గాడ్సే పేరుమీద వెబ్సైట్! | Hindu mahasabha launches Godse website | Sakshi
Sakshi News home page

గాడ్సే పేరుమీద వెబ్సైట్!

Published Sun, Nov 15 2015 5:53 PM | Last Updated on Sun, Sep 3 2017 12:32 PM

గాడ్సే పేరుమీద వెబ్సైట్!

గాడ్సే పేరుమీద వెబ్సైట్!

మీరట్: మహాత్మా గాంధీని హత్య చేసిన గాడ్సే పేరుమీద ఓ వెబ్సైట్ను ప్రారంభించారు.  గాడ్సేను ఉరితీసిన రోజు నవంబర్ 15ను బలిదాన్ దివస్గా జరుపుకుంటూ అఖిల భారతీయ హిందూ మహాసభ 'నాథురాం గాడ్సే- ఏ ఫర్గాటెన్ హీరో' పేరుతో వెబ్సైట్ను ప్రారంభించింది. ఈ వెబ్సైట్ ద్వారా గాడ్సేకు సంబంధించిన వివరాలను ప్రజలకు తెలియజేయనున్నట్లు తెలిపారు.


గాడ్సే పేరుమీద హిందూ మహాసభ కార్యాలయాల్లో యాగాలను నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూ మహాసభ జనరల్ సెక్రటరీ మున్నా కుమార్ మాట్లాడుతూ.. దేశ విభజనకు గాంధీ కారణమయ్యాడనే కారణంతో గాడ్సే అతని హత్యకు పాల్పడ్డాడు. గాంధీ బ్రతికుంటే భవిష్యత్తులో దేశం ఇంకా ముక్కలవుతుందని గాడ్సే గ్రహించాడని అన్నారు. గాడ్సే త్యాగానికి గుర్తుగా నవంబర్ 15 ను బలిదాన్ దివస్గా హిందూ మహాసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

 గాడ్సేకు సంబంధించిన జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాలలో చేర్చాలనే డిమాండ్తో రాష్ట్రపతికి వినతిపత్రం ఇవ్వనున్నట్లు హిందూ మహాసభ ప్రకటించింది. గాడ్సే వెబ్సైట్లో గాడ్సే, అతని సోదరుల రచనలు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. వెబ్సైట్ నిర్వహనకు గాను ఆరుగురు ఐటీ నిపుణులను నియమించారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement