని అన్నారు. కాగా సుబ్రమణియన్ స్వామి చేసిన ఈ ట్వీట్‌పై నెటిజెన్స్ నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.(ఇమ్రాన్‌ది రోడ్డుపక్క ప్రసంగం) Page 52 quotes Associated Press International journo: he heard at 5.05 pm 4 shots [not 3 as PP in Court later told court]. Godse deposed he fired only 2. Same API journalist said Gandhi declared dead in Birla House at 5.40PM i.e., he was alive for 35 mins. — Subramanian Swamy (@Swamy39) February 16, 2020 కాగా, గతంలోనూ గాంధీ హత్యపై పునర్విచారణ జరిపించాలన్న డిమాండ్లు వినిపించాయి. 2017 అక్టోబర్‌లో ఐటీ ప్రొఫెషనల్ డా.పంకజ్ కుముద్‌చంద్ర ఫడ్నీస్ గాంధీ హత్యపై పునర్విచారణ కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గాంధీ హంతకుడు నాథురామ్ గాడ్సే నాల్గవ బుల్లెట్‌ను కాల్చాడా లేదా అన్న దానిపై కొంత అస్పష్టత ఉన్నందున.. ఈ హత్యను పరిశీలించాల్సిన అవసరం ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. గాంధీ హత్య కేసులో గాడ్సే, దత్తాత్రేయ ఆప్టేలను 15 నవంబర్,1949లో ఉరితీశారని.. దేశంలో సుప్రీం కోర్టు ఏర్పాటుకు 71 రోజుల ముందు ఈ ఘటన జరిగిందని తెలిపారు. అప్పట్లో సుప్రీం కోర్టు లేకపోవడం వల్ల ఈస్ట్ పంజాబ్ హైకోర్టు విధించిన మరణశిక్షను సవాల్ చేసే అవకాశం వారికి లేకుండా పోయిందని పిటిషన్లో పేర్కొన్నారు. అయితే ఈ పిటిషన్‌ను సుప్రీం కొట్టివేసింది. -
మోదీ, గాడ్సేలది ఒకే భావజాలం: రాహుల్
వయనాడ్: ప్రధాని మోదీ, జాతిపిత మహాత్మ గాంధీని కాల్చి చంపిన నాథూరామ్ గాడ్సేది ఒకే రకమైన భావజాలమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. ‘రాజ్యాంగ పరిరక్షణ’ ఉద్యమంలో భాగంగా బుధవారం కేరళలోని కాల్పెట్టాలో రాహుల్ గాంధీ వేలాది మంది పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. మోదీ.. తరహా భావజాలం కలిగిన వాడేనని, కాకపోతే ఆ విషయాన్ని ఒప్పుకునే ధైర్యం మోదీకి లేదని విమర్శించారు. మోదీ ప్రభుత్వంలో యువతకు భవిష్యత్తు లేదని, పాకిస్థాన్ గురించి ప్రధాని ఎంత మాట్లాడినా మన యువకులకు ఉద్యోగాలైతే రావని అన్నారు. -
గాడ్సే – సావర్కర్ల సంబంధం!
ముంబై: మహాత్మాగాంధీ హంతకుడు నాథూరాం గాడ్సేకు, ప్రముఖ హిందూత్వ సిద్ధాంతకర్త వీర్ సావర్కర్‌కు శారీరక సంబంధం ఉందని కాంగ్రెస్ అనుబంధ ‘సేవాదళ్’ పేర్కొనడంపై బీజేపీ, శివసేన మండిపడ్డాయి. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో సేవాదళ్ విడుదల చేసిన ఒక బుక్‌లెట్‌లో ఆ విపరీత వ్యాఖ్యలను పొందుపర్చారు. దీనిపై మహారాష్ట్రలో కాంగ్రెస్ మిత్రపక్షం శివసేన స్పందిస్తూ.. సావర్కర్ గురించి కాంగ్రెస్ నేతల మెదళ్లలో చెత్త ఉందని వ్యాఖ్యానించింది. సావర్కర్ దేశభక్తిని, వీరత్వాన్ని ప్రశ్నించడం ద్వారా వారు తమను తాము కించపర్చుకుంటున్నారని సేన ఎంపీ సంజయ్‌రౌత్ పేర్కొన్నారు. సావర్కర్‌పై వికృతబుద్ధితో చేసిన అర్థపర్థం లేని వ్యాఖ్యలు అవని బీజేపీ పేర్కొంది. కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. వీర్ సావర్కర్: కిత్నే ‘వీర్’! పేరుతో సేవాదళ్ ఆ బుక్లెట్ విడుదల చేసింది. -
సారీ.. రెండోసారి!
న్యూఢిల్లీ: నాథూరాం గాడ్సేను దేశభక్తుడంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ శుక్రవారం రెండుసార్లు లోక్‌సభకు క్షమాపణ చెప్పారు. తాను గాడ్సేను దేశభక్తుడని అనలేదని ఆమె స్పష్టం చేశారు. ఆమె మొదటి సారి క్షమాపణలు చెప్పినప్పుడు ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఆమె అలా చెప్పే బదులు చెప్పకపోతే నయమన్నట్టుగా ఉన్నాయని విపక్షాలు గగ్గోలు పెట్టాయి. ‘నా వ్యాఖ్యలతో కొందరి మనోభావాలు దెబ్బ తిన్నందుకు చాలా విచారిస్తున్నాను. అందుకు క్షమాపణ చెబుతున్నా. అయితే సభలో నేను చేసిన వ్యాఖ్యల్ని వక్రీకరించారు. తప్పుగా అర్థం చేసుకున్నారు’అని ఆమె అన్నారు. తనని ఉగ్రవాది అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ట్వీట్‌ని ఆమె తప్పు పట్టారు. కోర్టు తనని దోషిగా నిర్ధారించకుండా ఉగ్రవాది అని ఎలా అంటారని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు మహిళలు, సా«ధ్విలను అవమానపరచడమేనని అన్నారు. దీంతో ప్రతిపక్షాలు సభా కార్యక్రమాల్ని అడ్డుకున్నాయి. మరోవైపు బీజేపీ రాహుల్‌కి హక్కులు నోటీసు ఇవ్వాలని పట్టుబట్టింది. ఆ తర్వాత స్పీకర్ ఓం బిర్లా చాంబర్లో అన్ని పార్టీల లోక్‌సభ పక్ష నాయకులు హాజరై మరోసారి ప్రజ్ఞా క్షమాపణలు చెప్పాలని తీర్మానించారు. దీంతో ముందుగా తయారు చేసిన క్షమాపణ ప్రకటనను ఆమె చదివి వినిపించారు. ‘నవంబర్ 27న ఎస్పీజీ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా నేను చేసిన వ్యాఖ్యలు ఎవరినైనా బాధిస్తే క్షమాపణ కోరుకుంటున్నా’అని అన్నారు. అయితే తాను గాడ్సేని దేశభక్తుడని అనలేదని మళ్లీ స్పష్టం చేశారు. మహాత్మాగాంధీని తాను ఎప్పుడూ గౌరవిస్తానని, జాతికి ఆయన చేసిన సేవలు సదా స్మరణీయమని అన్నారు. దీంతో సభలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. కాగా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ఎంపీ ప్రజ్ఞా సభా హక్కుల ఉల్లంఘన నోటీసుని లోక్‌సభ స్పీకర్‌కి సమర్పించారు. రైతు కుటుంబాలకు సాయం లేదు ఆత్మహత్యలకు పాల్పడిన రైతులకు చెందిన కుటుంబాలకు సాయం అందించే నిబంధనలేవీ ప్రస్తుత చట్టాల్లో లేవని కేంద్రం ప్రకటించింది. శుక్రవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో వ్యవసాయం, రైతుల సంక్షేమ శాఖ మంత్రి పురుషోత్తం రుపాలా ఈ విషయం తెలిపారు. అయితే, రైతుల పరిస్థితులను మెరుగుపరిచేందుకు రుణాల మంజూరు వంటి అనేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. వైద్యుల కొరత లేదు ► ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ దేశంలో వైద్యుల కొరత, నర్సుల కొరత లేదని ఆరోగ్య శాఖా మంత్రి హర్షవర్ధన్ లోక్‌సభలో వెల్లడించారు. విదేశాలకు వెళ్ళే వైద్యులను బలవంతంగా అడ్డుకోవడం కుదరదన్నారు. క్రమంగా రైల్వే విద్యుదీకరణ పర్యావరణ పరిరక్షణ కోసం భవిష్యత్‌లో అన్ని రైల్వేలైన్లను క్రమేణా విద్యుదీకరిస్తామని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ రాజ్యసభకు చెప్పారు. ప్రైవేటు బిల్లులు బుధవారం? ప్రైవేటు బిల్లులను శుక్రవారం బదులు బుధవారం సభలో ప్రవేశపెట్టేలా చర్యలు తీసుకోవాలంటూ పలువురు ఎంపీలు స్పీకర్‌ను కోరారు. జాతీయ స్థాయి అంశాలు ఉంటే తప్ప ప్రైవేటు బిల్లుల చర్చ కోసం సమయాన్ని తగ్గించకూడదని డిమాండ్ చేశారు. శుక్రవారం ఎంపీలంతా తమ నియోజకవర్గాలకు వెళ్లే హడావిడిలో ఉంటారు గనుక చర్చ పూర్తి స్థాయిలో జరగదని వారు చెప్పారు. -
ఆ కమిటీ నుంచి ప్రజ్ఞా తొలగింపు
న్యూఢిల్లీ: గాంధీజీని హత్య చేసిన నాథూరాం గాడ్సేని లోక్‌సభ సాక్షిగా దేశభక్తుడని కొనియాడిన బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ వ్యాఖ్యలపై బీజేపీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఆమెను రక్షణ సంప్రదింపుల కమిటీ నుంచి తొలగిస్తున్నట్టుగా పార్టీ కార్యనిర్వాహక అ«ధ్యక్షుడు జేపీ నడ్డా గురువారం ప్రకటించారు. ఈ దఫా పార్లమెంటరీ పార్టీ సమావేశాలకు హాజరుకాకూడదని ఆదేశాలు జారీ చేశారు. ఆమెను పార్టీ నుంచి బహిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. పార్లమెంటులో దుమారం ప్రజ్ఞా గాడ్సే వ్యాఖ్యలపై కాంగ్రెస్, ఇతర పక్షాలు మండిపడ్డాయి. ఆరెస్సెస్, బీజేపీ మనసులో ఉన్న మాటలనే ప్రజ్ఞా బయటకు చెప్పిందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. లోక్‌సభలో కాంగ్రెస్ ఈ అంశాన్ని గట్టిగా లేవనెత్తింది. స్పీకర్ ఆమె వ్యాఖ్యల్ని పార్లమెంటు రికార్డుల నుంచి తొలగించామని చెప్పారు. ఇక దీనిపై సభా కార్యకలాపాలను అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ కూడా ప్రజ్ఞా వ్యాఖ్యలు సరైనవి కాదని అన్నారు. దీనిపై సంతృప్తి చెందని కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, ఎన్సీపీ, లెఫ్ట్ పార్టీలు సభ నుంచి వాకౌట్ చేశాయి. ప్రజ్ఞా ఒక ఉగ్రవాది: రాహుల్ అంతకు ముందు రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా ప్రజ్ఞాపై విరుచుకుపడ్డారు. ఆమెని ఒక ఉగ్రవాదిగా అభివర్ణించారు. ‘ఒక ఉగ్రవాదైన ప్రజ్ఞా మరో ఉగ్రవాది గాడ్సేని దేశభక్తుడని చెబుతోంది. భారత పార్లమెంటులోనే ఇదో దుర్దినం. ఆమె వ్యాఖ్యలు బీజేపీ, ఆరెస్సెస్ అసలు సిసలు ఆత్మని ఆవిష్కరిస్తున్నాయి’ అని ట్వీట్ చేశారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా ప్రజ్ఞాను జాతి క్షమించదని ఆమెను బీజేపీ ఎప్పుడు పార్టీ నుంచి తరిమేస్తుందని ప్రశ్నించారు. -
ప్రజ్ఞాసింగ్ వ్యాఖ్యలో ఆంతర్యం ఏమిటి?
సాక్షి, న్యూఢిల్లీ : జాతిపిత మహాత్మా గాంధీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సేను దేశభక్తుడిగా పార్లమెంట్‌లోనే కీర్తించిన బీజేపీ ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌పై క్రమశిక్షణ పేరిట పాలక బీజేపీ పక్షం కంటి తుడుపు చర్యలు చేపట్టింది. ఆమె గాడ్సేను కీర్తించడం ఆశ్చర్యమూ కాదు, ఇదే మొదటి సారి కాదు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల ప్రచారం చేస్తూ ‘గాడ్సే నిజమైన దేశ భక్తుడు’ అంటూ అభివర్ణించారు. అప్పుడే ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాల్సిన బీజేపీ అధిష్టానం, ‘ఆమె అభిప్రాయాలు వ్యక్తిగతమైనవి. ఆ అభిప్రాయాలతో మేం ఏకీభవించడం లేదు’ అని స్పష్టం చేసింది. ‘ఆమె చేసిన వ్యాఖ్యలకు ఆమెను నేనెన్నడూ క్షమించలేను’ అని సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాడు వ్యాఖ్యానించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యకు అసలు అర్థం ఏమిటి? తాజాగా ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్య చేసిన మరునాడు గురువారం నాడు, క్రమ శిక్షణా చర్యల కింద ఆమెను రక్షణ శాఖ పార్లమెంటరీ వ్యవహారాల కమిటీ నుంచి ఆమెను తొలగిస్తున్నామని, ఆమెను ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల నుంచి బహిష్కరిస్తున్నామని బీజేపీ వర్కింగ్ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించడం హాస్యాస్పదం! దొంగకు తాళం చెవిచ్చి, దొంగతనం చేస్తుంటే పట్టుకున్నామని చెప్పడం లాంటిదే ఇది. అసలు ఆమెను పార్లమెంట్లోకే ఎందుకు అనుమతించారు? నరేంద్ర మోదీ నాటి వ్యాఖ్యలకు అసలు అర్థం ఇది కాదా? విజయం సాధించి వచ్చారు కనుక పార్లమెంట్‌లోకి అనుమతించారని సర్దుకోవచ్చు! మరి పార్లమెంటరీ ప్యానెల్లోకి ఎందుకు తీసుకున్నారు? ప్రజ్ఞా ఠాకూర్ ఇప్పటికీ ఓ టెర్రరిజం కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరనే విషయం తెలిసిందే. 2008, మహారాష్ట్రలోని మాలేగావ్‌లో జరిగిన మోటార్ సైకిల్ బాంబు పేలుడు ఘటనలో ఆరుగురు మరణించగా, వంద మందికిపైగా గాయపడ్డారు. ఆ మోటారు సైకిల్ ఆమె పేరుతో రిజిస్టరై ఉండంతోపాటు మరికొన్ని ఆధారాలు దొరకడంతో బాంబు పేలుడు కుట్రదారుల్లో ఒకరిగా ఆమెపై కేసు నమోదు చేశారు. నాటి నుంచి నేటికీ ఆ కేసు నత్తడక నడుస్తూనే ఉంది. అది వేరే సంగతి. కానీ ఠాకూర్ ఇదే నేపథ్యంలో గాడ్సేను టెర్రరిస్టుగా చూడరాదని, ఆయన నిజమైన దేశభక్తుడని వ్యాఖ్యానించారు. అంటే, ఆమె తనను తాను నిజమైన దేశభక్తురాలిగా అంతర్లీనంగా అభివర్ణించుకుంటున్నారేమో! ఆమె వ్యాఖ్యను పలువురు బీజేపీ ఎంపీలు ఆన్లైన్లో సమర్థించడం చూస్తుంటే ఆ పార్టీలోని ద్వంద్వ ప్రమాణాలు కూడా బయటపడుతున్నాయి. -
ఆమెను పార్లమెంటులో అడుగుపెట్టనివ్వరాదు!
న్యూఢిల్లీ : మహాత్మాగాంధీని చంపిన నాథూరాం గాడ్సేను దేశ భక్తుడంటూ సాక్షాత్తూ పార్లమెంట్‌లోనే ప్రశంసలు గుప్పించిన బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజ్ఞా వ్యాఖ్యలపై దుమారం చెలరేగడంతో బీజేపీ కూడా దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఆమెను రక్షణ మంత్రిత్వ శాఖ సలహా కమిటీ నుంచి తప్పించడమే కాకుండా.. ఈ పార్లమెంట్ సమావేశాల వరకూ బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో పాల్గొనకుండా బహిష్కరించింది. మరోవైపు ఆమె వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే ప్రజ్ఞా వ్యాఖ్యలను రాహుల్‌గాంధీ ఖండించగా.. తాజాగా కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ ఎంపీ శశి థరూర్ కూడా స్పందించారు. ప్రజ్ఞాసింగ్ క్షమాపణ చెప్పేవరకు పార్లమెంటులో అడుగుపెట్టనివ్వరాదని డిమాండ్ చేశారు. ‘‘బీజేపీ వాళ్లు ఆమెకు టికెట్ ఇచ్చారు. ఎంపీని చేసి పార్లమెంటులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆమెను పార్లమెంటరీ పార్టీ సమావేశాల నుంచి బహిష్కరించడం వల్ల ఏం లాభం? తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పేవరకు ఆమెను పార్లమెంటులో అడుగుపెట్టనివ్వరాదు. ఈ విషయమై సెన్సార్ మోషన్‌కు మేం డిమాండ్ చేస్తున్నాం’ అని శశి థరూర్ అన్నారు. నాథూరాం గాడ్సేను దేశభక్తుడిగా కొనియాడిన ప్రజ్ఞా సింగ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఉగ్రవాదైన ప్రజ్ఞా సింగ్ మరో ఉగ్రవాది గాడ్సేను దేశభక్తుడని కొనియాడారని, ఇది దేశ పార్లమెంట్ చరిత్రలోనే విచారకరమైన దినమని రాహుల్ ట్వీట్ చేశారు. బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాతోపాటు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రజ్ఞాసింగ్ వ్యాఖ్యలను ఖండించారు. -
లోక్‌సభలో ప్రజ్ఞా వివాదస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజ్ఞా లోక్‌సభలో మాట్లాడుతూ.. మహాత్మా గాంధీని చంపిన నాథూరాం గాడ్సేను దేశభక్తుడిగా అభివర్ణించారు. అయితే ప్రజ్ఞా వ్యాఖ్యలపై విపక్షాలు తీవ్రంగా స్పందించాయి. వివరాల్లోకి వెళితే.. బుధవారం లోక్‌సభలో ఎస్పీజీ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా డీఎంకే ఎంపీ రాజా మాట్లాడుతూ.. మహాత్మా గాంధీని ఎందుకు చంపాడనే దానిపై నాథురామ్ గాడ్సే చేసిన ప్రకటనను ఉదహరించారు. ఈ సమయంలో రాజా ప్రసంగానికి ప్రజ్జా అడ్డుతగిలారు. ‘దేశభక్తి గురించి మీరు సలహాలు ఇవ్వకండి’ అంటూ వ్యాఖ్యానించారు. ప్రజ్ఞా వ్యాఖ్యలతో లోక్‌సభలో ఒక్కసారిగా గందరగోళం చోటుచేసుకుంది. ఆమె వ్యాఖ్యలపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. దీంతో బీజేపీ సభ్యులు కూడా ప్రజ్ఞాను తన స్థానంలో కూర్చోవాల్సిందిగా సూచించారు. అనంతరం ప్రజ్ఞా వ్యాఖ్యలను స్పీకర్ రికార్డుల నుంచి తొలగించారు. గతంలో కూడా ప్రజ్ఞా.. మహాత్మా గాంధీని చంపిన నాథూరాం గాడ్సేను దేశభక్తుడిగా పేర్కొన్న సంగతి తెలిసిందే. విపక్షాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడం, బీజేపీ సైతం ప్రజ్ఙా వ్యాఖ్యలకు మద్దతుగా నిలవకపోవడంతో అప్పుడు ఆమె క్షమాపణ చెప్పారు. కాగా, రాజా మాట్లాడుతూ.. మహాత్మా గాంధీపై 32 ఏళ్లుగా తాను కోపం పెంచుకున్నానని, అందుకే ఆయన్ని చంపానని గాడ్సే ఒప్పుకున్నాడని రాజా చెప్పారు. భద్రత అనేది రాజకీయ కారణాలతో కాదని.. వారికి ఉన్న బెదిరింపులను బట్టి కల్పించాల్సి ఉంటుందని, మాజీ ప్రధానులు ఎస్పీజీ భద్రతను తొలగించడంపై హోం మంత్రి అమిత్ షా పునరాలోచించాలని కోరారు. -
‘గాడ్సేకే భారతరత్న ఇవ్వండి’
నాగపూర్ : వీర్‌సావర్కర్‌కు భారత రత్నను బీజేపీ ప్రతిపాదించడంపై కాంగ్రెస్ నేత మనీష్ తివారి స్పందిస్తూ సావర్కర్‌కు బదులు నాథూరాం గాడ్సేకు ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందించాలని వ్యాఖ్యానించారు. ‘మహాత్మా గాంధీని అంతమొందించేందుకు సావర్కర్ కుట్ర పన్నారనే ఆరోపణలు మాత్రమే వచ్చాయి..అయితే గాడ్సే మాత్రం నేరుగా గాంధీని బలితీసుకున్నారు’ అని పేర్కొన్నారు. ఈ ఏడాది మనం మహాత్మా గాంధీ 150వ జయంతిని జరుపుకుంటున్న క్రమంలో ఎన్డీయే ప్రభుత్వం సావర్కర్‌కు బదులు నేరుగా గాడ్సేకు భారత రత్న ప్రదానం చేయాలని మనీష్ తివారీ ఎద్దేవా చేశారు. మరోవైపు సావర్కర్‌కు భారత రత్న ప్రతిపాదించడంపై కాంగ్రెస్ రషీద్ అల్వీ బీజేపీపై మండిపడ్డారు. తదుపరి భారతరత్న నాథూరాం గాడ్సేకు ఇస్తారని చురకలు వేశారు. సావర్కర్ గాంధీ హత్యకు కుట్రపన్నారని అందరికీ తెలుసని, సరైన ఆధరాలు లేనందునే ఆయనను విడిచిపెట్టారని అలాంటి వ్యక్తికి భారతరత్న ఇస్తామని ప్రభుత్వం చెబుతోందని అలీ ధ్వజమెత్తారు. -
గాంధీ, గాడ్సేపై సభలో దుమారం
సాక్షి, భువనేశ్వర్: ఒడిశా అసెంబ్లీలో కాంగ్రెస్,బీజేపీ శాసనసభ్యుల మధ్య మహాత్మా గాంధీ, నాథూరాం గాడ్సే విషయంలో మాటల యుద్ధం సాగింది. శనివారం శాసనసభలో చర్చలో భాగంగా కాంగ్రెస్ పక్షనేత నరసింహా మిత్ర మాట్లాడుతూ.. బీజేపీ సిద్ధాంతాలపై తీవ్ర ఆరోపణలు చేశారు. జాతిపిత మహాత్మా గాంధీని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, గాంధీని హత్య చేసిన గాడ్సేను ఆర్ఎస్ఎస్ సభ్యులు గౌరవిస్తున్నారని మండిపడ్డారు. దేశ సమగ్రతపై ఆర్ఎస్ఎస్కు గౌరవం ఉంటే నాగపూర్‌లోని ఆ సంస్థ కేంద్ర కార్యాలయంపై జాతీయ జెండాను ఎందుకు ఎగరవేయడంలేదని ప్రశ్నించారు. ఆయన వ్యాఖ్యలపై స్పందించి బీజేపీ పక్షనేత ప్రధిపాట్ కుమార్ నాయక్ ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌కు అసలు దేశ భక్తి లేనేలేదని విమర్శించారు. వందేమాతరం అనడానికి ఆసక్తి చూపరని, రాజ్యాంగంపై కనీసం గౌరవం కూడా వారికి లేదని ధ్వజమెత్తారు. ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై జాతీయ జెండా లేనంతమాత్రనా దేశ భక్తిలేదని అర్థంకాదని వివరించారు. జాతీయ పతాకాన్నితాము తల్లితో సమానంగా భావిస్తామన్నారు. ఇద్దరి వ్యాఖ్యలతో అసెంబ్లీ దద్దరిల్లింది. కాసేపటి తరువాత సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించడంతో వివాదం సద్దుమణిగింది. -
మనం పరమ భక్తులం కదా!
గాంధీని చంపిన 71 సంవత్సరాల తరువాత గాంధీని, హత్యచేసిన గాడ్సేను చిరస్మరణీయులంటున్నాం. ఓం గాంధీ దేవా యనమః అని ఒక చోట అంటుంటే నాథూరాం గాడ్సే నమోస్తుతే అని మరో చోట అంటున్నాం. గాంధీ వల్లనే దేశ విభజన జరిగిందనీ, చాలామంది సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ ను కోరుకున్నా గాంధీ కావాలని నెహ్రూను ప్రథాని చేయడం వల్లనే దేశం అన్ని అనర్థాలకు గురైందని, నెహ్రూ వల్ల పాకిస్తాన్, చైనాలు కాశ్మీర్ భూభాగాన్ని ఆక్రమించుకున్నాయని నమ్మించే ప్రచారం విపరీతం. రాహుల్ గాంధీనుంచి వెనక్కి, ఇంకా వెనక్కి వెళ్లి, ఆయన తండ్రిని తాతను ముత్తాతను, గాంధీని కూడా నిందించడమే ఎజెండా. ఆ వీడియోలు, ఆడియోలు ఉపన్యాసాలు, సోషల్ మీడియాలో గుప్పించారు. ముస్లింలను బుజ్జగించే రాజకీయాలు కాంగ్రెస్ అనుసరించిందని విమర్శలు కూడా పద్ధతి ప్రకారం జనంలో ప్రవేశ పెట్టారు. దక్షిణాదిన కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన సినీ నటుడు కమల్ హాసన్ స్వతంత్ర భారతదేశంలో తొలి టెర్రరిస్టు హిందువనీ, అతని పేరు నాథూరాం గాడ్సే అనీ, ఆరకంగా టెర్రరిజం ప్రారంభమైందని మే 12న తమిళనాడులో చేసిన వ్యాఖ్య సంచలనం కలిగించింది. బీజేపీ తరఫున భోపాల్ నుంచి పోటీ చేసిన, హిందూ టెర్రరిజం నిందితురాలు సా«ధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ దీనికి నాలుగురోజుల తరువాత స్పందించారు. గాంధీని చంపిన గాడ్సే దేశ భక్తుడని, అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ దేశభక్తుడే అని తన భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. ఆమె కమలంతో గెలిచారు. కమల్ పార్టీ ఓడిపోయింది. చిత్రమేమంటే గాడ్సేను మొదటి టెర్రరిస్టు అని వర్ణించిన కమల్ హాసన్ తానే రచించి, నటించి, దర్శకత్వం వహించిన హే రాం అనే సినిమాలో గాంధీని చంపడానికి సాకేత్ రాం అయ్యంగార్ అనే యువకుడు ప్రయత్నించినట్టు చిత్రించారు. 2000 లో వచ్చిన ఈ సినిమాలో సాకేత్ కూడా గాడ్సే వలెనే ఆలోచిస్తుంటాడు. ఈ కాల్పనిక చారిత్రిక చిత్రాన్ని నిర్మించిన కమల్ హాసన్ కొంత వరకు గాడ్సే ఆలోచనలను సమర్థించినట్టే కదా. కనీసం గాడ్సే వలె ఇంకా మరికొందరు ఆలోచించారని చెప్పడానికి ప్రయత్నించినట్టే కదా? సినిమా వ్యాపారం కోసం గాడ్సే ఆలోచనలను సినిమా పొడుగునా సమర్థించి చివరకు మనసు మార్చుకున్నట్టు చూపిన కమల్ హాసన్‌కు గాడ్సే టెర్రరిస్టు అని చెప్పే నైతిక హక్కు ఉందా? సినిమా డబ్బుకోసం, ఎన్నికల ఓట్లకోసం గాడ్సేను వాడుకుంటారా? ఇక హత్యకేసులో నిందితురాలైన ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ దృష్టిలో గాడ్సే దేశభక్తుడు. ఇంకా కేసు ముగియకముందే ఆమెను బీజేపీ తన అభ్యర్థిగా ఎంపిక చేసి భోపాల్ నుంచి గెలిపించుకున్నది. గాంధీని హత్య చేసిన తరువాత కింది కోర్టులో గాడ్సేకు ఉరిశిక్ష పడింది. ఆయన హత్య చేయలేదని బుకాయించలేదు. రుజువులు చాలవని తనను విడుదల చేయా లని లాయర్లకు చెప్పి అబద్దపు వాదనలు చేయించలేదు. ఉరిశిక్షను ధృవీకరించడం కోసం కేసు హైకోర్టుకు వచ్చింది. ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం అప్పీలు విచారించింది. వారిలో ఒక న్యాయ మూర్తి జిడి ఖోస్లా 1965లో ఒక పుస్తకం రచించారు. అందులో గాడ్సే తన చర్యకు పశ్చాత్తాప పడ్డాడనీ, తనకు బతికే అవకాశం ఉంటే శాంతి కోసం కృషి చేస్తానని దేశ సేవ చేస్తానని అనుకున్నారని న్యాయమూర్తి వివరించారు. గాంధీ తన దారి మార్చుకోలేదు. గాడ్సే తన నిర్ణయం మార్చుకోలేదు. 71 ఏళ్ల తరువాత దేన్నయినా మార్చుకునే సామర్థ్యం, సాహసం చేయగల ఇప్పటి ఆధునిక నాయకులతో వారిని పోల్చడానికి వీల్లేదు. కమల్ తన ప్రకటనను మార్చారు. నేను గాడ్సేను టెర్రరిస్టు అనలేదని, తీవ్రవాది అన్నానని కమల్ మాట మార్చారు. ప్రజ్ఞ తన మాట మార్చారు. క్షమాపణలు కోరి ఆ ప్రకటనను ఉపసంహరించుకుంటున్నానని చెప్పారు. ప్రథాన మంత్రికి కోపం వచ్చింది. ప్రజ్ఞను తాను క్షమించబోనని చెప్పారు. ఈ మాట చెప్పడానికి ఎన్నడూ లేంది, డిల్లీలో అయిదేళ్లలో తొలిసారి విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు ప్రథాని. క్షమించడం సంగతి పక్కన బెడితే, ప్రజ్ఞ బీజేపీ ఎంపీగా కొనసాగడం, ఆమెగారు నరేంద్ర మోదీ నాయకత్వాన్ని సమర్థించడం జరిగిపోతూనే ఉంటుంది. మనకు గాంధీతోపాటు గాడ్సే కూడా దేవుడు. గాంధీకి గాడ్సేకు కూడా గుడులు కడతారు. సోనియా గాంధీ, ఖుష్బూ, అమితాబ్, సచిన్‌లకు కూడా గుడులు కడతారు. జనం, ఓటర్లు భక్తులు, ఒకే గాటన పోతూ ఉంటారు. వీళ్లకు ఎడమచేతితో వందమందిని పిట్టల్ని చంపినట్టు చంపే హీరోలు కావాలి. చిటికెలో మాయచేసి సమస్యలు పరిష్కరించే దైవిక శక్తులున్న నాయకులు ఉంటారని వస్తారని, వచ్చా రని వారిచేతుల్లో మంత్రదండాలు ఉంటాయని, వీర బ్రహ్మంగారు వీరిగురించే చెప్పారని, నోస్ట్రాడామస్ చెప్పిందీ ఇదే అని అంటారు. భక్తితో భజనలు చేస్తారు. మనం పరమభక్తులం మరి. మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
గాడ్సే వ్యాఖ్యలు : కమల్‌కు హైకోర్టులో ఊరట
చెన్నై : గాడ్సే వ్యాఖ్యలపై సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ నేత కమల్ హాసన్‌కు మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ సోమవారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. తమిళనాడులోని అరవకురిచ్చిలో ఎన్నికల ప్రచారం సందర్భంగా మహాత్మ గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సే భారత్‌లో తొలి హిందూ ఉగ్రవాది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఓ హిందూ సంస్థకు చెందిన కార్యకర్త ఫిర్యాదు మేరకు కరూర్ జిల్లాలోని అరవకురిచ్చి పోలీసులు కమల్ హాసన్‌పై కేసు నమోదు చేశారు. మతపరమైన విశ్వాసాలను ప్రేరేపించడం, భిన్న గ్రూపులకు చెందిన వారి మధ్య శత్రుత్వాన్ని పెంచడం వంటి అభియోగాలపై కమల్ హాసన్‌పై 153ఏ, 295ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా ప్రజల్లో తనకున్న మంచిపేరును చెడగొట్టేందుకే తనపై కక్షసాధింపునకు దిగుతున్నారని కమల్ హాసన్ ఆరోపించారు. గాడ్సేపై తన వ్యాఖ్యలను కమల్ సమర్ధించుకుంటూ గాంధీ హత్య కేసు విచారణ సందర్భంగా దేశ విభజనకు కారణమైన గాంధీని హిందువైన తాను చంపానని గాడ్సే స్వయంగా అంగీకరించారని చెప్పుకొచ్చారు. తాను గాంధీని ఎందుకు చంపాను అనే పుస్తకంలో సైతం గాడ్సే ఇదే విషయం చెప్పారని అన్నారు. కాగా, ముందస్తు బెయిల్ మంజూరుకు అవసరమైన షరతులకు లోబడతానని కమల్ న్యాయస్దానంలో పేర్కొన్నారు. -
సాధ్విపై సిద్ధూ ఫైర్..!
బెంగళూరు: భోపాల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞా సింగ్‌పై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఫైర్ అయ్యారు. మహాత్మాగాంధీ ప్రాణాలు తీసిన నాథూరాం గాడ్సేను దేశభక్తుడిగా కీర్తించే ప్రతిఒక్కరినీ ఉగ్రవాదిగానే ప్రజలు భావిస్తారని అన్నారు. ‘మహాత్మా గాంధీని హతమార్చిన గాడ్సేను నిజమైన దేశభక్తుడిగా అభివర్ణించిన సాధ్వి ప్రగ్యా సింగ్ ఒక ఉగ్రవాది’ అని వ్యాఖ్యానించారు. గాంధీజీపై ఉన్న అభిమానంతో ప్రజలు ఆయనను ‘మహాత్మా’ అంటూ పిలుస్తారని గుర్తు చేశారు. గాంధీ హంతకున్ని దేశభక్తుంటూ అభివర్ణించిన వారందరూ ఉగ్రవాదుల కోవాలోకే వస్తారని అభిప్రాయపడ్డారు. స్వతంత్ర భారతదేశంలో తొలి ఉగ్రవాది హిందువేనని మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత, నటుడు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం రేగిన సంగతి తెలిసిందే. అదేక్రమంలో గాడ్సేపై అభిప్రాయం తెలపాల్సిందిగా మీడియా అడగడంతో.. ‘గాడ్సే నిజమైన దేశభక్తుడు’ అంటూ అభివర్ణించి సాధ్వి సరికొత్త వివాదానికి తెరతీశారు. ఆమె వ్యాఖ్యలతో బీజేపీ ఇరుకున పడింది. గాడ్సేను కీర్తిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారడంతో.. తప్పు తెలుసుకున్న సాధ్వి క్షమాపణలు కోరింది. నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించిన బీజేపీ ఆమె వివరణివ్వాలని కోరింది. ఇక మహాత్మా గాంధీని అవమానించిన సాధ్విని క్షమించబోనని మోదీ పేర్కొనడం గమనార్హం. -
ఉరికంబం ఎక్కేముందు గాడ్సే ఏమన్నారంటే..
న్యూఢిల్లీ : నేటితో దేశ వాప్తంగా సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగిసింది. మహాత్మా గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సే తొలి హిందూ ఉగ్రవాది అంటూ మక్కల్ నీది మయ్యం అధినేత, సినీ నటుడు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గాంధీని హత్యచేసిన గాడ్సే దేశ భక్తుడిగా భోపాల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ప్రజ్ఞా సింగ్ అభివర్ణించడంతో వివాదం మరింత ముదిరింది. ఈ క్రమంలో గత రెండు రోజుల నుంచి నాథూరామ్ గాడ్సే రెండు జాతీయ పార్టీలకు ప్రధాన ప్రచారాస్త్రంగా మారారు. దీంతో కాంగ్రెస్, బీజేపీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శల పర్వం కొనసాగింది. సాధ్వి వ్యాఖ్యల పట్ల తీవ్ర వ్యతిరేకత రావడంతో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా సహా ప్రధాని మోదీ కూడా రంగంలోకి దిగి వివరణ ఇవ్వాల్సి వచ్చింది. బాపును అవమానించిన ప్రజ్ఞాను ఎంతమాత్రం సహించబోమంటూ ప్రధాని మోదీ కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా. అయితే గాడ్సే దేశ భక్తుడిగా కీర్తిపంబడటం ఇదే తొలిసారి కాదని.. ఆయనను ప్రశంసించిన ప్రజ్ఞాపై విరుచుకుపడుతున్న బీజేపీ శ్రేణులు 1990లో జరిగిన విషయాన్ని మరచిపోయాయేమోనన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 1990లో మహారాష్ట్రలో అధికారంలో ఉన్న బీజేపీ- శివసేన కూటమి ప్రభుత్వ హయాంలో గాంధీని చంపడానికి గల కారణాలను విశ్లేషిస్తూ.. గాడ్సేను నిజమైన దేశ భక్తుడిగా అభివర్ణిస్తూ ఒక నాటకం ప్రదర్శితమైంది. దీంతో కేవలం ప్రజ్ఞాపై చర్యలు తీసుకున్నంత మాత్రాన గాడ్సేపై బీజేపీ స్టాండ్ మారినట్టు కాదని కొంతమంది విమర్శలు చేస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో గాడ్సే గురించి జస్టిస్ జేడీ ఘోస్లా 1965లో రాసిన పుస్తకంలోని కొన్ని ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. ట్రయల్ కోర్టు విధించిన ఉరిశిక్షను సవాలు చేస్తూ గాంధీ హత్యోదంత నిందితులు ఉన్నత న్యాయస్థానంలో దాఖలు చేసిన పిటిషన్ విచారించిన వారిలో ఘోస్లా కూడా ఒకరు. ఈ క్రమంలో మహాత్మా గాంధీ హత్యకు నాథూరామ్ గాడ్సే, అతడి స్నేహితులు కుట్ర పన్నిన విధానం, ఉరికంబం ఎక్కేముందు గాడ్సే మానసిక పరిస్థితి గురించి జేడీ ఘోస్లా వెల్లడించిన వివరాలు సంక్షిప్తంగా... రెండు ఇన్యూరెన్సు పాలసీలు.. భారత దేశ విభజన అనంతరం పాకిస్తాన్‌కు చెల్లించాల్సిన 55 కోట్ల రూపాయల విషయంలో ప్రభుత్వ జాప్యం తగదని, ఈ విషయంపై మరోసారి సమీక్ష జరపాలంటూ మహాత్మా గాంధీ నిరాహార దీక్షకు దిగారు. ఈ నేపథ్యంలో జనవరి 13నే ఆయన హత్యకు బీజం పడింది. ఇది పక్కా పథకం ప్రకారమే జరిగింది. నిజానికి జనవరి 30 కంటే పది రోజుల ముందే గాడ్సే, అతడి స్నేహితులు గాంధీని చంపాలనుకుని విఫలమయ్యారు. తన మరణం ఖాయమని భావించిన గాడ్సే తన పేరిట 2 వేలు, 3 వేల విలువ చేసే ఇన్యూరెన్స్ పాలసీలకు అత్యవసరంగా నామినీలను ప్రతిపాదించారు. రూ. 2 వేల పాలసీకి స్నేహితుడు నారాయణ ఆప్టే భార్యను నామినీగా పేర్కొంటూ జనవరి 13న గాడ్సే పత్రాలు సిద్ధం చేయించాడు. మరొక పాలసీ డబ్బులు తన సోదరుడి భార్యకు చెందేలా ఏర్పాట్లు చేశాడు. అనంతరం తమ పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. జనవరి 30న గాంధీజీ రాక కోసం ఢిల్లీలోని బిర్లా మందిర్ ప్రాంగణంలో సుమారు 200 మంది ఎదురు చూస్తున్నారు. వారిలో గాడ్సే కూడా కలిసిపోయాడు. కాసేపటి తర్వాత ఇద్దరు బాలికల సహాయంతో గాంధీజీ అక్కడకు చేరుకున్నారు. ప్రజలకు అభివాదం చేసే సమయంలో వేగంగా ముందుకు కదిలిన గాడ్సే... గాంధీజీకి కుడి పక్కన ఉన్న అమ్మాయిని బలంగా నెట్టివేసి ఆయన ముందు నిలబడ్డాడు. వెంటనే పాయింట్ బ్లాంక్‌లో తుపాకీ గురిపెట్టి మూడుసార్లు కాల్పులు జరిపాడు. గాడ్సే ముఖంలో భయం.. ఈ పరిణామం తర్వాత అక్కడున్న ప్రజలంతా ఒక్కసారిగా గాడ్సేపై దాడి చేశారు. అయితే పోలీసులు రావడంతో అతడు వారి నుంచి తప్పించుకున్నాడు. గాడ్సేను అదుపులోకి తీసుకున్న అనంతరం ఈ హత్యలో అతడికి సహకరించిన నిందితుల కోసం పోలీసులు వేట మొదలుపెట్టారు. ఈ ఘటన జరిగిన ఐదు నెలల తర్వాత జడ్జి ఆత్మ చరన్ నేతృత్వంలో ట్రయల్ ప్రారంభమైంది. 1949, ఫిబ్రవరి 10న కోర్టు తన తీర్పు వెలువరించింది. హిందూ మహాసభ నాయకుడు వీర్ సావర్కర్(బీజేపీ ప్రముఖంగా ప్రస్తుతించే వ్యక్తి)కు కూడా ఈ కుట్రలో భాగం ఉందని తేల్చింది. అయితే సరైన సాక్ష్యాధారాలు లభించని కారణంగా ఆయన బయటపడ్డారు. అనంతరం నాథూరామ్ గాడ్సే, అతడి స్నేహితుడు నారాయణ ఆప్టేలకు కోర్టు ఉరిశిక్ష విధించింది. మిగిలిన ఐదుగురు నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. దీంతో నిందితులు పంజాబ్ హైకోర్టుకు అప్పీలు చేసుకున్నారు. ముగ్గురు న్యాయవాదులతో కూడిన ధర్మాసనం దీనిని విచారించింది(జస్టిస్ ఘోస్లా ఇందులో సభ్యులు). ఇక్కడ కూడా గాడ్సే, ఆప్టేలకు ఉరిశిక్ష విధించాలనే కోర్టు తీర్పునిచ్చింది. దీని ప్రకారం1949, నవంబరు 15న వారిద్దరిని అంబాలా జైలులో ఉరితీశారు. అయితే శిక్ష అమలు కావడానికి ముందు బతికేందుకు తనకు అవకాశం ఇవ్వాల్సిందిగా గాడ్సే కోరాడు. శాంతి గురించి ప్రచారం చేసుకుంటూ దేశ సేవలో తన శేష జీవితాన్ని గడుపుతానని పేర్కొన్నాడు. కానీ గాడ్సేకు ఆ అవకాశం లభించలేదు. ఉరిశిక్ష అమలయ్యే రోజున ఆ ఇద్దరు ఖైదీల చేతలు వెనక్కి మడిచి అధికారులు ఉరికంబం దగ్గరికి తీసుకువచ్చారు. ఈ క్రమంలో తడబడుతూనే గాడ్సే ముందుకు నడిచాడు. విషణ్ణ వదనంతో, భయంతో ఆయన ముఖకవళికల్లో పూర్తి మార్పు కనిపించింది. ఉరికంబం ముందు నిల్చుని గాడ్సే మానసిక యుద్ధం చేశారు. ధైర్యంగా ఉండేందుకు ప్రయత్నించారు. ఉరి తీయడానికి కొన్ని క్షణాల ముందు అఖండ భారత్ అంటూ నినదించిన గాడ్సే గొంతు జీరబోయింది. ట్రయల్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ వాదించినప్పుడు ఉన్నంత ధైర్యం ఇప్పుడు ఆ గొంతులో ప్రతిధ్వనించలేదు. -
‘తాలిబన్లుగా మారకూడదు’
ముంబై : నాథురామ్ గాడ్సేని దేశభక్తుడంటూ బీజేపీ లోక్‌సభ అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞాసింగ్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. ప్రతిపక్షాలన్ని సాధ్వి వ్యాఖ్యల పట్ల మండిపడుతున్నాయి. ఈ క్రమంలో మహీంద్ర గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్ర కూడా ఈ అంశంపై స్పందించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసి మన విలువల్ని మనమే నాశనం చేసుకుని తాలిబన్లుగా మారకూడదంటూ హితవు పలికారు. ‘75 ఏళ్లుగా ప్రపంచం, భారతదేశాన్ని మహాత్ముడి జన్మభూమిగానే గుర్తిస్తుంది. ప్రపంచం నైతికతను కొల్పోయినప్పుడు మన దేశమే ముందుండి దారి చూపిస్తుంది. ప్రపంచం అంతా మనల్ని పేదవారిగా చూస్తారు. కానీ బాపు ప్రపంచవ్యాప్తంగా ఎందరికో ఆదర్శంగా నిలిచి మనల్ని ఐశ్వర్యవంతుల్ని చేశారు. కొన్ని విషయాలు పవిత్రంగానే ఉండాలి. మనకోసం మనం ఏర్పాటు చేసుకున్న విలువల్ని మనమే నాశనం చేసుకుని తాలిబన్లుగా మారకూడదు’ అంటూ ట్వీట్ చేశారు. For 75 yrs,India’s been the land of the Mahatma;a beacon when the world lost its morality.We used to be pitied for being poor but we were always rich since Bapu inspired billions globally.Some things must remain sacred.Or we become the Taliban,destroying statues that sustain us — anand mahindra (@anandmahindra) May 17, 2019 ఆనంద్ ట్వీట్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ విషయంపై దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోన్న నేపథ్యంలో సమాజానికి సరైన సందేశం ఇచ్చారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. -
రాజీవ్ గాంధీపై వివాదాస్పద ట్వీట్
సాక్షి, బెంగళూరు: మక్కల్ నీది మయ్యం చీఫ్ కమల్ హాసన్ నాథూరం గాడ్సేపై చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఏడో విడత ఎన్నికల్లో అవే వ్యాఖ్యలను ప్రధాన పార్టీలన్నీ ప్రచార అస్త్రాలుగా చేసుకుని.. ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నాయి. గాడ్సే స్వతంత్ర దేశంలో తొలి హిందూ తీవ్రవాదిగా కమల్ వ్యాఖ్యానించగా.. గాంధీని హత్యచేసిన గాడ్సే దేశ భక్తుడని భోపాల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ప్రజ్ఞాసింగ్ అభిప్రాయపడ్డారు. తాజాగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని గాడ్సేతో పోల్చుతూ కర్ణాటక బీజేపీ ఎంపీ నళిన్ కుమార్ కాటిల్ వివాదాస్పద ట్వీట్ చేశారు. ‘‘నాథూరాం గాడ్సే కేవలం మహాత్మ గాంధీని మాత్రమే హత్య చేశాడు. ఉగ్రవాది అజ్మల్ కసబ్ ముంబై దాడుల్లో 72 మృతికి కారణమైయ్యాడు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 17000 మందిని హత్య చేశారు. వీరిలో ఎవరు ప్రజల పట్ల అతి క్రూరంగా ప్రవర్తించారో అర్థమవుతోంది’ అని ట్వీట్ చేశారు. ఇందిరా గాంధీ హత్య అనంతరం సిక్కుల ఊచకోతలో మూడు రోజుల్లో 3000 మంది అమాయక సిక్కులను హతమార్చినట్లు నళీన్ అభిప్రాయపడ్డారు. కాగా రెండు ఎంపీగా విజయం సాధించిన కాటిల్ ఈసారి దక్షిణ కన్నడ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. కాగా ఆయన ట్వీట్ చేసిన కాసేపటికే తీవ్ర విమర్శలు రావడంతో ట్విటర్ ఖాతానుంచి తొలిగించారు. -
‘ఖాకీ నిక్కరు, గాడ్సేనే ఆ పార్టీ గుర్తింపు’
లక్నో : బీజేపీ లోక్‌సభ అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ నాథూరాం గాడ్సే దేశభక్తుడని, ఆయన దేశభక్తుడిగానే ప్రజల్లో మిగిలిపోతారంటూ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా రాజకీయ దుమరాన్ని రేపుతున్నాయి. ఈ క్రమంలో సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఆజం ఖాన్ ఈ వ్యాఖ్యలపై మండి పడ్డారు. గాడ్సే, ఖాకీ నిక్కర్ ఆర్ఎస్ఎస్కు గుర్తింపు తెచ్చాయని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘బీజేపీ, ప్రజ్ఞా సింగ్ వ్యాఖ్యలను ఖండించినంత మాత్రాన ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇన్నాళ్లు ఆర్ఎస్ఎస్ అనగానే ఖాకీ నిక్కరు ఎలా గుర్తుకు వచ్చేదో.. ఇక మీదట గాడ్సే కూడా అలానే గుర్తుకు వస్తాడు. ఖాకీ నిక్కరు, గాడ్సేనే ఆర్ఎస్ఎస్ అస్థిత్వాలు. ఇప్పుడిక నిర్ణయం ప్రజల చేతుల్లోనే ఉంది. ఈ దేశాన్ని గాంధీ పేరుతో గుర్తుంచుకోవాలో.. గాడ్సే పేరుతో గుర్తుంచుకోవాలో అనే నిర్ణయాన్ని ప్రజలే తీసుకోవాలి. మానవత్వం కావాలో.. ఖాకీ నిక్కరు కావాలో ఓటర్లే తేల్చుకోవాల’న్నారు. అంతేకాక గాడ్సే మద్దతుదారురాలు అయినందుకు గాను ప్రజ్ఞా సింగ్‌ను బీజేపీ నుంచి బహిష్కరించాలని ఆజం ఖాన్ డిమాండ్ చేశారు. కాగా, మహాత్మా గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సే దేశంలో తొలి హిందూ ఉగ్రవాదని సినీనటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే. కమల్ హాసన్ వ్యాఖ్యలపై పలుచోట్ల ఫిర్యాదులు అందగా ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. -
‘గాడ్సేపై వ్యాఖ్యలను వెనక్కి తీసుకోను’
సాక్షి, చెన్నై: గాడ్సేపై తాను చేసిన వ్యాఖ్యలు వివాదం కాలేదని, హిందూ సంఘాలే వాటిని వివాదంగా మార్చాయని ఎంఎన్ఎం, అధ్యక్షుడు కమల్ హాసన్ అన్నారు. గాడ్సేపై తాను చేసిన వాఖ్యలను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయం తనకు లేదని, తనని అరెస్ట్ చేస్తే పరిస్థితులు ఉద్రిక్తంగా ఉంటాయని కమల్ స్పష్టం చేశారు. అరెస్ట్ చేయకపోవడం వారికే మంచిదన్నారు. అతివాదం అనేది ప్రతి మతంలో ఉంటుందని, ఈ విషయంలో చరిత్రే స్పష్టంగా చెబుతోందని పేర్కొన్నారు. ప్రచారంలో భాగంగా కమల్‌హాసన్ మధురైలో మీడియాతో మాట్లాడారు. ఏ మతాన్ని కించపరచడం తన ఉద్దేశ్యం కాదని, తాను ఎవరికీ బయపడేదిలేదన్నారు. కాగా స్వతంత్ర భారతదేశంలో తొలి హిందూ ఉగ్రవాది మహాత్మ గాంధీని హత్య చేసిన నాథూరం గాడ్సే అంటూ కమల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా పెనుదుమారాన్నే స్పష్టించాయి. కాగా ఇలాంటి వ్యాఖ్యలు చేసిన కమల్ నాలుకను కట్ చేయాలంటూ తమిళనాడు మంత్రి రాజేంద్ర బాలాజీ తీవ్రం స్థాయిలో మండిపడ్డారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
గాడ్సే దేశ భక్తుడైతే గాంధీ జాతి వ్యతిరేకా?
అగర్ మాల్వా, ఉజ్జయిని, భోపాల్/న్యూఢిల్లీ: బీజేపీ నేత, ఆ పార్టీ భోపాల్ లోక్‌సభ అభ్యర్థి, మాలెగావ్ పేలుళ్ల కేసులో నిందితురాలు సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సేని దేశభక్తుడిగా అభివర్ణించారు. దీంతో గాడ్సే దేశ భక్తుడైతే మహాత్మా గాంధీ జాతి వ్యతిరేకా అని విపక్ష నేతలు మండిపడ్డారు. ఇటీవల రెండుసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రజ్ఞా సింగ్ గురువారం మధ్యప్రదేశ్‌లోని అగర్ మాల్వాలో రోడ్ షో సందర్భంగా తాజా వివాదానికి తెరతీశారు. ఓ న్యూస్ చానెల్‌తో మాట్లాడుతూ.. గాడ్సే దేశ భక్తుడని, ఆయన ఎప్పటికీ దేశ భక్తుడిగానే ఉంటారని అన్నారు. ఆయన్ను ఉగ్రవాది అంటున్నవారు తమను తాము ఒకసారి పరీక్షించుకోవాలన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు వారికి సరైన గుణపాఠం చెబుతారన్నారు. స్వతంత్ర భారత తొలి ఉగ్రవాది హిందూ అంటూ గాడ్సేని దృష్టిలో ఉంచుకుని రాజకీయ నేతగా మారిన నటుడు కమల్‌హాసన్ చేసిన వ్యాఖ్యలపై అడిగిన ప్రశ్నకు.. ప్రజ్ఞ ఈ విధంగా జవాబిచ్చారు. ప్రజ్ఞ వ్యాఖ్యలపై కాంగ్రెస్, ఎన్సీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ మండిపడ్డాయి. బీజేపీ అసలు రంగు బయటపడిందని ధ్వజమెత్తాయి. ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో బీజేపీ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ప్రజ్ఞ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపింది. క్షమాపణ చెప్పాల్సిందిగా ప్రజ్ఞను ఆదేశించింది. దీంతో క్షమాపణ చెప్పిన ఆమె తాను చేసిన వ్యాఖ్యలను సైతం ఉపసంహరించుకున్నారు. భోపాల్‌లో మే 12న ఎన్నికల ప్రచారం ముగించిన ప్రజ్ఞ.. 19న ఎన్నికలు జరగబోయే మాల్వా ప్రాంతంలో పార్టీ ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజేపీ అసలు రంగు బయటపడింది: ఎన్సీపీ అమిత్ షా నేతృత్వంలోని బీజేపీ అసలు రంగును ప్రజలిప్పుడు చూస్తున్నారని మహారాష్ట్ర ఎన్సీపీ చీఫ్ జయంత్ పాటిల్ ట్విట్టర్లో పేర్కొన్నారు. గాంధీని చంపిన గాడ్సే.. ప్రజ్ఞ పేర్కొన్నట్టుగా దేశ భక్తుడేనా? అన్న సంగతి ప్రధాని మోదీ స్పష్టం చేయాలన్నారు. మాలెగావ్ పేలుళ్ల నిందితురాలు కూడా ఉగ్రవాది గాడ్సే కోవలోకే వస్తారని ఎన్సీపీ ప్రధాన కార్యదర్శి జితేంద్ర అవ్హద్ అన్నారు. గాడ్సే దేశ భక్తుడైతే మహాత్మా గాంధీ జాతి వ్యతిరేకా అని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ట్విట్టర్లో ప్రశ్నించారు. ఆ వ్యాఖ్యలతో పూర్తిగా విభేదిస్తున్నామన్న బీజేపీ ప్రజ్ఞ వ్యాఖ్యలతో తాము పూర్తిగా విభేదిస్తున్నామని బీజేపీ పేర్కొంది. మహాత్మా గాంధీ హంతకుడు దేశభక్తుడు కాలేడని తెలిపింది. ఆమె అలాంటి ప్రకటన ఎలా చేశారో వివరణ కోరతామని ఆ పార్టీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు తెలిపారు. అభ్యంతరకరమైన వ్యాఖ్యలకు గాను క్షమాపణ చెప్పడం సమంజసమని పేర్కొన్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ప్రజ్ఞ క్షమాపణలు చెప్పడం నెలలో రెండోసారి. గతంలో కర్కరేపై చేసిన వ్యాఖ్యలకు కూడా ఆమె క్షమాపణ చెప్పారు. తాజా వ్యాఖ్యలకు సైతం ఆమె క్షమాపణలు చెప్పినట్లు ఆమె ప్రతినిధి, బీజేపీ నేత డాక్టర్ హితేష్ బాజ్‌పాయ్ తెలిపారు. ప్రజ్ఞ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారని కూడా ఆయన చెప్పారు. గతంలోనూ... ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కలకలం సృష్టించారు. ఐపీఎస్ అధికారి, ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కరే తాను పెట్టిన శాపంతోనే ముంబై ఉగ్రదాడుల్లో మరణించారని అన్నారు. ఏటీఎస్ చీఫ్‌గా మాలెగావ్ పేలుళ్ల కేసు విచారించిన కర్కరే తనను హింసించారని ప్రజ్ఞ అప్పట్లో ఆరోపించారు. 1992లో అయోధ్యలో బాబ్రీ మసీదు విధ్వంసంలో పాల్గొన్నందుకు గర్వపడుతున్నానని మరోసారి వ్యాఖ్యానించారు. అది బీజేపీ డీఎన్ఏలోనే ఉంది : కాంగ్రెస్ ప్రజ్ఞ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. మోదీ, అమిత్ షాల అభిమాన బీజేపీ నేత ప్రజ్ఞా సింగ్ మరోసారి జాతి యావత్తును అవమానించారని పేర్కొంది. హింసా సంస్కృతి, అమరులను కించ పరచడమనేది బీజేపీ డీఎన్ఏలోనే ఉందని విమర్శించింది. ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రజ్ఞా సింగ్‌ను దండించాలని కాంగ్రెస్ పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా ప్రధానిని కోరారు. బీజేపీ నేతలు గాడ్సే వారసులనేది స్పష్టమయ్యిందని అన్నారు. వారు గాడ్సేని దేశ భక్తుడని, వీర మరణం పొందిన కర్కరేని దేశ ద్రోహి అని అంటారన్నారు. తమ నేతల ద్వారా బీజేపీ.. జాతిపిత సిద్ధాంతాలు, ఆలోచనా విధానంపై ‘హానికారక దాడులు’ చేస్తూనే ఉందని ఆరోపించారు. ‘ఇది గాంధేయ సూత్రాలను కించ పరిచేందుకు జరుగుతున్న కుట్ర. దేశం క్షమించజాలని క్షమాపణార్హం కాని నేరం..’ అని అన్నారు. మోదీకి ఎంత మాత్రం తెలివి ఉన్నా ప్రజ్ఞా సింగ్‌ను దండించి, దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భోపాల్‌లో బీజేపీ ప్రత్యర్థి, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ సింగ్ కూడా ప్రజ్ఞ వ్యాఖ్యలపై మండిపడ్డారు. గాడ్సేని ప్రశంసించడం దేశ భక్తి కాదని, అదొక జాతి వ్యతిరేక చర్య అని అన్నారు. మోదీ, అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
‘ఆమె వ్యాఖ్యలు దేశానికి అవమానకరం’
సాక్షి, న్యూఢిల్లీ : మహాత్మ గాంధీని చంపిన నాథూరాం గాడ్సేను దేశభక్తుడిగా భోపాల్ బీజేపీ అభ్యర్ధి సాధ్వి ప్రజ్ఞా సింగ్ కొనియాడటం పట్ల కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సాధ్వి ప్రజ్ఞా సింగ్ వ్యాఖ్యలు దేశానికి అవమానకరమని, గాంధీ సిద్ధాంతంపై దాడి అని కాంగ్రెస్ ప్రతినిధి రణ్‌దీప్ సుర్జీవాలా ఆక్షేపించారు. భారత ఆత్మను నాథూరాం గాడ్సే వారసులు, పాలక బీజేపీ శ్రేణులు దెబ్బతీశారని ఆందోళన వ్యక్తం చేశారు. మహాత్మ గాంధీని హత్య చేసిన గాడ్సేను నిజమైన జాతీయవాదిగా బీజేపీ నేతలు అభివర్ణిస్తున్నారని..ఇది దేశానికి అవమానకరమని, గాంధీ సిద్ధాంతానికి తూట్లుపొడవడమేనని సుర్జీవాలా పేర్కొన్నారు. సాధ్వి వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ఖండించారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గాంధీని చంపిన గాడ్సే ఓ హంతకుడని, ఆయనను కీర్తించడం దేశభక్తి కాదని, రాజద్రోహమని దిగ్విజయ్ సింగ్ అన్నారు. బీజేపీ వివరణ.. ప్రజ్ఞా సింగ్ వ్యాఖ్యలతో బీజేపీ ఏకీభవించదని, దీనిపై పార్టీ ఆమె వివరణ కోరుతుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు. ఈ వ్యాఖ్యలు చేసిన ప్రజ్ఞా సింగ్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఆయన కోరారు. కాగా మహాత్మ గాంధీని చంపిన నాథూరాం గాడ్సే దేశభక్తుడని, ఆయన దేశభక్తుడిగానే ఉంటారని సాధ్వి ప్రజ్ఞా సింగ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. -
కమల్ హాసన్‌పై చెప్పుల దాడి
చెన్నై : ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్‌కు చేదు అనుభవం ఎదురయ్యింది. ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న కమల్ హాసన్ మీద చెప్పులు విసిరారు. బుధవారం ఓ రోడ్ షో లో పాల్గొన్న కమల్ హాసన్ మీద ఓ వ్యక్తి చెప్పు విసిరాడు. అయితే, అది కమల్ హాసన్‌కు తగలలేదు. మరికొందరు కూడా కమల్ మీదకు చెప్పులు విసిరే ప్రయత్నం చేయబోగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ దాడిలో పోలీసులు బీజేపీ కార్యకర్తలతో పాటు హనుమ సేన కార్యకర్తలపై కూడా కేసు నమోదు చేశారు. రెండు రోజుల క్రితం కమల్ హాసన్ స్వతంత్ర భారత దేశంలో మొట్టమొదటి ఉగ్రవాది ఓ హిందూ అని, అతని పేరు నాథూరామ్ గాడ్సే అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా పెను దుమారం రేపాయి. కమల్ హాసన్ మీద చర్యలు తీసుకోవాలంటూ పలు హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. కమల్ హాసన్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు కూడా చేశారు. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కమల్ హాసన్ మీద చెప్పుల దాడి జరిగింది. -
కమల్‌హసన్‌పై కేసు నమోదు చేసిన కరూర్ జిల్లా పోలీసులు
-
నాథూరామ్ గాడ్సే ఉగ్రవాదే...
సాక్షి, హైదరాబాద్: జాతిపిత మహాత్మాగాంధీని హతమార్చిన నాథూరామ్ గాడ్సే ఉగ్రవాదే అని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చాక దేశంలో మొట్టమొదటి ఉగ్రవాది హిందువేనని.. అతనే నాథూరామ్ గాడ్సే అంటూ మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలను అసద్ సమర్థించారు. మంగళవారం దారుస్సలాంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జాతిపిత గాంధీని చంపిన గాడ్సేను మహాత్ముడంటారా? రాక్షసుడంటారా? అని ప్రశ్నించారు. గాంధీని చంపినట్లు రుజువై.. శిక్ష కూడా పడిన వ్యక్తిని ఏమని పిలవాలని అన్నారు. హంత కుడిని గొప్పవాడిగా ఎలా అభివర్ణిస్తారన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నైరాశ్యంలో ఉన్నారని, ఆయనకు దేశమంతటా ఎదురుగాలి వీస్తోందని పేర్కొన్నారు. మోదీ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశమే లేదన్నారు. టీఆర్ఎస్ ఆధినేత కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాలు అభినందనీయమన్నారు. కేసీఆర్‌కు రాజకీయ విజన్, ఒక వ్యూహం ఉందన్నారు. తెలంగాణలో బీజేపీని అసెంబ్లీలో ఒక్క సీటుకు పరిమితం చేయగలిగామని, లోక్‌సభ ఎన్నికల్లో ఆ ఒక్క సీటు కూడా గల్లంతు కావడం ఖాయమన్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం ప్రాంతీయ పార్టీల మద్దతుతోనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని జోస్యం చెప్పారు. -
చిక్కుల్లో కమల్
సాక్షి, న్యూఢిల్లీ : మహాత్మ గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సేపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి సినీనటుడు మక్కల్ నీది మయ్యం నేత కమల్ హాసన్ చిక్కుల్లో పడ్డారు. కమల్ తన వ్యాఖ్యలతో మత విశ్వాసాలు, మనోభావాలను దెబ్బతీశారని ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టులో ఆయనపై క్రిమినల్ ఫిర్యాదు నమోదైంది. మహాత్మా గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సే దేశంలో తొలి హిందూ ఉగ్రవాది అంటూ కమల్ చేసిన వ్యాఖ్యలు రేపిన సంగతి తెలిసిందే. తమిళనాడులోని అరవకురిచ్చిలో జరిగిన ఓ ఎన్నికల ప్రచార సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హిందూ మతాన్ని ఉగ్రవాదంతో ముడిపెడుతూ కమల్ చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని ఆయనపై క్రిమినల్ ఫిర్యాదు నమోదైంది. మరోవైపు కమల్ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన బీజేపీ సోమవారం ఆయనపై చర్యలు తీసుకోవాలని ఈసీకి నివేదించింది. కాగా, చెన్నైలోని కమల్ హాసన్ నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. -
ఆయనెలా గొప్పవాడవుతాడు : ఒవైసీ
న్యూఢిల్లీ : జాతిపితను హతమార్చిన నాథూరామ్ గాడ్సే నిజమైన ఉగ్రవాది అని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారు. దేశంలో మొట్టమొదటి ఉగ్రవాది హిందూ వ్యక్తి నాథూరామ్ గాడ్సే అంటూ మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు, నటుడు కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం అసదుద్దీన్ మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ హంతకుడిని గొప్పవాడిగా ఎలా అభివర్ణిస్తారని ప్రశ్నించారు. హిందూ ఉగ్రవాదం గురించి నోరెత్తని వారు మహాత్మా గాంధీని చంపింది ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు. తద్వారా నాథూరామ్ గాడ్సే గురించి కమల్ వెలిబుచ్చిన అభిప్రాయానికి ఆయన మద్దతునిచ్చారు. కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా అరవక్కురిచ్చిలో ఏర్పాటు చేసిన రోడ్‌షోలో కమల్ హాసన్ మాట్లాడుతూ..‘ ‘గాంధీ విగ్రహం ముందు నిలబడి ఒకటి చెబుతున్నా..దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక మొట్టమొదటి ఉగ్రవాది హిందూ వ్యక్తి నాథూరాం గాడ్సే. మహాత్మాగాంధీని హతమార్చిన గాడ్సేతోనే ఉగ్రవాదం ఆరంభమైంది. ఇక్కడ ముస్లిం ఓటర్లు ఎక్కువ ఉన్నారని ఈ మాట చెప్పడం లేదు. ఎక్కడైనా ఇదే మాట చెబుతా’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో హిందూ సంఘాలు, బీజేపీ నేతలు కమల్ వ్యాఖ్యలపై మండిపడుతుండగా, కాంగ్రెస్ నేతలు కమల్‌కు అండగా నిలుస్తున్నారు. ఇక విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేస్తున్న కమల్‌పై చర్యలు తీసుకోవాలంటూ పలువురు బీజేపీ నేతలు ఈసీని కోరుతున్నారు. -
హిందూ ఉగ్రవాదంపై కమల్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, చెన్నై : హిందూ ఉగ్రవాదంపై ప్రముఖ సినీ నటుడు, మక్కళ్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో మొట్టమొదటి ఉగ్రవాది హిందూ వ్యక్తి నాథూరామ్ గాడ్సే అని వ్యాఖ్యానించారు. మహాత్మగాంధీని హత్యచేసిన గాడ్సేతోనే దేశంలో ఉగ్రవాదం ఆరంభమైందని కమల్‌హాసన్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అరవక్కురిచ్చిలో ఏర్పాటు చేసిన రోడ్‌షోలో కమల్ ఈ వ్యాఖ్యలు చేశారు. అరక్కురిచ్చిలో ముస్లిం ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారని తాను ఈ వాఖ్యలు చేయడం లేదని వివరించారు. ‘గాంధీ విగ్రహం ముందు నిలబడి ఒక చెబుతున్నా..దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక మొట్టమొదటి ఉగ్రవాది హిందూ వ్యక్తి నాథూరాం గాడ్సే. మహాత్మాగాంధీని హతమార్చిన గాడ్సేతోనే ఉగ్రవాదం ఆరంభమైంది. ఇక్కడ ముస్లిం ఓటర్లు ఎక్కువ ఉన్నారని ఈ మాట చెప్పడం లేదు. ఎక్కడైనా ఇదే మాట చెబుతా’అని కమల్‌హాసన్ గాడ్సేపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కమల్ వ్యాఖ్యలపై హిందూ సంఘాలులతో పాటు పలు పార్టీలు తీవ్రంగా ఖండించాయి. -
దేశంలో తొలి హిందూ తీవ్రవాది గాడ్సే
-
గాడ్సేపై ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
పుణె : జాతిపిత మహాత్మా గాంధీని హత్యచేసిన నాథూరాం గాడ్సే ‘నెం1 హిందు రత్న టెర్రరిస్ట్’ అని హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై నోటీసులు పంపించే దమ్ము ఎవరికైన ఉందా అని ఆయన ప్రశ్నించారు. పుణేలో జరిగిన ఓ కార్యక్రమంలో ఒవైసీ ప్రసంగిస్తూ.. ముస్లింలు భారత దేశాన్ని అమ్మాలనుకోవడం లేదని, కానీ గత 70 ఏళ్ల నుంచి దాడులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లింలంతా పాకిస్తాన్ లేదా సిరియా వెళ్లాలని కొందరంటున్నారని, అలా వెళ్లేవారు ఇప్పటికే పాకిస్తాన్‌కు వెళ్లారని ఒవైసీ స్పష్టం చేశారు. మా పూర్వీకులు సైతం బ్రిటిష్ వారితో పోరాటం చేశారని, హిందూస్తాన్ జిందాబాద్ అన్నారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ‘మేం ఇక్కడే జీవిస్తాం. ఇక్కడే చస్తాం’ అని ఒవైసీ పేర్కొన్నారు. ఇక రాజ్యసభలో ఆగిపోయిన ట్రిపుల్ తలాక్ బిల్లుపై స్పందిస్తూ.. ప్రధాని నరేంద్రమోదీపై విమర్శలు గుప్పించారు. ‘మిస్టర్ మోదీ కళ్లు తెరిచి చూడండి.. మీరు ముస్లిం మహిళల మంచి కోరేవారు కాదు. ముస్లింలకు శత్రువు.’ ఒవైసీ అని విమర్శించారు. ముస్లింలకు వ్యతిరేకంగా చట్టాలు రూపొందిస్తున్నారని ధ్వజమెత్తారు. రామ మందిర నిర్మాణం జరగకపోతే భారత్ మరో సిరియా అవుతుందని ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్ వ్యాఖ్యలపై ఒవైసీ మండిపడిన విషయం తెలిసిందే. రాజ్యంగంపై గౌరవంలేని రవిశంకర్‌పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. -
గాంధీని గాడ్సేనే చంపాడు
న్యూఢిల్లీ: గాంధీజీ హత్య కేసును తిరిగి విచారించాల్సిన అవసరం లేదని ఈ కేసులో అమికస్ క్యూరీగా(న్యాయ సహాయకుడు) వ్యవహరిస్తోన్న సీనియర్ న్యాయవాది అమరేందర్ సుప్రీంకోర్టుకు తెలిపారు. గాంధీపై నాథురాం గాడ్సేనే కాల్పులు జరిపాడని, ఈ కేసులో బ్రిటిష్ ప్రత్యేక నిఘా విభాగం పాత్ర ఉందన్న ఆరోపణలు నిరూపితం కాలేదని కోర్టుకు ఆయన నివేదిక సమర్పించారు. నివేదికను పరిశీలించిన జస్టిస్ బాబ్డే నేతృత్వంలోని బెంచ్ విచారణను వాయిదా వేసింది. నాథురాం గాడ్సే తుపాకీతో కాల్చి గాంధీజీని హత్య చేయగా.. గాడ్సేతో పాటు కేసుతో ప్రమేయమున్న నారాయణ్ ఆప్టేకు కోర్టు ఉరిశిక్ష విధించింది. 1949 నవంబర్‌లో వారిద్దరిని ఉరి తీశారు. గాంధీ హత్యలో వేరే వ్యక్తి ప్రమేయం ఉందని ఆరోపిస్తూ.. ముంబై పరిశోధకుడు పంకజ్ ఫడ్నీస్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిల్‌పై విచారణ చేపట్టిన కోర్టు కేసులో న్యాయసలహా కోరుతూ అమరేందర్ శరణ్‌ను అమికస్ క్యూరీగా నియమించింది. -
నాథూరాం గాడ్సేకు గుడి కట్టేశారు!
భోపాల్: హిందూత్వ సంస్థ అయిన అఖిల భారతీయ హిందూ మహాసభ.. మహాత్మాగాంధీ హంతకుడైన నాథూరాం గాడ్సేకు ఘన నివాళులర్పించింది. గాడ్సే వర్థంతి సందర్భంగా గురువారం గ్వాలియర్‌లో ప్రతేక కార్యక్రమాన్ని నిర్వహించిన మహాసభ.. గాడ్సే అర్ధవిగ్రహాన్ని ప్రతిష్ఠాపన చేసి.. శ్రద్ధాంజలి ఘటించింది. అంతేకాకుండా గాడ్సేకు గుడి కూడా కట్టినట్టు వెల్లడించింది. గ్వాలియర్‌లో నాథూరాం గాడ్సేకు గుడి కట్టేందుకు హిందూ మహాసభ ప్రయత్నించగా.. ఇందుకు జిల్లా అధికార యంత్రాంగం అనమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 32 అంగుళాల పొడవున్న గాడ్సే విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసిన హిందూ మహాసభ.. ఆయనకు గుడి కట్టాలన్న తమ అభ్యర్థనను జిల్లా యంత్రాంగం నిరాకరించిందని, అయినప్పటికీ తమ సొంత స్థలంలో గాడ్సే విగ్రహం ఏర్పాటుచేసి.. గుడి కట్టామని తెలిపింది. మహాసభకు చెందిన సొంత స్థలంలో గుడి కట్టినందున దీనిపై ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదని మహాసభ జాతీయ ఉపాధ్యక్షుడు జైవీర్ భరద్వాజ్ తెలిపారు. -
గాంధీ హత్య.. నాలుగో బుల్లెట్ ఎక్కడిది?
సాక్షి, న్యూఢిల్లీ : జాతి పిత మహాత్మా గాంధీజీ హత్యకు సంబంధించి దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీం కోర్టు నేడు(శుక్రవారం) విచారణ చేపట్టనుంది. బాపూజీ హత్యపై పలు అనుమానాలు ఉన్నాయంటూ అభినవ్ భారత్ ట్రస్ట్ సభ్యుడు పంకజ్ ఫడ్నవిస్ ఈ పిల్ దాఖలు చేశారు. జనవరి 30, 1948న జరిగిన అంశాలను ప్రస్తావిస్తూ.. నిజాలను వెలుగులోకి తేవాల్సిన అవసరం ఉందంటూ ఆయన న్యాయస్థానాన్ని కోరారు. గాంధీని నాథురం గాడ్సే ఒక్కడే హత్య చేయలేదని.. అతనితోపాటు మరో వ్యక్తి కూడా ఉన్నాడని పంకజ్ చెబుతున్నారు. నిజానికి గాడ్సే గాంధీని కాల్చిన సమయంలో మూడు బుల్లెట్లే తగిలాయంటూ చెప్పారు. కానీ, నాలుగో బుల్లెట్ మూలంగానే గాంధీ మరణించారని అప్పట్లో అంతర్జాతీయ మీడియాలు ప్రముఖంగా ప్రచారం చేశాయి. అయితే ఆ అంశాన్ని అప్పటి పోలీసులు పక్కన పెట్టారని పంకజ్ వాదిస్తున్నారు. గాంధీజీ హత్యకు గాడ్సే ఉపయోగించింది 'బెరెట్టా' తుపాకీ. గ్వాలియర్ కు చెందిన డాక్టర్ దత్తాత్రేయ పర్చూరే వాటిని గాడ్సేకు సమకూర్చాడన్న ఆరోపణలు ఉన్నాయి. రిజిస్టర్డ్ నంబర్ 068240, 719791లతో అవి ఆయన దగ్గర ఉన్నాయి. కానీ అయితే రెండో నంబర్‌కు చెందిన రిజిస్ట్రేషన్‌తో గ్వాలియర్ కే చెందిన ఉదయ్ చాంద్ అనే వ్యక్తి వద్ద కూడా ఓ తుపాకీ ఉందని పోలీసు రికార్డులు చెబుతున్నాయి. దీనికి సంబంధించిన 1948 నాటి పోలీస్ డాక్యుమెంట్‌ను ప్రముఖ ఆంగ్ల దిన పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా బహిర్గతం కూడా చేసింది. ఇక గాడ్సే వాడిన తుపాకీ నుంచి నాలుగో బుల్లెట్ రాలేదన్న విషయాన్ని బలపరుస్తూ ఆ సమయంలో గాంధీ పక్కనే సహయంగా ఉన్న మనుబెన్ తన డైరీలో రాసుకున్నారు. ఈ నేపథ్యంలో గాంధీని గాడ్సే ఒక్కడే చంపాడా? లేక ఇద్దరు చంపారా? చంపితే ఆ వ్యక్తి ఎవరు? అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉందని పంకజ్ కోరుతున్నాడు. మరి సుప్రీంకోర్టు ధర్మాసనం పిల్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో మరి కొన్ని గంట్లోనే తెలియనుంది. -
ఆ ముగ్గురు హంతకుల మాటేమిటి?
విశ్లేషణ గాంధీ హత్య, దర్యాప్తు, పరిశోధన, నేర విచారణ, అప్పీలు, జైలుశిక్ష, ఉరిశిక్షలు, కపూర్ కమిషన్ సిఫార్సులు, వాటిపై చర్యలు తదితరాలకు సంబంధించిన అన్ని రికార్డులతో సమగ్ర సమాచార నిధిని ప్రజలకు అందుబాటులో ఉంచాలి. గాంధీ హత్యానేరం ఎఫ్ఐఆర్, తుది చార్జిషీట్, నాథూరాం గాడ్సేను ఉరితీయడానికి చివరగా ఇచ్చిన ఉత్తర్వు కాపీ లను హేమంత్ పాండా తన అధ్యయనానికి అవసరమంటూ కోరారు. పురావస్తు శాఖ ప్రజా సమాచార అధికారి నుంచి పాండా కొన్ని దస్తావేజుల ప్రతులను తీసుకున్నారు. కాని తుది చార్జిషీట్, నాథురాం గాడ్సే మరణశిక్ష ఉత్తర్వులు కనిపించలేదని కమిషన్‌కు విన్నవించారు. గాంధీ హంతకుల్లో ముగ్గురు–గంగాధర్ దహావతే, సూర్యదేవ శర్మ, గంగాధర్ యాదవ్ పారిపోయినట్టు రికార్డులు చూపుతు న్నాయని, వారిని పట్టుకున్నారా, లేదా? అందుకు ఏమైనా ప్రయత్నాలు, పరిశోధనలు జరిగాయా, లేదా? వారి సంగతే మయిందో వివరించాలని కూడా పాండా కోరారు. వారిని పట్టుకోవడానికి ఏ ప్రయత్నాలూ జరగ కపోతే అందుకు కారణాలను తెలుపాలని, దర్యాప్తు సాగితే దానికి సంబంధించిన రికార్డులు, డైరీలు చూపాలని ఆయన కోరారు. గాంధీ హత్యలో పాలుపంచు కున్న శంకర్ కిష్టయ్య (తెలుగువాడు), మరొక వ్యక్తి దత్తా త్రేయ పర్చురేలను సాక్ష్యం సరిపోలేదని హైకోర్టు వది లేసిందంటూ ఆ వివరాలు కూడా ఇవ్వాలని కోరారు. గాంధీ హత్య కేసు దర్యాప్తు, నేరవిచారణ, అప్పీ లుకు సంబంధించిన రికార్డులు తమకు అందినంత మేరకు చూపగలమే గాని, లోపాలు కారణాలు, అభిప్రా యాలు చెప్పజాలమని సీపీఐఓ అన్నారు. ఎలా పారిపో యారు, ఎందుకు పట్టుకోలేదు, ఎందుకు విడిచిపెట్టారు అనే అంశాలను పురావస్తుశాఖ ఎలా చెప్పగలదని ఆయన ప్రశ్నించారు. తమ వద్ద ఉన్న కొన్ని వేల పేజీల దస్తావేజులను ఎవరైనా చదువుకోవచ్చని, హేమంత్ మళ్లీ రావచ్చని వివరించారు. పురావస్తు శాఖ నియ మాల ప్రకారం కూడా తమ పేరు నమోదుచేసుకుని కార్యాలయంలో కూచుని దస్తావేజులు చదువుకునే అవ కాశాన్ని కల్పిస్తామన్నారు. కానీ చట్ట ప్రకారం తమకు వచ్చిన దరఖాస్తును సంబంధిత కార్యాలయాలకు బదిలీ చేయాల్సిన బాధ్యత జాతీయ పురావస్తు కార్యాలయంపైన ఉంది. వారా పని చేయలేదు. గాంధీ హత్య వివరాలున్న దస్తావేజులు చాలా పాతవని, పదే పదే ఫోటో కాపీలు తీయడం వల్ల చెడిపోతాయని, కనుక తాము వాటిని సీడీలుగా చేసి, వాటి నుండి ప్రింట్ కాపీలు ఇస్తున్నా మన్నారు. రికార్డు భద్రత దృష్ట్యా సమాచార కమిషనర్ ఢిల్లీ్లలోని జాతీయ పురావస్తు శాఖ కార్యాలయానికి వెళ్లి అసలు దస్తావేజులను పరిశీలించారు. రికార్డులలో ఒకే చార్జిషీటు ఉంది కాని, ప్రాథమిక, తుది ఆరోపణా పత్రం అని లేవు. తమ వద్ద జైలు రికార్డులు లేవు కనుక నాథూరాం గాడ్సే ఉరిశిక్ష ఉత్తర్వు ఇవ్వలేమన్నారు. హేమంత్ కోరిన సమాచారాన్ని నిరాకరించడానికి ఏ మినహాయింపూ వర్తించే అవకాశం లేదు. నిజానికి ప్రతి పౌరుడికీ జాతిపిత గాంధీ హత్య కేసు వివరా లన్నిటినీ తెలుసుకునే హక్కు ఉంది. పురావస్తు అథారిటీ సమాచార దరఖాస్తును అనేక ఉన్నతాధికార కార్యాల యాలకు పంపాల్సి ఉంది. గాంధీ హత్య, దర్యాప్తు, పరిశోధన, నేరవిచారణ, అప్పీలు, జైలుశిక్ష, ఉరిశిక్షలు, కపూర్ విచారణ కమిషన్ నివేదిక సిఫార్సులు, వాటిపై తీసుకున్న చర్యలు తదితర అంశాలకు సంబంధించిన అన్ని రికార్డులను సేకరించి సమగ్ర సమాచార నిధిని ఏర్పాటుచేసి ప్రజలకు అందుబాటులో ఉంచవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. కనుక దరఖా స్తును ప్రధాన మంత్రి కార్యాలయానికి బదిలీ చేయాలని కమిషన్ ఆదేశించింది. గాంధీ హత్యా నిందితులను పట్టుకోవడానికి చేసిన ప్రయత్నాలు, వివరాలున్న డైరీలను, ఇతర పత్రాలను ముంబై, పుణె, ఢిల్లీ పోలీసు వర్గాల నుంచీ, నిందితు లను జైలులో బంధించిన వివరాలను పోలీసు శాఖ నుంచీ, నాథూరాం గాడ్సే తదితరుల ఉరిశిక్ష వివరాలను జైలు అధికారుల నుంచీ, మరో ఇద్దరు నిందితులను అప్పీలులో విడుదల చేసి ఉంటే దానికి సంబంధించిన వివరాలను న్యాయస్థానం నుంచీ, బొంబాయి మహా రాష్ట్ర ప్రభుత్వాలతో ఈ విషయమై జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలనూ సేకరించేందుకు ఈ సమాచార దరఖా స్తును హోం మంత్రిత్వ శాఖకు పంపాలని ఆదేశించడ మైంది. పారిపోయిన ముగ్గురిని పట్టుకోవడానికి సంబం ధించిన వివరాలున్న కేసు డైరీలను, ఇతర రికార్డులను ఇవ్వడానికి గాను ఈ దరఖాస్తును తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్ అధికారికి బదిలీ చేయాలని ఆదేశించారు. గాంధీ హత్య కేసులకు సంబంధించిన తీర్పులు తదితర అన్ని రికార్డులను ఇవ్వడానికి వీలుగా సుప్రీం కోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు కూడా దరఖాస్తును బదిలీ చేయాలని ఆదేశించడమైంది. జస్టిస్ జేఎల్ కపూర్ కమి షన్ గాంధీ హత్య వెనుక కుట్ర వివరాలను సేకరించి, కొన్ని సూచనలను చేసింది. ఆ సూచనల వివరాలను, కమిషన్ విచారణలో లభించిన పత్రాలను, పురావస్తు అథారిటీకి ఇచ్చేందుకు వీలుగా పార్లమెంటు సెక్రటరీ జనరల్‌కు కూడా దరఖాస్తును బదిలీ చేయాలని కమి షన్ ఆదేశించింది. హోంశాఖ, ముఖ్యంగా ఢిల్లీ పోలీ సులు గాంధీ కేసు దస్తావేజులన్నీ సేకరించి పురావస్తు అథారిటీకి ఇవ్వాలని, అవన్నీ సేకరించిన తరువాత మొత్తం గాంధీ హత్య కేసుల ఫైళ్లన్నీ ఒక చోట భద్రపరిచి పౌరులకు అందుబాటులో ఉంచాలని కూడా కమిషన్ ఆదేశించింది. హేమంత్ పాండా వర్సెస్ పీఐఓ (సాంస్కృతిక మంత్రిత్వ శాఖ) CIC/SH/A/2016/001055 కేసులో 16 ఫిబ్రవరి 2017 ఇచ్చిన తీర్పు ఆధారంగా). మాడభూషి శ్రీధర్, వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
‘గాడ్సే’లకూ ఉంది వాక్ స్వేచ్ఛ
విశ్లేషణ రాజకీయ కారణాలతో గాంధీని చంపక తప్పలేదని గాడ్సేలు చెప్పుకున్నారు. ఆ అభిప్రాయాన్ని అంగీకరించాల్సిన పని లేదు. కానీ అంగీకారయోగ్యం కానంత మాత్రాన ఆ అభిప్రాయాన్ని చెప్పుకునే హక్కు లేదనడం సాధ్యం కాదు. వాక్ స్వాతంత్య్రం రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కు. హత్యానేర నిందితులకు కూడా ఈ హక్కు ఉంటుంది. దోషులని రుజువై, శిక్ష అనుభవించిన వారైనా తాము చేసిన హత్య గురించి వివరిస్తూ పుస్తకాలు రాసు కోవచ్చు. జాతిపిత మహాత్మా గాంధీ హంతకులకు సైతం ఈ స్వేచ్ఛ పూర్తిగా ఉంటుంది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కూడా నిందితుడికి సమాచార స్వేచ్ఛను, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ఇస్తుంది. నిందితుడికి అన్నీ తెలియాలి. ఆ తరువాత అతను ఏదైనా చెప్పకునే అవకాశం ఇవ్వాలి. సెక్షన్ 313 కింద ఆ అవకాశం ఉంది. కోర్టులో జడ్జి అడిగిన ఏదైనా ప్రశ్నకు జవాబు ఇవ్వకపోతే శిక్ష పడదు. ఇష్టం వచ్చి నంత సేపు దోషి తన సంజాయిషీని చెప్పుకోవచ్చు. తాను గాంధీని ఎందుకు చంపవలసి వచ్చిందో వివ రిస్తూ నాథూరాం గాడ్సే కొన్ని గంటలపాటు వాంగ్మూ లం ఇచ్చాడు. నేరం రుజువై ఉరిశిక్షకు గురై అతడు చని పోయాడు. అతని తమ్ముడు గోపాల్ గాడ్సే నేరం కూడా రుజు వైంది. కొన్నేళ్ల జైలు శిక్ష తదుపరి విడుదలైనాక అతను తన అన్న నాథూరాం గాడ్సే వాంగ్మూలాన్ని, ఇతర విమ ర్శలను కలిపి ‘గాంధీ హత్య–నేను’ పేరుతో మరాఠీలో ఒక పుస్తకం ప్రచురించాడు. సెక్షన్ 99 ఏ (సీఆర్పీసీ) కింద భద్రతకు భంగం కలిగించే రచనలను నిరోధించే అధికారం ఉందని, ఈ పుస్తకం హిందువులు, ముస్లింల మధ్య ద్వేషాన్ని రగులుస్తుందని అంటూ 1967లో ప్రభుత్వం ఈ పుస్తక ప్రతులన్నిటినీ స్వాధీనం చేసు కోవాలని ఆదేశించింది. సెక్షన్ 99 ఏ రాజ్యాంగ వ్యతి రేకమని, ఆ సెక్షన్ కింద జారీచేసిన ఈ ఉత్తర్వు వాక్ స్వాతంత్య్రానికి భంగకరమనీ కనుక దాన్ని రదు ్దచేయా లని బొంబాయి హైకోర్టులో గోపాల్ వినాయక్ గాడ్సే భారత ప్రభుత్వంపై ఒక రిట్ పిటిషన్ దాఖలు చేశారు (ఎఐఆర్ 1971 బాంబే 56లో ఈ తీర్పు ప్రచురించారు). వాక్ స్వాతంత్య్రానికి హామీ ఇచ్చే రాజ్యాంగ అధి కరణం 19(1)(ఏ) పైన పరిమితులను 19(2) వివరిం చింది. అందులో నిర్దేశించిన ఆధారాలపై పార్లమెంటు చట్టం ద్వారా వాక్ స్వాతంత్య్రంపైన పరిమితులు విధిం చవచ్చునని పేర్కొన్నది. సామాజిక శ్రేయస్సు కోసం సీఆర్పీసీ సవరణ చట్టం ద్వారా ఈ పరిమితిని విధిం చడం రాజ్యాంగబద్ధమే అని బొంబాయి హైకోర్టు తీర్పు చెప్పింది. సెక్షన్ 99 ఏ రాజ్యాంగబద్ధమే అయినా, గోపాల్ గాడ్సే పుస్తకాన్ని నిషేధించడం చెల్లదని ఆదేశిం చింది. ఐపీసీ సెక్షన్ 153 ఏ కింద ఇరు మతాల ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి, ప్రాణాలకు ముప్పు తెచ్చే రచనలు చేయడానికి వీల్లేదని అడ్వకేట్ జనరల్ వాదిం చారు. గాంధీ హంతకులను గొప్పగా చూపుతూ, గాంధీతో సమానమైన కీర్తిని గాడ్సేకు ఆపాదిస్తూ, హత్యను సమర్థించుకునే ఈ పుస్తకం సమాజానికి ప్రమా దకరమనీ, కొత్తతరాల మనసుల్లో గాంధీ హత్యను సమర్థించే తప్పుడు అభిప్రాయాల్ని కల్గించడం కోసం ఇది ప్రయత్నిస్తున్నదనీ, దాన్ని నిరోధించడం సమాజ శ్రేయస్సు రీత్యా అవసరం అని ఆయన నివేదించారు. గాడ్సే పుస్తకాన్ని ఇంగ్లిష్‌లోకి అనువదింపచేసి, న్యాయమూర్తులు దాన్ని కూలంకషంగా పరిశీలించారు. దాని మూల కథనాన్ని, విమర్శను, సమకాలీన చారిత్రిక అంశాలను, హిందూ తత్వంపై వ్యాఖ్యలను లోతుగా అధ్యయనం చేసారు. ఇదొక తీవ్రమైన విమర్శే అయినా, ఆ పుస్తకం ప్రస్తుతం హిందువులు, ముస్లింల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతుందని తమకు అనిపించడం లేదని న్యాయమూర్తులు తమ తీర్పులో పేర్కొన్నారు. కలహాలు సృష్టించడమే రచయిత ఉద్దేశం అనిపించడం లేదన్నారు. గాంధీని ఒక మత పిచ్చివాడెవడో హత్య చేశాడనే అభిప్రాయం పోగొట్టి, ఇది గాంధీ సాగించిన వ్యవహారాలను, విధానాలను తీవ్రంగా వ్యతిరేకించే హత్యనీ, రాజకీయ కారణాల రీత్యా గాంధీని చంపడం తప్ప మరో రకంగా ఆయన నిర్ణయాలను ఆపే మార్గం లేదని భావించి హత్య చేయవలసి వచ్చిందని చెప్పుకునే ప్రయత్నం ఈ పుస్తకం చేసిందనీ హైకోర్టు వివరించింది. ముస్లింలను విపరీతంగా బుజ్జగిస్తూ గాంధీ తీసుకున్న నిర్ణయాల వల్ల హిందూ వర్గాలకు తీవ్రమైన హాని జరుగుతుందని రచయిత నమ్మారు. పాకిస్తానీ తెగల వారు కశ్మీర్‌పై దాడులు చేయడం వల్ల, ఆ దేశానికి రూ. 55 కోట్లు చెల్లించాలన్న ఒప్పందాన్ని పాటించాల్సిన అవసరం లేదని మొత్తం మంత్రివర్గం ఆమోదించినా... గాంధీ నిరాహార దీక్ష చేసి, పాకిస్తాన్‌కు రూ. 55 కోట్లు ఇప్పించారనీ, ఈ విధంగానే వ్యవహరిస్తూపోతే దేశానికి నష్టం కనుక ఒక దేశ భక్తునిగా గాడ్సే అర్జునుడి వలె గాంధీని చంపక తప్పలేదనీ వారు సమర్థించుకునే ప్రయత్నం చేశారని హైకోర్టు అంది. ఆ అభిప్రాయాన్ని అంగీకరించాల్సిన అవసరం లేదనీ, అలాగే అంగీకార యోగ్యం కానంత మాత్రాన అభిప్రాయం చెప్పుకునే హక్కు లేదనడం సాధ్యం కాదనీ, కనుక పుస్తకంపై నిషేధం చెల్లదనీ అంటూ బొంబాయి హైకోర్టు ఆ పుస్త కాలను స్వాధీనం చేసుకోవాలనే ఉత్తర్వును కొట్టి వేసింది. నాథూరాం గాడ్సే వాంగ్మూలంతోపాటు, ఇంకా ఎన్నో విమర్శలున్న పుస్తకంపైనే అభ్యంతరాలు చెల్లవన్న తరువాత... కోర్టులో గాడ్సే చేసిన ప్రకటనను వెల్లడి చేయడంపై అభ్యంతరాలకు తావే లేదు. మాడభూషి శ్రీధర్, వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
'గాడ్సేకు ఆర్ఎస్ఎస్తో సంబంధాలున్నాయి'
అనంతపురం : జాతిపిత మహాత్మాగాంధీని హత్య చేసిన గాడ్సేకు ఆర్ఎస్ఎస్తో సంబంధాలున్నాయని ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ ఎన్ రఘువీరారెడ్డి ఆరోపించారు. శనివారం అనంతపురంలో రఘువీరా మాట్లాడుతూ... హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ మరణానికి కారకులైన కేంద్రమంత్రులను తొలగించాలని మోదీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం దళితులు, మైనార్టీలకు వ్యతిరేకమని... అందుకే వారిపట్ల వివక్ష చూపుతుందని ఆయన విమర్శించారు. హెచ్‌సీయూ వీసీ అప్పారావుపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గాడ్సే , గాంధీ వారసుల మధ్య సైద్ధాంతిక పోరు జరుగుతుందని రఘువీరా తెలిపారు. -
'గాడ్సే పుస్తకాన్ని రిలీజ్ చేస్తే ఒప్పుకోం'
పనాజి: నాధురాం గాడ్సే పేరిట రచించిన ఓ పుస్తకం విడుదల వివాదానికి దారి తీయనుంది. మహాత్మగాంధీ వర్థంతి రోజునే ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం పెట్టుకోవడం కూడా ఆ వివాదానికి ఆజ్యం పోయనుంది. మహాత్మాగాంధీని నాధూరాం గాడ్సే కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఆ గాడ్సేపైనే 'నాధురాం గాడ్సే-ది స్టోరీ ఆఫ్ యాన్ అస్సాసిన్' అనే పుస్తకం శనివారం విడుదలవుతోంది. దీనిని అనూప్ సర్దేశాయి రచించగా.. బీజేపీ నేత ఒకరు విడుదల చేస్తున్నారు. అదికూడా ప్రభుత్వం భవనం అయినటువంటి రవీంధ్ర భవన్లో. దీంతో ఈ పుస్తకాన్ని అసలు విడుదల చేయొద్దని డిమాండ్ చేస్తూ, విడుదల చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ గోవాలో కొత్తగా ఏర్పాటయిన పార్టీ గోవా ఫార్వార్డ్ పార్టీ హెచ్చరిస్తోంది. రవీంధ్ర భవన్ ఎదుట తాము సత్యాగ్రహానికి దిగుతామని హెచ్చరిస్తోంది. తాము ఆ భవన్ వైపు వచ్చే మార్గాలన్నింటిని మూసివేస్తామని, ఎవరూ ఈ కార్యక్రమానికి హాజరుకావొద్దని వారు సూచిస్తోంది. -
గాడ్సే పేరుమీద వెబ్సైట్!
మీరట్: మహాత్మా గాంధీని హత్య చేసిన గాడ్సే పేరుమీద ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. గాడ్సేను ఉరితీసిన రోజు నవంబర్ 15ను బలిదాన్ దివస్‌గా జరుపుకుంటూ అఖిల భారతీయ హిందూ మహాసభ 'నాథురాం గాడ్సే- ఏ ఫర్గాటెన్ హీరో' పేరుతో వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఈ వెబ్సైట్ ద్వారా గాడ్సేకు సంబంధించిన వివరాలను ప్రజలకు తెలియజేయనున్నట్లు తెలిపారు. గాడ్సే పేరుమీద హిందూ మహాసభ కార్యాలయాల్లో యాగాలను నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూ మహాసభ జనరల్ సెక్రటరీ మున్నా కుమార్ మాట్లాడుతూ.. దేశ విభజనకు గాంధీ కారణమయ్యాడనే కారణంతో గాడ్సే అతని హత్యకు పాల్పడ్డాడు. గాంధీ బ్రతికుంటే భవిష్యత్తులో దేశం ఇంకా ముక్కలవుతుందని గాడ్సే గ్రహించాడని అన్నారు. గాడ్సే త్యాగానికి గుర్తుగా నవంబర్ 15 ను బలిదాన్ దివస్‌గా హిందూ మహాసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గాడ్సేకు సంబంధించిన జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాలలో చేర్చాలనే డిమాండ్‌తో రాష్ట్రపతికి వినతిపత్రం ఇవ్వనున్నట్లు హిందూ మహాసభ ప్రకటించింది. గాడ్సే వెబ్సైట్లో గాడ్సే, అతని సోదరుల రచనలు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. వెబ్సైట్ నిర్వహనకు గాను ఆరుగురు ఐటీ నిపుణులను నియమించారు. -
గాడ్సేను ఉరితీసిన రోజును..
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ హంతకుడైన నాథూరాం గాడ్సేను ఉరితీసిన నవంబర్ 15న బలిదాన్ దివస్’ నిర్వహించాలని అతివాద హిందూ సంస్థ ‘హిందూ మహాసభ నిర్ణయించింది. ఆ రోజు అన్ని రాష్ట్రాల్లో జిల్లాస్థాయిలో ‘బలిదాన్ దివస్’ నిర్వహించనున్నారు. ఆ సందర్భంగా రక్తదాన శిబిరాలు నిర్వహించేందుకూ హిందూ మహాసభ సన్నాహాలు చేస్తోంది. గాంధీ హత్యకేసులో మరో నింది తుడైన నాథూరాం సోదరుడు గోపాల్ రచనలను ప్రజలకు పంచిపెట్టాలని యోచిస్తోంది. గాడ్సే దేశభక్తుడా, లేక దేశద్రోహా అన్న అంశంపై చర్చను ప్రజల్లోకి తీసుకెళ్లడమే తమ ఉద్దేశమని అఖిల భారత హిందూ మహాసభ అధ్యక్షుడు చంద్రప్రకాశ్ కౌశిక్ తెలిపారు. ప్రజలే ఏ విషయాన్నీ నిర్ణయిస్తారని అన్నారు. -
ఆర్ఎస్ఎస్ స్క్రిప్ట్ ప్రకారమే...
ముంబై: జాతిపిత మహాత్మాగాంధీని హత్యచేసిన నాథూరాం గాడ్సేను కొన్ని హిందుత్వ సంస్థలు ప్రస్తుతించడం వెనుక ఆర్ఎస్ఎస్ హస్తముందని గాంధేయవాది, సామాజిక కార్యకర్త రామ్ పునియాని ఆరోపించారు. ఈ తతంగమంతా ఆర్ఎస్ఎస్ స్క్రిప్ట్ ప్రకారమే నడుస్తోందన్నారు. ఈ అంశంపై నరేంద్ర మోదీ సర్కారు మౌనం వహించడాన్ని ఆయన ప్రశ్నించారు. 'నాథూరాం గాడ్సేను హిందూ సంస్థలు ప్రస్తుతించడం నాకు ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే ఇదంతా ఆర్ఎస్ఎస్ స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతోంది. కాని ఇది ప్రమాదకరమైన ప్రయాణం' అని రామ్ పునియాని వ్యాఖ్యానించారు. -
మహాత్మా..మహర్షీ
►చెదిరిన బాపూజీ కలలు ►గాంధీజీ వ్యక్తిగత సహాయకుడు వి.కల్యాణం ఆవేదన ►బాపూజీ చివరి క్షణాల ప్రత్యక్షసాక్షి గాంధీజీ వ్యక్తిగత సహాయకుడు వి.కల్యాణం (బాపూజీ చివరి క్షణాల ప్రత్యక్షసాక్షి) అది భారతదేశ చరిత్రలో చీకటి రోజు.. జనవరి 30, 1948.. సాయంత్రం 5 గం.17 నిమిషాలు..ఢిల్లీలోని బిర్లాహౌస్ ప్రాంగణం.. ప్రార్థనా మందిరానికి వెళ్తున్న 78 సంవత్సరాల మహాత్మాగాంధీ తుపాకీగుళ్లకు నేలకొరిగారు. నాధూరాం గాడ్సే జరిపిన ఈ కాల్పుల ఘటనతో అక్కడి వారంతా నిశ్చేష్టులయ్యారు. ఆ సమయంలో గాంధీజీ వెన్నంటే ఉన్న మహాత్ముని వ్యక్తిగత కార్యదర్శి వి.కల్యాణం వెంటనే ఈ వార్తను నాటి ప్రధాని నెహ్రూకు ఫోన్ ద్వారాను, హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు స్వయంగా తెలియజేశారు. 1943-48 మధ్యకాలంలో మహాత్మునికి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసి, గాంధీజీ చివరి క్షణాల వరకూ ఆయనతో సన్నిహితంగా మెలిగిన కల్యాణం మహాత్మునితో తనకున్న అనుభవాలను-జ్ఞాపకాలను పంచుకున్నారు. జయప్రకాశ్‌నారాయణ, సి.రాజగోపాలాచారి సెక్రటరీగా కూడా కల్యాణం పని చేశారు. విశాఖపట్నం ఏయూలోని గాంధీ స్టడీ సెంటర్ ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొనేందుకు చెన్నయ్ నుంచి వచ్చిన ఆయన సాక్షితో ముచ్చటించారు. గాంధీ మహాత్ముని వ్యక్తిగత కార్యదర్శిగా నాకు ఆ మహనీయునితో ఐదేళ్ల సాన్నిహిత్యం ఉందని ఆయన వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన వి.కల్యాణం చెప్పారు. ఏయూలోని గాంధీ స్టడీ సెంటర్ ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొనేందుకు చెన్నయ్ నుంచి వచ్చిన ఆయన సాక్షితో ముచ్చటించారు. ఆయన ఏమన్నారంటే.. - ఏయూ క్యాంపస్ మహరాష్ట్రలోని వార్థా సేవాశ్రమంలో నేను చేరే నాటికి బాపూజీకి అంత సన్నిహితుణ్ణి అవుతానని అనుకోలేదు. సేవాశ్రమానికి జమ్నాలాల్ బజాజ్ ఇచ్చిన వ్యవసాయక్షేత్రంలో కూరగాయలు పండిస్తూ, అక్కడ పండిన వరి, గోధుమ ఆశ్రమ అవసరాలకు వినియోగించేవాళ్లం. సోప్స్, ఆయిల్ సొంతంగా తయారు చేసుకునే వారం. దుస్తులు కూడా మేమే రాట్నంపై తయారు చేసుకుని ధరించేవాళ్లం. ఆశ్రమాన్ని పరిశుభ్రంగా ఉంచటంతో అద్దంలా కనిపించేంది. ఇప్పుడు స్వచ్ఛభారత్ పేరుతో ప్రధాని మోడీ ఆచరించమంటున్న పరిశుభ్రతా కార్యక్రమాన్ని నేను 80 ఏళ్ల నుంచే ఆచరిస్తున్నాను. ఇప్పటికీ రోజులో 11 నుంచి 12 గంటల వరకూ ఎవరి సహాయం లేకుండా అన్ని పనులు చేసుకుంటున్నాను. గాంధీజీకి దేశంలోని వివిధ ప్రాం తాల నుంచి వచ్చే ఉత్తరాలను ఏ భాషకాభాషగా విభజించి ఆయనకు అందులో ముఖ్యాంశాలు చేరవేయటం ఆశ్రమంలో నా పాత్ర. మహాత్ముని మార్గం పట్టదా.. స్వాతంత్య్రానంతరం భారతదేశం ఎలా అభివద్ధి చెందాలో మహాత్ముడు కన్న స్వప్నాలు చెదిరిపోయాయి. కాంగ్రెస్ స్థానంలో లోక్ సేవక్ సంఘ్ ఆవిర్భవించాలన్న ఆయన ఆశయం నెరవేరలేదు. చెడు వినవద్దు..కనవద్దు..చూడవద్దు..అన్న ప్రబోధంకాంగ్రెస్ రాజకీయ పార్టీగా అవతరించి నెహ్రూతో సహా అందరూ గాంధీ విలువలకు తిలోదకాలిచ్చారు. అవినీతిపరులైన ఎంపీలను సైతం అప్పటి పాలకులు వత్తాసు పలికారు. దేశంలో ఉన్న పల్లెలన్నీ విద్య, వైద్యపరంగా వెనుకపడ్డాయి. హార్స్‌రేడింగ్, లాటరీలు, మద్యాన్ని నిషేధించాలని గాంధీజీ పదేపదే చెప్పేవారు. అవేవీ నేటికీ ఆచరణ కాలేదు. 67 సంవత్సరాల స్వాతంత్య్ర భారతం గాంధీ ఆలోచనలు పట్టించుకోకపోవటం దురదష్టకరం. నా దృష్టిలో బ్రిటిష్ పాలనలోనే భారతదేశం చక్కగా ఉండేది. ఇప్పుడూ అడ్మినిస్ట్రేషన్‌లో అధ్వాన పరిస్థితి అదే విధంగా అపరిశుభ్రతలో మాత్రమే మనం ముందున్నాం. ఇది విచారకరవిషయం. ఆంగ్లేయుల పాలనలో ‘లా’ కచ్చితంగా అమలయ్యేది. చివరికి సైకిల్‌కు లైట్ లేకపోయినా అప్పట్లో జరిమానా వేసేవారు. ఇప్పుడంతా లంచాల మయమైపోయింది. ఎవరు తప్పు చేసినా ధనం ముసుగులో అది చెల్లిపోతుంది. 1922-47 మధ్య కాలంలో ఈవ్‌టీజింగ్, దోపిడీలు, అత్యాచారాలవంటి కేసులు అసలు కనిపించేవి కావు. అన్ని వ్యవస్థలూ భ్రష్టు పట్టి దేశంలో జీవించటమే సామాన్యుడికి శాపంగా మారింది. డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.ఎంకెగాంధీ.ఇన్ వెబ్సైట్ కు రోజూ 3వేల క్లిక్కులు వస్తే .. అందులో 90 శాతానికి పైగా యువతవే. ఆత్మకథ, సత్యశోధన (మై ఎక్సపెర్‌మెంట్ విత్ ట్రూత్) ఇప్పటి దాకా అన్ని భాషలు కలిపి 50 లక్షలకు పైగా ప్రతులు విక్రయించారు. ఏటా రెండు లక్షల కాపీలు అమ్ముడవుతున్నాయి. అది ఓ వ్యక్తిత్వ వికాస గ్రంథంగా యువత ఆదరిస్తోంది. నేడు మహాత్మునిపై ప్రత్యేక ప్రసంగం గురువారం మధ్యాహ్నం విశాఖకు చేరుకున్న వి. కల్యాణంకు ఏయూలోని గాంధీ స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఏబీఎస్‌వీ రంగారావు, ఏపీ సర్వోదయ మండలి రావిప్రోలు సుబ్రహ్మణ్యం గాంధీ స్టడీ సెంటర్ నిర్వాహకులు, పలువురు గాంధీ అభిమానులు స్వాగతం పలికారు. సక్రవారం ఉదయం 8 గంటలకు ఏయూ ప్రాంగణంలో ఉన్న గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. అనంతరం 9గంటలకు ఏయూ ప్లాటినం జూబ్లీ సమావేశ మందిరంలో నిర్వహించే గాంధీ వర్థంతి సభలో ఆయన ప్రధాన ప్రసంగం చేస్తారు. విశిష్ట అతిథిగా ఏయూ వీసీ జీఎస్ఎన్ రాజు పాల్గొంటారని ప్రొఫెసర్ రంగారావు తెలిపారు. -
కాలపరీక్షకు నిలిచిన స్వచ్ఛ పరిమళం
అవలోకనం గాంధీ బోధనల్లో, ఆచరణలో అర్థం కానివి ఏవీ లేవు. అందుకే ఆయనకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కీర్తి నేటికీ చెక్కు చెదరకుండా నిలిచే ఉంది. రాజకీయవేత్తకు ఉండవలసిన నిరాడంబరత విషయంలో తన వెనుక ఆయన ఎంత స్వచ్ఛమైన పరిమళాన్ని వదిలిపెట్టి వెళ్లారో కదా! ఈ నెలలో భారత దేశంలోకెల్లా అత్యంత సుప్రసిద్ధ వ్యక్తి హంతకుడి 67వ వర్ధంతిని మనం గుర్తుంచుకోబోతున్నాం. అయితే గాంధీ ని గాడ్సే ఆనాడు ఎందుకు చంపినట్లు? అన్నదే కీలకం. అరెస్టయ్యాక గాడ్సేని నాటి హిందుస్తాన్ టైమ్స్ పత్రిక సంపాదకుడు, గాంధీ కుమారుడు దేవదాస్ కలుసుకున్నారు. వీరిద్దరూ కలుసుకున్న ఘటనను నాథూరాం గాడ్సే సోదరుడు, గాంధీ హత్యానేరంలో సహ భాగస్వామి, సహ దోషి అయిన గోపాల్ గాడ్సే (జైలు పాలయ్యాడు కానీ ఉరికెక్కలేదు) రాసిన ‘గాంధీజీస్ మర్డర్ అండ్ ఆఫ్టర్’ పుస్తకంలో వర్ణించారు. తన తండ్రి హంతకుడిని చూసేందుకు గాంధీ తనయుడు పార్లమెంట్ స్ట్రీట్‌లోని పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ఎలాంటి నమ్రతాలేని, రక్తపిపాసిని తాను కలుసుకుంటున్నట్లు దేవదాస్ భావించి ఉంటాడని గోపాల్ గాడ్సే ఆ పుస్తకంలో రాశాడు. అయితే అత ను ఊహించినదానికీ, నాథూరాం మృదు సంభాష ణలు, ప్రశాంత చిత్తానికీ, ఏమాత్రం పోలిక లేకుం డాపోయిందని గోపాల్ పేర్కొన్నాడు. వారిద్దరి కలయిక ఇలాగే జరిగిందా అనేది మనకయితే తెలీదు. కానీ, గోపాల్ గాడ్సే ప్రకారం ‘నేను నాథూరాం వినాయక్ గాడ్సేని, హిందూ రాష్ట్ర దినపత్రిక సంపాదకుడి’ని అని నాథూరాం తనను కలవడానికి వచ్చిన దేవదాస్ గాంధీకి చెప్పాడట. ‘ఈ రోజు మీ తండ్రిని కోల్పోయారు. ఆ విషాదానికి నేనే కారణం. మీకూ మీ కుటుంబానికి కలిగిన ఈ వియోగానికి నేను చాలా చింతిస్తున్నా. దయచేసి నన్ను నమ్మండి. మీ పట్ల ఎలాంటి వ్యక్తిగత ద్వేషం తోనో, కక్షతోనో లేక దురుద్దేశంతోనో నేనీ కార్యాన్ని తలపెట్టలేదు’ అని నాథూరాం అన్నాడు. అలాంట ప్పుడు ఇలా ఎందుకు చేశావని దేవదాస్ అడిగారు. కేవలం రాజకీయ అంశమే దీనికి కారణమని నాథూరాం చెప్పాడు. తన చర్యను వివరించడానికి కాస్త సమయం కావాలని నాథూరాం కోరాడు. కానీ పోలీసులు అనుమతించలేదు. న్యాయస్థానంలో కూడా నాథూరాం తన చర్య గురించి ఒక ప్రకట నలో వివరించాడు. అయితే కోర్టు దాన్ని నిషేధిం చింది. నాథూరాం వీలునామాను తర్వాత గోపాల్ గాడ్సే తన పుస్తకానికి అనుబంధంగా పునర్ముద్రిం చాడు. ఆ వీలునామాలోని చివరి వాక్యం ఇలా సాగుతుంది. ‘న్యాయస్థానంలో నేను చేసిన ప్రకట నపై నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తి వేసినట్లయితే, దాన్ని ప్రచురించడానికి నీకు అధికారమి స్తున్నాను.’ ఇంతకూ ఆ ప్రకటనలో ఏముంది? దాంట్లో గాడ్సే కింది అంశాలను పొందుపర్చాడు. గాంధీ అంటే తనకెంతో గౌరవమని చెప్పుకున్నాడు. ‘‘అన్నిటికంటే మించి వీర సావర్కర్, గాంధీ రాసి న, మాట్లాడిన ప్రతిదాన్నీ నేను క్షుణ్ణంగా చది వాను. నాకు తెలిసినంతవరకు.. గత ముప్పై సంవ త్సరాల కాలంలో ఏ ఇతర అంశం కంటే, భారతీ యుల ఆలోచనలను, కార్యాచరణను మలచడంలో ఈ ఇద్దరు సిద్ధాంతవేత్తలదే అధికపాత్ర. ముప్పై రెండు సంవత్సరాలుగా గాంధీపై పేరుకుపోతూ వస్తున్న ఆగ్రహం, ప్రకోపం, ఇటీవల ఆయన చేప ట్టిన ముస్లిం అనుకూల నిరాహారదీక్షతో చరమ స్థాయికి చేరుకుంది. దీంతోటే గాంధీ అనే వ్యక్తి ఉనికిని తక్షణమే ముగించాల్సిన అవసరముందని నేను భావించాను. దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు అక్కడి భారతీయుల హక్కులు, వారి శ్రేయస్సును పరిరక్షించడానికి గాంధీ చాలా బాగా పనిచేశారు. కానీ, అక్కడి నుంచి భారత్‌కు తిరిగొచ్చినప్పుడు ఆయన ఒక స్వీయాత్మక మనస్తత్వాన్ని పెంపొం దించుకున్నారు. దీంట్లోంచే ఏది తప్పు, ఏది సరై నది అని తేల్చడంలో తాను మాత్రమే అంతిమ న్యాయమూర్తి అనే అభిప్రాయాన్ని పెంచుకున్నారు. దేశం తన నాయకత్వాన్ని కోరుకుంటున్నట్లయితే, తన లోపరాహిత్యాన్ని, అమోఘమత్వాన్ని యావ ద్దేశం ఆమోదించవలసి ఉంటుంది. అలా జరగనట్ల యితే కాంగ్రెస్‌కు దూరంగా జరిగి తన సొంత మార్గాన్ని కొనసాగిస్తారు.’’ ఈ ఆలోచనే గాంధీకి వ్యతిరేకంగా తీవ్ర చర్య కు పురికొల్పింది. ఎందుకంటే నాథూరాం దృష్టిలో గాంధీ ఆలోచనలకు వ్యతిరేక వైఖరి అవలంబించా లంటే అడ్డదారులు పనికిరావు. కాంగ్రెస్ తన ఇచ్ఛను గాంధీ పాదాక్రాంతం చేయాలి. ఆయన విపరీత మనస్తత్వానికి, చాపల్యానికి, అధిభౌతికత త్వానికి, ఆదిమ దార్శనికతకు తాళం వాయించడా నికే అది కట్టుబడాలి. లేదా గాంధీ లేకుండానే కాంగ్రెస్ కొనసాగాలి. నాథూరాం మరొక ఆరోపణ ఏమంటే, గాంధీ పాకిస్తాన్‌ను సృష్టించారు. ‘గాంధీ సమ్మతితో కాం గ్రెస్ అగ్రనేతలు దేశాన్ని విభజించి, చీల్చి వేస్తున్న పుడు, (దేశం పట్ల మేం అప్పటికే ఒక ఆరాధనా భావాన్ని పెంచుకుని ఉన్నాం) నా మనస్సు ఆగ్ర హంతో దహించుకుపోయింది. నాకు వ్యక్తిగతంగా ఏ ఒక్కరిమీదా దురుద్దేశం లేదు కానీ ముస్లింల పట్ల అన్యాయంగా సానుకూల విధానంతో వ్యవహరిస్తు న్న ప్రస్తుత ప్రభుత్వం పట్ల నా కెలాంటి గౌరవ భావం లేదని చెబుతున్నాను. అదే సమయంలో ఈ ప్రభుత్వ విధానం మొత్తంగా గాంధీ ఉనికితోటే సాధ్యమవుతోందని నేను స్పష్టంగా గ్రహించాను’. అయితే గాడ్సే వాదనలో ఒక సమస్య ఉంది. అదేమిటంటే, గాంధీ విపరీత మనస్తత్వం కలవా రని గాడ్సే ఆలోచించడమే. గాంధీ పట్ల యావత్ ప్రపంచం దీనికి వ్యతిరేకంగానే ఆలోచిస్తోంది. పైగా గాడ్సే ప్రకారం గాంధీ కాంగ్రెస్ పార్టీలో ఒక నియం త. తన దృక్పథాన్ని కాంగ్రెస్ ఆచరించేలా చేసేం దుకోసం గాంధీ నిరాహార దీక్ష చేపట్టారని కూడా గాడ్సే అన్నాడు. ఒక నియంతకు ఆదేశించడం తప్ప మరే చర్యకైనా పూనుకోవలసిన అవసరం ఏముం ది? గాంధీ చివరి నిరాహారదీక్షను (పాకిస్తాన్‌కు నిధులు విడుదల చేయకూడదన్న భారత్ నిర్ణయా నికి వ్యతిరేకంగా) నాథూరాం వ్యతిరేకిస్తున్నాడు. అయితే భారత్ గతంలో ఈ అంశంలో చేసిన వాగ్దానం నుంచి వెనక్కి పోయినప్పుడు మాత్రమే ఇలా జరిగింది. వాస్తవానికి ఈ వ్యవహారంలో భారత్ హుందాతో, సరైన దారిలో వెళ్లేటట్టు చేసింది గాంధీ మాత్రమే. నాథూరాం చెప్పిందాంట్లో ఏ కొంచెం కూడా తర్కబద్ధంగా లేదు. తన చర్యకు ఏది కారణం అనే అంశంపై గతంలో తను చేసిన ప్రకటనకు ఇది భిన్నంగా ఉంది. గాంధీ లౌకిక భావజాలం పట్ల నాథూరాం ద్వేషం పెంచుకున్నాడు. ఈ లౌకిక భావ జాలమే నిజమైన హిందూ స్ఫూర్తి. ఆరెస్సెస్ ప్రభా వంతో సంపూర్ణంగా కలుషితమైన ఆలోచనతో అతడు ఈ స్ఫూర్తినే అంతిమంగా వ్యతిరేకించే స్థాయికి వెళ్లిపోయాడు. వాస్తవమేమిటంటే గాంధీ బోధనల్లో కాని, ఆయన ఆచరణలో కాని అర్థం కాని వి, ఆక్షేపణీయ మైనవి ఏవీలేవు. అందుకే రాజకీయ వేత్తగా గాంధీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కీర్తి దశా బ్దాలు గడిచినా చెక్కు చెదరకుండా నిలిచే ఉంది. సుప్రసిద్ధ రచయిత జార్జి ఆర్వెల్ 1949లో గాంధీ గురించి రాస్తూ ఇలా అన్నారు. ‘నాలాగే గాం ధీ పట్ల ఎవరైనా ఒక సౌందర్యాత్మక అప్రీతిని, అయి ష్టతను కలిగి ఉండవచ్చు. ఆయనకు ఆపాదించిన రుషిత్వ భావనను ఎవరైనా తిరస్కరించవచ్చు (గాంధీ ఎన్నడూ ఏ రకంగానూ తనను రుషిలా భావించుకోలేదు), రుషిత్వాన్ని ఒక ఆదర్శభావ నగా ఎవరైనా తోసిపుచ్చి, గాంధీ ప్రాథమిక లక్ష్యా లు మానవ వ్యతిరేకమని, ప్రతీఘాతుకతత్వంతో కూడినవని ప్రకటించవచ్చు. కాని రాజకీయవేత్తకు ఉండవలసిన నిరాడంబరత విషయంలో, మన కాలపు ఇతర ప్రధాన రాజకీయ ప్రముఖులతో పోల్చి చూసినప్పుడు, తన వెనుక ఆయన ఎంత స్వచ్ఛమైన పరిమళాన్ని వదిలిపెట్టి వెళ్లారో కదా!’ నాథూరాం ఆరోపణలు కాల పరీక్షకు నిలబ డని సమయంలో ఈ 2015లో కూడా ఇదెంత వాస్త వమో కదా! (వ్యాసకర్త ప్రముఖ కాలమిస్టు, రచయిత) Aakar.patel@icloud.com) -
'గాడ్సేకు గుడి కడితే ఎన్ఎస్ఏ కేసు'
సీతాపూర్(యూపీ): జాతిపిత మహాత్మాగాంధీని హత్యచేసిన నాథూరాం గాడ్సే ఆలయం నిర్మించేందుకు ప్రయత్నిస్తే జాతీయ భద్రతా చట్టం(ఎన్ఎస్ఏ) కింద కేసులు పెడతామని సీతాపూర్ జిల్లా మేజిస్ట్రేట్ ఎల్బీ పాండే హెచ్చరించారు. నాథూరాం గాడ్సే పేరుతో ఎక్కడా ఆలయం నిర్మించినా చర్య తప్పదన్నారు. వచ్చే జనవరి 30న పారా గ్రామంలో గాడ్సేకు గుడి కట్టనున్నట్టు కమలేష్ తివారి అనే వ్యక్తి ఇంతకుముందు ప్రకటించాడు. ఇందుకోసం తనుకున్న భూమిలో కొంత దానం కూడా చేశాడు. ఈ నేపథ్యంలో జిల్లా మేజిస్ట్రేట్ హెచ్చరిక జారీ చేశారు. -
'దేశ్ భక్త్ నాథూరాం గాడ్సే' చిత్రంపై దావా
ముంబై: నాథూరాం గాడ్సే పై భారతీయ హిందూ మహాసభ రూపొందించిన చిత్రం విడుదలను అడ్డుకోవాలని పుణే కోర్టులో దావా దాఖలైంది. జనవరి 30న విడుదల కానున్న 'దేశ్ భక్త్ నాథూరాం గాడ్సే' చిత్రాన్ని నిలుపుదల చేయాలంటూ ఉద్యమ కారుడు హేమంత్ పాటిల్ సివిల్ దావాను కోర్టులో దాఖలు చేశారు. ఆ చిత్రం విడుదలైతే మతపరమైన విధ్వంసాలు రేకెత్తే అవకాశం ఉందని ఆ పిటిషన్ లో హేమంత్ పేర్కొన్నారు. మహత్మా గాంధీని నాథూరాం గాడ్సే కాల్చి చంపిన రోజునే సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేయడం విద్వేషాలు రెచ్చగొట్టడమేనని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా భారతీయ హిందూ మహా సభ కూడా చిత్ర విడుదలను నిలుపుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. గాంధీని హిందూ వ్యతిరేకిగా చిత్రీకరించినట్లు ఒక వర్గం మీడియా పనిగట్టుకుని తమపై దాడి చేస్తోందని మహాసభ జనరల్ సెక్రటరీ మున్నా కుమార్ శర్మ తెలిపారు. ఈ దావాకు సంబంధించి శుక్రవారం పుణే కోర్టులో విచారణకు రానుంది. -
గాంధీని ఎందుకు చంపాను?: గాడ్సే
న్యూఢిల్లీ: జాతిపిత మహాత్మాగాంధీని హత్యచేసిన నాథూరామ్ వినాయక్ గాడ్సే కోర్టులో ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా అతని సోదరుడు గోపాల్ గాడ్సే రాసిన ‘గాంధీని ఎందుకు చంపాను?’ అనే మరాఠీ పుస్తకం ఇంగ్లిష్ అనువాదాన్ని పునర్ముద్రించనున్నారు. ఢిల్లీకి చెందిన ఫార్‌సైట్ పబ్లిషర్స్ దీన్ని ముద్రిస్తోంది. 1993 నాటి అనువాదాన్ని సవరించి ఇటీవల వెయ్యి కాపీలు ముద్రించామని దీనికి తాజాగా సంపాదకత్వం వహించిన వీరేందర్ మోహ్రా తెలిపారు. మరో వెయ్యి కాపీల ముద్రణకు ఆర్డర్ ఇచ్చామని ఆయన చెప్పారు. 1948 జనవరి 30న నాథూరామ్ గాడ్సే మహాత్మాగాంధీని హత్య చేసి, పోలీసుల వద్ద లొంగిపోయాడు. గాంధీ హత్య కేసులో గోపాల్ గాడ్సే కూడా నిందితుడు. మరాఠీలో రాసిన‘గాంధీని ఎందుకు చంపాను?’ అనే పుస్తకం హిందీ అనువాదం 1970లో, ఇంగ్లీషు అనువాదం 1993లో ముద్రించారు. -
తెగలాగితే అసలుకు మోసం
ఆగ్రా మత మార్పిడుల సమస్యను ప్రతిపక్షం పట్టుకు వేలాడుతుంటే... ప్రభుత్వం మతమార్పిడులను నియంత్రించాలనే తన అసలు వాదనకు బీజేపీ మరింత సమర్థనను జోడిస్తూ వచ్చింది. బీజేపీ చెప్పే ‘మత మార్పిడులపై ప్రభుత్వ నియంత్రణ’ మత స్వేచ్ఛకు సరిగ్గా వ్యతిరేకమైనది. ఈ కారణంగా, ఈ సమస్యపై ప్రతిపక్షం అవసరమైన దానికంటే ఎక్కువగా లాగడం అవివేకం అవుతుంది. కేంద్రంలోని నేటి ప్రభుత్వానికి లోక్ సభలో మెజారిటీ ఉంది. అయినా గానీ అది కూడా గత ప్రభుత్వంలాగే క్రమం తప్పకుండా సమస్యల్లో ఇరు క్కుంటోంది, ఫలవంతంగా పనిచే యలేకపోతోంది. ప్రధాని నరేంద్రమోదీ మిత్రుల ప్రకటనలు, చర్యలు ఇందుకు కొంత వరకు కారణం. గత వారం నేను ఒక మంత్రి గురించి రాశాను. ఈ వారం రెండు అంశాలపై సమస్యలు తలెత్తాయి. అందులో ఒకటి, ఒక బీజేపీ ఎంపీ గాంధీజీ హంతకుడైన నాథూరామ్ గాడ్సేను కీర్తిస్తూ చేసిన అనవసర ప్రకటన అని చెప్పనవసరం లేదు. సదరు ఎంపీ నాయకుడు కావాలని నిర్ణయించుకున్న సాధువు. ఇది చెప్పనవసరం లేని, ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమేనని అన్నాను. ఎందుకంటే అది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అభిప్రాయమనీ, దానిపై రచ్చచేయడం పార్లమెంటును స్తంభింపజేస్తుందనీ తెలిసి కూడా అదే చేయడం ఎందుకు? చివరికి జరిగిందీ అదే. మోదీ దృఢమైన వైఖరితో, ఆ మంత్రి తన మాటలు తప్పని ఒప్పుకునేట్టు చేశారు. అయితే , ఇదే వారంలో తలెత్తిన మరో సమస్యపై మోదీ ప్రభుత్వానికి అలా ఎదుటి పక్షం లొంగుబాటును చూపడం జరగకపోవచ్చు. అది మత మార్పి డికి సంబంధించిన సమస్య. భారతీయ జనతాపార్టీకి ఇది చాలా కాలంగా ఇబ్బంది కలిగిస్తున్న సమస్య. సాధారణంగా అది హిందువులను ఇస్లాం లోకి లేదా క్రైస్తవంలోకి మత మార్పిడి చెందించడానికి సంబంధించినది. నేడు అలాంటి మత మార్పిడులు చాలా తక్కువ. సాధారణంగా ఇప్పుడు జరిగే మార్పిడులకు కారణం మత విశ్వాసం గాక వివాహమే అవుతోంది. ఈ వారం పరిస్థితి తారుమారైంది. ఒకప్పుడు మొఘల్ సామ్రాజ్య రాజధానియైన ఆగ్రాలో జరిగిన మత మార్పిడులు అంటున్న ఘటనలో ముస్లింలను హిందువులుగా మార్చారు. బీబీసీ కథనం ప్రకారం ‘‘దాదాపు 250 మంది ‘హవన్’ (ప్రాథమిక క్రతువు)కు హాజరయ్యారు. ఆ మురికివాడ వాసులలో అత్యధికులు చెత్త ఏరుకునేవారు. కార్యక్రమానికి హాజరైతే రేషన్ కార్డులు ఇస్తామని, ప్రాథమిక సదుపాయాలు కల్పిస్తామని స్థానిక హిందూ కార్యకర్త తమకు వాగ్దానం చేసి నట్టు వారిలో చాలా మంది చెప్పారు. ఆ మురికివాడలో ఉండే సలీనా అనే ఆమె, తనకసలు అది మతమార్పిడి కార్యక్రమమనే తెలియదని చెప్పింది. కార్య క్రమం మధ్యలో హఠాత్తుగా మా చేత పూజారి చేసినట్టు ప్రతిదీ చేయించారు. ఒక ముస్లిం తన చేతుల్తో ఒక విగ్రహాన్ని పట్టుకునేట్టు కూడా చేశారు. కార్యక్రమం ముగిశాక, ఇక మేమంతా హిందువులమై పోయామని సదరు స్థానిక కార్యకర్త చెప్పాడు. మేం అసమ్మతి తెలపాలని అనుకున్నాం. కానీ రేషన్ కార్డు, ఇతర సదుపా యాలు కావాలంటే నోరెత్తకుండా ఉండాలని మాకు సూచించారు. ఆ మురికివాడలోనే ఉండే ముంతాజ్ మాత్రం తనను ఆ కార్యక్రమానికి హాజరు కావాలని ఎవరూ నిర్బంధించలేదని, హాజరైనవారంతా స్వచ్ఛందంగానే హాజరయ్యారని చెప్పింది.’’ నావరకు నాకు ఇదేమీ పెద్ద సమస్యగా అనిపించలేదు. కానీ ఉర్దూ మీడియా మాత్రం ఈ ఘటనకు నివ్వెరపోయింది, ఆగ్రహించింది. దేశంలోని ‘ఇంక్విలాబ్’ అనే అతి పురాతన మైన, అత్యంత గౌరవప్రదమైన ఉర్దూ పత్రిక ‘‘అసత్యాలు, వంచన, దురభిమానం’’ అనే శీర్షికతో సంపాదకీయం ప్రచురించింది. ప్రతిపక్షం వెనువెంటనే పార్లమెంటులో దాడికి దిగింది. తమకు కూడా ఈ మతమార్పిడులు సమస్యాత్మకంగా ఉన్నా యని, వాటిని నిలుపుదల చేయాలని భావిస్తున్నామని బీజేపీ ప్రతిస్పందించింది. కానీ, చర్చ జరగాల్సిన అంశం దానిపైన కానే కాదు. అయితే ప్రతిపక్షం ఆ విషయాన్ని అదే పనిగా పట్టుకు వేలాడుతుంటే... మతమార్పిడులన్నీ చెడ్డవేనని, ప్రభు త్వం వాటిని నియంత్రించాలనే తన అసలు వాదనకు బీజేపీ మరింత సమర్థనను జోడిస్తూ వచ్చింది. బీజేపీ చెప్పే ‘మత మార్పిడులపై ప్రభుత్వ నియంత్రణ’ మతస్వేచ్ఛకు సరిగ్గా వ్యతిరేకమైనది. ఈ కారణంగా, ఈ సమస్యపై ప్రతిపక్షం అవసరమైన దానికంటే ఎక్కువగా లాగడం అవివేకం అవుతుంది. విశ్వహిం దూ పరిషత్‌కు చెందిన నా మిత్రుడు అశోక్ చౌగులే ఈ సమ స్యపై గాంధీ చేసిన పలు ప్రకటనల జాబితాను నాకు పంపారు. వాటిలో ఇది ఒకటి. ‘‘ఒక మనిషిని మరొకరిగా మార్పిడి చేయడంలో నాకు విశ్వాసం లేదు. మరొకరి మతవిశ్వాసాన్ని దెబ్బతీయడానికి ఎన్నటికీ కృషి చేయను. పైగా వారు తమ సొంత విశ్వాసానికి మరింత మంచి అనుయాయిగా మారాలని కోరుతాను. దీని అర్థం అన్ని మతాల సత్యంలోనూ విశ్వాసం, గౌరవం కలిగి ఉండటమని అర్థం. దివ్య కాంతి అన్ని మతాలకు లోపసహి తమైన మాంసపు ముద్ద మాధ్యమం ద్వారానే చేరుతుంది. కాబట్టి అవి ఆ మాధ్యమం యొక్క అపరిపూర్ణతలను కొంత ఎక్కువగా లేదా తక్కువగా కలిగి ఉండవచ్చు. ’’ గాంధీజీ మతమార్పిడి గురించి, అంటే మతమార్పిడులు చేయించుకోవాలని చురుగ్గా ప్రజలను కోరడం గురించి కూడా మాట్లాడారు. ‘‘ఒక పాడు ఉద్దేశం మొత్తం బోధననే ఉల్లంఘి స్తుంది. పాడు చేసేస్తుంది. అది మొత్తం ఆహారాన్నంతటినీ పాడు చేసే ఒక్క విషపు బొట్టులాంటిది. దానివలన నేను ఎలాంటి బోధన లేకుండానే ఉండి పోవాల్సి ఉంటుంది. గులాబీకి బోధన అవసరం లేదు. అది అతి మామూలుగానే అందరికీ సువాసనలను పంచుతుంది. అదే దాని ప్రబోధం... మత, ఆధ్యాత్మిక జీవితపు పరిమళాలు గులాబీ పరిమళం కంటే మరింత మృదువైనవి, దానికంటే సున్నితమైనవి.’’ భార త రాజ్యాంగం ఎప్పుడో ఈ చర్చను పరిష్కరించింది. చట్టం ఈ విషయంలో సుస్పష్టంగానే ఉంది. అధికరణం 25 భారతీయులందరికీ ‘‘విశ్వాస స్వేచ్ఛ, వృత్తి స్వేచ్ఛ, మత అను సరణ, ప్రచార స్వేచ్ఛ’’లను కల్పిస్తోంది. మతం విషయంలో భారత్‌లో అలాంటి ఉదారవాద చట్టం ఉండటం ఉపఖండంలో అసాధారణమైనది. ప్రతిపక్షం ఈ సమస్యపై ప్రభుత్వంపై దాడి చేసేటప్పుడు దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఒక ఘటన ఆ చట్టం పునఃపరిశీలనకు కార ణంగా మారడాన్ని అనుమతించరాదు. (వ్యాసకర్త ప్రముఖ కాలమిస్టు, రచయిత) - aakar.patel@gmail.com ఆకార్ పటేల్ -
‘గాడ్సే’ వ్యాఖ్యలపై మహరాజ్ విచారం
వ్యాఖ్యలను వాపసు తీసుకుంటున్నట్లు వెల్లడి శాంతించని విపక్షాలు, హోరెత్తిన్న లోక్‌సభ.. న్యూఢిల్లీ: మహాత్ముడిని హత్య చేసిన నాథూరామ్ గాడ్సేను దేశభక్తుడిగా పేర్కొనడంపై బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ శుక్రవారం లోక్‌సభలో విచారం వ్యక్తంచేశారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ వ్యవహారంపై పార్లమెంట్లో ప్రతిపక్షాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. కాంగ్రెస్, ఆర్జేడీ సభ్యులు లోక్‌సభలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. దీనిపై పలు పార్టీలు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ సుమిత్రా మహాజన్ తిరస్కరించడంతో విపక్షాలు భగ్గుమన్నాయి. స్పీకర్ పోడియంలోకి దూసుకెళ్లి నినాదాలు చేశాయి. కాంగ్రెస్, ఆర్జేడీ, టీఎంసీ, లెఫ్ట్‌పార్టీల సభ్యులు ఇందులో పాల్గొన్నారు. దీంతో సభ పది నిమిషాలు వాయిదా పడింది. మళ్లీ భేటీ అయిన తర్వాత పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు కల్పించుకుని.. గాంధీజీ హంతకుడిని ప్రశంసించడాన్ని ఎవరూ సమర్థించరని, సదరు ఎంపీ వ్యాఖ్యలతో కేంద్రం, బీజేపీ ఏకీభవించడం లేదన్నారు. అయితే మంత్రి సమాధానంతో కాంగ్రెస్ సభ్యులు సంతృప్తి చెందలేదు. వెంకయ్య మళ్లీ కల్పించుకుని.. గాంధీ సిద్ధాంతాలను రోజూ హత్య చేస్తున్నారన్నారు. విపక్షాలకు మరే అంశం లేకపోవడంతో ఈ విషయంపై రాద్ధాంతం చేస్తూ సభను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే సాక్షి మహారాజ్ లేచి.. మహాత్ముడిని, సభను తాను గౌరవిస్తానని, తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని తెలిపారు. ‘గాంధీని గాడ్సే ఎప్పుడో చంపాడు. కానీ సిక్కు అల్లర్ల సందర్భంగా గాంధీ సిద్ధాంతాలను నా స్నేహితులు హత్య చేశారు’ అని కాంగ్రెస్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేస్తూ పోడియంలోకి వెళ్లారు. ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా నిరసన తెలిపారు. మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. గాంధీ బోధనలకు వ్యతిరేకంగా ప్రతిపక్షం ప్రవర్తిస్తోందని విమర్శించారు. అంతకుముందు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట పలువురు కాంగ్రెస్ ఎంపీలు నిరసన తెలిపారు. సాక్షి మహరాజ్ క్షమాపణ చెప్పేవరకు సభను సాగనివ్వమని ఆ పార్టీ నేత జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. -
నాథూరామ్ గాడ్సే దేశభక్తుడు..!
బీజేపీ ఎంపీ సాక్షీ మహరాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు కాంగ్రెస్ సహా విపక్షాల తీవ్ర నిరసన రాజ్యసభలో గందరగోళం.. వ్యాఖ్యలను వక్రీకరించారన్న ఎంపీ న్యూఢిల్లీ: అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ తరచూ వివాదాలు లేవనెత్తుతున్న బీజేపీ ఎంపీల జాబితాలోకి తాజాగా మరొకరు చేరారు. మహాత్మాగాంధీని హత్యచేసిన నాథూరామ్ గాడ్సేను దేశభక్తుడని సంబోధించి బీజేపీ ఎంపీ సాక్షీ మహరాజ్ మరో గొడవకు తెరతీశారు. ఆయన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగింది. కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్షాల నిరసనలతో రాజ్యసభలో గందరగోళం నెలకొంది. అయితే తన వ్యాఖ్యలను వక్రీకరించారని సాక్షీ మహరాజ్ ప్రకటించారు. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నవ్ లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సాక్షీ మహరాజ్ ఇటీవల మహారాష్ట్రలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘‘నాథూరామ్ గాడ్సే చాలా బాధలకు గురైన వ్యక్తి. అతను పొరపాటుగా ఏదైనా చేసి ఉండవచ్చుగానీ దేశద్రోహి మాత్రం కాదు. గాడ్సే దేశ భక్తుడు..’’ అని వ్యాఖ్యానించారు. దీనిపై గురువారం రాజ్యసభలో కాంగ్రెస్ సహా విపక్షాలు విరుచుకుపడ్డాయి. సాక్షీ మహరాజ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గందరగోళం సృష్టించాయి. మహాత్మాగాంధీ హంతకుడిని అధికారపక్షం గొప్పవాడిని చేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించాయి. జీరో అవర్‌లో కాంగ్రెస్ ఎంపీ హుస్సేన్ దల్వాయి ఈ అంశాన్ని లేవనెత్తారు. ప్రపంచానికే అహింసా మార్గాన్ని చూపిన మహాత్మాగాంధీని గాడ్సే హత్యచేశాడని, అలాంటిది గత నెల 15న నాథూరామ్ గాడ్సే శౌర్య దివస్ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించారని పేర్కొన్నారు. దీని వెనుక ఉన్నవారందరినీ అరెస్టు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమయంలో కాంగ్రెస్ సభ్యుల నినాదాలతో సభలో గందరగోళం నెలకొనడంతో రెండు సార్లు వాయిదా పడింది. అయితే మహాత్మాగాంధీ హంతకుడిని పొగిడే ఎలాంటి అంశాలకైనా ప్రభుత్వం వ్యతిరేకమేనని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు విపక్షాలకు స్పష్టం చేశారు. అయితే దీనిపై ఒక సంస్థను నిందించడం సరికాదని పేర్కొన్నారు. కాగా.. గాడ్సేను తాను దేశభక్తుడు అనలేదని సాక్షీ మహరాజ్ పేర్కొన్నారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆయన పేర్కొన్నారు.