న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ హంతకుడైన నాథూరాం గాడ్సేను ఉరితీసిన నవంబర్ 15న బలిదాన్ దివస్’ నిర్వహించాలని అతివాద హిందూ సంస్థ ‘హిందూ మహాసభ నిర్ణయించింది. ఆ రోజు అన్ని రాష్ట్రాల్లో జిల్లాస్థాయిలో ‘బలిదాన్ దివస్’ నిర్వహించనున్నారు. ఆ సందర్భంగా రక్తదాన శిబిరాలు నిర్వహించేందుకూ హిందూ మహాసభ సన్నాహాలు చేస్తోంది.
గాంధీ హత్యకేసులో మరో నింది తుడైన నాథూరాం సోదరుడు గోపాల్ రచనలను ప్రజలకు పంచిపెట్టాలని యోచిస్తోంది. గాడ్సే దేశభక్తుడా, లేక దేశద్రోహా అన్న అంశంపై చర్చను ప్రజల్లోకి తీసుకెళ్లడమే తమ ఉద్దేశమని అఖిల భారత హిందూ మహాసభ అధ్యక్షుడు చంద్రప్రకాశ్ కౌశిక్ తెలిపారు. ప్రజలే ఏ విషయాన్నీ నిర్ణయిస్తారని అన్నారు.
గాడ్సేను ఉరితీసిన రోజును..
Published Tue, Oct 20 2015 7:28 AM | Last Updated on Sun, Sep 3 2017 11:15 AM
Advertisement