
నాగపూర్ : వీర్‌సావర్కర్‌కు భారత రత్నను బీజేపీ ప్రతిపాదించడంపై కాంగ్రెస్ నేత మనీష్ తివారి స్పందిస్తూ సావర్కర్‌కు బదులు నాథూరాం గాడ్సేకు ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందించాలని వ్యాఖ్యానించారు. ‘మహాత్మా గాంధీని అంతమొందించేందుకు సావర్కర్ కుట్ర పన్నారనే ఆరోపణలు మాత్రమే వచ్చాయి..అయితే గాడ్సే మాత్రం నేరుగా గాంధీని బలితీసుకున్నారు’ అని పేర్కొన్నారు. ఈ ఏడాది మనం మహాత్మా గాంధీ 150వ జయంతిని జరుపుకుంటున్న క్రమంలో ఎన్డీయే ప్రభుత్వం సావర్కర్‌కు బదులు నేరుగా గాడ్సేకు భారత రత్న ప్రదానం చేయాలని మనీష్ తివారీ ఎద్దేవా చేశారు. మరోవైపు సావర్కర్‌కు భారత రత్న ప్రతిపాదించడంపై కాంగ్రెస్ రషీద్ అల్వీ బీజేపీపై మండిపడ్డారు. తదుపరి భారతరత్న నాథూరాం గాడ్సేకు ఇస్తారని చురకలు వేశారు. సావర్కర్ గాంధీ హత్యకు కుట్రపన్నారని అందరికీ తెలుసని, సరైన ఆధరాలు లేనందునే ఆయనను విడిచిపెట్టారని అలాంటి వ్యక్తికి భారతరత్న ఇస్తామని ప్రభుత్వం చెబుతోందని అలీ ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment