‘‘వై ఐ కిల్‌డ్‌ గాంధీ’’ సినిమా విడుదల ఆపండి | Congress asks Maha CM to stop release of movie Why I killed Gandhi | Sakshi
Sakshi News home page

‘‘వై ఐ కిల్‌డ్‌ గాంధీ’’ సినిమా విడుదల ఆపండి

Published Tue, Jan 25 2022 6:05 AM | Last Updated on Tue, Jan 25 2022 6:05 AM

Congress asks Maha CM to stop release of movie Why I killed Gandhi - Sakshi

ముంబై: మహాత్మాగాంధీ వర్ధంతి రోజైన జనవరి 30న విడుదల కానున్న వై ఐ కిల్‌డ్‌ గాంధీ సినిమా విడుదల నిలిపివేయాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది.  ఈ సినిమాతో జాత్యహంకార పోకడలు పెచ్చుమీరుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేకు మహారాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ నానా పటోల్‌ ఒక లేఖ రాశారు. మహాత్ముని మార్గాలైన అహింస, శాంతిని స్మరించుకోవాల్సిన రోజు ఈ సినిమా విడుదల చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఎన్‌సీపీ ఎంపీ, నటుడు అమోల్‌ కొల్హె ఈ సినిమాలో మహాత్ముడిని చంపిన నాథూరామ్‌ గాడ్సే పాత్రని పోషించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement