కమల్‌ హాసన్‌పై చెప్పుల దాడి | Slippers Thrown At Kamal Haasan Over Godse Remark | Sakshi
Sakshi News home page

హిందూ తీవ్రవాది వ్యాఖ్యలకు నిరసనగా దాడి

Published Thu, May 16 2019 9:49 AM | Last Updated on Thu, May 16 2019 9:55 AM

Slippers Thrown At Kamal Haasan Over Godse Remark - Sakshi

చెన్నై : ప్రముఖ నటుడు, మక్కల్‌ నీది మయ్యం పార్టీ అధినేత కమల్‌ హాసన్‌కు చేదు అనుభవం ఎదురయ్యింది. ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న కమల్‌ హాసన్‌ మీద చెప్పులు విసిరారు. బుధవారం ఓ రోడ్ షో లో పాల్గొన్న కమల్ హాసన్ మీద ఓ వ్యక్తి చెప్పు విసిరాడు. అయితే, అది కమల్ హాసన్‌కు తగలలేదు. మరికొందరు కూడా కమల్ మీదకు చెప్పులు విసిరే ప్రయత్నం చేయబోగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ దాడిలో పోలీసులు బీజేపీ కార్యకర్తలతో పాటు హనుమ సేన కార్యకర్తలపై కూడా కేసు నమోదు చేశారు.

రెండు రోజుల క్రితం కమల్ హాసన్ స్వతంత్ర భారత దేశంలో మొట్టమొదటి ఉగ్రవాది ఓ హిందూ అని, అతని పేరు నాథూరామ్ గాడ్సే అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా పెను దుమారం రేపాయి. కమల్ హాసన్ మీద చర్యలు తీసుకోవాలంటూ పలు హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. కమల్ హాసన్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు కూడా చేశారు. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కమల్ హాసన్ మీద చెప్పుల దాడి జరిగింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement